రఘురామ కృష్ణంరాజు కేసులో డాక్టర్ ప్రభావతికి ఊరట | Doctor Padmavathi Gets Relief Suprem Court | Sakshi
Sakshi News home page

రఘురామ కృష్ణంరాజు కేసులో డాక్టర్ ప్రభావతికి ఊరట

Jan 31 2025 12:00 PM | Updated on Jan 31 2025 1:42 PM

Doctor Padmavathi Gets Relief Suprem Court

ఢిల్లీ : సీఐడీ కస్టడీలో తనను తీవ్రంగా వేధించారంటూ రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేసిన కేసుకు సంబంధించి డాక్టర్‌ ప్రభావతికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.  ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. డాక్టర్‌ ప్రభావతి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై రెండు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఏపీ పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. అదే సమయంలో తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.

ఈ కేసులో ముందస్తు బెయిల్‌పై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభావతి సుప్రీంలో పిటిషన్ వేశారు. ఈరోజు (శుక్రవారం) ప్రభావతి దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ చేపట్టింది. ముందస్తు బెయిల్‌పై హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. విచారణకు సహకరించాలని డాక్టర్ ప్రభావతికి ఆదేశించింది. డాక్టర్ ప్రభావతి పిటీషన్‌పై రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీం ఆదేశిస్తూ.. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

సీఐడీ కస్టడీలో తనను తీవ్రంగా వేధించారంటూ గుంటూరులోని నగరంపాలెం పోలీసులకు గతంలో రఘురామ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు..  ప్రభావతిని ఏ5గా పేర్కొన్నారు. జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా ఆమె తప్పుడు నివేదిక ఇచ్చారంటూ రఘురామ ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement