special treatment
-
Bal Thackeray: సీఎంనే మందు పార్టీ అడిగిన బాల్ ఠాక్రే
న్యూఢిల్లీ: బాల్ ఠాక్రే.. మహారాష్ట్ర రాజకీయాల్లో శక్తివంతమైన నేతగా పేరుగాంచారు. నేడు (నవంబర్ 17) ఆయన వర్థంతి. 1926 జనవరి 23న జన్మించిన ఆయన 2012 నవంబర్ 17న కన్నుమూశారు. ఒకానొక సమయంలో బాల్ ఠాక్రే మహారాష్ట్ర రాజకీయాలను శాసించారు.మహారాష్ట్ర సీఎం పదవిలో ఎవరున్నా బాల్ ఠాక్రే ఆధిపత్యమే కొనసాగేదని చెబుతుంటారు. ప్రముఖ జర్నలిస్టు సుజాతా ఆనందన్ 'హిందూ హృదయ సామ్రాట్ - హౌ ది శివసేన ఛేంజ్డ్ ముంబై ఫర్ ఎవర్’ అనే పుస్తకాన్ని రాశారు. దానిలో ఆమె బాల్ ఠాక్రేకు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తెలియజేశారు. బాల్ ఠాక్రే బహిరంగంగా బీరు తాగేందుకు, సిగరెట్లు కాల్చేందుకు ఏమాత్రం మొహమాటపడేవారు కాదని సుజాతా ఆనందన్ ఆ పుస్తకంలో తెలిపారు. ఈ రెండూ అంటే బాల్ ఠాక్రేకు ఎంతో ఇష్టమని, ఆయన అందరి ముందు మద్యం తాగేవారని ఆమె ఆ పుస్తకంలో పేర్కొన్నారు.అది 1995. బాల్ ఠాక్రే పార్టీ గెలిచింది. దీంతో ముంబైకి చెందిన బిల్డర్ నిరంజన్ హీరానందాని తండ్రి డాక్టర్ ఎల్ హెచ్ హీరానందాని ఒక పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో గొంతు తడపడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని బాల్ ఠాక్రే కోరారు. వెంటనే హీరానందానీ.. ‘పార్టీకి సీఎం వస్తారు. వారి సమక్షంలో మద్యం ఎలా తాగగలం?’ అని ప్రశ్నించారు. దీనికి స్పందించిన బాల్ ఠాక్రే నేరుగా సీఎం మనోహర్ జోషితో ‘ఏంటి మనోహర్.. మీరేమీ తాగరా’ అని ప్రశ్నించారు. ఈ మాట వినగానే సీఎం అవాక్కయ్యారు. తరువాత బాల్‌ఠాక్రే డాక్టర్ హీరానందానీతో మనం ఇప్పుడిప్పుడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. కనీసం షాంపైన్ అయినా ఏర్పాటు చేయాలి అని అన్నారు. దీంతో ఫ్రూట్ జ్యూస్ పార్టీ కాస్తా మద్యం పార్టీగా మారిపోయింది.ఇది కూడా చదవండి: ఎన్నికల ప్రచారంలో నటుడు గోవిందాకు అస్వస్థత -
Andhra Pradesh: పల్లెకు ‘స్పెషల్’ వైద్యం
మూడేళ్ల క్రితం..ఏలూరు జిల్లా టెక్కినవారిగూడేనికి చెందిన ఉమ్మడి దుర్గారావు మూడేళ్ల క్రితం వరకూ వైద్య చికిత్స కోసం 15 కి.మీ. దూరంలోని జంగారెడ్డిగూడెం వెళ్లేవారు. అక్కడ కూడా అరకొర సేవలే అందుతుండటంతో ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వచ్చేది. రూ.వెయ్యి నుంచి రూ.1,500 దాకా ఖర్చయ్యేది. మరి ఇప్పుడు.. దుర్గారావు కుటుంబంతోపాటు పరిసర గ్రామాల్లో ఇప్పుడు ఎవరు అనారోగ్యానికి గురైనా జంగారెడ్డిగూడెం పరిగెత్తడం లేదు. లక్కవరం పీహెచ్‌సీలోనే చికిత్స పొందుతున్నారు. నాడు– నేడు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షల నిధులతో స్థానికపీహెచ్సీని అభివృద్ధి చేసింది. ఇద్దరు వైద్యులతో పాటు ముగ్గురు స్టాఫ్ నర్సులు, ఫార్మాసిస్ట్, అటెండర్, వాచ్మెన్ ఇతర సిబ్బందిని నియమించారు. వీడీఆర్ఎల్, టైపాయిడ్ ఇతర పరీక్షలు చేస్తున్నారు. నాడు సాధారణ వైద్య సేవలే గగనంగా మారిన చోట నేడు ప్రతి సోమవారం చెవి, ముక్కు సమస్యలకు చికిత్స, బుధవారం నేత్ర సేవలు అందుతున్నాయి. 60 ఏళ్లు దాటిన వారికి గురువారం ప్రత్యేక వైద్య శిబిరం, శుక్ర, శనివారాల్లో 13 – 18 ఏళ్ల వారికి వైద్య పరీక్షలు, నెలకొక సారి దంత, మెంటల్ హెల్త్ క్లినిక్‌లు నిర్వహిస్తున్నారు. ఫలితంగా ఒక్కప్పుడు ఇక్కడ రోజుకు 30 లోపు ఓపీలు ఉండగా ప్రస్తుతం 60 నుంచి 80 వరకు పెరిగాయి. గత సర్కారు హయాంలో అత్యవసర ఔషధాలూ అందుబాటులో లేని దుస్థితి నెలకొనగా ఇప్పుడు 240 రకాల ఎసెన్షియల్ మందులు పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉంటున్నాయి. చెంతనే స్పెషలిస్టు సేవలు పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం కరాలపాడుకు చెందిన చల్లా వెంకట కోటమ్మ ఆయాసానికి చికిత్స కోసం 50 కి.మీ దూరంలో ఉన్న నరసరావుపేట లేదా 80 కి.మీ దూరంలో ఉండే గుంటూరు వెళ్లాలి. చార్జీల భారంతో పాటు రోజంతా పొలం పనులు ఆగిపోయేవి. ఇప్పుడు కరాలపాడు పీహెచ్సీలో స్పెషలిస్ట్ వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో తమ ఇబ్బందులు తొలగిపోయాయని సంతోషం వ్యక్తం చేస్తోంది. సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 1,145 పీహెచ్‌సీల్లో ఇలాంటి మార్పులే కనిపిస్తున్నాయి. సర్కారు ఆస్పత్రుల్లో వైద్య సేవలకు ప్రాణం పోసి ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల నుంచి బోధనాసుపత్రుల వరకు రూపురేఖలు సమూలంగా మారుతున్నాయి. ప్రతి చోటా ఇద్దరు వైద్యులు, ముగ్గురు స్టాఫ్ నర్సులతో పాటు ఇతర సిబ్బంది కలిపి 12 మంది ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే 909 మంది డాక్టర్లు, 1,113 మంది నర్సులు, 4233 ల్యాబ్ టెక్నీషియన్, ఎఫ్ఎన్వో, ఇతర సిబ్బంది పోస్టులను భర్తీ చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల స్థితిగతులు, వైద్య సేవల్లో మార్పులు ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడయ్యాయి. టెలి మెడిసిన్ సేవల్లో రికార్డు సాధారణ వైద్య సేవలతో పాటు టెలి మెడిసిన్ ద్వారా స్పెషలిస్టు డాక్టర్ల వైద్య సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. టెలిమెడిసిన్ ద్వారా గ్రామీణ ప్రజలకు పీహెచ్‌సీలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల నుంచే స్పెషాలిటీ సేవలు అందించడంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ రికార్డు సాధించింది. ఇప్పటివరకూ ఏకంగా 1.40 కోట్ల కన్సల్టేషన్లు నమోదయ్యాయి. రోగులతో వాయిస్, వీడియో కాల్స్‌లో మాట్లాడి డాక్టర్లు వైద్య సేవలు అందించారు. దేశంలో తొలిసారిగా ‘స్పెషల్’.. దేశంలోనే తొలిసారిగా తొమ్మిది స్పెషాలిటీల్లో ఓపీ సేవలను రాష్ట్ర ప్రభుత్వం పీహెచ్‌సీల్లో అందుబాటులోకి తెచ్చింది. జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఈఎన్టీ, ఆఫ్తాల్మాలజీ, డెర్మటాలజీ, ఈఎన్టీ, జనరల్ సర్జన్, డెంటల్ సర్జన్, పల్మనరీ మెడిసిన్ వైద్య సేవలను ప్రజలకు చేరువ చేసింది. ఇందుకోసం ఒక్కో స్పెషాలిటీలో 142 మందిని నియమిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,276 మంది స్పెషలిస్టుల అవసరం ఉండగా ఇప్పటికే 979 మందిని నియమించారు. వైద్య పరీక్షల్లో 57 శాతం పెరుగుదల నాడు–నేడులో భాగంగా పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో ల్యాబ్‌లను బలోపేతం చేసి 35 రకాల వైద్య పరీక్షలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. 2017–18తో పోలిస్తే 2021–22లో వైద్య పరీక్షలు 57.85 శాతం పెరిగాయి. గతంలో 60,60,854 పరీక్షలు మాత్రమే చేయగా ఇప్పుడు 1,04,76,190 పరీక్షలు నిర్వహించారు. మంచి స్పందన.. ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెరిగింది. ప్రసవాలు కూడా చేస్తున్నాం. స్పెషాలిటీ క్లినిక్‌లకు మంచి స్పందన లభిస్తోంది. – అల్లాడి అశోక్‌కుమార్, లక్కవరం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి పట్టించుకోరనుకున్నాం... ప్రభుత్వ ఆసుపత్రి అంటే సరిగా పట్టించుకోరని భావించాం. అక్కడకు వెళ్లాక ఆ భావన తొలగిపోయింది. వైద్యులు, సిబ్బంది పనితీరు బాగుంది. – దేవి, టెన్నేరు గ్రామం, కృష్ణా జిల్లా ప్రైవేట్ కంటే మెరుగ్గా.. ప్రైవేట్ ఆస్పత్రులకన్నా ప్రభుత్వ ఆస్పత్రి పరిశుభ్రంగా ఉంది. సేవలు పెరిగాయి. స్థానికంగా లభించని వైద్యానికే ఇప్పుడు జంగారెడ్డిగూడెం వెళ్తున్నాం. – పసుపులేటి చిన్నారి, లక్కవరం, జంగారెడ్డిగూడెం మండలం కీళ్ల నొప్పులకు ట్రీట్మెంట్.. కీళ్లు, మోకాళ్లు, కండరాలు, మెడ నొప్పి బాధితులకు ప్రత్యేకంగా సేవలు అందిస్తున్నాం. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవాల్సిన అవసరం లేకుండా మెరుగైన వైద్యం అందుతోందని బాధితులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. – టి. సంజీవ్, తిప్పాయపాలెం పీహెచ్సీ వైద్యుడు (ఎమ్మెస్ ఆర్థో స్పెషలిస్ట్) ప్రకాశం జిల్లా -
వైద్య సిబ్బందికి నిమ్స్‌లో చికిత్స
సాక్షి, హైదరాబాద్: కరోనా బారిన పడ్డ వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు నిమ్స్, టిమ్స్, గాంధీ ఆస్పత్రుల్లో ప్రత్యేక చికిత్స అందిస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఆయా సంఘాల నాయ కులతో గురువారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి కూడా పాల్గొన్నారు. నిమ్స్‌లో ప్రత్యేకంగా 50 పడకలు ఏర్పాటు చేస్తామని, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న అందరికీ అక్కడే చికిత్స అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. కరోనాతో చనిపోయిన వైద్య సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎక్స్‌గ్రేషియా ఇచ్చే అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఆందోళన వాయిదా: డాక్టర్లు, పారామెడికల్ సంఘాల డిమాండ్లపై మంత్రి సానుకూలంగా స్పందించారని రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పుట్ల శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఆందోళనను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు వెల్లడించారు. -
శశికళను చూసి షాకైన రేఖా శర్మ
సాక్షి, బెంగళూర్ : పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న వీకే శశికళకు స్పెషల్ ట్రీట్మెంట్ కొనసాగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆమె తనకు నిర్ధేశించిన జైలు యూనిఫాంను కూడా ధరించడం లేదు. బెంగళూర్ జైలుని జాతీయ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రేఖా శర్మ సందర్శించిన క్రమంలో తోటి ఖైదీలు, ఆమెకు మధ్య ఈ వ్యత్యాసాన్ని గుర్తించారు. అక్రమాస్తుల కేసులో శశికళ, ఆమె బంధువు ఇళవరసి ఇదే జైలులో ఖైదీలుగా ఉన్న విషయం తెలిసిందే. తాను జైలును సందర్శించిన సమయంలో శశికళ, ఇళవరసి జైలు యూనిఫాం ధరించకుండా సాధారణ దుస్తుల్లో కనిపించారని రేఖా శర్మ నిర్ధారించారు. ఇదే విషయమై తాను జైలు అధికారులను ప్రశ్నించగా ఆమె అత్యున్నత కేటగిరీకి చెందిన వారు కావడంతో సొంత దుస్తులు వాడేందుకు అనుమతిస్తామని చెప్పినట్టు తెలిపారు. జైలులో శశికళ ప్రత్యేక సౌకర్యాలు పొందుతున్నారని, విజిటర్స్‌ను ప్రైవేటు ప్రదేశంలో కలుస్తున్నారని, ప్రత్యేకంగా తయారుచేసిన ఆహారం స్వీకరిస్తున్నారని, ప్రత్యేక సెల్స్‌ను వ్యక్తిగత అవసరాలకు వాడుతున్నారని తొలుత జైళ్ల శాఖ మాజీ డీఐజీ రూప తొలుత వెలుగులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కర్ణాటక జైళ్లలో ఖైదీలంతా తెలుపు రంగు దుస్తులు వాడాల్సి ఉండగా, శశికళ, ఇళవరసి మాత్రం చీరలు, సల్వార్ కమీజ్ సహా తమ సొంత దుస్తులను వాడుతున్నారని రూప గతంలోనే వెల్లడించారు. యూనిఫాం విషయంలో ఖైదీల మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉండదని ఆమె స్పష్టం చేశారు. -
మహిళల రక్షణకు.. సఖి
♦ అఘాయిత్యాలకు గురైన మహిళకు ప్రత్యేక చికిత్స ♦ ఒకేచోట అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ♦ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కలెక్టర్, ఎమ్మెల్యే పాలమూరు : వివిధ రూపాల్లో అఘాయిత్యాలకు గురై ఇబ్బంది పడుతున్న మహిళలు, యువతులు, బాలికలకు సఖి కేంద్రంలో ప్రత్యేక చికిత్స అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రి ఆవరణలో రూ.42లక్షల వ్యయంతో నిర్మించనున్న సఖి భవన నిర్మాణ పనులకు శుక్రవారం ఆయన ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళలపై అఘాయిత్యాలు తగ్గించేలా చూడడంతో పాటు బాధితులకు ‘సఖి’ ద్వారా అండగా వైద్యుడు, పోలీస్ అధికారులు, న్యాయవాదులు, మానసిక వ్యక్తిత్వ వికాస నిపుణులు.. అందరూ సఖి కేంద్రంలో ఉంటారని చెప్పారు. కాగా, మూడు అంతస్తులతో భవనం నిర్మిస్తుండగా.. మూడు నెలల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ రాధ, శిశు సంక్షేమ అధికారి గోవిందరాజులు, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకిషన్, గైనిక్ హెచ్ఓడీ రాధ పాల్గొన్నారు. -
వొడాఫోన్, ఐడియాలకు స్పెషల్ ట్రీట్మెంటా?
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద టెలికాం కంపెనీగా అవతరించబోతున్న వొడాఫోన్-ఐడియాల విలీన సంస్థకు ఎలాంటి స్పెషల్ ట్రీట్ మెంట్ ఉండదని టెలికాం మంత్రి మనోజ్ సిన్హా స్పష్టంచేశారు. రెవెన్యూ క్యాప్, సబ్ స్క్రైబర్, స్పెక్ట్రమ్ క్యాపిటల్ కు సంబంధించి ప్రస్తుత నిబంధలకే విలీన సంస్థ కట్టుబడి ఉండాల్సిందేనని చెప్పారు. టెలికాం రంగ ఆర్థిక సంపదను, వినియోగదారుల ప్రయోజనాలను సమతూకం చేస్తూ పాలసీలను అమలు చేసేందుకు టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ తో కలిసి మంత్రిత్వశాఖ పనిచేస్తుందని పునరుద్ఘాటించారు. ప్రస్తుతం టెలికాం రంగంలో అతిపెద్ద కంపెనీగా ఉన్న భారతీ ఎయిర్ టెల్ ను వెనక్కి నెట్టేసి, వొడాఫోన్-ఐడియాల విలీన సంస్థ ఆ చోటును దక్కించుకోబోతుంది. ఒకవేళ విలీన సంస్థలు నిబంధనలకు కట్టుబడి ఉండకపోతే, వారికి టెలికాం రంగంలో కొనసాగే అనుమతే లేదని తేల్చిచెప్పారు. కచ్చితంగా వారు నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. టెలికాం రంగంలో మెగా మెర్జర్ నిలువబోతున్న వొడాఫోన్-ఐడియాల విలీనానికి ఏమన్న స్పెషల్ ట్రీట్ మెంట్ ఇస్తారా? అనే ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి స్పెషల్ ట్రీట్ మెంట్ ఉండదన్నారు. ఐదు మార్కెట్లలో విలీన సంస్థ రెవెన్యూ మార్కెట్ షేరును, సబ్ స్క్రైబర్, స్పెక్ట్రమ్ క్యాపిటల్ ను ఉల్లంఘించే అవకాశాలున్నాయని టెలికాం విశ్లేషకులు సందేహం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. విలీనాలతో, కొనుగోళ్లతో టెలికాం రంగంపై ఎలాంటి ఆందోళన చెందాల్సినవసరం లేదన్నారు. రెవెన్యూ క్యాపిటల్, సబ్ స్క్రైబర్ క్యాప్,స్పెక్ట్రమ్ క్యాప్ విషయంలో గైడ్ లైన్స్ ఉన్నాయని, వాటిని ఫాలో అవుతూ సమృద్ధికరమైన పోటీ వాతావరణం పొందాల్సిందేనన్నారు. దీనికోసం తాము అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
పశువుల్లో పడక జబ్బు
నివారణే ప్రధానం.. సకాలంలో చర్యలు చేపట్టాలి గజ్వేల్ పశువైద్యాధికారి నరేందర్‌రెడ్డి సలహాలు... సూచనలు గజ్వేల్: పశువుల్లో పడక జబ్బు తలెత్తి రైతులు ఇబ్బంది పడుతుంటారు. ఈ వ్యాధి కారణంగా పశువులు తెలివిగా ఉండి కూడా లేచి నిలబడలేకపోతాయి. అధికంగా పాలిచ్చే పశువుల్లో ఈ వ్యాధి కనబడుతుంది. ఈ వ్యాధి నివారణకు సకాలంలో చర్యలు చేపట్టాలని గజ్వేల్ పశువైద్యాధికారి నరేందర్‌రెడ్డి(సెల్ : 9505056118) తెలిపారు. ఈ సందర్భంగా సలహాలు, సూచనలు అందించారు. వ్యాధి సోకడానికి కారణాలు సాధారణంగా పశువులు ఈనిన వెంటనే వచ్చే పాల జ్వరం వ్యాధి చికిత్స సక్రమంగా పూర్తి చేయకపోతే అవి డౌనర్గా మారతాయి. తొడ, కండరాళ్లకు గాయాలవ్వడం, వాటికి సంబంధించిన నరాలు దెబ్బ తినడం వల్ల గర్భస్త దూడ పెద్దగా ఉన్నప్పుడు, అందించే మేపులో, రక్తంలో కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం లోపమున్నప్పుడు, పొటాషియం లవణ లోపం వల్ల ఆవులు పడుకుని పాకుతూ ఉంటాయి. లక్షణాలు శ్వాస సాధారణంగా, నాడీరేటు అధికంగా ఉంటాయి. పడుకున్న ఆవులు తరచుగా నిలబడడనికి ప్రయత్నిస్తుంటాయి. కానీ నిలబడలేవు. మేత మేస్తుంటాయి. నెమరు వేస్తుంటాయి. కొన్ని ఆవులు కాళ్లను చాచి పడుకుని, తలను వెనక్కి లాక్కుని ఉండిపోతాయి. కొన్ని ఆవులు తరచుగా బెదురుతూ గిలగిలా కొట్టుకుంటాయి. పడక వల్ల శరీరంపై పుండ్లు ఏర్పడతాయి. 7 రోజుల పాటు అదే పరిస్థితి ఉంటే పశువుల లేవడం కష్టం. చికిత్స అవసరాన్ని బట్టి పశు వైద్యుల సలహాపై నో విజాక్-పి, కార్టిజోన్స్, విటమిన్-ఈ, కాల్షియం, పాస్ఫరస్, సెలీనియం ఇంజక్షన్లు వాడాలి. అదే విధంగా బీ1, బీ6, బీ12కు సంబంధించిన ఇంజక్షన్లు వాడాలి. నీరు, మేత తీసుకోకుండా ఉంటే 20శాతం గ్లూకోజ్ ఎక్కించాలి. వ్యాధిగ్రస్త పశువుల్ని అటూ... ఇటు తిప్పుతుండాలి. పశువులకు మెత్తని పడకను ఏర్పాటు చేయాలి. వ్యాధి గ్రస్త పశువుల కండరాల్ని వరిగడ్డి లేదా కొబ్బరి పీచుతో మసాజ్ చేస్తుండాలి. ఇన్ఫ్రారెడ్ కిరణాల్లో కూడా మసాచ్ చేయవచ్చు. ఖనిజ లవణ మిశ్రమం ప్రతిరోజు వాడుతుండాలి. ఇవే కాకుండా పడక వ్యాధితో బాధపడే పశువులను క్రమక్రమంగా పైకి లేపడం ద్వారా బాగు చేయడానికి ప్రత్యేకంగా మహారాష్ట్రలో పరికరాన్ని తయారు చేశారు. దీని ధర సుమారు రూ. 15వేల వరకు ఉంటుందని, స్థానికంగా కూడా ఈ పరికరాన్ని తయారు చేసుకోవచ్చు. -
డిస్పెన్సరీలో మెరుగైన వైద్యం
ౖయెటింక్లయిన్‌కాలనీ : సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని ౖయెటింక్లయిన్‌కాలనీ డిస్పెన్సరీలో వైద్యసేవలు మెరుగు పర్చేందుకు సింగరేణి యాజమాన్యం ఆదేశాలు జారీ చేసిందని ఆర్జీ–2 టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్ తెలిపారు. స్థానిక ప్రెస్‌భవన్‌లో శనివారం మాట్లాడారు. డిస్పెన్సరీలో డాక్టర్లు లేక కార్మికుల కుటుంబాలు గోదావరిఖనిలోని ఏరియా ఆసుపత్రికి వెళ్లాల్సివస్తోందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. స్పందించిన ఆయన ఐదుగురు డాక్టర్ల నియామకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. తీవ్రమైన జ్వరంతో వచ్చే కార్మిక కుటుంబాలకు ఇక్కడే ఇన్‌పేషెంట్‌గా చికిత్స చేయించనున్నట్లు పేర్కొన్నారు. ల్యాబ్‌కు సంబంధించిన పరీక్షలను కూడా ఇక్కడే చేయించేలా టెక్నీషియన్‌ను నియమించినట్లు తెలిపారు. షుగర్, కొలెస్ట్రాల్ పరీక్షలు ఇక్కడే జరిపేలా ఆదేశాలు జారీ చేశారన్నారు. వైద్యం కోసం వచ్చే కార్మిక కుటుంబాలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేయాలని తాము కోరినట్లు తెలిపారు. సమావేశంలో కొంగర రవీందర్, సిరిపురం రాజేశం, శ్రీనివాస్‌రెడ్డి, సదయ్య, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
మా విమానం మోదీ ఫ్రీ గా వాడుకోలేదు..
న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామిక వేత్త, అదాని గ్రూపు ఛైర్మన్ గౌతం అదానీ కాంగ్రెస్ నేత జై రాం రమేష్ తాజా విమర్శలపై స్పందించారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోలేదని, తమకు స్పెషల్ ట్రీట్ మెంటే ఏమీ లేదని వివరణ ఇచ్చారు. తమ విమానాన్ని ప్రధాని ఉచితంగా వాడుకోలేదని వెల్లడించిన ఆయన కాంగ్రెస్ నేతలు జీఎంఆర్ విమానాలను వాడుకోలేదా అని ప్రశ్నించారు. నెహ్రూ గాంధీ కుటుంబం పాలిస్తున్న కాంగ్రెస్ విమర్శల వెనుక పెద్ద రాజకీయమే ఉందని ఆరోపించారు. వాస్తవాలకు దూరంగా జై రాం రమేష్ ఆరోపణలు గుప్పించారన్నారు. కావాలనే రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. అదానీ గ్రూపుపై విధించిన 200 కోట్ల జరిమానాను ఉపసంహరించుకోలేదని ప్రభుత్వం స్పష్టం చేసిందని గౌతం వివరించారు. సునీతా నరైన్ నివేదిక తర్వాత యూపీఏ ప్రభుత్వం తమ సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేసిందని అయితే దానికి తాము సమాధానమిచ్చామని తర్వాత ప్రభుత్వం (యూపీఏ) ఏమీ చేయాలో నిర్ణయించలేకపోయిందని విమర్శించారు. జైం రాం రమేష్ ఆరోపించినట్టుగా చత్తీస్ ఘడ్ లోని అటవీ ప్రాంతాన్ని మైనింగ్ కోసం ఇచ్చిన కంపెనీ తమకు సంబంధించింది కాదని స్పష్టం చేశారు. అది రాజస్తాన్ ప్రభుత్వానికి చెందిన కంపెనీ అనీ, మైనింగ్ కాంట్రాక్టర్ గా తమను ప్రభుత్వం ఎంచుకుందని వివరించారు. అలాగే కాంగ్రెస్ ప్రబుత్వం హయాంలోనే ఈ ఒప్పందం జరిగిందనీ, దీనికి అనుమతి ఇచ్చిందని జై రాం రమేషే నని చెప్పుకొచ్చారు. ఇపుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో తనకు అర్థం కావడంలేదన్నారు. పిటిషనర్ వరుసగా నాలుగు పిల్స్ వేశాడని.. కానీ ఒకటి కూడా ఆ ప్రాంతంలో కమ్యూనిటీ కానీ, దీని వల్ల నష్టపోతున్న వారుగానీ వేయలేదన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు రాజకీయంగా మోటివేట్ చేశాయని ఆరోపించారు. అయినా అక్కడ అభివృద్ధిజరగడం తమకు చాలా గర్వంగా ఉందని తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వం దీనిపై విచారణ జరుపుతోందన్నారు. తాము ఎలాంటి నిబంధనల అతిక్రమణకు పాల్పడలేదని వివరించారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అని గౌతం అదాని వ్యాఖ్యానించారు. రాజకీయ వివాదాలలోకి రావడం తమకు ఇష్టంలేదనీ, కార్పొరేట్ సంస్థలు రాజకీయాలకు దూరంగా ఉండాలన్నారు. రాజకీయ పార్టీలు అనవసరంగా కార్పొరేట్లను రాజకీయాల్లోకి లాగొద్దని కోరారు. ఇది దేశానికి మంచి కాదని వ్యాఖ్యానించారు. తాము రాజకీయ చదరంగంలో పావులు కాదలుచుకోలేదని ఆయన చెప్పారు. తాము రాజకీయ పార్టీతో కలిసి పనిచేస్తున్నామనీ, గుజరాత్,మహారాష్ట్ర, రాజస్థాన్ లాంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సైతం నిబద్ధతతో పనిచేస్తున్నామని తెలిపారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు లేకుండా మౌలిక సదుపాయాల కల్పన సాధ్యం కాదని గౌతం ఆదాని, పేర్కొన్నారు. -
యువతికి ‘ప్రత్యేక’ శస్త్రచికిత్స
హైదరాబాద్: ఓ యువతికి వైద్యులు పత్రేకమైన శస్త్రచికిత్స నిర్వహించి సక్సెస్ అయ్యారు. పునరుత్పత్తి అవయవాలతోపాటు జననాంగం(వెజీనా)లేని ఓ యువతికి ప్రముఖ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ డి. పద్మావతి న్యూ వెజీనా రీ కన్స్ట్రక్షన్ సర్జరీని విజయవంతంగా నిర్వహించి సదరు యువతికి వైవాహిక జీవితాన్ని ప్రసాదించారు. కృష్ణానగర్‌లోని శీతల్ నర్సింగ్‌హోమ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ... పటాన్చెరు ప్రాంతానికి చెందిన కౌసల్య(26) అనే యువతికి చిన్నతనం నుంచే కేవలం మూత్ర ప్రసరణ రంద్రం మాత్రమే కలిగి వెజినా ఎజెనిసిస్తో భాదపడుతోందని చెప్పారు. దీంతో ఆమెకు ఉన్న జన్యుసంబంధ వ్యాధిని గుర్తించి చికిత్స కోసం ఏర్పట్లు చేసామని ఆమె తెలిపారు. ఆమెలోని పునరుత్పత్తి కెనాల్ అసంపూర్ణంగా ఉండటం గుర్తించి వెంటనే ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ డి. రామారావు సహకారంతో కృత్రిమ వెజినాను సృష్టించామని తెలిపారు. ఆపరేషన్ విజయవంవతంగా జరిగిందని, ఆమె ఆరోగ్యంగా వైవాహిక జీవితాన్ని కొనసాగించవచ్చునని, అయితే సంతానయోగం లేదని ఆమె తెలిపారు. -
కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ వైద్య సేవలు
ఆదిలాబాద్: ఆదిలాబాద్ రిమ్స్ వైద్యులు ఓ చిన్నారికి అరుదైన చికిత్స అందించారు. నాలుగు నెలల క్రితం 650 గ్రాముల బరువుతో జన్మించిన పాపకు చికిత్సతో పునర్జన్మను ప్రసాదించారు. గత సెప్టెంబర్ 9న ఆదిలాబాద్‌లోని శాంతినగర్ కాలనీకి చెందిన రాకేశ్, విజయలక్ష్మి దంపతులకు 650 గ్రాముల బరువుతో పాప జన్మించింది. అతి తక్కువ బరువుతో జన్మించిన పాపను రిమ్స్ వైద్యులు నాలుగు నెలలు ఎస్‌ఎన్‌సీయూలో ఉంచి వైద్యమందించారు. బరువు 1.9 కిలోలకు చేరి మామూలు స్థితికి రావడంతో చిన్నారిని ఆదివారం అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న చేతుల మీదుగా డిశ్చార్జి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... అతితక్కువ బరువుతో పుట్టిన పాపను మామూలు స్థితికి తీసుకు రావడంపై రిమ్స్ వైద్యులను అభినందించారు. వైద్యుల కొరత ఉన్నా రాష్ట్రంలోనే ఏ ఆస్పత్రిలో లేని విధంగా పాపను వైద్యంతో బతికించడం సంతోషకరమన్నారు. ఈ సమావేశంలో రిమ్స్ ఇన్చార్జి డెరైక్టర్ అశోక్, చిన్నపిల్లల వైద్య నిపుణులు సూర్యకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
'చిరంజీవీ.. మీరూ క్యూలోనే రండి'