వొడాఫోన్, ఐడియాలకు స్పెషల్ ట్రీట్మెంటా?
వొడాఫోన్, ఐడియాలకు స్పెషల్ ట్రీట్మెంటా?
Published Thu, Mar 30 2017 3:47 PM | Last Updated on Sat, Aug 11 2018 8:24 PM
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద టెలికాం కంపెనీగా అవతరించబోతున్న వొడాఫోన్-ఐడియాల విలీన సంస్థకు ఎలాంటి స్పెషల్ ట్రీట్ మెంట్ ఉండదని టెలికాం మంత్రి మనోజ్ సిన్హా స్పష్టంచేశారు. రెవెన్యూ క్యాప్, సబ్ స్క్రైబర్, స్పెక్ట్రమ్ క్యాపిటల్ కు సంబంధించి ప్రస్తుత నిబంధలకే విలీన సంస్థ కట్టుబడి ఉండాల్సిందేనని చెప్పారు. టెలికాం రంగ ఆర్థిక సంపదను, వినియోగదారుల ప్రయోజనాలను సమతూకం చేస్తూ పాలసీలను అమలు చేసేందుకు టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ తో కలిసి మంత్రిత్వశాఖ పనిచేస్తుందని పునరుద్ఘాటించారు.
ప్రస్తుతం టెలికాం రంగంలో అతిపెద్ద కంపెనీగా ఉన్న భారతీ ఎయిర్ టెల్ ను వెనక్కి నెట్టేసి, వొడాఫోన్-ఐడియాల విలీన సంస్థ ఆ చోటును దక్కించుకోబోతుంది. ఒకవేళ విలీన సంస్థలు నిబంధనలకు కట్టుబడి ఉండకపోతే, వారికి టెలికాం రంగంలో కొనసాగే అనుమతే లేదని తేల్చిచెప్పారు. కచ్చితంగా వారు నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. టెలికాం రంగంలో మెగా మెర్జర్ నిలువబోతున్న వొడాఫోన్-ఐడియాల విలీనానికి ఏమన్న స్పెషల్ ట్రీట్ మెంట్ ఇస్తారా? అనే ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి స్పెషల్ ట్రీట్ మెంట్ ఉండదన్నారు.
ఐదు మార్కెట్లలో విలీన సంస్థ రెవెన్యూ మార్కెట్ షేరును, సబ్ స్క్రైబర్, స్పెక్ట్రమ్ క్యాపిటల్ ను ఉల్లంఘించే అవకాశాలున్నాయని టెలికాం విశ్లేషకులు సందేహం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. విలీనాలతో, కొనుగోళ్లతో టెలికాం రంగంపై ఎలాంటి ఆందోళన చెందాల్సినవసరం లేదన్నారు. రెవెన్యూ క్యాపిటల్, సబ్ స్క్రైబర్ క్యాప్,స్పెక్ట్రమ్ క్యాప్ విషయంలో గైడ్ లైన్స్ ఉన్నాయని, వాటిని ఫాలో అవుతూ సమృద్ధికరమైన పోటీ వాతావరణం పొందాల్సిందేనన్నారు. దీనికోసం తాము అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Advertisement
Advertisement