Ghorakpur
-
సింహాలకు హీటర్లు.. పాములకు కంబళ్లు
గోరఖ్‌పూర్: ఉత్తరప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపధ్యంలో గోరఖ్‌పూర్‌లోని షహీద్ అష్ఫాక్ ఉల్లా ఖాన్ జూలాజికల్ పార్కులోని జంతువులకు చలి నుంచి రక్షణ కల్పించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జూపార్కులోని సింహాలు, పులులు వంటి భారీకాయం కలిగిన జంతువులు చలిని తట్టుకోలేవు. అందుకే వాటికి చలి నుంచి రక్షణ కల్పించేందుకు అవి ఉండేచోట హీటర్లను అమర్చారు. ఈ హీటర్లు రాత్రి ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి. ఇదేవిధంగా శీతాకాలంలో జంతువులు ఆరోగ్యంగా ఉండేందుకు అధికారులు పలు చర్యలు చేపడుతున్నారు. పాముల వంటి సరీసృపాలకు చలి నుంచి రక్షణ కల్పించేందుకు కంబళ్లను వినియోగిస్తున్నారు.జింకలు, ఇతర చిన్న జంతువులకు చలి నుంచి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక గడ్డిని వాటి ఎన్క్లోజర్లలో ఉంచుతున్నారు. తద్వారా అవి వెచ్చదనంలో ఉండేలా చూస్తున్నారు. జలచరాలకు వేడి నీటిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జూ పశువైద్యాధికారి యోగేష్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ ఈ శీతాకాలంలో ప్రతి జాతి జంతువుల అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఇది కూడా చదవండి: ఎర్ర సముద్రంలో బోటు ప్రమాదం..16 మంది గల్లంతు -
ఉత్తరప్రదేశ్: తొలి రౌండ్లో బీజేపీ ఆధిక్యం
యూపీలో లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి ట్రెండ్‌లో బీజేపీ ముందంజలో ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో జరిగాయి. లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ ఒకటి వరకు కొనసాగాయి. దేశంలోని 543 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. యూపీలోని మీరట్ ఎస్పీ అభ్యర్థి సునీతా వర్మ ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి అరుణ్ గోవిల్ వెనుకంజలో ఉన్నారు. ఎన్నికల కౌంటింగ్‌కు ముందు గోరఖ్‌పూర్ బీజేపీ అభ్యర్థి రవికిషన్ ఆలయంలో పూజలు నిర్వహించారు. #WATCH उत्तर प्रदेश: गोरखपुर लोकसभा सीट से भाजपा उम्मीदवार रवि किशन ने #LokSabhaElections2024 के मतगणना से पहले पंचमुखी मंदिर में पूजा की। pic.twitter.com/9PHNgUOmcF— ANI_HindiNews (@AHindinews) June 4, 2024 -
‘400 లోక్‌సభ స్థానాల్లో గెలుపు మాదే’.. బీజేపీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు
లక్నో : ప్రముఖ నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 స్థానాల్ని కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తాను రెండోసారి ఎంపీగా పోటీ చేస్తున్న లోక్‌సభ స్థానం గోరఖ్‌పూర్ చరిత్ర సృష్టిస్తుందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచుతోంది. రికార్డ్ స్థాయిలో 195 మందితో తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. వారిలో ప్రముఖ నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ ఒకరు. 2019 నుంచి ఉత్తర్‌ప్రదేశ్ గోరఖ్‌పూర్ ఎంపీగా రవికిషన్ కొనసాగుతున్నారు. అయితే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రెండోసారి పోటీ చేసేందుకు బీజేపీ అధిష్టానం ఆయనకు మరోసారి అవకాశం ఇచ్చింది. #WATCH | Gorakhpur: BJP leader Ravi Kishan says, "I want to thank the top leadership wholeheartedly... The organization gave me a second chance from the hottest seat after Kashi. I would like to express my heartfelt gratitude to the entire organization and Prime Minister Modi. I… https://t.co/SFXrQnf6Zi pic.twitter.com/ewqZS5olQN — ANI (@ANI) March 2, 2024 బీజేపీకి 400 సీట్లు పక్కా ఈ సందర్భంగా ‘కాశీ తర్వాత అత్యంత హాటెస్ట్ సీటు గోరఖ్‌పూర్. ఇక్కడి నుంచే పోటీ చేసేందుకు బీజేపీ పెద్దలు నాకు రెండోసారి అవకాశం కల్పించారు. పార్టీకి, ప్రధాని నరేంద్ర మోదీకి నా కృతజ్ఞతలు. నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటా. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలుస్తుంది. గోరఖ్‌పూర్ సీటు చరిత్ర సృష్టిస్తుంది’ అని బీజేపీ ఎంపీ రవి కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం యోగి కంచుకోట ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు గోరఖ్‌పూర్ కంచుకోట. గోరఖ్‌పూర్ లోక్ సభ స్థానం నుంచి యోగి ఆదిత్యనాథ్ వరుసగా ఐదు పర్యాయాలు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం 1998లో ప్రారంభమై 2017లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే వరకు కొనసాగింది. ఇక్కడి నుంచి నటుడు రవి కిషన్ రెండో సారి బరిలోకి దిగనున్నారు. కాగా తొలిసారి ఇదే స్థానం నుంచి ఎంపీగా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బరిలోకి దిగిన రవికిషన్ సమాజ్‌వాద్ పార్టీ అభ్యర్థి రాంభూల్ నిషాద్పై 3 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. -
గీతా ప్రెస్ ట్రస్టీ బైజ్నాథ్ అగర్వాల్ కన్నుమూత!
గీతా ప్రెస్ ట్రస్టీ బైజ్నాథ్ అగర్వాల్ (90) కన్నుమూశారు. ఆయన 1950లో ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో గల గీతా ప్రెస్ ట్రస్ట్‌లో చేరారు. నగరంలోని సివిల్ లైన్స్‌లో గల హరిఓమ్‌నగర్ నివాసంలో ఉంటున్న బైజ్నాథ్ అగర్వాల్ శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. బైజ్నాథ్ అగర్వాల్ మృతిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన తన ట్విట్టర్(ఎక్స్) ఖాతాలోలో ఇలా రాశారు.. ‘గోరఖ్‌పూర్‌లోని గీతా ప్రెస్ ట్రస్టీ బైజ్నాథ్ అగర్వాల్ మరణం విచారకరం. గత 40 సంవత్సరాలుగా గీతా ప్రెస్‌కు ధర్మకర్తగా బైజ్నాథ్ వ్యవహరించారు. ఆయన జీవితం ప్రజా సంక్షేమానికే అంకితమయ్యింది. శ్రీరాముడు తన పాదాల చెంత ఆయన ఆత్మకు చోటు కల్పించాలని వేడుకుంటున్నానని’ అన్నారు. ఇది కూడా చదవండి: దేశంలో వీధి కుక్కలు ఎన్ని? కుక్క కాటు కేసులు ఎక్కడ అధికం? गीता प्रेस, गोरखपुर के ट्रस्टी श्री बैजनाथ अग्रवाल जी का निधन अत्यंत दुःखद है। विगत 40 वर्षों से गीता प्रेस के ट्रस्टी के रूप में बैजनाथ जी का जीवन सामाजिक जागरूकता और मानव कल्याण के लिए समर्पित रहा है। उनके निधन से समाज को अपूरणीय क्षति हुई है। प्रभु श्री राम दिवंगत पुण्यात्मा… — Yogi Adityanath (@myogiadityanath) October 28, 2023 -
ఘోర ప్రమాదం.. అర్ధరాత్రి కాలిబూడిదైన బతుకులు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని గోకుల్‌పురి ప్రాంతంలో మురికివాడల్లో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవదహనమవ్వగా... భారీ ఆస్తినష్టం వాటిల్లింది . ఈ ఘటన శనివారం అర్థరాత్రి ఒంటి గంట సమయంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకుని కొన్ని గంటల వ్యవధిలో మంటలను అదుపులోకి వచ్చాయని చెప్పారు. సుమారు 60కి పైగా గుడిసెలు కాలి బూడిద అయ్యాయి. మంటలు చాలా వేగంగా వ్యాపించడంతో మృతులు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని ఢిల్లీ ఫైర్ డైరెక్టర్ అతుల్ గార్గ్ అన్నారు. ఇదిలా ఉండగా.. ఈ ప్రమాదంలో మృతి చెందిన బాధితులకి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంతాపం తెలిపారు. ఈశాన్య ఢిల్లీ ఎంపీ మనోజ్ తివారీ కూడా బాధితులకు సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సీఎం కేజ్రీవాల్‌పై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై న్యాయ విచారణ జరిపి, కుటుంబ సభ్యులకు తక్షణమే రూ. కోటి రూపాయల సాయం ప్రకటించాలని ఆయన అన్నారు. మనోజ్ తివారీ ఈరోజు గోకుల్‌పురి ప్రాంతాన్ని సందర్శించనున్నారు. (చదవండి: పాకిస్తాన్ పై భారత్ క్షిపణి ప్రయోగం... ప్రమాదవశాత్తు జరిగిందని వివరణ) -
రూ.30కే చికెన్.. రోడ్లన్నీ బ్లాక్
లక్నో : కోవిడ్–19 (కరోనా వైరస్) దేశ వ్యాప్తంగా పౌల్ట్రీ రంగాన్ని దారుణంగా దెబ్బతీస్తోంది. గత పక్షం రోజులుగా ఈ ప్రభావంతో పౌల్ట్రీ పరిశ్రమ భారీ నష్టాన్ని చవిచూసింది. కోవిడ్–19 వైరస్ చికెన్, గుడ్ల ద్వారా వ్యాప్తి చెందుతుందన్న అబద్ధపు ప్రచారం నేపథ్యంలో దేశంలో చికెన్, గుడ్ల వినియోగం దాదాపు 40 శాతం మేర పడిపోయినట్లు పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరిగి పుంజుకునేందుకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన పౌల్ట్రీ ఫామ్ అసోషియేషన్ సభ్యులు వినూత్న ప్రయోగం చేశారు. చికెన్, ఫిష్ కారణంగా కరోనా వైరస్ సోకదని, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గోరఖ్‌పూర్‌లో ఆదివారం ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేవలం రూ. 30 రూపాయాలకే అపరిమిత చికెన్‌తో మీల్స్‌ను అందుబాటులో ఉంచారు. దీంతో పెద్ద ఎత్తున చికెన్ ప్రియులు అక్కడికి చేరుకుని.. లాగించారు. (సీఎంతో సహా మేమంతా తింటున్నాం) దీనిపై పౌల్ట్రీ నిర్వహకులు మాట్లాడుతూ.. ‘కరోనా వైరస్ కారణంగా పౌల్ట్రీ పరిశ్రమ చాలా దెబ్బతిన్నంది. చికెన్, గుడ్లు, మటన్, ఫిష్ తినడం మూలంగా వైరస్ సోకుతుందని అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా అసత్యం. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చికెన్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించాం. గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఈ ఫెస్ట్ పెట్టాం. కొద్దిసేపటికే భారీగా జనం క్యూ కట్టారు. దాదాపు మూడు గంటల పాటూ.. వచ్చే రోడ్లన్నీ బ్లాక్ అయ్యాయి. వెయ్యి కిలోలకు పైగా చికెన్ వండగా.. కొద్ది గంటల్లోనే మొత్తం ఖాళీ అయింద’ని చెప్పారు. కోవిడ్–19కు చికెన్‌కు సంబంధం లేదు... కోవిడ్–19 వైరస్‌కు చికెన్, గుడ్లతో ఎలాంటి సంబంధం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చైనాలో విభిన్న భౌగోళిక, వాతావరణ పరిస్థితులు, సగం ఉడికిన (హాఫ్ బాయిల్డ్) ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవడం తదితర కారణాలతో కోవిడ్ వైరస్ ఆ దేశంలో విజృంభిస్తోందన్నారు. మన దేశంలో ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలకుపైగా చేరుకోవడం, ఆహార పదార్థాలను సుమారు 100 సెంటిగ్రేడ్ వరకు ఉడికించి తింటుండటంతో ఎలాంటి వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు లేవని స్పష్టం చేస్తున్నారు. కొందరు అదే పనిగా సోషల్ మీడియాలో చికెన్, గుడ్లతో ఈ వైరస్ సోకుతోందని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఇది ముమ్మాటికి తప్పుడు ప్రచారమేనని.. చికెన్, గుడ్ల వినియోగంతో వైరస్ వ్యాప్తి చెందదని సర్క్యులర్‌ను జారీ చేశాయని పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధులు తెలిపారు. -
సీఎం యోగికి కలిసొచ్చిన పెంపుడు కుక్క
లక్నో: కొన్ని పెంపుడు జంతువులు వాటి ఆలవాట్ల వల్లనో.. అవి చేసే పనులతోనో వార్తల్లో నిలుస్తుంటాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ పెంపుడు కుక్క మాత్రం ఏమి చేయకుండానే సెలబ్రిటీ అయిపోయింది. ఈ బ్లాక్ లాబ్రాడర్ కుక్క పేరు ‘కాలూ’. సీఎం యోగి అదిత్యనాథ్ ‘కాలూ’తో సరదాగా ఆడుకుంటున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. యోగికి ఈ కుక్కను గోరఖ్‌పూర్ ఆలయ భక్తులు బహుమతిగా ఇచ్చారు. అప్పటి నుంచి కలుపై సీఎం ప్రత్యేక దృష్టిపెట్టి పెంపకంలో జాగ్రత్తలు పాటిస్తున్నారు. ప్రస్తుతం ‘కాలూ’ గోరఖ్‌పూర్ ఆలయంలో ఉంది. అయితే సీఎం యోగి ఈ ఆలయానికి వచ్చినపుడల్లా దానిని కలుస్తూ ఉంటాడని, సమయం దొరికినప్పుడల్లా ప్రత్యేకంచి దాని కోసమే గొరఖ్‌పూర్ వెళ్తుంటాడని ఆలయ ఇన్చార్జీ తివారి మీడియాకు తెలిపారు. అయితే కలుకు కూడా యోగి అంటే చాలా ఇష్టమని, ఆయనను చూడగానే ఆనందంతో యోగిపైకి ఎగురుతూ ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలో సోమవారం సీఎం యోగి అదిత్యనాథ్ గోరఖ్‌పూర్ వెళ్లి ‘కాలూ’ను కలిసి దానికి పన్నీరు తీనిపిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అనంతరం దీనిపై తివారి మీడియాతో మాట్లాడుతూ ‘ఈ బ్లాక్ లాబ్రాడర్‌ను 2016 డిసెంబర్లో గోరఖ్‌పూర్ ఆలయానికి తీసుకువచ్చాం. అదే సమయంలో సీఎం యోగి పెంపుడు కుక్క రాజాబాబు చనిపోవడంతో ఆయన చాలా బాధపడ్డారు. దీంతో ఆలయ భక్తులు యోగికి ఈ కుక్కను బహుమతిగా ఇచ్చారు. అది వచ్చిన మూడు నెలకు 2017 మార్చిలో యోగి అదిత్యానాథ్ సీఎం అయ్యారు. ఇక అప్పటి నుంచి ఆలయ భక్తులు ‘కాలూ’ను సీఎం యోగికి లక్కీ అని అభిప్రాయపడుతుంటారు. అయితే ఈ కుక్క శాఖాహారి అని, గుడిలోని పాలు, రోటి మాత్రమే తింటుందని చెప్పారు. అలాగే ఇది అనారోగ్య బారిన పడకుండ ప్రత్యేకంగా వసతులు కూడా ఏర్పాటు చేశామని తివారి తెలిపారు. -
కోడిగుడ్లు కోసం గొడవ.. ప్రియుడితో వివాహిత పరార్
లక్నో : తినడానికి కోడిగుడ్లు తేవటంలేదన్న కోపంతో ఓ భార్య, భర్తను విడిచి ప్రియుడితో పారిపోయింది. ఈ వింత సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. వివరాల మేరకు.. గోరఖ్‌పూర్ జిల్లాలోని కంపేర్‌గంజ్‌కు చెందిన ఓ మహిళ ప్రతిరోజూ తినడానికి గుడ్లు తేవాలని భర్తతో గొడవపడేది. దినసరి కూలీ అయిన సదరు భర్త ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఇందుకు నిరాకరించేవాడు. దీంతో శనివారం మహిళ భర్తతో గొడవపడి ప్రియుడితో ఇంట్లోంచి పారిపోయింది. ఈ విషయంపై మహిళ భర్త మీడియాతో మాట్లాడుతూ.. ‘నేనో దినసరి కూలీని. నా ఆదాయంతో ప్రతి రోజూ కుటుంబానికి గుడ్లు తెచ్చిపెట్టే పరిస్థితి లేదు. ఈ బలహీనతను అలుసుగా తీసుకుని నా భార్య రోజూ గుడ్లు కావాలని గొడవపెట్టుకునేది. ఆమె ప్రియుడు ప్రతి రోజూ గుడ్లు తెచ్చి ఇచ్చేవాడు. అందుకే అతడితో పరారయింద’ని తెలిపాడు. -
పాడైన బోగీలతో.. కానిచ్చేశారు..!
ముంబై: రైళ్ల రాకపోకల సమయాల్లో, నిర్ణయాల్లో జాప్యం చేసే రైల్వే శాఖ శుక్రవారం రాష్ట్ర మంత్రి చొరవతో అరకొర వసతులున్న రైలును ఎనిమిది గంటల్లోనే ముంబై నుంచి ఉత్తరప్రదేశ్, బీహార్ల మీదుగా వెళ్లే విధంగా ప్రత్యేక సర్వీసును ఏర్పాటు చేసింది. వివాహాల సీజన్ కావడంతో రైళ్లలో ఖాళీలు లేక ఉత్తర భారతదేశానికి చెందిన ఎక్కువ మంది ప్రజలు ముంబై స్టేషన్లోనే పడుకుంటున్నారంటూ బీజేపీ కార్యకర్తలు అందించిన సమాచారంతో కదిలిన మహారాష్ట్ర రైల్వే శాఖ మంత్రి మనోజ్ సిన్హా వెంటనే ప్రత్యేక సర్వీసులను నడపాలని సెంట్రల్ రైల్వే అధికారులను ఆదేశించారు. దీంతో కదిలిన రైల్వే శాఖ ఆదేశాలు అందిన రెండు గంటలలోపే వాడుకలో లేని కోచ్‌లను త్వరగా రప్పించి శుక్రవారం రాత్రి 11.30 నిమిషాలకు ప్రత్యేక రైలును గోరఖ్‌పూర్ వరకు నడపాలని నిర్ణయించారు. ఇందుకోసం సీఎస్టీ, వాడి బన్డర్, మజ్గావ్, దాదర్ రైల్వే యార్డుల నుంచి రెండు చొప్పునా, బైకుల్లా యార్డు నుంచి నాలుగు వాడుకలో లేని, పూర్తిగా పాడై ఉన్న కోచ్‌లను ఎంపిక చేశారు. వీటిని రిపేర్ చేయడం, శుభ్ర పరచడం కోసం 25 మంది రైల్వే సిబ్బంది కేటాయించారు. శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో రిపేర్ చేసిన 12 కోచ్‌లు ముంబై స్టేషన్‌కు చేరుకున్నపుడు పరిశీలిస్తే బోగీలన్నీ అపరిశుభ్రంగా ఉండటంతో పాటు ఫ్యాన్లు కూడా సరిగా పనిచేయడం లేదు. రద్దీ ఎక్కువగా ఉండటంతో ముంబై నుంచి గోరఖ్‌పూర్, వారణాసి, పాట్నాలకు 84 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు సెంట్రల్ రైల్వే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ నరేంద్రపాటిల్ తెలిపారు.