మహిళల రక్షణకు.. సఖి
♦ అఘాయిత్యాలకు గురైన మహిళకు ప్రత్యేక చికిత్స
♦ ఒకేచోట అన్ని శాఖల అధికారులు, సిబ్బంది
♦ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కలెక్టర్, ఎమ్మెల్యే
పాలమూరు : వివిధ రూపాల్లో అఘాయిత్యాలకు గురై ఇబ్బంది పడుతున్న మహిళలు, యువతులు, బాలికలకు సఖి కేంద్రంలో ప్రత్యేక చికిత్స అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రి ఆవరణలో రూ.42లక్షల వ్యయంతో నిర్మించనున్న సఖి భవన నిర్మాణ పనులకు శుక్రవారం ఆయన ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ మహిళలపై అఘాయిత్యాలు తగ్గించేలా చూడడంతో పాటు బాధితులకు ‘సఖి’ ద్వారా అండగా వైద్యుడు, పోలీస్ అధికారులు, న్యాయవాదులు, మానసిక వ్యక్తిత్వ వికాస నిపుణులు.. అందరూ సఖి కేంద్రంలో ఉంటారని చెప్పారు. కాగా, మూడు అంతస్తులతో భవనం నిర్మిస్తుండగా.. మూడు నెలల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ రాధ, శిశు సంక్షేమ అధికారి గోవిందరాజులు, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకిషన్, గైనిక్ హెచ్‌ఓడీ రాధ పాల్గొన్నారు.