లక్నో : ప్రముఖ నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 స్థానాల్ని కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తాను రెండోసారి ఎంపీగా పోటీ చేస్తున్న లోక్‌సభ స్థానం గోరఖ్‌పూర్ చరిత్ర సృష్టిస్తుందని అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచుతోంది. రికార్డ్ స్థాయిలో 195 మందితో తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. వారిలో ప్రముఖ నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ ఒకరు.
2019 నుంచి ఉత్తర్‌ప్రదేశ్ గోరఖ్‌పూర్ ఎంపీగా రవికిషన్ కొనసాగుతున్నారు. అయితే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రెండోసారి పోటీ చేసేందుకు బీజేపీ అధిష్టానం ఆయనకు మరోసారి అవకాశం ఇచ్చింది.
#WATCH | Gorakhpur: BJP leader Ravi Kishan says, "I want to thank the top leadership wholeheartedly... The organization gave me a second chance from the hottest seat after Kashi. I would like to express my heartfelt gratitude to the entire organization and Prime Minister Modi. I… https://t.co/SFXrQnf6Zi pic.twitter.com/ewqZS5olQN
— ANI (@ANI) March 2, 2024
బీజేపీకి 400 సీట్లు పక్కా
ఈ సందర్భంగా ‘కాశీ తర్వాత అత్యంత హాటెస్ట్ సీటు గోరఖ్‌పూర్. ఇక్కడి నుంచే పోటీ చేసేందుకు బీజేపీ పెద్దలు నాకు రెండోసారి అవకాశం కల్పించారు. పార్టీకి, ప్రధాని నరేంద్ర మోదీకి నా కృతజ్ఞతలు. నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటా. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలుస్తుంది. గోరఖ్‌పూర్ సీటు చరిత్ర సృష్టిస్తుంది’ అని బీజేపీ ఎంపీ రవి కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సీఎం యోగి కంచుకోట
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు గోరఖ్‌పూర్ కంచుకోట. గోరఖ్‌పూర్ లోక్ సభ స్థానం నుంచి యోగి ఆదిత్యనాథ్ వరుసగా ఐదు పర్యాయాలు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం 1998లో ప్రారంభమై 2017లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే వరకు కొనసాగింది. ఇక్కడి నుంచి నటుడు రవి కిషన్ రెండో సారి బరిలోకి దిగనున్నారు. కాగా తొలిసారి ఇదే స్థానం నుంచి ఎంపీగా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బరిలోకి దిగిన రవికిషన్ సమాజ్‌వాద్ పార్టీ అభ్యర్థి రాంభూల్ నిషాద్‌పై 3 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment