సాక్షి, హైదరాబాద్: మీడియా మిత్రులపై మా నాన్న(మంచు మోహన్‌బాబు) దాడి చేయడం బాధాకరమని, ఆయన తరఫున నేను క్షమాపణలు చెబుతున్నాను అన్నారు మంచు మనోజ్. మీడియాపై మోహన్‌బాబు చేసిన దాడిని ఖండిస్తూ ధర్నాకు దిగిన జర్నలిస్టులకు ఆయన మద్దతు తెలిపారు. తన కోసం వచ్చిన మీడియా మిత్రులపై దాడి చేయడం దారుణమన్నారు. తనపై మోహన్‌బాబు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించాడు.
‘నేను ఆస్తుల కోసం ఏ రోజు కూడా గొడవ చేయలేదు. నా సొంత కాళ్లపై నిలబడుతున్నాను. నేను మద్యానికి బానిసై కొడుతున్నానని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మా నాన్న దేవుడు.. ఇప్పుడు చూస్తున్న నాన్న మా నాన్న కాదు. ఆయన భుజంపై తుపాకీ పెట్టి మమ్మల్ని కాలుస్తున్నారు. మా బంధువులపై దాడి చేశారు. నా భార్య, ఏడు నెలల పాపను గొడవలోకి లాగుతున్నారు. ఈ గొడవల మధ్య మా అమ్మ నలిగిపోతుంది. ఇన్ని రోజులు ఆగాను.. ఇక ఆగలేను. అసలేం జరిగింది? గొడవ దేనికోసం అనేది ఈ రోజు(డిసెంబర్ 11) సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు చెబుతాను’ అని మంచు మనోజ్ అన్నారు.
(చదవండి: నటుడు మోహన్ బాబుపై కేసు నమోదు)
కాగా, సీనియర్ నటుడు మోహన్‌బాబు ఫ్యామిలీ గొడవలు మంగళవారం తారా స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంటి వద్ద నిన్న రాత్రి వరకు హైడ్రామా నడిచింది. మంచు విష్ణు, మనోజ్‌ల బౌన్సర్ల మోహరింపు.. తోపులాటలతో ‘మంచు టౌన్’హీటెక్కింది. ఈ గొడవను కవర్ చేయడానికి వచ్చిన మీడియా ప్రతినిధులపై మోహన్‌బాబు దాడి చేశాడు. దీంతో ఆయన క్షమాపణలు చెప్పాలంటూ జర్నలిస్టులు అక్కడే ధర్నాకు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment