డిస్పెన్సరీలో మెరుగైన వైద్యం
Published Sat, Jul 30 2016 5:46 PM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
ౖయెటింక్లయిన్‌కాలనీ : సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని ౖయెటింక్లయిన్‌కాలనీ డిస్పెన్సరీలో వైద్యసేవలు మెరుగు పర్చేందుకు సింగరేణి యాజమాన్యం ఆదేశాలు జారీ చేసిందని ఆర్జీ–2 టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్ తెలిపారు. స్థానిక ప్రెస్‌భవన్‌లో శనివారం మాట్లాడారు. డిస్పెన్సరీలో డాక్టర్లు లేక కార్మికుల కుటుంబాలు గోదావరిఖనిలోని ఏరియా ఆసుపత్రికి వెళ్లాల్సివస్తోందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. స్పందించిన ఆయన ఐదుగురు డాక్టర్ల నియామకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. తీవ్రమైన జ్వరంతో వచ్చే కార్మిక కుటుంబాలకు ఇక్కడే ఇన్‌పేషెంట్‌గా చికిత్స చేయించనున్నట్లు పేర్కొన్నారు. ల్యాబ్‌కు సంబంధించిన పరీక్షలను కూడా ఇక్కడే చేయించేలా టెక్నీషియన్‌ను నియమించినట్లు తెలిపారు. షుగర్, కొలెస్ట్రాల్ పరీక్షలు ఇక్కడే జరిపేలా ఆదేశాలు జారీ చేశారన్నారు. వైద్యం కోసం వచ్చే కార్మిక కుటుంబాలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేయాలని తాము కోరినట్లు తెలిపారు. సమావేశంలో కొంగర రవీందర్, సిరిపురం రాజేశం, శ్రీనివాస్‌రెడ్డి, సదయ్య, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement