ముంబై: రైళ్ల రాకపోకల సమయాల్లో, నిర్ణయాల్లో జాప్యం చేసే రైల్వే శాఖ శుక్రవారం రాష్ట్ర మంత్రి చొరవతో అరకొర వసతులున్న రైలును ఎనిమిది గంటల్లోనే ముంబై నుంచి ఉత్తరప్రదేశ్, బీహార్ల మీదుగా వెళ్లే విధంగా ప్రత్యేక సర్వీసును ఏర్పాటు చేసింది.
వివాహాల సీజన్ కావడంతో రైళ్లలో ఖాళీలు లేక ఉత్తర భారతదేశానికి చెందిన ఎక్కువ మంది ప్రజలు ముంబై స్టేషన్లోనే పడుకుంటున్నారంటూ బీజేపీ కార్యకర్తలు అందించిన సమాచారంతో కదిలిన మహారాష్ట్ర రైల్వే శాఖ మంత్రి మనోజ్ సిన్హా వెంటనే ప్రత్యేక
సర్వీసులను నడపాలని సెంట్రల్ రైల్వే అధికారులను ఆదేశించారు.
దీంతో కదిలిన రైల్వే శాఖ ఆదేశాలు అందిన రెండు గంటలలోపే వాడుకలో లేని కోచ్లను త్వరగా రప్పించి శుక్రవారం రాత్రి 11.30 నిమిషాలకు ప్రత్యేక రైలును గోరఖ్పూర్ వరకు నడపాలని నిర్ణయించారు. ఇందుకోసం సీఎస్టీ, వాడి బన్డర్, మజ్గావ్, దాదర్ రైల్వే యార్డుల నుంచి రెండు చొప్పునా, బైకుల్లా యార్డు నుంచి నాలుగు వాడుకలో లేని, పూర్తిగా పాడై ఉన్న కోచ్లను ఎంపిక చేశారు. వీటిని రిపేర్ చేయడం, శుభ్ర పరచడం కోసం 25 మంది రైల్వే సిబ్బంది కేటాయించారు. శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో రిపేర్ చేసిన 12 కోచ్లు ముంబై స్టేషన్కు చేరుకున్నపుడు పరిశీలిస్తే బోగీలన్నీ అపరిశుభ్రంగా ఉండటంతో పాటు ఫ్యాన్లు కూడా సరిగా పనిచేయడం లేదు.
రద్దీ ఎక్కువగా ఉండటంతో ముంబై నుంచి గోరఖ్పూర్, వారణాసి, పాట్నాలకు 84 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు సెంట్రల్ రైల్వే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ నరేంద్రపాటిల్ తెలిపారు.
పాడైన బోగీలతో.. కానిచ్చేశారు..!
Published Sat, Apr 23 2016 3:37 PM | Last Updated on Sun, Sep 3 2017 10:35 PM
Advertisement