కుటుంబ వివాదంలో సతమతమవుతున్న నటుడు మోహన్ బాబుకి మరో షాక్ తగిలింది. మోహన్ బాబు ఫ్యామిలీలో అసలేం జరుగుతుందో తెలుసుకునేందుకు మంగళవారం రాత్రి పలువురు జర్నలిస్టులు జల్పల్లిలోని ఆయన ఇంటికి వెళ్లారు. అయితే ప్రశ్న అడిగేందుకు ఓ రిపోర్టర్ ప్రయత్నించగా.. అతడి దగ్గరున్న మైక్ లాక్కొని సదరు జర్నలిస్టుపైనే మోహన్ బాబు దాడి చేశాడు.
(ఇదీ చదవండి: నా గుండెలపై తన్నావ్.. మోహన్ బాబు ఆడియో వైరల్)
ఈ దాడిలో సదరు జర్నలిస్టు తలపై కాస్త గట్టిగానే గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో మోహన్ బాబు క్షమాపణలు చెప్పాలని.. ఇప్పటికే పలువురు జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ దాడి విషయమై 118 బీఎన్ఎస్ యాక్ట్ కింద.. మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఈ విషయం కాస్త చర్చనీయాంశంగా మారింది.
118 బీఎన్ఎస్ యాక్ట్ విషయానికొస్తే.. 2023 భారతీయ న్యాయ సంహిత ప్రకారం ప్రమాదకరమైన ఆయుధాలతో దాడి చేస్తే ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. దీనికి ప్రతిగా మూడేళ్ల జైలుశిక్ష లేదంటే రూ.20 వేల జరిమానా విధించొచ్చు. కొన్నిసార్లు రెండింటిని కూడా విధించే అవకాశముంది.
మంగళవారం రాత్రి మోహన్ బాబు ఇంటి దగ్గర జరిగిన గొడవ దృష్ట్యా.. తమ దగ్గరున్న లైసెన్స్ గన్స్ సరెండర్ చేయాలని పోలీసులు.. మోహన్ బాబు, విష్ణు, మనోజ్‌లని ఆదేశించారు. అలానే బుధవారం ఉదయం పదిన్నర గంటలకు విచారణకు హాజరు కావాలని ఇప్పటికే రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
(ఇదీ చదవండి: మోహన్ బాబు ఇంటి వద్ద హై టెన్షన్.. గేట్లు బద్దలు కొట్టిన మనోజ్!)
Comments
Please login to add a commentAdd a comment