
న్యూఢిల్లీ, సాక్షి: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ, ఆయన మనుషులు గతంలో ఇంటెలిజెన్స్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడినందుకు కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రఘురామ వేసిన క్వాష్ పిటిషన్‌పై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.
శుక్రవారం(ఫిబ్రవరి 14) జస్టిస్ జెకె మహేశ్వరి, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. అయితే బాధితుడు ఫరూక్ భాషా తరఫున వకాలత్ దాఖలు చేయడానికి ఆయన లాయర్ సమయం కోరారు. దీంతో.. అందుకు రెండు వారాల గడువు ఇచ్చింది కోర్టు. అలాగే.. ఈ పిటిషన్‌పై విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
నరసాపురం ఎంపీగా ఉన్న టైంలో.. విధుల్లో ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్ పోలీస్ ఫరూక్ భాషపై రఘురామ, ఆయన తనయుడు భరత్ కలిసి దాడి చేశారనే అభియోగాలు ఉన్నాయి. 2022 జులైలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో.. విధి నిర్వహణలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన కానిస్టేబుల్ ఫరూక్‌ను బలవంతంగా ఎత్తుకెళ్లి రఘురామ మనుషులు ఆయన నివాసంలోనే చితకబాదారు. ఆపై అనుమానితుడిగా పోలీసులకు అప్పగించారు. అయితే..
రఘురామ, ఆయన మనుషులు తనను చిత్రహింసలకు గురి చేశారని ఫరూక్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో జులై 4వ తేదీన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో రఘురామ, ఆయన తనయుడు, రఘురామ పీఏ, సీఆర్పీఎఫ్ సిబ్బంది తదితరులపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో ఊరట కోసం తెలంగాణ హైకోర్టులో రఘురామ క్వాష్ వేయగా చుక్కెదురైంది. ఆ వెంటనే ఆయన సుప్రీంను ఆశ్రయించారు.