doctor padmavathi
-
రఘురామ కృష్ణంరాజు కేసులో డాక్టర్ ప్రభావతికి ఊరట
ఢిల్లీ : సీఐడీ కస్టడీలో తనను తీవ్రంగా వేధించారంటూ రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేసిన కేసుకు సంబంధించి డాక్టర్ ప్రభావతికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. డాక్టర్ ప్రభావతి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. అదే సమయంలో తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.ఈ కేసులో ముందస్తు బెయిల్‌పై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభావతి సుప్రీంలో పిటిషన్ వేశారు. ఈరోజు (శుక్రవారం) ప్రభావతి దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ చేపట్టింది. ముందస్తు బెయిల్‌పై హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. విచారణకు సహకరించాలని డాక్టర్ ప్రభావతికి ఆదేశించింది. డాక్టర్ ప్రభావతి పిటీషన్‌పై రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీం ఆదేశిస్తూ.. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.సీఐడీ కస్టడీలో తనను తీవ్రంగా వేధించారంటూ గుంటూరులోని నగరంపాలెం పోలీసులకు గతంలో రఘురామ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రభావతిని ఏ5గా పేర్కొన్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా ఆమె తప్పుడు నివేదిక ఇచ్చారంటూ రఘురామ ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. -
మండే ఎండలు.. అప్రమత్తత అవసరం
– అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ పద్మావతి అనంతపురం మెడికల్ : ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ తగిలే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ పద్మావతి పేర్కొన్నారు. శుక్రవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. తీవ్రమైన తలనొప్పి, నీరసంగా ఉండడం, చర్మం పొడిబారడం, సొమ్మసిల్లడం వంటివి వడదెబ్బ లక్షణాలన్నారు. నీరు తక్కువగా తీసుకోవడం, మత్తుపానీయాలు సేవించడం, ఎండలో తిరగడం, విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల వడదెబ్బ తగిలే అవకాశం ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మత్తు పానీయాలు తాగరాదని, వదులుగా ఉన్న కాటన్ దుస్తులు ధరించాలన్నారు. ఆహారాన్ని తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తీసుకోవాలన్నారు. శరీర ఉష్ణోగ్రత్త తగ్గించడానికి తడి వస్త్రంతో శరీరాన్ని తుడుస్తూ ఉండాలన్నారు. ఈ విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఎంపీహెచ్ఈఓ లక్ష్మన్న, ఐడీఎస్పీ ధరంసింగ్, ఎపిడమాలజిస్ట్ రామకృష్ణ, డిప్యూటీ హెచ్ఈఓ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
యువతికి ‘ప్రత్యేక’ శస్త్రచికిత్స
హైదరాబాద్: ఓ యువతికి వైద్యులు పత్రేకమైన శస్త్రచికిత్స నిర్వహించి సక్సెస్ అయ్యారు. పునరుత్పత్తి అవయవాలతోపాటు జననాంగం(వెజీనా)లేని ఓ యువతికి ప్రముఖ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ డి. పద్మావతి న్యూ వెజీనా రీ కన్స్ట్రక్షన్ సర్జరీని విజయవంతంగా నిర్వహించి సదరు యువతికి వైవాహిక జీవితాన్ని ప్రసాదించారు. కృష్ణానగర్‌లోని శీతల్ నర్సింగ్‌హోమ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ... పటాన్చెరు ప్రాంతానికి చెందిన కౌసల్య(26) అనే యువతికి చిన్నతనం నుంచే కేవలం మూత్ర ప్రసరణ రంద్రం మాత్రమే కలిగి వెజినా ఎజెనిసిస్తో భాదపడుతోందని చెప్పారు. దీంతో ఆమెకు ఉన్న జన్యుసంబంధ వ్యాధిని గుర్తించి చికిత్స కోసం ఏర్పట్లు చేసామని ఆమె తెలిపారు. ఆమెలోని పునరుత్పత్తి కెనాల్ అసంపూర్ణంగా ఉండటం గుర్తించి వెంటనే ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ డి. రామారావు సహకారంతో కృత్రిమ వెజినాను సృష్టించామని తెలిపారు. ఆపరేషన్ విజయవంవతంగా జరిగిందని, ఆమె ఆరోగ్యంగా వైవాహిక జీవితాన్ని కొనసాగించవచ్చునని, అయితే సంతానయోగం లేదని ఆమె తెలిపారు.