Manoj Sinha
-
ఉగ్ర లింకులున్న ముగ్గురు ఉద్యోగుల తొలగింపు
జమ్మూ: ఉగ్ర మూకలతో సంబంధాలున్నట్లు తేలడంతో పోలీసు కానిస్టేబుల్ సహా ముగ్గురు ఉద్యోగులను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శనివారం విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వీరిలో పోలీస్ కానిస్టేబుల్ ఫిర్దౌస్ అహ్మద్ భట్, స్కూల్ టీచర్ అష్రాఫ్ భట్, అటవీ శాఖ ఉద్యోగి నిసార్ అహ్మద్ ఖాన్ ఉన్నారు. నిసార్ అహ్మద్ ఖాన్ 2000వ సంవత్సరంలో నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన మంత్రి హత్య కేసులో అరెస్టయ్యాడు. ఇతడికి హిజ్బుల్ ముజాహిదీన్‌తో సంబంధాలున్నట్లు తేలింది. అదేవిధంగా, 2005లో స్పెషల్ పోలీస్ అధికారి(ఎస్పీవో)గా నియమితుడై, 2011లో కానిస్టేబుల్‌గా ప్రమోషన్ పొందిన ఫిర్దౌస్కు ఉగ్రలింకులున్నట్లు తేలడంతో గతేడాది సస్పెండ్ చేశారు. ఆయుధాలు, డ్రగ్స్ సరఫరా చేసే ఇతడు ప్రస్తుతం కొట్ భల్వాల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అనంత్‌నాగ్ జిల్లాలో దాడులకు పథక రచన చేస్తుండగా మరో ఇద్దరు ఉగ్రవాదులతోపాటు పట్టుకున్నారు. రియాసికి చెందిన అష్రాఫ్ భట్ రెహ్బార్–ఇ–తలీం టీచర్‌గా 2008లో చేరాడు. ఇతడికి లష్కరేతోయిబాతో సంబంధాలున్నాయి. పాక్ కేంద్రంగా పనిచేసే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మహ్మద్ కాసిమ్ ఆదేశాల మేరకు ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇతడిని పోలీసులు 2022లో అరెస్ట్ చేశారు. -
జమ్మూకశ్మీర్ రాష్ట్రహోదా తీర్మానానికి ఎల్జీ ఓకే
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలంటూ ఒమర్ అబ్దుల్లా కేబినెట్ చేసిన తీర్మానానికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆమోదముద్రవేశారు. గురువారం సమావేశమై కేబినెట్ ఆమోదించిన తీర్మానానికి ఎల్జీ ఆమోదం తెలిపినట్లు అధికారిక వర్గాలు శనివారం వెల్లడించాయి. జమ్మూకశ్మీర్ ప్రజల గుర్తింపు, రాజ్యాంగబద్ధ హక్కులను తిరిగి పొందేందుకు పాత గాయాలను మాన్పే పూర్తిరాష్ట్ర హోదా పొందే ప్రక్రియలో ఈ తీర్మానం తొలి అడుగు అని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. జమ్మూకశ్మీరీల ప్రత్యేక గుర్తింపే నూతన ప్రభుత్వం అనుసరించనున్న విధాననిర్ణయాలకు భూమిక అని ఆయన అన్నారు. నవంబర్ నాలుగోతేదీన అసెంబ్లీ సమావేశాలు జరపనున్నారు. రాష్ట్ర పునరుద్ధరణకు సంబంధించిన విషయాలపై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో చర్చించేందుకు సీఎం ఒమర్ త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు. అయితే రద్దయిన 370 ఆరి్టకల్‌ను తిరిగి తీసుకొచ్చే విషయంలో ఎలాంటి తీర్మానాలు జరగకపోవడాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. కొలువుతీరిన కొద్దిరోజులకే ఒమర్ సర్కార్ అప్పుడే కేంద్రప్రభుత్వానికి లొంగిపోయిందని ఆగ్రహం వ్యక్తంచేశాయి. -
అలా నిరూపిస్తే రాజీనామా చేస్తా: జమ్ము ఎల్జీ
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో గత ఐదేళ్లలో అభివృద్ధి జరగలేదని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానంటున్నారు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కశ్మీర్ పర్యటనలో తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మనోజ్ ఇలా స్పందించారు.‘జమ్ము కశ్మీర్లో ప్రజల వద్ద రాహుల్ గాంధీ అభిప్రాయాలను సేకరించాలి. అప్పుడే రాహుల్‌కు మరింత అవగాహన వస్తుంది. కావాలంటే రహస్య బాలెట్ విధానంలో ప్రజాభిప్రాయాన్ని చేపట్టండి. ఇక్కడి 75 శాతం మంది ప్రజలు అభివృద్ధి జరగలేదని చెబితే నా పదవికి రాజీనామా చేస్తా’ అని అన్నారు. అలాగే.. జమ్ము కశ్మీర్లో ఎవరి ప్రభుత్వం కొలువుదీరినా వారికి నా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతాలకు ఉండే లెఫ్టినెంట్ గవర్నర్‌కు కొన్ని ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయని పేర్కొన్నారు. ఇటీవల రాహుల్ గాంధీ జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఎల్జీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ జమ్ము కశ్మీర్లో ఒక రాజు ఉన్నారు. ఆయనే లెఫ్టినెంట్ గవర్నర్. ఆయన జమ్ము కశ్మీర్ ప్రజల సంపదను బయటి వ్యక్తులకు తరలిస్తున్నారు’ అని అన్నారు. ఇక.. జమ్ము కశ్మీర్లో సెప్టెంబర్18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, అక్టోబర్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. జమ్ము కశ్మీర్లో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.చదవండి: ‘రాహుల్ గాంధీ.. మీకూ మీ నాన్నమ్మ గతే పడుతుంది’ -
జూలై ఒకటి నుంచి అమర్నాథ్ యాత్ర
జమ్మూ: హిమాలయాల్లో కొలువైన అమర్నాథ్ ఆలయ వార్షిక యాత్ర జూలై ఒకటో తేదీ నుంచి మొదలుకానుంది. ఆగస్ట్ 31 దాకా కొనసాగనుంది. ఈ నెల 17వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన ఆలయ బోర్డు భేటీలో ఈ మేరకు నిర్ణయించినట్టు అధికారులు చెప్పారు. యాత్రకు వివరాల కోసం గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. -
హైదర్‌పురా కాల్పులపై న్యాయ విచారణ
శ్రీనగర్: కశ్మీర్‌లోని హైదర్‌పురాలో సోమవారం జరిగిన కాల్పుల ఘటనపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా న్యాయ విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా శ్రీనగర్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఖుర్షీద్ అహ్మద్ షాను నియమించారు. హైదర్‌పురాలో ఓ ఇంట్లో జరిగిన ఎన్కౌంటర్లో ఒక పాక్ ఉగ్రవాది, అతడి సహాయకుడు మహ్మద్ అమీర్ మాగ్రే, ఇంటి యజమాని మహ్మద్ అల్తాఫ్ భట్, అందులో అద్దెకు ఉండే ముదాసిర్ గుల్ మృతిచెందారు. మాగ్రే, అల్తాఫ్ భట్, ముదాసిర్ గుల్కు ఉగ్రవాదులతో సంబంధం లేదని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మృతదేహాలను అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ, నాలుగు మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించామని పోలీసులు చెప్పారు. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలంటూ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా శ్రీనగర్‌లో ధర్నా చేశారు. బాధిత కుటుంబాలకు మద్దతుగా హురియత్ కాన్ఫరెన్స్ శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చింది. అల్లర్లు జరుగుతాయన్న అనుమానంతో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) అధినేత మహబూబా ముఫ్తీని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. ఆ పార్టీకి చెందిన ఇద్దరు నాయకులను అరెస్టు చేశారు. మహ్మద్ భట్, గుల్ మృతదేహాలను వెలికితీసి, కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. -
జూన్ 28 నుంచి అమర్నాథ్ యాత్ర
సాక్షి, న్యూఢిల్లీ: ఏటా శివ భక్తులు ఎంతగానో ఎదురుచూసే అమర్నాథ్ యాత్ర తేదీలు ఖరారు అయ్యాయి. గతేడాది కోవిడ్–19 మహమ్మారి కారణంగా రదై్దన యాత్రను ఈ ఏడాది జూన్ 28 నుంచి ఆగస్టు 22 వరకు నిర్వహించాలని అమర్నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు నిర్ణయించింది. శనివారం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన రాజ్‌భవన్‌లో జరిగిన 40వ అమర్నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు సమావేశంలో యాత్ర షెడ్యూల్‌తో పాటు, పలు కీలక అంశాలపై చర్చించారు. కోవిడ్ ప్రొటోకాల్స్ కచ్చితంగా పాటిస్తూ యాత్రను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర బాల్టాల్ మార్గం ద్వారా మాత్రమే జరిగే అవకాశాలున్నాయి. ప్రయాణం పహల్గామ్, చందన్వాడి, శేష్నాగ్, పంచతర్ని గుండా సాగుతుంది. అమర్నాథ్ గుహలో మంచు స్ఫటికాలతో ఏటా 10–12 అడుగుల ఎత్తైన మంచు శివలింగం ఏర్పడుతుంది. అంతేగాక అమర్నాథ్ శివలింగం ఎత్తు చంద్రునిపై ఆధారపడి ఉంటుంది. పౌర్ణమి నాడు శివలింగం దాని పూర్తి పరిమాణంలో ఉండగా, అమావాస్య రోజున శివలింగ పరిమాణం కొంత తక్కువగా ఉంటుంది. అమర్నాథ్ గుహ శ్రీనగర్ నుంచి 145 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గుహ సుమారు 150 అడుగుల ఎత్తు, 90 అడుగుల పొడవు ఉంటుంది. ఈ గుహ సుమారు 4 వేల మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ: దేశవ్యాప్తంగా 37 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్, జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ , యస్ బ్యాంక్‌ల 446 బ్రాంచుల్లో ఏప్రిల్ 1 నుంచి అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. గతేడాది కరోనా కారణంగా అమర్నాథ్ యాత్రను సాధువులకు మాత్రమే పరిమితం చేశారు. 2019లో 3.42 లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నారు. -
జమ్మూకశ్మీర్ ఎల్జీగా మనోజ్ సిన్హా ప్రమాణస్వీకారం
-
జమ్మూకశ్మీర్ ఎల్జీగా మనోజ్ సిన్హా
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేత మనోజ్ సిన్హా (61)ను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమిస్తున్నట్లు రాష్ట్రపతి ప్రెస్ కార్యదర్శి అజయ్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకూ లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించిన గిరీశ్ చంద్ర ముర్ము రాజీనామా చేయగా, ఆయన్ను నూతన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)గా నియమిస్తూ రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. వికాస్ పురుష్‌గా పేరున్న మనోజ్ సిన్హా మూడుసార్లు లోక్‌సభకు ఎంపికయ్యారు. -
ముర్ము రాజీనామాకు కారణాలేమిటి?
న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్లో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. కశ్మీర్ నూతన లెఫ్టినెంట్ గవర్నర్‌గా కేంద్ర మాజీ మంత్రి మనోజ్ సిన్హా నియమితులయ్యారు. నిన్నటి వరకు ఎల్జీగా సేవలు అందించిన గిరీష్ చంద్ర ముర్ము రాజీనామా చేయడం, వెంటనే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అందుకు అంగీకరించడం.. అదే విధంగా ముర్ము స్థానంలో మనోజ్ సిన్హా నియామకాన్ని ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేయడం చకచకా జరిగిపోయాయి. జమ్మూ కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుకు సరిగ్గా ఏడాది కాలం పూర్తైన రోజే ముర్ము ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం సహా ఎల్జీగా కేంద్ర మాజీ మంత్రి నియామకం వంటి ఆకస్మిక పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.(చైనా జోక్యాన్ని ఖండిస్తున్నాం: భారత్) తొలి ఎల్జీగా జీసీ ముర్ము ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లదాఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ ఆగస్ట్ 5న నరేంద్ర మోదీ సర్కారు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీకి సన్నిహితుడుగా గుర్తింపు పొందిన సీనియర్ ఐఏఎస్ అధికారి గిరీశ్ చందర్ ముర్ము.. జమ్మూకశ్మీర్ తొలి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులయ్యారు. 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ముర్ము.. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో సీఎం అడిషనల్ ప్రిన్స్‌పల్ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. ఈ క్రమంలో 2019 నవంబర్ 30 న పదవీ విరమణ చేసిన ఆయన అదే ఏడాది అక్టోబరులో జమ్మూ కశ్మీర్ ఎల్జీగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు ఆ పదవిలో కొనసాగిన ముర్ము సాయంత్రానికి తన విధులకు సంబంధించిన షెడ్యూల్ మొత్తం రద్దు చేసుకున్నారు. ఆ వెనువెంటనే రాజీనామాను సమర్పించారు. మరుసటి రోజే ఆయన స్థానంలో సీనియర్ నాయకులు, బీజేపీ మాజీ ఎంపీ మనోజ్ సిన్హా నియామఖం ఖరారైంది. (జమ్మూ కశ్మీర్ ఎల్జీగా మనోజ్ సిన్హా) ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎల్జీగా నియమితులైన మనోజ్ సిన్హాకు శుభాకాంక్షలు తెలిపానన్న ఆయన.. తనకున్న రాజకీయ, పాలనా అనుభవంతో సిన్హా ఆ పదవికి మరింత వన్నె తీసుకువస్తారని పేర్కొన్నారు. దీంతో జమ్మూ కశ్మీర్లో ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేసేందుకే కేంద్ర సర్కారు ఈ మేరకు పావులు కదిపిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎల్జీగా పాలనా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ప్రజల్లోకి చొచ్చుకుపోయే స్వభావం కలిగిన నాయకుడిని ఎంపిక చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. (కశ్మీర్ ఓ నివురుగప్పిన నిప్పు) అందుకే ముర్ము రాజీనామా చేశారా? మరోవైపు.. రాజకీయ ప్రయోజనాల కోసమే సిన్హా నియామకం జరిగిందని పలువురు భావిస్తున్నపటికీ.. ఇటీవల ముర్ము చేసిన వ్యాఖ్యలే ఆయన పదవికి ఎసరు తెచ్చాయని మరికొందరు భావిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో ముర్ము మాట్లాడుతూ.. జమ్మూ కశ్మీర్లో 4జీ సేవల(ఇంటర్నెట్)ను పునరుద్ధరిస్తామని వ్యాఖ్యానించారు. కశ్మీర్ ప్రజలు ఇంటర్నెట్ను ఎలా ఉపయోగించుకున్నా తాను భయపడబోనని ఆయన పేర్కొన్నారు. కాగా కశ్మీర్లో లోయలో ఉగ్రవాదుల వల్ల ప్రమాదం పొంచి ఉందన్న భయాల నేపథ్యంలో ఇంటర్నెట్ సర్వీసులు దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నందున.. కేంద్ర హోం శాఖ ఇందుకు సుముఖంగా లేదని ఇప్పటికే వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. అంతేగాక కశ్మీర్ లోయలో రాష్ట్రపతి పాలన కొనసాగింపు భావ్యం కాదని, త్వరలోనే ఎన్నికలు జరుగుతాయని ముర్ము పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలకు తోడు.. స్వయానా ఐఏఎస్ అధికారి అయిన ముర్ముకు ఎల్జీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీనియర్ బ్యూరోక్రాట్లతో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చీఫ్ సెక్రటరీ బీవీఆర్ సుబ్రహ్మణ్యంతో అభిప్రాయ భేదాలు తీవ్రమయ్యాయని.. అంతేగాక ముఖ్యమైన ఫైల్స్ అన్నీ ఎల్జీ తన ఆఫీసుకు తెప్పించుకుని, అక్కడి నుంచి సీఎస్‌కు నోట్స్ పంపేవారని తెలుస్తోంది. తప్పనిసరిగా తన ఆదేశాలు అమలు చేయాల్సిందిగా ఒత్తిడి తీసుకువచ్చారనే మాటలు వినిపిస్తున్నాయి. దీంతో రంగంలోకి దిగిన కేంద్రం పరిస్థితి తన చేయి దాటి పోకముందే దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయాల గురించి సీనియర్ జర్నలిస్టు జఫర్ చౌదరి మాట్లాడుతూ.. ‘‘ కశ్మీర్ చాలా సున్మితమైన(బ్యూరోక్రాట్లకు) ప్రదేశం. ఈ కారణంగానే నెహ్రూ హయాంలోనూ సర్దార్ వల్లభబాయ్ పటేల్‌కు కొన్నిసార్లు విభేదాలు తలెత్తాయి. ఇక ముర్ము ఎల్జీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే పాలనా విభాగం రెండు వర్గాలుగా విడిపోయింది. ఒకరికి కౌంటర్‌గా మరొకరు పనులు చేసేవారు. పాలనా వ్యవస్థలోని అంతర్గత విభేదాలు తీవ్ర పరిణామాలకు దారి తీశాయి’’అని పేర్కొన్నారు. ఎవరైనా అంతే కదా! ఇక ఆర్టికల్ 370 రద్దు తర్వాత అనేక కారణాలు చూపి మాజీ ముఖ్యమంత్రులు సహా పలువురు కశ్మీరీ నేతలకు గృహ నిర్బంధం విధించిన విషయం తెలిసిందే. అంతేగాక 400 మందిని అరెస్టు కూడా చేశారు. ప్రస్తుతం వీరిలో కొంతమందిపై ఇంకా నిర్బంధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో తాజా పరిణామాల గురించి నేషనల్ కాన్ఫరెన్స్ నేత ముస్తఫా కమల్ మాట్లాడుతూ.. ప్రభుత్వం కొత్తగా నియమించే వ్యక్తులు వల్ల పెద్దగా తేడా ఉండబోదని ప్రజలు భావిస్తున్నారన్నారు. తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకే మార్పులు చేస్తున్నారని విమర్శించారు. రెండు రోజుల క్రితం జరిగిన ఆందోళనలు ప్రజల్లో ప్రభుత్వ నిర్ణయాల మీద ఉన్న అభిప్రాయానికి అద్దం పట్టాయని ఎద్దేవా చేశారు. ఇలాంటి సమయంలో కొత్తగా బాధ్యతలు చేపట్టే వ్యక్తి అయినా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. -
జమ్మూ కశ్మీర్ ఎల్జీగా మనోజ్ సిన్హా
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ నూతన లెఫ్టినెంట్ గవర్నర్‌గా కేంద్ర మాజీ మంత్రి మనోజ్ సిన్హా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన నియామకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగా ఇన్నాళ్లుగా జమ్మూ కశ్మీర్ ఎల్జీగా సేవలు అందించిన గిరీష్ చంద్ర ముర్ము బుధవారం రాజీనామా చేశారు. ఈ క్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం ఆయన రాజీనామాను ఆమోదించారు. అదే విధంగా ముర్ము స్థానంలో మనోజ్ సిన్హా నియామకాన్ని ఖరారు చేస్తూ రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. శరవేగంగా చోటుచేసుకున్న ఈ పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.(కశ్మీర్ ఓ నివురుగప్పిన నిప్పు) కాగా ఉత్తరప్రదేశ్‌కి చెందిన మనోజ్ సిన్హా ఐఐటీ వారణాసి నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో పట్టా పుచ్చుకున్నారు. విద్యార్థి దశలోనే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న ఆయన బెనారస్ హిందూ యూనివర్సిటీ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో బీజేపీలో చేరి ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ నియోజకవర్గం నంచి మూడుసార్లు లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు. సమాచార శాఖ స్వతంత్ర మంత్రిగా, రైల్వేశాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. ఇక గత లోక్‌సభ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ అఫ్జల్ అన్సారీ చేతిలో ఆయన ఓటమి పాలైన విషయం విదితమే. ఇక గతేడాది (ఆగస్టు 5న) ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకశ్మీర్, లఢక్ కేంద్రపాలిత ప్రాంతాలుగా మారిన విషయం తెలిసిందే. -
ప్రత్యేక కంపెనీగా పోస్టల్ ఇన్సూరెన్స్: సిన్హా
న్యూఢిల్లీ: పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేయాలని పోస్టల్ శాఖ భావిస్తోంది. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యకలాపాలను ఒక ప్రత్యేక వ్యాపార విభాగంగా (సెపరేట్ బిజినెస్ యూనిట్) ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు కేబినెట్ నోట్‌ను పంపామని సమాచార శాఖ మంత్రి మనోజ్ సిన్హా చెప్పారు. రెండు వారాల్లో ఈ నోట్‌ను కేబినెట్ ఆమోదించే అవకాశాలు ఉన్నట్లు తెలియజేశారు. మొదటి దశలో ఎస్‌బీయూను, రెండో దశలో పూర్తి స్థాయి బీమా కంపెనీని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ)రెండో వార్షికోత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. ఇటీవల ఐపీపీబీ 1.26 లక్షల యాక్సెస్ పాయింట్లను ఏర్పాటు చేసిందని, 10 రోజుల్లో మరో పదివేల యాక్సెస్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నదని వివరించారు. బజాజ్ ఆటో లాభం 20% అప్ న్యూఢిల్లీ: అమ్మకాల్లో వృద్ధితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో బజాజ్ ఆటో నికర లాభం 20 శాతం పెరిగి రూ. 1,221 కోట్లకు చేరింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో సంస్థ నికర లాభం రూ. 1,014 కోట్లు. ఇక తాజా క్యూ3లో మొత్తం ఆదాయం 19% వృద్ధి చెంది రూ. 6,595 కోట్ల నుంచి రూ. 7,879 కోట్లకు చేరింది. వాహన విక్రయాలు 26 శాతం వృద్ధితో 10.01 లక్షల నుంచి 12.60 లక్షల యూనిట్లకు చేరాయి. దేశీయంగా మోటార్ సైకిల్స్ అమ్మకాలు 4,66,431 నుంచి 6,44,093 యూనిట్లకు పెరిగాయి. బుధవారం బజాజ్ ఆటో షేరు బీఎస్ఈలో 2.65 శాతం క్షీణించి రూ. 2,499 వద్ద క్లోజయ్యింది. -
తొలి దేశీ ఎలక్ట్రానిక్ చిప్!!
న్యూఢిల్లీ: కాల్ డ్రాప్స్‌ను నియంత్రించడంతో పాటు 5జీ కనెక్షన్స్‌కు ఉపయోగపడేలా దేశీయంగా తొలి ఎలక్ట్రానిక్ చిప్సెట్ పృథ్వీ 3ని బెంగళూరుకు చెందిన సాంఖ్య ల్యాబ్స్ రూపొందించింది. మొబైల్ ఫోన్స్‌లో నేరుగా టీవీ ప్రసారాలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. దీని డిజైనింగ్, అభివృద్ధి పూర్తిగా దేశీయంగానే జరిగినట్లు చిప్‌సెట్‌ను ఆవిష్కరించిన సందర్భంగా టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి, అధునాతన టీవీ వ్యవస్థ గల చిప్ అని ఆయన పేర్కొన్నారు. టెలికం ఆపరేటర్లు ఎదుర్కొంటున్న కాల్స్ నాణ్యతాపరమైన సమస్యలను పరిష్కరించేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని మంత్రి వివరించారు. వీడియో కంటెంట్‌ను మొబైల్ నెట్వర్క్ నుంచి వేరు చేయడం ద్వారా స్పెక్ట్రంపై ఎక్కువ భారం పడకుండా కాల్ నాణ్యతను పెంచేందుకు ఈ చిప్ తోడ్పడుతుందని సాంఖ్య ల్యాబ్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో పరాగ్ నాయక్ చెప్పారు. దీనితో.. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను శాటిలైట్ ఫోన్లా ఉపయోగించుకోవచ్చన్నారు. ఎలక్ట్రానిక్ డివైజ్‌లలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ చిప్సెట్స్ను ప్రస్తుతం విదేశీ కంపెనీలే తయారు చేస్తున్నాయి. దేశీయంగా అధునాతన సెమీకండక్టర్ తయారీ ప్లాంటు లేకపోవడంతో భారత్‌లో వీటిని ఉత్పత్తి చేయడం లేదు. సాంఖ్య ల్యాబ్స్ ఎలక్ట్రానిక్ చిప్సెట్స్.. దక్షిణ కొరియాలోని శామ్సంగ్ ప్లాంటులో తయారవుతున్నాయి. -
ఐటీయూలో భారత్‌కు మళ్లీ సభ్యత్వం..
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ కౌన్సిల్ (ఐటీయూ)లో భారత్ మళ్లీ సభ్యత్వం దక్కించుకుంది. 2019 నుంచి 2022 దాకా నాలుగేళ్ల పాటు ఈ సభ్యత్వం ఉంటుందని కేంద్ర టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హా ఒక ప్రకటనలో తెలిపారు. దుబాయ్‌లో ఐటీయూ సదస్సు సందర్భంగా నిర్వహించిన ఎన్నికల్లో భారత్‌కు 165 ఓట్లు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఆసియా–ఆస్ట్రలేషియా ప్రాంతం నుంచి ఎన్నికైన 13 దేశాల్లో భారత్ మూడో ర్యాంక్‌లో నిల్చిందని, అంతర్జాతీయంగా మొత్తం 48 దేశాల జాబితాలో ఎనిమిదో స్థానం దక్కించుకుందని సిన్హా వివరించారు. -
తల్చుకుంటే సర్కారును రద్దు చేసే వాళ్లం
సాక్షి ప్రతినిధి, చెన్నై: తాము తలచుకుని ఉంటే తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఉండే వాళ్లమని కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి మనోజ్ సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులోని తిరుచెందూరులోని సెంథిల్నాథన్ ఆలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అన్నాడీఎంకే ప్రభుత్వం తనకు తానుగానే కూలిపోతుంది. అసెంబ్లీలో బలం కోల్పోయిన పరిస్థితిలో ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఆ పార్టీ నేతలు అష్టకష్టాలు పడుతున్నారు. మేం తలచుకుని ఉంటే ఆర్టికల్–356ను ప్రయోగించి ప్రభుత్వాన్ని రద్దు చేసి ఉండేవాళ్లం’ అని కేంద్ర మంత్రి అన్నారు. రాష్ట్రంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం బీజేపీతో రహస్య సంబంధాలను నెరపుతోందనీ, తమిళనాడులో ప్రస్తుతం మోదీ ప్రభుత్వమే సాగుతోందని విమర్శలు రావడం తెల్సిందే. -
జూలై కల్లా కొత్త టెలికం పాలసీ
న్యూఢిల్లీ: వచ్చే నెలాఖరు నాటికి కొత్త టెలికం విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. అప్పటికల్లా దీన్ని కేంద్ర క్యాబినెట్ ఆమోదించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్–ఫ్లయిట్ కనెక్టివిటీ సర్వీసులు ఏడాది కాలంలో సాకారం కాగలవన్నారు. నాలుగేళ్ల ఎన్డీఏ పాలనలో సాధించిన విజయాలపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాలు వెల్లడించారాయన. మరోవైపు, జూన్ 29న జరిగే సమావేశంలో ఈ ముసాయిదాను టెలికం కమిషన్ ముందు ఉంచనున్నట్లు టెలికం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్ తెలిపారు. నెట్ న్యూట్రాలిటీ, కొత్త టెక్నాలజీ అమలుకు అవసరమైన విధానాలు మొదలైన వాటిపై ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. జాతీయ డిజిటల్ కమ్యూనికేషన్స్ విధానం (ఎన్డీసీపీ) 2018 ముసాయిదాను కేంద్రం ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇంటింటికీ 50 ఎంబీపీఎస్ డౌన్లోడ్ స్పీడ్‌తో ఇంటర్నెట్, కమ్యూనికేషన్స్ రంగంలోకి రూ. 6.5 లక్షల కోట్లు ఆకర్షించడంతో పాటు 40 లక్షల పైచిలుకు కొత్త ఉద్యోగాల కల్పన లక్ష్యంతో దీన్ని రూపొందించారు. -
రైల్వేలు: ఫిర్యాదులు, ఫుడ్ ఆర్డర్ ఈజీ
సాక్షి, చెన్నై: దేశంలో రైల్వే వ్యవస్థను ప్రయాణీకులు మరింత చేరువ దిశగా రైల్వే శాఖ ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో రైల్వే ప్రయాణికుల సౌలభ్యం కోసం కొత్తగా రెండు మొబైల్ యాప్‌లను కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ చెన్నైలో లాంచ్ చేశారు. ‘రైల్ మదద్’, ‘మెనూ ఆన్ రైల్స్’ పేరిట రెండు రైల్వే యాప్‌లు తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చామని మంత్రి తెలిపారు. ప్రయాణీకులు ఫిర్యాదులను సమర్పించటానికి రైల్ మదద్ అనుమతినిస్తుండగా, మెనూ ఆన్ రైల్స్ ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి ఉపయోగడనుంది. రైలు మదద్: ప్రయాణికుల ఫిర్యాదుల కుద్దేశించింది ‘రైల్ మదద్’ యాప్. ఈ మొబైల్ యాప్ ద్వార సమస్యలపై ప్రయాణికులు రైల్వే శాఖకు ఫిర్యాదు చేయవచ్చు. ప్రయాణికుల భద్రత, ఛైల్డ్ హెల్ప్ లైన్ నంబర్లను అనుసంధానం చేస్తూ ఈ యాప్ ను రూపొందించామని రైల్వే మంత్రి ప్రకటించారు. మెనూ ఆన్ రైల్స్: మెనూ యాప్ సాయంతో ప్రయాణికులు తమకిష్టమైన ఆహారం, పానీయాలు, వాటి ధరలను తెలుసుకోవచ్చు. 96 రకాల బ్రేక్ ఫాస్ట్, ఆహార పదార్థాలు మెనూలో అందుబాటులో ఉన్నాయి. జైన్ ఫుడ్, డయాబెటిక్ ఫుడ్, బ్రేక్ ఫాస్ట్ లు అందుబాటులో ఉంచారు. శతాబ్ది, రాజధాని, దురంతో రైళ్లలో ముందుగా ఆర్డరిస్తే అన్నిరకాల ఆహారపదార్థాలు సప్లయి చేస్తామని రైల్వే అధికారులు చెప్పారు. గత నాలుగేళ్ళలో రైల్వేల అభివృద్ధి గురించి కేంద్రమంత్రి గోయల్, రైల్వే శాఖ సహాయమంత్రి మనోజ్ సిన్హా మీడియాతోమాట్లాడారు. 'సాఫ్ నియత్, సహీ వికాస్' అనే దృక్పథంతో పని చేస్తున్నామని, ముఖ్యంగా రైల్వేలో భద్రతకు ప్రాధాన్యమిచ్చామని పేర్కొన్నారు. తద్వారా రైలు ప్రమాదాల సంఖ్యను తగ్గించామని పీయూష్ గోయల్ వెల్లడించారు. 2013-14లో 118 రైలు ప్రమాదాలు జరగ్గా 2017-18లో వీటి సంఖ్యను 73కు తగ్గించామని మంత్రి వివరించారు. -
తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన మొబైల్ కనెక్షన్లు
సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో మొబైల్ కనెక్షన్లు తగ్గిపోయాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గత మార్చి నుంచి జనవరి మధ్య 10 నెలల కాలంలో దాదాపు ఏడున్నర లక్షల మొబైల్ కనెక్షన్లు, 1.34 లక్షల ల్యాండ్‌లైన్ కనెక్షన్లు తగ్గిపోయాయని కేంద్ర కమ్యునికేషన్ల శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి బుధవారం అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. 31 మార్చి 2017న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తంగా 8,49,42,695 మొబైల్ కనెక్షన్లు ఉండగా 31 జనవరి 2018 నాటికి ఈ సంఖ్య 8,41,95,340 కి తగ్గాయని వెల్లడించారు. అత్యధిక మొబైల్ ఖాతాదారులు కలిగి ఉన్న సంస్థగా 2.72 కోట్ల కనెక్షన్లతో ఎయిర్టెల్ ప్రథమ స్థానంలో నిలువగా ఆ తదుపరి స్థానాల్లో ఐడియా, జియో, బీఎస్ఎన్ఎల్, వొడాఫోన్ సంస్థలు నిలిచాయి. ఈ పది నెలల కాలంలో ఎయిర్టెల్, జియో, బీఎస్ఎన్ఎల్ సంస్థలకు ఖాతాదారులు పెరగ్గా ఐడియా, వొడాఫోన్, ఎయిర్‌సెల్, టెలినార్, రిలయన్స్, టాటా సంస్థల ఖాతాదారులు తగ్గారు. అయితే అంతకుముందు ఏడాది కాలానికి మొత్తంగా 1.02 కోట్ల మేర కనెక్షన్లు పెరగడం విశేషం. ఇందులో జియో వాటానే 93.71 లక్షలుగా ఉంది. ఇక ల్యాండ్లైన్ల విషయంలో రెండు రాష్ట్రాల్లో కలిపి ఇదే కాలంలో 16,37,790 ల్యాండ్లైన్ల సంఖ్య నుంచి 15,03,028కి తగ్గింది. అంటే దాదాపు 1.34 లక్షల కనెక్షన్లు తగ్గాయి. 31 మార్చి 2015 నుంచి 31 జనవరి 2018 మధ్య కాలంలో దాదాపు 3.65 లక్షల కనెక్షన్లు తగ్గిపోయాయని మంత్రి తెలిపారు. ఇందులో ప్రధానంగా బీఎస్ఎన్ఎల్ సంస్థ ఖాతాదారులు తగ్గిపోయారు. -
విదేశాలకు మొబైల్ ఫోన్ డేటా లీకేజి వాస్తవమే
న్యూఢిల్లీ : విదేశాలకు మొబైల్ ఫోన్ డేటా లీకేజీ వాస్తవమేనని రాజ్యసభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా సమాధానమిచ్చారు. అయితే లీకవుతున్న సమాచారం ఎలాంటిదో కనిపెట్టడం కష్టమని మనోజ్ సిన్హా శుక్రవారం రాజ్యసభలో ప్రకటించారు. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ..మొబైల్ ఫోన్ల ద్వారా విదేశాలకు సమాచారం లీక్ అవుతున్నట్లుగా కొన్ని పత్రికలలో వచ్చిన వార్తలు ప్రభుత్వ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఈ వార్తలపై వెంటనే స్పందించి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ రంగంలోకి దిగిందన్నారు. మొబైల్ ఫోన్ల భద్రత, రక్షణ కోసం ఫోన్ల తయారీ సంస్థలు ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నాయి..ఆయా ఫోన్ల ఆర్కిటెక్చర్, ఫ్రేమ్ వర్కు తదితర వివరాలను సమర్పించాలని మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలను కోరినట్లు మంత్రి తెలిపారు. మొబైల్ డేటా విదేశాలకు లీకవుతున్నట్లు వార్తలు వెలువడిన తర్వాత తమ మంత్రిత్వ శాఖకు చెందిన స్టాండర్డైజేషన్ టెస్టింగ్, క్వాలిటీ సర్టిఫికేషన్ విభాగం దీనిపై లోతుగా పరిశీలన జరిపిందని చెప్పారు. మొబైల్ ఫోన్ల నుంచి షేర్ అవుతున్న డేటా సంకేత సంక్షిప్త సందేశం (ఎన్‌క్రిప్ట్) రూపంలో ఉంటున్నందున అది ఎలాంటి సమాచారమో కనిపెట్టడం కష్టమవుతోందని మంత్రి చెప్పారు. ఈ డేటా కేవలం తమ ప్రతిభా సామర్థ్యాలను మరింతగా పెంపొందిచుకోవడం కోసం మాత్రమే వినియోగిస్తున్నట్లుగా ఆయా కంపెనీలు చెబుతున్నాయని మంత్రి వివరించారు. -
కొత్తగా 650 పోస్టల్ పేమెంట్స్ బ్యాంకులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో సామాన్యులకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసేందుకు కొత్తగా 650 పోస్టల్ పేమెంట్ బ్యాంకులను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. వరల్డ్ పోస్ట్ డేను పురస్కరించి సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఉన్న 1.55 లక్షల పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్ సర్వీసులను ప్రారంభించేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా మొదట 650పోస్టల్ పేమెంట్ బ్యాంకులను ప్రారంభించనున్నామని చెప్పారు. తపాలా శాఖ కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. -
2020 కల్లా 5జీ టెక్నాలజీ రెడీ..
న్యూఢిల్లీ: మరింత వేగవంతమైన వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులోకి తేవడంపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగా 2020 నాటికల్లా 5జీ టెక్నాలజీని ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ప్రత్యేకంగా అత్యున్నత స్థాయి 5జీ ఫోరంను ఏర్పాటు చేయడంతో పాటు పరిశోధన.. అభివృద్ధి కార్యకలాపాలకు తోడ్పడటానికి రూ.500 కోట్లతో నిధిని కూడా ఏర్పాటు చేయనుంది. టెలికం మంత్రి మనోజ్ సిన్హా మంగళవారం ఈ విషయాలు చెప్పారు. ‘దేశంలో 5జీ సర్వీసులు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యానికి అనుగుణంగా అత్యున్నత స్థాయి 5జీ ఫోరాన్ని ఏర్పాటు చేశాం. 2020లో ప్రపంచదేశాలకు దీటుగా భారత్ కూడా దీన్ని అందుబాటులోకి తేగలదని విశ్వసిస్తున్నాం‘ అన్నారాయన. 3జీ, 4జీ టెక్నాలజీల్లో కీలక పాత్ర పోషించే అవకాశాన్ని ప్రభుత్వం చేజార్చుకుందని, కానీ 5జీ ప్రమాణాలు, ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో మాత్రం క్రియాశీలకంగా వ్యవహరించాలని తాము భావిస్తున్నామని మంత్రి చెప్పారు. అంతర్జాతీయ సంస్థలతో పోటీపడేలా దీటైన ఉత్పత్తుల అభివృద్ధి, తయారీకి భారత్ కృషి చేస్తుందన్నారు. తద్వారా దేశీయంగా 50 శాతం, అంతర్జాతీయంగా 10 శాతం మార్కెట్ వాటాను దక్కించుకునే లక్ష్యం దిశగా పనిచేస్తున్నట్లు మనోజ్ సిన్హా చెప్పారు. ’5జీ ఇండియా 2020 ఫోరం’లో టెలికం విభాగం కార్యదర్శి అరుణ సుందరరాజన్, ఐటీ కార్యదర్శి అజయ్ కుమార్ సాహ్నీ, శాస్త్ర..సాంకేతిక విభాగం కార్యదర్శి అశుతోష్ శర్మతో పాటు టెక్నాలజీ నిపుణులు ఉంటారు. 10,000 ఎంబీపీఎస్ స్పీడ్..: 5జీ అందుబాటులోకి వస్తే పట్టణ ప్రాంతాల్లో 10,000 మెగాబిట్ పర్ సెకన్ (ఎంబీపీఎస్), గ్రామీణ ప్రాంతాల్లో 1,000 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ సేవలు అందించవచ్చని సిన్హా తెలిపారు. వచ్చే ఏడాది మధ్య నాటికి అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ 5జీ ప్రమాణాలను ఖరారు చేయొచ్చని ఆయన పేర్కొన్నారు. వైద్య రంగంలోను, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు మొదలైన వాటికి ఇవి ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ట్రాయ్ గణాంకాలమేరకు రిలయన్స్ జియో 4జీ నెట్వర్క్ ద్వారా 18 ఎంబీపీఎస్ స్పీడ్‌తో డేటా సేవలు అందిస్తోంది. 5జీ నెట్వర్క్ సిద్ధం: ఎయిర్టెల్ వేగవంతమైన 5జీ సేవలు అందించేందుకు అనువైన టెక్నాలజీని ఇప్పటికే తాము అందుబాటులోకి తెస్తున్నట్లు భారతీ ఎయిర్టెల్ వెల్లడించింది. 5జీ నెట్‌వర్క్‌లకు ఉపయోగపడే ఎంఐఎంవో(మాసివ్ మల్టిపుల్ ఇన్పుట్ మల్టిపుల్ అవుట్‌పుట్) టెక్నాలజీని తొలుత బెంగళూరు, కోల్‌కతాలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. కొత్త టెక్నాలజీ ప్రస్తుత నెట్వర్క్ సామర్థ్యాన్ని 5–7 రెట్లు పెంచగలదని, 2–3 రెట్లు వేగవంతమైన డేటా స్పీడ్ అందించగలదని ఎయిర్టెల్ పేర్కొంది. కస్టమర్లు టారిఫ్ ప్లాన్లను, ఫోన్లను మార్చాల్సిన అవసరం లేకుండా తమ 4జీ ఫోన్లలోనే మరింత వేగవంతమైన డేటా సేవలు పొందవచ్చని వివరించింది. -
యాప్స్ ద్వారా రూ.1.4 లక్షల కోట్లు
న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు, దానిలో కనీసం ఓ ఐదు నుంచి పది యాప్స్ అయినా ఉంటాయి. ప్రస్తుతం దేశంలో యాప్స్ వాడకం అంతలా పెరిగిపోయింది. ఏ పనిచేయాలన్న స్మార్ట్‌ఫోన్ యూజర్ మొదట ఆశ్రయించేది యాప్‌నే. ఈ క్రమంలోనే ఇంటర్నెట్ యాప్స్ రెవెన్యూలు కూడా భారీగానే పెరుగుతున్నట్టు తెలుస్తోంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీకి ఇంటర్నెట్ యాప్స్ రూ.1.4 లక్షల కోట్లను అందించినట్టు తాజా నివేదికలు పేర్కొన్నాయి. 2020 నాటికి ఈ మొత్తం మరింత పెరిగి రూ.18 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఓ అధ్యయన రిపోర్టు పేర్కొంది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్, బ్రాండ్‌బ్యాండు ఇండియా ఫోరం చేపట్టిన అధ్యయన రిపోర్టును కేంద్ర సమాచారాల శాఖ మంత్రి మనోజ్ సిన్హా శుక్రవారం విడుదల చేశారు. వాయిస్ కంటే డేటా ఎక్కువగా ఇండస్ట్రీని రన్ చేయడం ప్రారంభించినప్పటి నుంచి ప్రజా సంప్రదింపుల మేరకు ప్రస్తుత టెలికాం పాలసీని కూడా తాము పునఃపరిశీలిస్తున్నామని సిన్హా చెప్పారు. యాప్స్ వల్ల మనదేశ ఆర్థికవ్యవస్థకు కనీసం సగానికి పైగా సహకారం ఇంటర్నెట్ ద్వారానే అందుతున్నట్టు అధ్యయన రిపోర్టు తెలిపింది. 2020 నాటికి భారత జీడీపీకి ఇంటర్నెట్ ఎకానమీ 537.4 బిలియన్ డాలర్ల సహకారం అందిస్తుందని ఈ స్టడీ అంచనావేస్తోంది. వీటిలో కనీసం 270.9 బిలియన్ డాలర్లు యాప్స్ ద్వారానే వస్తాయని చెప్పింది. ప్రత్యేక పనులు నిర్వర్తించడానికి ఎక్కువగా యాప్స్ లేదా అప్లికేషన్లనే వాడుతున్నారని స్టడీ చెప్పింది. ఐటీ కంపెనీ సిస్కో అంచనావేసిన వర్చ్యువల్ నెట్వర్కింగ్ ఇండెక్స్ ఆధారితంగా ఇంటర్నెట్ వాడకాన్ని అధ్యయనం చేశారు. సిస్కో అంచనాల ప్రకారం 2015లో మొత్తం ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో భారత ఇంటర్నెట్ ట్రాఫిక్ నాన్-పీసీ డివైజ్‌లో 28 శాతముంది. -
టెలికం వృద్ధికి కఠిన నిర్ణయాలకైనా వెనుకాడం
టెలికం మంత్రి మనోజ్ సిన్హా న్యూఢిల్లీ: టెలికం రంగ వృద్ధి కోసం ఎలాంటి కఠిన నిర్ణయాలైనా తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సంకోచించదని టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. తీవ్రమైన రుణ భారంతో సతమతమౌతోన్న టెలికం పరిశ్రమ ఆర్థిక ఇబ్బందుల పరిష్కారానికి సంబంధించి ఏర్పాటు చేసిన అంతర మంత్రిత్వ శాఖ బృందం (ఐఎంజీ) తన నివేదిక రెండు వారాల్లోగా సమర్పించే అవకాశముందని చెప్పారు. ఈయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. ‘అన్ని అంశాలకు సంబంధించిన సమాచారం మా వద్ద ఉంది. కేవలం ఒక వైపు అభిప్రాయాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోలేం. ఐఎంజీ నివేదిక కోసం వేచి చూస్తున్నాం. దేశంలో టెలికం పరిశ్రమకి సంబంధించిన విజయగాథ ఉంది. దీన్ని అలాగే కొనసాగించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం’ అని వివరించారు. అంతర మంత్రిత్వ శాఖ బృందం సిఫార్సులపై వేగంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా టెలికం రంగ రుణం భారం రూ.4.6 లక్షల కోట్లను తాకిన విషయం తెలిసిందే. ఇక రిలయన్స్ జియో ఎంట్రీతో టెలికం కంపెనీల ఆదాయం, లాభదాయకతపై తీవ్రమైన ఒత్తిడి నెలకొని ఉంది. -
టెలికం రంగ వృద్ధికి చర్యలపై కేంద్రం హామీ
న్యూఢిల్లీ: రుణభారంతో కుంగుతున్న టెలికం రంగ వృద్ధికి తగు చర్యలు తీసుకుంటామని టెల్కోలకు కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి మనోజ్ సిన్హా హామీ ఇచ్చారు. టెలికం పరిస్థితిపై అంతర్ మంత్రిత్వ శాఖల బృందం (ఐఎం జీ) నివేదిక త్వరలో రానున్నట్లు తెలిపారు. వివిధ టెల్కోల అధిపతులతో గురువారం సమావేశమైన సందర్భంగా మంత్రి వారికి ఈ విషయాలు వివరించారు. సుమారు రెండు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్, ఆర్‌కామ్ చైర్మన్ అనిల్ అంబానీ, ఐడియా ఎండీ హిమాంశు కపానియా, టాటా సన్స్ డైరెక్టర్ ఇషాత్ హుస్సేన్, రిలయన్స్ ఇన్ఫోకామ్ బోర్డు సభ్యుడు మహేంద్ర నహతా తదితరులు ఇందులో పాల్గొన్నారు. టెలికం రంగం ఆర్థిక సమస్యలు, పరిష్కార మార్గాలపై ఐఎంజీ ఇటీవల టెల్కోలతో భేటీ అయిన నేపథ్యంలో తా జా సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. సాక్షి బిజినెస్ వెబ్సైట్లో... ⇔ ర్యాలీకి రెడీగా ఉన్న టాప్ 10 షేర్లు ⇔ బోధ్ ట్రీని కొనేవారు లేరు ⇔ ప్లైవుడ్, లామినేషన్ షేర్లలో ర్యాలీ ⇔ చైనా పాల నిషేధంతో మురి‘పాలు’ ⇔ మరిన్ని ఆసక్తికరమైన కథనాలు, స్టాక్ అప్డేట్స్.. WWW.SAKSHIBUSINESS.COM -
వొడాఫోన్, ఐడియాలకు స్పెషల్ ట్రీట్మెంటా?
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద టెలికాం కంపెనీగా అవతరించబోతున్న వొడాఫోన్-ఐడియాల విలీన సంస్థకు ఎలాంటి స్పెషల్ ట్రీట్ మెంట్ ఉండదని టెలికాం మంత్రి మనోజ్ సిన్హా స్పష్టంచేశారు. రెవెన్యూ క్యాప్, సబ్ స్క్రైబర్, స్పెక్ట్రమ్ క్యాపిటల్ కు సంబంధించి ప్రస్తుత నిబంధలకే విలీన సంస్థ కట్టుబడి ఉండాల్సిందేనని చెప్పారు. టెలికాం రంగ ఆర్థిక సంపదను, వినియోగదారుల ప్రయోజనాలను సమతూకం చేస్తూ పాలసీలను అమలు చేసేందుకు టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ తో కలిసి మంత్రిత్వశాఖ పనిచేస్తుందని పునరుద్ఘాటించారు. ప్రస్తుతం టెలికాం రంగంలో అతిపెద్ద కంపెనీగా ఉన్న భారతీ ఎయిర్ టెల్ ను వెనక్కి నెట్టేసి, వొడాఫోన్-ఐడియాల విలీన సంస్థ ఆ చోటును దక్కించుకోబోతుంది. ఒకవేళ విలీన సంస్థలు నిబంధనలకు కట్టుబడి ఉండకపోతే, వారికి టెలికాం రంగంలో కొనసాగే అనుమతే లేదని తేల్చిచెప్పారు. కచ్చితంగా వారు నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. టెలికాం రంగంలో మెగా మెర్జర్ నిలువబోతున్న వొడాఫోన్-ఐడియాల విలీనానికి ఏమన్న స్పెషల్ ట్రీట్ మెంట్ ఇస్తారా? అనే ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి స్పెషల్ ట్రీట్ మెంట్ ఉండదన్నారు. ఐదు మార్కెట్లలో విలీన సంస్థ రెవెన్యూ మార్కెట్ షేరును, సబ్ స్క్రైబర్, స్పెక్ట్రమ్ క్యాపిటల్ ను ఉల్లంఘించే అవకాశాలున్నాయని టెలికాం విశ్లేషకులు సందేహం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. విలీనాలతో, కొనుగోళ్లతో టెలికాం రంగంపై ఎలాంటి ఆందోళన చెందాల్సినవసరం లేదన్నారు. రెవెన్యూ క్యాపిటల్, సబ్ స్క్రైబర్ క్యాప్,స్పెక్ట్రమ్ క్యాప్ విషయంలో గైడ్ లైన్స్ ఉన్నాయని, వాటిని ఫాలో అవుతూ సమృద్ధికరమైన పోటీ వాతావరణం పొందాల్సిందేనన్నారు. దీనికోసం తాము అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
యూపీ సీఎం రేసులో నేను లేను: కీలక నేత స్పష్టీకరణ
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ రోజు (శనివారం) సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి ఎవరనేది తేలిపోనుండగా.. రేసులో కీలకంగా ఉన్న పలువురు నేతల మధ్య పోటీ తీవ్రమవుతున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా కేంద్రమంత్రులు రాజ్‌నాథ్, మనోజ్ సిన్హా, బీజేపీ యూపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య, ఎంపీ యోగిఆదిత్యానాథ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ పేర్లు కాకుండా పూర్తిగా కొత్త పేరు కూడా తుదిదశలో తెరపైకి రావొచ్చునని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేసులో అందరికంటే ముందంజలో ఉన్నట్టు భావిస్తున్న మనోజ్ సిన్హా తాజాగా స్పందించారు. తాను ముఖ్యమంత్రి పదవి రేసులో లేనేలేనని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఎవరన్నది పార్టీ శాసనసభాపక్షం, పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తాయని, తాను రేసులో ముందున్నాననని, తనకే అవకాశం వస్తుందంటూ జాతీయ మీడియా అనవసర కథనాలు వండి వారుస్తున్నదని ఆయన తప్పుబట్టారు. మరోవైపు యూపీ సీఎం రేసు హీటెక్కింది. తమ నాయకుడికే సీఎంగా అవకాశం ఇవ్వాలంటూ ఇటు కేశవ్ ప్రసాద్ మౌర్య, అటు యోగి ఆదిత్యానాథ్ మద్దతుదారులు లక్నోలో రోడెక్కి బలప్రదర్శన ర్యాలీలు నిర్వహించారు. మౌర్య శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకొని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో మంతనాలు జరిపారు. సీఎం ఎంపికపైనే చర్చ జరిగినట్టు తెలుస్తోంది. లక్నోలో శనివారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర పరిశీలకులు వెంకయ్య, భూపీంద్ర సింగ్ సమక్షంలో భేటీ అవ్వనున్న పార్టీ ఎమ్మెల్యేలు సీఎంను నిర్ణయించనున్నారు. ఈ నేపథ్యంలో వెంకయ్య, ఇతర అధిష్ఠాన నేతలు ఇప్పటికే లక్నో చేరుకున్నారు. మార్చి 19న (ఆదివారం) పార్టీ జాతీయ నాయకుల సమక్షంలో సీఎం ప్రమాణస్వీకారం ఉండనుంది. -
కౌన్ బనేగా యూపీ సీఎం!
-
కౌన్ బనేగా యూపీ సీఎం!
రేసులో ముగ్గురి పేర్లు పూజలు చేసిన మనోజ్ సిన్హా మీడియా కథనాలు అవాస్తవమన్న వెంకయ్య న్యూఢిల్లీ/లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ రోజు (శనివారం) సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి ఎవరు తేలిపోనుందని.. బీజేపీ స్పష్టం చేసినప్పటికీ.. రేసులో పలువురి పేర్లు వినిపిస్తుండటంతో ఎవరు సీఎం అవుతారన్నది ఇంకా స్పష్టత రాలేదు. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్, మనోజ్ సిన్హా, బీజేపీ యూపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య, ఎంపీ యోగి ఆదిత్యానాథ్ పేర్లు సీఎం రేసులో ప్రధానంగా వినబడుతున్నా.. పూర్తిగా కొత్త పేరు కూడా తుదిదశలో తెరపైకి రావొచ్చునని పార్టీ వర్గాలు అంటున్నాయి. లక్నోలో శనివారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర పరిశీలకులు వెంకయ్య, భూపీంద్ర సింగ్ సమక్షంలో భేటీ అవ్వనున్న పార్టీ ఎమ్మెల్యేలు సీఎంను నిర్ణయిస్తారని మౌర్య స్పష్టం చేశారు. మార్చి 19న (ఆదివారం) పార్టీ జాతీయ నాయకుల సమక్షంలో సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందన్నారు. మనోజ్ సిన్హా పూజలు! యూపీ సీఎం రేసులో ముందంజలో ఉన్నట్టు భావిస్తున్న సీనియర్ నేత, కేంద్రమంత్రి మనోజ్ సిన్హా శనివారం కాల భైరవ, కాశీ విశ్వనాథ ఆలయాలను దర్శించుకొని ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం గమనార్హం. ఇప్పటికే సీఎం రేసు నుంచి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ తప్పుకున్నారని, మౌర్య కూడా రేసులో ప్రధానంగా లేరని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో మచ్చలేని వ్యక్తిత్వం, పాలన అనుభవం గల నేతగా పేరొందిన సిన్హాకు యూపీ అందలం దక్కవచ్చునని భావిస్తున్నారు. మరోవైపు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు శనివారం స్పందిస్తూ.. ఈ రోజు సాయంత్రం యూపీ బీజేపీ ఎమ్మెల్యేలు సీఎం ఎన్నుకుంటారని చెప్పారు. సీఎం రేసులో పలువురు ఉన్నారంటూ మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవాలని ఆయన కొట్టిపారేశారు. -
19న యూపీ సస్పెన్స్ కు తెర
లక్నో: ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 19న నూతన ప్రభుత్వం కొలువుతీరనుంది. లక్నోలోని స్మృతివనంలో జరిగే కార్యక్రమంలో కొత్త ముఖ్యమంత్రి, మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఇప్పటివరకు ఖరారు కాలేదు. ఇటీవల ముగిసిన యూపీ ఎన్నికల్లో బీజేపీ 312 సీట్లు గెల్చుకుంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు శనివారం సమావేశమై తమ నాయకుడిని ఎన్నుకునే అవకాశముంది. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, టెలికం మంత్రి మనోజ్ సిన్హా, బీజేపీ యూపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య పేర్లు ముఖ్యమంత్రి పదవికి బలంగా విన్పిస్తున్నాయి. వీరిలో ఎవరు సీఎం అవుతారనేది ఆదివారం తేలిపోతుంది. కాగా, యూపీ సీఎం రేసులో తాను లేనని, ఇటువంటి రేసుల గురించి తనకు తెలియదని మనోజ్ సిన్హా వ్యాఖ్యానించారు. -
లక్ ఎవరిదో?
ఉత్తర్రపదేశ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టేది ఎవరు? ఉత్తరప్రదేశ్ అధికార పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకున్న నేపథ్యంలో కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి ఎవరనేది ప్రకటించకుండానే ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో ప్రస్తుత కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మొదలుకొని ఫైర్‌బ్రాండ్ ఎంపీ యోగీ ఆదిత్యనాథ్ వరకూ అనేకమంది సీఎం పదవి రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరందరిలో సీఎం పీఠం ఎవరిని వరిస్తుంది? ఎవరి బలమేంటి? బలహీనతలేంటి? అన్నది విశ్లేషిస్తే... – సాక్షి నాలెడ్జ్ సెంటర్ రాజ్‌నాథ్ సింగ్... పార్టీ సీనియర్ నేత. ఆర్ఎస్ఎస్తోనూ దగ్గరి సంబంధాలున్న వ్యక్తి. 24 ఏళ్ల వయసులో జన్‌సంఘ్ జిల్లా అధ్యక్షుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రాజ్‌నాథ్ అంచలంచెలుగా యూపీ సీఎం స్థానానికి ఎదిగారు. రెండు దఫాలు సీఎంగానూ, పార్టీ అధ్యక్షుడిగానూ పనిచేసిన అనుభవముంది. కుల, మత రాజకీయాలకు ప్రాధాన్యమున్న యూపీలో అన్ని వర్గాల వారిని కలుపుకొనిపోగల నేతగా రాజ్‌నాథ్‌కు పేరుంది. మనోజ్ సిన్హా... ఘాజీపూర్ నుంచి పార్లమెంటుకు ఎంపికై కేంద్ర టెలికాం శాఖ మంత్రిగా పనిచేస్తున్న మనోజ్ సిన్హా విద్యావంతుడు. బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ చేసిన సిన్హా.. ప్రధాని మోదీ నియోజకవర్గం వారణాసిలో కీలక మార్పులు తీసుకురావడంలో ముఖ్యభూమిక పోషించారు. భూమిహార్ వర్గానికి చెందిన వాడు కావడం ఆయనకు ముఖ్యమంత్రి పదవి దక్కేందుకు అనుకూలమైన అంశం. కేశవ్ ప్రసాద్ మౌర్య.. బీజేపీ యూపీ అధ్యక్షుడైన కేశవ్ ప్రసాద్ మౌర్యకు ఈ సారి సీఎం పదవి దక్కవచ్చన్న బలమైన వాదన ఉంది. 2014లో పార్లమెంట్‌కు ఎన్నికైన 47 ఏళ్ల మౌర్య 1990లో రామమందిరం ఆందోళనలో చురుగ్గా పాల్గొన్నారు. రాష్ట్రంలోని యాదవేతర ఓట్లను కొల్లగొట్టే లక్ష్యంతో ఓబీసీలలో కుశ్వాహ వర్గానికి చెందిన మౌర్యను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. పాలనాపరమైన అనుభవం లేకపోవడం ప్రతికూల అంశం. అనుభవం లేకపోయినా మౌర్యకు పదవి దక్కవచ్చునని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యోగీ ఆదిత్యనాథ్... వీరితోపాటు కరడుకట్టిన హిందుత్వవాది, వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లోకి ఎక్కే యోగీ ఆదిత్యనాథ్ కూడా ఈ పదవిపై కన్నేయడమే కాకుండా తనను ముఖ్యమంత్రిని చేయాల్సిందిగా మోదీని కోరారు కూడా. అయితే ఘోరఖ్‌నాథ్ మఠానికి అధిపతిగా, హిందూ యువవాహిని వంటి వివాదాస్పద సంస్థలకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఈ ఎంపీని.. మోదీ అందలమెక్కిస్తారా? అన్నది ప్రశ్న. వీరితో పాటు బీజేపీ సీనియర్ నేతలు ఉమాభారతి కూడా రేసులో ఉన్నప్పటికీ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే పార్టీ నాయకత్వం ఈ సాధ్వీని పరిగణనలోకి తీసుకునే అవకాశాలు తక్కువే. మరోవైపు కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్న కల్రాజ్ మిశ్రా, సంతోష్ గంగ్వార్ వంటి వారు కూడా ఈ పదవిని ఆశిస్తున్నారు. -
కాల్స్ డ్రాప్స్‌పై చేతులెత్తేసిన ప్రభుత్వం
కాల్స్ డ్రాప్స్ సమస్యతో ఓవైపు కస్టమర్లు సతమతమవుతుంటే, ఆ సమస్యను పూర్తిగా నిర్మూలించలేమని కేంద్రప్రభుత్వం చేతులెత్తేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా నెలకొనే సమస్యగా పేర్కొన్న కేంద్రం టెలికాం నెట్‌వర్క్‌లో కాల్‌డ్రాప్స్‌పై పూర్తిగా పరిష్కరించలేమంటూ శుక్రవారం వెల్లడించింది. బలహీనమైన రేడియో కవరేజ్, రేడియో ఇంటర్ఫియరెన్స్, అందుబాటులో ఉన్న స్పెక్ట్రమ్ లోడింగ్, ట్రాఫిక్ తీరులో మార్పులు, పవర్ ఫెయిల్యూర్స్‌తో సైట్లు మూత వంటి వివిధ కారణాల చేత కాల్డ్రాప్స్ ఏర్పడతాయని టెలికాం శాఖ మంత్రి మనోజ్ సిన్హా రాజ్యసభ్యకు శుక్రవారం తెలిపారు. ఈ కారణాలచే ప్రతి వైర్లెస్ నెట్‌వర్క్‌ల్లో కాల్ డ్రాప్స్ సమస్యలు తలెత్తుతాయని వెల్లడించారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం, టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయని, టెలికాం ఆపరేటర్లు కాల్ డ్రాప్ సమస్యను గుర్తించి, వారి పరిమిత స్థాయిలో తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాయని వెల్లడించారు. కానీ పూర్తిగా మాత్రం నిర్మూలించలేమని చెప్పారు. -
‘రైలు ప్రమాదానికి అదే కారణం కావొచ్చు’
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ సమీపంలో రైలు పట్టాలు తప్పిన ఘటనలో 113 మంది మృతి చెందారని అధికారులు వెల్లడించారు. 150 మందికి పైగా గాయపడినవారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంత మంది ప్రాణాలను బలితీసుకున్న ఈ రైలు ప్రమాదంపై ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ప్రమాదానికి కారణమైన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. అయితే.. రైలు పట్టాలో పగులు ఏర్పడటం ఈ ప్రమాదానికి కారణం అయి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంజనీర్లు, నిపుణుల ఆధ్వర్యంలో ఈ ప్రమాదంపై విచారణ జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
కాల్‌డ్రాప్ పరిస్థితిపై చర్చిద్దాం రండి!
న్యూఢిల్లీ : వినియోగదారులకు తెగ విసుగు తెప్పించిన కాల్ డ్రాప్స్ ప్రస్తుత పరిస్థితిపై చర్చించేందుకు కేంద్ర కమ్యూనికేషన్ శాఖా మంత్రి మనోజ్ సిన్హా, టెల్కోలతో భేటీ కానున్నారు. నవంబర్ 1న అన్ని టెలికాం కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లతో ఆయన భేటీ నిర్వహించనున్నట్టు టెలికాం సెక్రటరీ జే.ఎస్ దీపక్ తెలిపారు. ఈ భేటీలోనే కాల్ డ్రాప్స్ ప్రస్తుత పరిస్థితితో పాటు, భవిష్యత్తు కార్యచరణపై కూడా చర్చించనున్నారు. కాల్ డ్రాప్ పరిస్థితిలో గణనీయమైన మెరుగుదల నమోదైనట్టు ట్రాయ్ వెల్లడించినట్టు దీపక్ తెలిపారు. ఈ సమస్యపై జూన్‌లో టెలికాం కంపెనీ ఆపరేటర్లతో భేటీ నిర్వహించామని, ఆ భేటీలో టెల్కోలు 100 రోజుల ప్లాన్ హామీగా ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఈ ప్రొగ్రామ్ ద్వారా కాల్ డ్రాప్స్ పరిస్థితి చక్కబరిచి, లక్ష్యాలను చేధిస్తామన్నారని వాగ్దానం చేసినట్టు చెప్పారు. జూన్10 నుంచి ఈ ప్రొగ్రామ్ ప్రారంభమైంది. అప్పటినుంచి ట్రాయ్ సమర్పిస్తున్న నివేదికల్లో కాల్ డ్రాప్స్‌లో మెరుగైన ఫలితాలు కనిపించాయని తెలిపారు. 2015 డిసెంబర్ వరకు 54 నెట్‌వర్క్స్‌లో ఎలాంటి పనితీరు కనిపించలేదని, ప్రస్తుతం ఆ నెట్‌వర్క్‌లు 19కి తగ్గినట్టు వివరించారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా టెల్కోలు 60వేల బీటీఎస్(బేస్ ట్రాన్సీవర్ స్టేషన్లను) ఏర్పరచనున్నట్టు తెలిపారు. మొదటి 45లో 48వేల స్టేషన్లను టెల్కోలు ఏర్పరిచారు. కాల్ డ్రాప్స్ సమస్య నుంచి బయటపడటానికి బీటీఎస్‌లు ఏర్పాటుకు టెల్కోలు రూ.12వేల కోట్ల మేర ఖర్చుచేస్తున్నట్టు దీపక్ తెలిపారు. -
కోరుకున్న వెంటనే రైల్వే బెర్తు!
న్యూఢిల్లీ: ప్రయాణికులు కోరుకున్న వెంటనే రిజర్వేషన్ కల్పించే వెసులుబాటును 2020 కల్లా సిద్ధం చేయాలని రైల్వే శాఖ ప్రణాళికలు రచిస్తోంది. వెయింటింగ్ లిస్టు పెద్దగా ఉంటోందని, అందుబాటులో ఉన్న సీట్లు-ప్రయాణికుల సంఖ్యలో భారీ తేడా ఉంటోందని రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. ప్రయాణికుల అవసరాలు, ప్రస్తుతం ఉన్న రైల్వే మౌలిక సదుపాయాలకు మధ్య తేడా చాలా ఉందన్నారు. ‘స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి దేశంలో రైల్వే ట్రాఫిక్ 20 శాతం పెరిగింది. మౌలిక సదుపాయాలు కేవలం 2.25 శాతమే పెరిగాయి. ఈ రెండింటి మధ్య తేడా భారీగా ఉంద’ని మనోజ్ సిన్హా అన్నారు. రైల్వే మౌలిక సదుపాయాలను మెరుగు పరిచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన చెప్పారు. -
కాల్ డ్రాప్స్ సమస్య తగ్గింది: కేంద్రం
న్యూఢిల్లీ: కాల్ డ్రాప్ సమస్య గడచిన రెండు నెలలుగా గణనీయంగా తగ్గిందని టెలికం మంత్రి మనోజ్ సిన్హా శుక్రవారం పేర్కొన్నారు. అయితే సేవల నాణ్యత మరింత పెరగాలని ఆపరేటర్స్‌కు ఆయన సూచించారు. లేదంటే పోటీపూర్వక మార్కెట్లో నిలదొక్కుకోవడం కష్టమని ఒక ఇంటర్వ్యూలో అన్నారు. రానున్న స్పెక్ట్రమ్ వేలం ఆపరేటర్స్‌కు మరిన్ని రేడియోవేవ్స్ అందుబాటులోకి తెస్తుందని పేర్కొన్న మంత్రి, సేవల మెరుగుదల, ఆదాయాల పెం పునకు ఇది మార్గం సుగమం చేస్తుందని వివరించారు. రానున్న మూడు-నాలుగు నెలల్లో సేవల్లో నాణ్యత మరింత మెరుగుపడుతుం దన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ దిశలో ఫలితాలను సాధించుకోడానికి కంపెనీలు రానున్న స్పెక్ట్రమ్ ఆక్షన్‌లో కంపెనీలు ఉత్సాహంగా పాల్గొంటాయన్న అభిప్రాయాన్నీ ఆయన వ్యక్తం చేశారు. స్పెక్ట్రమ్‌లో పాల్గొనని కంపెనీలు సేవల మెరుగుదలలో తమ లక్ష్యాలను చేరలేవని కూడా మంత్రి పేర్కొన్నారు. వచ్చే నెల నుంచీ ప్రారంభం కానున్న స్పెక్ట్రమ్ వేలం ఇప్పటివరకూ జరిగిన వేలంలో అతి భారీదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి
తిరుమల : తిరుమలలోని శ్రీవెంకటేశ్వరస్వామిని కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి మనోజ్ సిన్హా దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆయన శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు ఆలయం వద్ద టీటీడీ అధికారులు మంత్రి మనోజ్ సిన్హాకు స్వాగతం పలికారు.శ్రీ వారి దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను మనోజ్ సిన్హాకు అందజేశారు. -
45 రోజుల్లో 48వేల టవర్లు
♦ కాల్ డ్రాప్స్ పరిష్కారానికి ఆపరేటర్ల చర్యలు: మనోజ్ సిన్హా ♦ వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్‌కు కొత్త బ్యాండ్లు కావాలని వినతి న్యూఢిల్లీ : మొబైల్ కాల్ డ్రాప్స్ సమస్య పరిష్కారం కోసం రూ.20 వేల కోట్ల పెట్టుబడులతో లక్ష టవర్లను ఏర్పాటు చేసేందుకు టెలికం కంపెనీలు ముందుకు వచ్చాయి. అయితే, మరింత స్పెక్ట్రమ్ కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరాయి. కాల్ డ్రాప్స్ అంశంపై టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హా సోమవారం కంపెనీల ప్రతినిధులతో భేటీ అయిన సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకుంది. 100 రోజుల్లో 60 వేల టవర్లు నిర్మిస్తామన్న హామీలో భాగంగా 45 రోజుల్లో 48వేల టవర్ల నిర్మాణం పూర్తి చేసినట్టు సమావేశం అనంతరం మంత్రి మనోజ్ సిన్హా విలేకరులకు తెలిపారు. ఆపరేటర్ల పనితీరు సంతృప్తికరంగానే ఉందని, ప్రభుత్వం మాత్రం వినియోగదారుల అనుభవం ఆధారంగా నెట్‌వర్క్‌ను ఇంకా పటిష్ట పరచాలని ఆశిస్తోందని చెప్పారు. కాల్ డ్రాప్స్ అంశంపై ప్రభుత్వానికి, కంపెనీలకు మధ్య జరిగిన రెండో సమావేశం ఇది. జూన్‌లో జరిగిన తొలి సమావేశం సందర్భంగా నెట్వర్క్ పటిష్టతకు కంపెనీలు అదనపు టవర్ల ఏర్పాటుపై కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాయి. సెప్టెంబర్‌లో స్పెక్ట్రం వేలం సెప్టెంబర్‌లో స్పెక్ట్రమ్ వేలం నిర్వహించనున్నామని, దీంతో స్పెక్టమ్ కొరత సమస్య తీరిపోతుందని ఆపరేటర్లకు మంత్రి తెలియజేశారు. అయితే, ఈ వేలంలో 71 నుంచి 76 గిగాహెడ్జ్, 50 గిగాహెడ్జ్ నూతన ఫ్రీక్వెన్సీ బ్యాండ్లను కూడా అందుబాటులోకి తేవాలని ఆపరేటర్లు మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ బ్యాండ్లలో వైర్లెస్ సేవల ద్వారా బ్రాడ్‌బ్యాండ్‌ను 1 గిగాబైట్ వేగంతో అం దించడానికి వీలవుతుందని సూచించారు. తాము ఏడాదిలో లక్ష టవర్ల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని, అదే సమయంలో నెట్‌వర్క్‌ల సామర్థ్యం పెంచుకునేందుకు గాను ఈ (71-76), వీ (50గిగాహెడ్జ్) బ్యాండ్లను కూడా అందుబాటులోకి తేవాలని కోరినట్టు సెల్యులర్ ఆపరేటర్ల సంఘం డెరైక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ తెలిపారు. ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ వేసేందుకు అనుమతులు కష్టంగా ఉండడంతో ఈ బ్యాండ్లు ప్రయోజనకరంగా ఉంటాయన్నారు. అలాగే, స్పెక్ట్రమ్ కోసం చేసే చెల్లింపులపై వడ్డీ రేటు తక్కువగా ఉంచాలని కోరినట్టు కూడా ఆయన తెలిపారు. -
మెగా స్పెక్ట్రమ్ వేలానికి డేట్ ఫిక్స్
న్యూఢిల్లీ : మెగా స్పెక్ట్రమ్ వేలానికి డేట్ ఫిక్స్ అయింది. సెప్టెంబర్ లో ఈ వేలం నిర్వహించనున్నట్టు టెలికాం మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. ఈ వేలంతో ప్రభుత్వ ఖజానాకు రూ.5.66లక్షల కోట్ల ఆదాయం సమకూరనుంది. సిన్హా తన మొదటి మీడియా మీటింగ్ లో ఈ విషయాన్ని సిన్హా వెల్లడించారు. అదేవిధంగా కాల్ డ్రాప్స్ సమస్యను కూడా తీవ్రంగా పరిగణలోకి తీసుకుని, పరిస్థితిని చక్కబెడతామన్నారు. గత నెలలో మెగా స్పెక్ట్రమ్ వేలానికి సంబంధించిన ప్రణాళికకు కేబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ సారి నిర్వహించబోయే వేలమే అన్ని స్పెక్ట్రమ్ వేలంలో కెల్లా అతిపెద్దది. ట్రాయ్ సిఫారసులతో 3జీ, 4జీ ఆఫర్ చేసే క్వాంటమ్ 2,200 మెగాహెడ్జ్ పైగా స్పెక్ట్రమ్ ను ప్రభుత్వం తొలిసారిగా వేలం వేయబోతోంది. అయితే అందుబాటులో ఉన్న అన్ని స్పెక్ట్రమ్ లను ప్రభుత్వం విక్రయించబోదని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ధర ఆందోళనలు, మునుపటి అమ్మకాల అవసరాలతో పోలిస్తే ఆపరేటర్ల పరిమిత అవసరాలు.. అన్నింటిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ వేలాన్ని వేయనున్నట్టు తెలుస్తోంది. 20 రోజుల తర్వాత కాల్ డ్రాప్స్ సమస్య పరిష్కారంపై కూడా పూర్తి వివరాలను వెల్లడిస్తామని సిన్హా తెలిపారు. వచ్చే నాలుగు, ఐదు నెలలో ఈ సమస్య నుంచి వినియోగదారులు పూర్తిగా ఉపశమనం పొందుతారని పేర్కొన్నారు. ప్రైవేట్ కంపెనీల ద్వారా 90శాతం టెలి డెంసిటీ టార్గెట్లను టెలికాం ఇండస్ట్రి సాధించిందని సిన్హా తెలిపారు. టెలికాంలో దాదాపు రూ.46వేల కోట్ల కుంభకోణం చోటుచేసుకుందని.. దాన్ని కేంద్రప్రభుత్వం చాపకింద దాచిపెడుతుందని కాంగ్రెస్ ప్రభుత్వ ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పులను ప్రస్తుత ప్రభుత్వాలపై రుద్దకూడదన్నారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, అలాంటి ఫిర్యాదులేమి రాలేదని, నిర్దేశిత గడువులోగానే టెలికాం ఆపరేటర్ల నుంచి సొమ్మును వసూలుచేస్తున్నామని సిన్హా తెలిపారు. -
‘టీ సంపర్క్ క్రాంతి’ ప్రారంభించలేం
లోక్‌సభలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించడం ప్రస్తుతానికి సాధ్యం కాదని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా ప్రకటించారు. బుధవారం లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీ కొత్తా ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కార్యాచరణ, ఆర్థిక వనరుల పరమైన ఇబ్బందుల వల్ల తెలంగాణ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించడం ప్రస్తుతానికి సాధ్యం కాదని మనోజ్ సిన్హా రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ప్రస్తుతం తిరుపతి-నిజాముద్దీన్ మధ్య ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ నడుస్తోందని, తెలంగాణలోని పలు స్టేషన్లలో ఈ రైలుకు స్టాపేజ్‌లు ఉన్నాయని పేర్కొన్నారు. కాగా, కొత్తపల్లి-మనోహరాబాద్, అక్కన్నపేట్-మెదక్ మధ్య నూతన రైల్వే లైన్ల నిర్మాణపు పనులు చేపట్టినట్లు మరో ప్రశ్నకు ఆయన జవాబిచ్చారు. కొత్తపల్లి-మనోహరాబాద్ నూతన రైల్వే లైను నిర్మాణానికి ఇప్పటికే రూ. 1.76 కోట్ల మేర వ్యయమైందని, 2016-17 బడ్జెట్లో రూ. 30 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. అక్కన్నపేట్-మెదక్ నూతన రైల్వే లైను నిర్మాణానికి కూడా ఇప్పటికే రూ. 118 కోట్లు మంజూరైనట్లు, పర్యావరణ అనుమతులు లభించాయని, టెండర్ల పనులు కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. -
పాడైన బోగీలతో.. కానిచ్చేశారు..!
ముంబై: రైళ్ల రాకపోకల సమయాల్లో, నిర్ణయాల్లో జాప్యం చేసే రైల్వే శాఖ శుక్రవారం రాష్ట్ర మంత్రి చొరవతో అరకొర వసతులున్న రైలును ఎనిమిది గంటల్లోనే ముంబై నుంచి ఉత్తరప్రదేశ్, బీహార్ల మీదుగా వెళ్లే విధంగా ప్రత్యేక సర్వీసును ఏర్పాటు చేసింది. వివాహాల సీజన్ కావడంతో రైళ్లలో ఖాళీలు లేక ఉత్తర భారతదేశానికి చెందిన ఎక్కువ మంది ప్రజలు ముంబై స్టేషన్లోనే పడుకుంటున్నారంటూ బీజేపీ కార్యకర్తలు అందించిన సమాచారంతో కదిలిన మహారాష్ట్ర రైల్వే శాఖ మంత్రి మనోజ్ సిన్హా వెంటనే ప్రత్యేక సర్వీసులను నడపాలని సెంట్రల్ రైల్వే అధికారులను ఆదేశించారు. దీంతో కదిలిన రైల్వే శాఖ ఆదేశాలు అందిన రెండు గంటలలోపే వాడుకలో లేని కోచ్‌లను త్వరగా రప్పించి శుక్రవారం రాత్రి 11.30 నిమిషాలకు ప్రత్యేక రైలును గోరఖ్‌పూర్ వరకు నడపాలని నిర్ణయించారు. ఇందుకోసం సీఎస్టీ, వాడి బన్డర్, మజ్గావ్, దాదర్ రైల్వే యార్డుల నుంచి రెండు చొప్పునా, బైకుల్లా యార్డు నుంచి నాలుగు వాడుకలో లేని, పూర్తిగా పాడై ఉన్న కోచ్‌లను ఎంపిక చేశారు. వీటిని రిపేర్ చేయడం, శుభ్ర పరచడం కోసం 25 మంది రైల్వే సిబ్బంది కేటాయించారు. శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో రిపేర్ చేసిన 12 కోచ్‌లు ముంబై స్టేషన్‌కు చేరుకున్నపుడు పరిశీలిస్తే బోగీలన్నీ అపరిశుభ్రంగా ఉండటంతో పాటు ఫ్యాన్లు కూడా సరిగా పనిచేయడం లేదు. రద్దీ ఎక్కువగా ఉండటంతో ముంబై నుంచి గోరఖ్‌పూర్, వారణాసి, పాట్నాలకు 84 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు సెంట్రల్ రైల్వే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ నరేంద్రపాటిల్ తెలిపారు. -
ఆ దుప్పట్లు ఉతికేది రెండు నెలలకోసారే!
మీరు రైల్లో వెళ్లేటపుడు.. ఫస్ట్ క్లాస్, సెకెండ్ క్లాస్, థర్డ్ ఏసీ వంటి బోగీల్లో ఎప్పుడైనా ప్రయాణం చేశారా? అక్కడ మీకు కప్పుకోడానికి ఇచ్చే దుప్పట్ల కంపు గమనించే ఉంటారు. ఆ విషయం గురించి ఎన్నిసార్లు అటెండెంటుతో గొడవ పడినా ప్రయోజనం ఉండదు. కానీ.. ఇప్పుడు అదే విషయం పెద్దల సభలో చర్చకు వచ్చింది. దాంతో.. రైళ్లలో దుప్పట్లను రెండు నెలలకు ఓసారి మాత్రమే ఉతుకుతారన్న విషయం వెల్లడైంది. ఈ విషయాన్ని రైల్వేశాఖ సహాయమంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. దుప్పట్లు ప్రతిరోజూ ఉతికించడం కుదిరే పని కాదని, వాసన రావడం సహజమేనని చెప్పారు. రైల్వే శాఖకు లినెన్ సరఫరా చేస్తున్న దుప్పట్ల నాణ్యత, పరిశుభ్రతపై ఓ ప్రశ్నకు సమాధానంగా సదరు మంత్రి గారు తన మనసులోని మాటను వెల్లడించారు. సభలో సభ్యులు తమకు రైళ్లలో ఎదురైన అనుభవాలను తెలపడంతో.. సభాపతి హమీద్ అన్సారీ కూడా దీనిపై మాట్లాడారు. అంత ఇబ్బందిగా ఉంటే ప్రయాణికులు తమ సొంత దుప్పట్లు, పరుపులను తీసుకెళ్లడం మంచిదని వ్యాఖ్యానించారు. మరో రెండేళ్ళలో 25 మెకనైజ్డ్ లాండ్రీలను రైల్వే శాఖ ఏర్పాటు చేస్తోందని, దీంతో 85 శాతం ప్రయాణికులు పరిశుభ్రమైన దుప్పట్లను పొందగలరని వెల్లడించిన మంత్రి సిన్హా తన ప్రకటనపై సమర్థించుకున్నారు. ఇండియన్ రైల్వే 'బెడ్ రోల్ టేక్ ఎవే' అనే ఓ తాత్కాలిక పథకం ప్రారంభించిందని, రైల్వే దుప్పట్ల కంపు నచ్చని ప్యాసింజర్లు ఆన్ లైన్లో 110 రూపాయలకు ఓ బ్లాంకెట్, 140 రూపాయలకైతే రెండు బెడ్ షీట్లు చొప్పున కిట్ బుక్ చేసుకోవచ్చని ఓ రైల్వే అధికారి చెప్పారు. ప్రయాణం ముగిసిన తర్వాత ఆయా బ్లాంకెట్లు, బెడ్ షీట్లను ప్రయాణికులు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చని కూడా ఆఫర్ ఇచ్చారు. అదీ మన రైల్వేల సంగతి!! -
రైల్వేకు 46,333 హెక్టార్ల ఖాళీ స్థలం
న్యూఢిల్లీ: రైల్వే శాఖ అధీనంలో 46,333 హెక్టార్ల ఖాళీ స్థలం ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రైల్వే శాఖకు మొత్తం 4,61,487 హెక్టార్ల భూమి ఉందని రైల్వేశాఖ సహాయమంత్రి మనోజ్ సిన్హా వెల్లడించారు. ఇందులో 4,14,240 హెక్టార్లు తమశాఖ కార్యకలాపాలకు వినియోగిస్తున్నామని, మిగతా స్థలం ఖాళీగా ఉందని రాజ్యసభలో చెప్పారు. ఖాళీగా ఉన్న స్థలం ఎక్కువ శాతం రైల్వే పట్టాల వెంట నిలువుగా ఉందని తెలిపారు. సర్వీసింగ్, ట్రాక్ నిర్వహణకు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాల కోసం ఈ ఖాళీ స్థలం అవసరమవుతుందన్నారు. అవసరానికి అనుగుణంగా దీన్ని వినియోగిస్తామని చెప్పారు. రైల్వే భూముల రికార్డుల డిజిటలైజేషన్ దాదాపు పూర్తైందని మంత్రి తెలిపారు. -
రైల్వే చార్జీల పెంపు ప్రతిపాదన లేదు: మనోజ్
లక్నో: రైల్వే చార్జీల పెంపు ప్రతిపాదన ఇప్పటికైతే లేదని రైల్వే శాఖ సహాయమంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. అన్ని విషయాలు బడ్జెట్ సమయంలోనే తెలుస్తాయన్నారు. శనివారమిక్కడ లక్నో-కత్గోడం ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. వచ్చే బడ్జెట్లో రైల్వే చార్జీలు పెంచుతారా అంటూ విలేకరులు సిన్హాను ప్రశ్నించగా.. ‘‘ఇప్పటికైతే ఆ ప్రతిపాదన లేదు. బడ్జెట్ గురించి ఇప్పుడు చర్చించడం సబబు కాదు. సమయం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి’’ అని పేర్కొన్నారు. . రైల్వేను ప్రైవేటీకరించే యోచన ప్రభుత్వానికి లేదని స్పష్టంచేశారు. -
ప్యాసింజర్ రైళ్ల వేగం పెంచేందుకు 9 కారిడార్లు
న్యూఢిల్లీ: ప్యాసింజర్ రైళ్ల వేగాన్ని గంటకు 160-200 కిలోమీటర్ల వరకూ పెంచేందుకుగాను చెన్నై-హైదరాబాద్, నాగపూర్-సికింద్రాబాద్ సహా 9 రైల్వే కారిడార్లను గుర్తించినట్లు కేంద్రం వెల్లడించింది. శతాబ్ది ఎక్స్‌ప్రెస్, తదితర రైళ్లను గరిష్టంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో న్యూఢిల్లీ-ఆగ్రా మార్గంలో ఈ నెల 3న నడిపి పరీక్షించామని, దీంతో ఆ వేగానికి ట్రాక్ పటిష్టంగానే ఉంటుందని తేలినట్లు ఈ మేరకు శుక్రవారం రైల్వే సహాయ మంత్రి మనోజ్ సిన్హా రాజ్యసభకు రాతపూర్వకంగా వెల్లడించారు. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు, ఎలక్ట్రిక్ లోకోలను కూడా 180 కి.మీ. గరిష్ట వేగం వరకూ విజయవంతంగా నడిపినట్లు తెలిపారు. ఈ పరీక్షల్లో భద్రత, ట్రాకు పటిష్టత, సాంకేతికపరమైన అన్ని అంశాలను పరిశీలించినట్లు మంత్రి మనోజ్ సిన్హా పేర్కొన్నారు.