న్యూఢిల్లీ, సాక్షి: ఫార్ములా ఈ కార్ రేసు కేసును కొట్టేయాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన బీఆర్‌ఎస్ కార్యనిర్వహాక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు(KTR)కు ఊరట దక్కలేదు. పిటిషన్‌ను తక్షణ విచారణకు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం నిరాకరించింది.
ఏసీబీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ.. కేటీఆర్ సుప్రీం కోర్టులో క్వాష్ వేశారు. అయితే ఈ పిటిషన్‌ను రేపు(శుక్రవారం) విచారణకు స్వీకరించాలని కేటీఆర్ తరఫు న్యాయవాది కోరారు. అయితే.. అందుకు సీజే బెంచ్ నిరాకరించింది. ఈ నెల 15వ తేదీన విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. ఈ కేసులో కేటీఆర్ గనుక సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే వేస్తే తమ వాదనలు కూడా వినాలంటూ ఏసీబీ తరఫున తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఇక.. ఏసీబీ కేసును కొట్టేయాలంటూ కేటీఆర్ ఇంతకుముందు హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ ఆయనకు చుక్కెదురైంది. ఏసీబీ దర్యాప్తులో జోక్యం చేసుకోమని పేర్కొంటూ.. ఆయనకు అరెస్ట్ నుంచి రక్షణ సైతం ఇవ్వలేదు.
Comments
Please login to add a commentAdd a comment