హైదరాబాద్: ఓ యువతికి వైద్యులు పత్రేకమైన శస్త్రచికిత్స నిర్వహించి సక్సెస్ అయ్యారు. పునరుత్పత్తి అవయవాలతోపాటు జననాంగం(వెజీనా)లేని ఓ యువతికి ప్రముఖ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ డి. పద్మావతి న్యూ వెజీనా రీ కన్‌స్ట్రక్షన్ సర్జరీని విజయవంతంగా నిర్వహించి సదరు యువతికి వైవాహిక జీవితాన్ని ప్రసాదించారు. కృష్ణానగర్‌లోని శీతల్ నర్సింగ్‌హోమ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ... పటాన్‌చెరు ప్రాంతానికి చెందిన కౌసల్య(26) అనే యువతికి చిన్నతనం నుంచే కేవలం మూత్ర ప్రసరణ రంద్రం మాత్రమే కలిగి వెజినా ఎజెనిసిస్‌తో భాదపడుతోందని చెప్పారు.
దీంతో ఆమెకు ఉన్న జన్యుసంబంధ వ్యాధిని గుర్తించి చికిత్స కోసం ఏర్పట్లు చేసామని ఆమె తెలిపారు. ఆమెలోని పునరుత్పత్తి కెనాల్ అసంపూర్ణంగా ఉండటం గుర్తించి వెంటనే ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ డి. రామారావు సహకారంతో కృత్రిమ వెజినాను సృష్టించామని తెలిపారు. ఆపరేషన్ విజయవంవతంగా జరిగిందని, ఆమె ఆరోగ్యంగా వైవాహిక జీవితాన్ని కొనసాగించవచ్చునని, అయితే సంతానయోగం లేదని ఆమె తెలిపారు.
యువతికి ‘ప్రత్యేక’ శస్త్రచికిత్స
Published Sat, Mar 12 2016 8:31 PM | Last Updated on Sun, Sep 3 2017 7:35 PM
Advertisement