Ravi Kishan
-
చీర కట్టి, గాజులు వేసుకుని సీతలా నటించా.. నాన్న తోలు తీశాడు: నటుడు
పిల్లలు బాగా చదువుకుని గొప్ప ఉద్యోగం చేయాలని పేరెంట్స్ కలలు కంటుంటారు. తాము పడ్డ కష్టాలు వారు పడకూడదని ఆలోచిస్తారు. అయితే ఉద్యోగం చేయడం అందరికీ ఇష్టం ఉండదు. కొందరికి తెలియకుండానే నటనవైపు మనసు మళ్లుతుంది. అలా నటుడు, రాజకీయ నాయకుడు రవి కిషన్ కూడా చిన్నతనంలోనే యాక్టింగ్‌పై మనసు పారేసుకున్నాడు. కానీ ఇది అతడి తండ్రికి ఏమాత్రం ఇష్టం లేదు. ఒకసారైతే అతడిని విపరీతంగా కొట్టి చర్మం ఒలిచేశాడు.చర్మం ఊడిపోయేలా కొట్టాడుఈ సంఘటన గురించి రవి కిషన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మా ఊరిలో రామ్‌లీలా అనే నాటకం వేసేవారు. నేను అందులో సీతలా నటించేవాడిని. ఒకరోజు మా నాన్నకు ఆ విషయం తెలిసింది. అప్పుడు నేను మా అమ్మ చీర తీసుకెళ్లి దానితో రోజంతా రిహార్సల్ చేశాను. ఇంటికి వెళ్లగానే మా నాన్న బెల్ట్ అందుకుని వాయించాడు. నా చర్మం ఊడిపోయేలా కొట్టాడు. మా ఊరిలో నాన్నకు మంచి పేరుంది. తనకు అందరూ ఎంతో గౌరవించేవారు. బహుశా అందుకునేమో నేనిలా అమ్మాయిలా వేషం కట్టి యాక్ట్ చేస్తుంటే భరించలేకపోయారు.ఆ రోజే ఇంటి నుంచి పారిపోయాఅయితే ఆ కోపంతో నాన్న నన్నెక్కడ చంపేస్తాడోనని అమ్మ భయపడింది. అదే రోజు రాత్రి నా చేతిలో రూ.500 పెట్టి పారిపోమని చెప్పింది. అలా 15 ఏళ్ల వయసులో నేను ఇంటి నుంచి పారిపోయి ముంబైకు వచ్చాను అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే రవికిషన్ హిందీ, భోజ్‌పురి, తెలుగు భాషల్లో అనేక చిత్రాల్లో నటించాడు. రేసుగుర్రం మూవీతో తెలుగువారికి ఎంతగానో దగ్గరైన ఈయన ప్రస్తుతం డాకు మహారాజ్ మూవీ చేస్తున్నాడు.చదవండి: ఈ ఏడాదిలో 'జాతర' చూపించిన స్టార్స్ -
వీళ్లు ఇండస్ట్రీ పరువు తీస్తున్నారు: 'రేసుగుర్రం' విలన్
'రేసుగుర్రం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు రవికిషన్. స్వతహాగా ఇతడికి బిహార్. భోజ్‌పురి భాషలో బోలెడన్ని సినిమాలు చేశాడు. ప్రస్తుతం రాజకీయాల్లో ఉండటం వల్ల నటన తగ్గించేశాడు. రీసెంట్గా ఢిల్లీలోని సాహిత్య ఆజ్‌తక్ కార్యక్రమంలో పాల్గొన్న ఇతడు.. తన జూనియర్లు భోజ్‌పురి ఇండస్ట్రీ పరువు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.(ఇదీ చదవండి: 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న నటుడు సుబ్బరాజ్)'ఇప్పుడొస్తున్న చాలామంది నటీనటులు భోజ్‌పురి చిత్రపరిశ్రమ ఖ్యాతి నాశనం చేస్తున్నారు. నేను భోజ్‌పురి ఇండస్ట్రీలో మూడో జనరేషన్లో వచ్చాను. నా తర్వాత వచ్చేవాళ్ల కోసం అన్ని ఏర్పాటు చేశాం. కానీ వాళ్లీ దీన్ని సరిగా ఉపయోగించుకోలేకపోతున్నారు. చెప్పాలంటే ఇండస్ట్రీ పరువు తీస్తున్నారు. భోజ్‌పురి 25 కోట్లమంది మాట్లాడే భాష. ఇందుకు నేను చాలా గర్వపడుతున్నాను''భోజ్‌పురి ఇండస్ట్రీ.. చాలామందికి జాబ్స్ కల్పిస్తోంది. అయినాసరే చిన్నచూపు చూస్తున్నారు. ఈ రోజు ఇండస్ట్రీలో లక్ష మందికి పైగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు' అని రవికిషన్ తన ఆవేదన వ్యక్తం చేశారు. 2002లో భోజ్‌పురి నటుడిగా ఈయన కెరీర్ ప్రారంభించాడు. తెలుగులోనూ రేసుగుర్రం, సుప్రీం, సైరా తదితర సినిమాలలో నటించారు. (ఇదీ చదవండి: 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) -
చిన్నగదిలో బతికా.. నాన్న కూడా అవమానించారు: రేసుగుర్రం నటుడు
తెలుగు ప్రేక్షకులకు మద్దాలి శివారెడ్డిగా పరిచయమైన నటుడు రవికిషన్. అల్లు అర్జున్ మూవీ రేసుగుర్రంతో టాలీవుడ్ ప్రియులను అలరించాడు. తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఈ ఏడాది అమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు తెరకెక్కించిన లపట్టా లేడీస్ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఈ మూవీ పోలీసు అధికారి పాత్రలో నటించారు.ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన రవికిషన్ తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన చిన్నతనంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. దాదాపు 34 ఏళ్లపాటు పోరాటం చేశానని వెల్లడించారు. ఇప్పుడు మీరు చూస్తున్న రవికిషన్ వెనుక ఎంతో కృషి దాగి ఉందని వివరించారు.రవికిషన్ మాట్లాడుతూ.. 'నేను పూజారి కొడుకుని. నాకు మా నాన్న ఆధ్యాత్మికత, నిజాయితీ గురించి మాత్రమే నేర్పారు. నేను థియేటర్లో ఉండేవాడిని. నా చిన్నతనంలోనే రామ్ లీలాలో సీత పాత్రలో నటించా. దీంతో నాన్న నన్ను కొట్టారు. ఆ తర్వాత కోపంతో నువ్వు నర్తకి అవుతావని ఎగతాళి చేశారు. కానీ సినిమాల్లోకి రావడానికి చాలా ఇబ్బందులు పడ్డా. ముంబయిలో చెప్పుల్లేకుండా నడిచా. చిన్నరూమ్‌లో ఉండేవాడిని. నాకు గాడ్‌ఫాదర్ ఎవరూ లేరు. కానీ నా జీవితంలో మంచి రోజులు వస్తాయని మాత్రం తెలుసు' అని అన్నారు.తాను తెలుగు, హిందీ సినిమాల్లో అవకాశాలు వచ్చాయని రవికిషన్ తెలిపారు. అలాగే మీరు నన్ను బుల్లితెరపై కూడా చూస్తారని అన్నారు. నటనలో సహజత్వాన్ని తీసుకురావాలని ఎప్పుడూ కోరుకుంటానని పేర్కొన్నారు. అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ 90వ దశకంలో వచ్చారని.. నా ప్రయాణం మొదలైంది కూడా అప్పుడేనని వెల్లడించారు. కానీ వారి జీవితాల్లో త్వరగా ఎదిగారని.. వారిలా ఉన్నతస్థాయికి చేరుకునేందుకు కృషి చేస్తున్నట్లు రవికిషన్ తెలిపారు. కాగా.. ఆయన నటించిన లపట్టా లేడీస్ ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్స్‌లో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. -
పేరు వినగానే బిత్తరపోయిన యాంకర్
-
Lok Sabha Election 2024: గోరఖ్‌పూర్‌లో స్టార్ వార్!
ఉత్తరప్రదేశ్‌లో శనివారం పోలింగ్ జరగనున్న స్థానాల్లో గోరఖ్‌పూర్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. బీజేపీ అభ్యరి్థ, సిట్టింగ్ ఎంపీ రవికిషన్ శుక్లా, ఇండియా కూటమి తరఫున బరిలో ఉన్న ఎస్పీ అభ్యర్థి కాజల్ నిషాద్ ఇద్దరూ భోజ్‌పురి స్టార్లే కావడం అందుకు కారణం... రవికిషన్‌కు పీఠం మద్దతు... భోజ్‌పురి సినిమాల్లో సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న రవి కిషన్ అసలు పేరు రవీంద్ర శుక్లా. కాంగ్రెస్ సభ్యునిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో జౌన్పూర్ నుంచి పోటీ చేసి ఓడారు. 2017లో బీజేపీలో చేరారు. 2019లో 3 లక్షల పైచిలుకు మెజారిటీతో గెలిచారు. కానీ ఈ ఐదేళ్లలో నియోజకవర్గంలో కనిపించనే లేదనే విమర్శలున్నాయి. ప్రతిపక్షాలు ఆయనను ‘బయటి వ్యక్తి’గా అభివర్ణిస్తున్నాయి. దాంతో పీఎం మోదీ, సీఎం యోగి చరిష్మానే నమ్ముకున్నారు. గోరఖ్‌పూర్‌లో తనకు ఇల్లుందని, ఇక్కడే ఉంటున్నానని చెప్పుకొస్తున్నారు. యువకులతో కుస్తీ పడుతూ, స్థానికులతో సెల్ఫీలు దిగుతూ ప్రచారం జోరుగా చేశారు. రవి కిషన్‌కు గోరక్షనాథ్ పీఠం మద్దతు కూడా ఉంది. నిషాద్ ఓట్లను నమ్ముకున్న కాజల్ భోజ్‌పురి నటి, ఎస్పీ అభ్యర్థి కాజల్ నిషాద్కు ఇది నాలుగో ఎన్నిక. రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్‌పూర్ రూరల్ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై, కాంపియర్గంజ్ నుంచి ఎస్పీ తరఫున పోటీ చేసి ఓడారు. మేయర్ ఎన్నికల్లోనూ ఓటమి చవి చూశారు. రాజకీయాల్లో చురుకుగా ఉండే ఆమెకు ఈసారి గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. తన సామాజికవర్గమైన నిషాద్ ఓట్లనే నమ్ముకున్నారు. అయితే 2019 మాదిరిగా ఈసారి కూడా ఎస్పీ ఓట్లను బీఎస్పీ గట్టిగానే చీల్చేలా కని్పస్తోంది. 1990ల నుంచి బీజేపీ హవా.. గోరఖ్‌పూర్ స్థానంలో 1984 దాకా కాంగ్రెస్‌దే హవా. రామమందిర ఉద్యమ నేపథ్యంలో 1989 నుంచీ గోరక్షనాథ్ పీఠం ఆధిపత్యం మొదలైంది. అప్పటినుంచి 1996 దాకా వరుసగా మూడుసార్లు గోరక్షనాథ్ పీఠాధిపతి మహంత్ అవైద్యనాథ్ ఇక్కడినుంచి గెలిచారు. 1998 నుంచి 2014 దాకా ఐదుసార్లు ప్రస్తుత పీఠాధిపతి యోగి గెలిచారు. సీఎం అయ్యాక ఆయన రాజీనామాతో 2018లో జరిగిన ఉప ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్యరి్థగా ఎస్పీ నేత ప్రవీణ్ నిషాద్ బీజేపీ అభ్యర్థి ఉపేంద్ర శుక్లాను ఓడించారు. కానీ ఈ ఆధిపత్యాన్ని ఎస్పీ నిలబెట్టుకోలేకపోయింది. కుల సమీకరణాలదే కీలకపాత్ర..గోరఖ్‌పూర్‌లో అగ్రవర్ణ ఓట్లు 6 లక్షలున్నాయి. 9 లక్షల ఓబీసీ, 4 లక్షల నిషాద్, 2 లక్షలకు పైగా యాదవ ఓట్లున్నాయి. 2.5 లక్షల దళిత ఓట్లు, 2 లక్షల ముస్లిం ఓట్లూ తనకేనని కాజల్ చెబుతున్నారు. నిషాద్లూ తన వెంటే ఉన్నారంటున్నారు. బీజేపీ కూడా నిషాద్‌ల ఓట్ల కోసం ముమ్మర ప్రయత్నాలు చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రవి కిషన్‌కు ఊరట.. ఆ పరీక్షకు కోర్టు నిరాకరణ
లోక్ సభ ఎన్నికల సమయంలో నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్‌కు కాస్త ఊరట లభించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికల బరిలో ఉన్నారు. ఇలాంటి సమయంలో రవికిషన్ తన అండ్రి అంటూ జూనియర్ నటి షినోవా సోనీ తెరపైకి వచ్చింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె ముంమై కోర్టును ఆశ్రయించింది.భోజ్ పురి, హిందీ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న రవికిషన్.. అల్లు అర్జున్ 'రేసుగుర్రం' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2019లో గోరఖ్ పుర్ నుంచి ఎంపీగా గెలిచిన ఆయన మరొసారి ఎన్నికల బరిలో ఉన్నాడు. సరిగ్గా ఇలాంటి సమయంలో రవి కిషన్ తన భర్త అంటూ కొద్ది రోజుల క్రితం షినోవా సోనీ తల్లి అపర్ణా సోనీ విలేకరుల సమావేశంలో ప్రకటించింది. (రవి కిషన్ సతీమణి ప్రీతి)రవికిషన్ నుంచి సరైన రెస్పాన్స్ రాకపోవడంతో షినోవా సోనీ తన తల్లితో కోర్టుకు వెళ్లింది. డీఎన్ఏ పరీక్ష చేయాలని తన లాయర్ ద్వారా పిటీషన్ దాఖలు చేసింది. రవికిషన్ను తాను అంకులు అని పిలుస్తాను. కానీ, ఆయన తనకు తండ్రి అని ఆమె చెప్పింది. ఆమె మాటల్లో నిజం లేదని రవికిషన్ లాయర్ చెప్పారు. అపర్ణతో రవికిషన్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. వారిద్దరి మంచి స్నేహ బంధం మాత్రమే ఉందని పేర్కొన్నారు. ఎలాంటి రిలేషన్ కూడా లేదన్నారు. అపర్ణ, రవికిషన్ రిలేషన్లో ఉన్నారని చెప్పేందుకు కనీసం ఒక్క ఆధారం అయినా చూపించకపోవడంతో డీఎన్ఏ పరీక్షను కోర్టు తిరస్కరించింది. గతంలో తమకు రూ.20 కోట్లు ఇవ్వాలని బెదిరించినట్లు రవికిషన్ సతీమణి తెలిపారు. ఒకవేళ డబ్బు ఇవ్వకుంటే అత్యాచారం కేసులో రవికిషన్ను ఇరికిస్తామంటూ షినోవా సోనీ, అపర్ణ బెదిరించారని ఆమె తెలిపింది. -
'రేసుగుర్రం విలన్' మా నాన్నే.. ట్రెండింగ్‌లో నటి (ఫోటోలు)
-
నటుడి ఇంట సవతి పోరు? కోపంతో భార్య ఏం చేసిందంటే..
లక్నో: లోక్‌సభ ఎన్నికలకు ముందే నటుడు, బీజేపీ గోరఖ్‌పూర్ ఎంపీ 'రవి కిషన్ శుక్లా' తన కుమార్తెకు తండ్రి ఓ మహిళా మీడియా ముందుకొచ్చి చెప్పింది. తన కుమార్తెను ఆయన స్వీకరించాలని పేర్కొంది. ఈ వ్యాఖ్యలు చేసిన మహిళతో పాటు మరో ఆరుగురిపైన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం. రవికిషన్ భార్య ప్రీతి శుక్లా ఫిర్యాదు మేరకు హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్లో మంగళవారం అర్థరాత్రి ఎఫ్ఐఆర్ నమోదైంది. మహిళతో పాటు అపర్ణా ఠాకూర్, ఆమె భర్త రాజేష్ సోనీ, కూతురు షెనోవా సోనీ, కొడుకు సోనాక్ సోనీ, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు వివేక్ కుమార్ పాండే, జర్నలిస్టు ఖుర్షీద్ ఖాన్ పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అపర్ణ సోనీ అలియాస్ అపర్ణా ఠాకూర్ తనకు అండర్ వరల్డ్‌తో సంబంధాలు ఉన్నాయని బెదిరించినట్లు కూడా బీజేపీ ఎంపీ భార్య ఆరోపించింది. ఆమె రూ. 20 కోట్ల డబ్బు ఇవ్వాలని రవి కిషన్ భార్య ప్రీతి శుక్లా పేర్కొంది. ఆమె అడిగిన డబ్బు తనకు ఇవ్వకపోతే.. రవి కిషన్‌ను అత్యాచారం కేసులో ఇరికించి అతని ప్రతిష్టను దిగజార్చేస్తానని బెదిరించినట్లు పోలీసులకు తెలిపారు. -
'రేసుగుర్రం' విలన్ సీక్రెట్ ఫ్యామిలీ.. ఎన్నికల టైంలో ఇరికించేశారు!
లోక్ సభ ఎన్నికల ముందు నటుడు-భాజాపా ఎంపీ రవికిషన్ చిక్కుల్లో పడ్డాడు. తను ఆయన భార్యనే అంటూ ఓ మహిళ మీడియా ముందుకొచ్చింది. తన కూతుర్ని ఆయన స్వీకరించాలని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పుడు ఈ విషయం సినీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. ఇప్పటికీ ప్రీతి కిషన్ అనే మహిళని పెళ్లి చేసుకున్న రవికిషన్ కి రివా కిషన్ అనే కూతురు ఉంది. భోజ్ పురి, హిందీ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న రవికిషన్.. అల్లు అర్జున్ 'రేసుగుర్రం' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో నటించాడు. 2019లో ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పుర్ నుంచి ఎంపీగా గెలిచాడు. త్వరలో మరోసారి పోటీ చేయబోతున్నాడు. (ఇదీ చదవండి: రహస్యంగా పెళ్లి చేసుకున్న 'టెంపర్' నటి) సరిగ్గా ఇలాంటి సమయంలో అపర్ణా ఠాకుర్ అనే మహిళ.. తన ఆయన భార్యనే అంటూ మీడియా ముందుకొచ్చింది. 1996లోనే తమకు పెళ్లి జరిగిందని, పాప కూడా పుట్టిందని ఆమెని తీసుకొచ్చింది. పాత ఫొటోల్ని కూడా మీడియాకు రిలీజ్ చేసింది. తమతో రవికిషన్ ఇప్పటికీ టచ్ లో ఉన్నారని, కానీ బహిరంగంగా మాత్రం ఒప్పుకోవడం లేదని ఈమె ఆరోపణలు చేసింది. దీంతో రవికిషన్ రాజకీయ కెరీర్ చిక్కుల్లో పడేలా కనిపిస్తోంది. 'రవికిషన్ నా తండ్రి అని.. నాకు 15 ఏళ్లు వచ్చిన తర్వాతే తెలిసింది. అంతకు ముందు ఆయన్ని అంకుల్ అని పిలిచేదాన్ని. నా ప్రతి పుట్టినరోజుకి మా ఇంటికి వచ్చేవారు. ఆయన కుటుంబాన్ని కూడా నేను ఓసారి కలిశాను. తండ్రిగా చూస్తే మాత్రం ఎప్పుడు నా దగ్గర లేరు. నన్ను కూతురిగా స్వీకరించాలని ఆయన్ని కోరుతున్నా. అందుకే కోర్టులో కేసు వేద్దామని అనుకుంటున్నాం' అని అపర్ణ ఠాకుర్ కూతురు చెప్పుకొచ్చింది. అయితే ఈ మొత్తం విషయమై రవికిషన్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: డైరెక్టర్ శంకర్ కూతురికి రెండో పెళ్లి.. కుర్రాడు ఎవరంటే?) Video interview of Shenova who claims to be Ravi Kishan's daughter. pic.twitter.com/bdOGS0dvrA — Mohammed Zubair (@zoo_bear) April 15, 2024 Aparna Thakur claims that BJP MP Ravi Kishan is father of her daughter Shenova. She along with her daughter held a press conference in Lucknow claiming that she would approach Court to get her daughter's legal rights if he doesn't accept Shenova as his daughter. They also want to… pic.twitter.com/bdvImCl0Bl — Mohammed Zubair (@zoo_bear) April 15, 2024 -
నా తండ్రే నన్ను మట్టుబెట్టాలని చూశాడు: రేసుగుర్రం విలన్
ప్రముఖ నటుడు రవికిషన్ తెలుగు, భోజ్‌పురి, హిందీ భాషల్లో అనేక సినిమాలు చేశాడు. కానీ తెలుగువారికి మాత్రం ఇతడు రేసుగుర్రం విలన్ మద్దాలి శివారెడ్డిగానే గుర్తుండిపోయాడు. సినిమాలతో కావాల్సినంత గుర్తింపు తెచ్చుకున్న ఇతడు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ ఎంపీగా సేవలందిస్తున్నాడు. రాజకీయాల్లో ఉన్నప్పటికీ సినిమాలకు దూరం కాలేదు. ఇటీవలే లాపట్ట లేడీస్ అనే సినిమాలో కనిపించాడు. నాన్నకు కోపం ఎక్కువ తాజాగా అతడు తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. 'మా నాన్నకు కోపం చాలా ఎక్కువ. నన్ను చితక్కొట్టేవాడు.. సింపుల్‌గా చెప్పాలంటే చంపేందుకు కూడా వెనుకాడలేదు. అలా ఓ రోజు నన్ను చంపాలన్న కోపంతో కనిపించాడు. అది గమనించిన అమ్మ నన్ను పారిపోమని చెప్పింది. వెంటనే ఆలస్యం చేయకుండా రూ.500 జేబులో పెట్టుకుని ఇంట్లో నుంచి పారిపోయి ముంబై ట్రైన్ ఎక్కాను. నటుడినవుతానంటే.. నాన్న కోపం వెనక అర్థం ఉంది. ఆయనొక పూజారి. ఒక బ్రాహ్మణుడిగా తన కొడుకు కూడా పూజారే కావాలని ఆశపడ్డాడు. లేదంటే వ్యవసాయం చేయాలి, అదీ లేదంటే ప్రభుత్వ ఉద్యోగిగానైనా స్థిరపడాలని ఆశించాడు. తన కుటుంబంలో ఒక ఆర్టిస్టు పుడతాడని అస్సలు ఊహించలేదు. ఒకసారి నేను సీతలా వేషం వేసుకుని నటిస్తూ, డ్యాన్స్ చేస్తూ ఉంటే షాకైపోయాడు. అయితే అతడి దెబ్బల వల్లే నాకు జీవితమంటే ఏంటో తెలుసొచ్చింది. ప్రతి దండన ఒక పాఠమే అనుకున్నాను. తన వల్లే ఈ రోజు రవికిషన్గా మీ ముందు నిలబడ్డాను. చివరి క్షణాల్లో.. నేను నటుడిగా స్థిరపడ్డాక నా ఎదుగుదల చూసి ఆయన ఎంతో సంతోషించాడు. ఆయన చావుకు దగ్గరైనప్పుడు కూడా నన్ను చూసి గర్వంగా ఉందని చెప్పి కన్నుమూశాడు' అని ఎమోషనలయ్యాడు. కాగా రవికిషన్ ప్రస్తుతం 'మామ్లా లీగల్ హై' అనే వెబ్ సిరీస్‌లో నటించాడు. ఈ సిరీస్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండ్ అవుతోంది. చదవండి: ఆమెతో కితకితలకు ప్రయత్నించా..వర్కౌట్ కాలేదు: హీరో -
‘ఎంపీ రవి కిషన్ భూమిని కబ్జా చేశారు’ : సీఎం యోగి ఆదిత్యనాథ్
ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ నవ్వులు పూయించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో యూపీ పార్లమెంట్ స్థానం గోరఖ్‌పూర్‌లోని రామ్‌ఘర్ తాల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం యోగి శంకుస్థాపన చేశారు. అనంతరం యోగి తన ప్రసంగంతో సభికులతో పాటు ప్రజల్ని నవ్వులు పూయించారు. ఈ కార్యక్రమంలో సీఎం యోగితో పాటు సభపై ప్రముఖ నటుడు, బీజేపీ ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్‌పూర్ ఎంపీ రవికిషన్ ఉన్నారు. రవికిషన్ను ఉద్దేశిస్తూ సీఎం మాట్లాడారు. బంగ్లా కబ్జా చేశారంటూ.. భళ్లున నవ్విన ‘ఇంతకుముందు ఓ వీఐపీ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు భోజ్‌పురి స్టార్ రవికిషన్ ఆ ప్రాంతానికి సమీపంలోని ఓ బంగ్లాను కబ్జా చేశార'ని భళ్లున నవ్వారు. వెంటనే లేదు.. లేదు.. రవికిషన్ ఆ ఇంటి లాక్కోలేదు. డబ్బుతో కొన్నారు’ అంటూ ప్రసంగాన్ని కొనసాగించారు. అభివృద్దికి కేరాఫ్ అడ్రస్ ఏడేళ్ల క్రితం రామ్‌గఢ్ తాల్ దగ్గరకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడేవారు. కానీ ఇప్పుడు వాతావరణం మారిపోయింది. ఇప్పుడు అక్కడ సినిమా షూటింగ్‌లు జరుగుతున్నాయి. సెల్ఫీలు దిగుతున్నారు. రవికిషన్ (ఎంపీ సీటును) మళ్లీ తన స్థానాన్ని దక్కించుకున్నారు. ఇప్పుడు నగరం మొత్తం కెమెరా నిఘాలో ఉంది. రవికిషన్ సినిమా షూటింగ్ కోసం హడావుడిగా వెళ్లి సిగ్నల్ బ్రేక్ చేస్తే వెంటనే అతని మొబైల్‌కి చలాన్ వెళ్తుందని, అంతలా అభివృద్ది జరిగిందని స్పష్టం చేశారు. #WATCH | Gorakhpur: BJP leader Ravi Kishan says, "I want to thank the top leadership wholeheartedly... The organization gave me a second chance from the hottest seat after Kashi. I would like to express my heartfelt gratitude to the entire organization and Prime Minister Modi. I… https://t.co/SFXrQnf6Zi pic.twitter.com/ewqZS5olQN — ANI (@ANI) March 2, 2024 గోరఖ్‌పూర్ సీటు గెలుస్తా.. చరిత్ర సృష్టిస్తా ఈ నెల ప్రారంభంలో బీజేపీ రికార్డ్ స్థాయిలో 195 మందితో తొలి విడత పార్లమెంట్ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. కమలం ప్రకటించిన జాబితాలో గోరఖ్‌పూర్ ఎంపీ రవికిషన్ రెండోసారి పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ‘కాశీ తర్వాత అత్యంత హాటెస్ట్ సీటు గోరఖ్‌పూర్. ఇక్కడి నుంచే పోటీ చేసేందుకు బీజేపీ పెద్దలు నాకు రెండోసారి అవకాశం కల్పించారు. పార్టీకి, ప్రధాని నరేంద్ర మోదీకి నా కృతజ్ఞతలు. నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటా. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలుస్తుంది. గోరఖ్‌పూర్ సీటు చరిత్ర సృష్టిస్తుంది’ అని బీజేపీ ఎంపీ రవి కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
‘400 లోక్‌సభ స్థానాల్లో గెలుపు మాదే’.. బీజేపీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు
లక్నో : ప్రముఖ నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 స్థానాల్ని కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తాను రెండోసారి ఎంపీగా పోటీ చేస్తున్న లోక్‌సభ స్థానం గోరఖ్‌పూర్ చరిత్ర సృష్టిస్తుందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచుతోంది. రికార్డ్ స్థాయిలో 195 మందితో తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. వారిలో ప్రముఖ నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ ఒకరు. 2019 నుంచి ఉత్తర్‌ప్రదేశ్ గోరఖ్‌పూర్ ఎంపీగా రవికిషన్ కొనసాగుతున్నారు. అయితే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రెండోసారి పోటీ చేసేందుకు బీజేపీ అధిష్టానం ఆయనకు మరోసారి అవకాశం ఇచ్చింది. #WATCH | Gorakhpur: BJP leader Ravi Kishan says, "I want to thank the top leadership wholeheartedly... The organization gave me a second chance from the hottest seat after Kashi. I would like to express my heartfelt gratitude to the entire organization and Prime Minister Modi. I… https://t.co/SFXrQnf6Zi pic.twitter.com/ewqZS5olQN — ANI (@ANI) March 2, 2024 బీజేపీకి 400 సీట్లు పక్కా ఈ సందర్భంగా ‘కాశీ తర్వాత అత్యంత హాటెస్ట్ సీటు గోరఖ్‌పూర్. ఇక్కడి నుంచే పోటీ చేసేందుకు బీజేపీ పెద్దలు నాకు రెండోసారి అవకాశం కల్పించారు. పార్టీకి, ప్రధాని నరేంద్ర మోదీకి నా కృతజ్ఞతలు. నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటా. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలుస్తుంది. గోరఖ్‌పూర్ సీటు చరిత్ర సృష్టిస్తుంది’ అని బీజేపీ ఎంపీ రవి కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం యోగి కంచుకోట ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు గోరఖ్‌పూర్ కంచుకోట. గోరఖ్‌పూర్ లోక్ సభ స్థానం నుంచి యోగి ఆదిత్యనాథ్ వరుసగా ఐదు పర్యాయాలు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం 1998లో ప్రారంభమై 2017లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే వరకు కొనసాగింది. ఇక్కడి నుంచి నటుడు రవి కిషన్ రెండో సారి బరిలోకి దిగనున్నారు. కాగా తొలిసారి ఇదే స్థానం నుంచి ఎంపీగా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బరిలోకి దిగిన రవికిషన్ సమాజ్‌వాద్ పార్టీ అభ్యర్థి రాంభూల్ నిషాద్పై 3 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. -
అశ్లీలత, వల్గర్ డైలాగ్స్ మానేయాలి.. తెలుగు సినిమా..: రవికిషన్
రవికిషన్.. రేసుగుర్రం విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. ఈయన ఎక్కువగా భోజ్‌పురి, హిందీ సినిమాలు చేశాడు. అయితే భోజ్‌పురి అనగానే చాలామంది అశ్లీలతే గుర్తొస్తుంది. అక్కడ సరైన సినిమాలే ఉండవని భావిస్తుంటారు. ఈ పరిస్థితులు మారాల్సిన అవసరం ఉందంటున్నాడు రవికిషన్. 'భోజ్‌పురి ఇండస్ట్రీ ముఖచిత్రాన్ని మార్చేందుకు ప్రయత్నించాను. భోజ్‌పురి సినిమాకుగానూ జాతీయ అవార్డు అందుకున్న వ్యక్తిగా ఆ మార్పు కోసం పూనుకున్నాను. కానీ ఇక్కడ రిలీజయ్యే ఆల్బమ్ సాంగ్స్, ప్రైవేట్ సాంగ్స్ ఇండస్ట్రీ గౌరవాన్ని దెబ్బతీస్తున్నాయి. చీప్ డైలాగ్స్, బోల్డ్ సీన్స్.. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత దాని గురించి పట్టించుకోలేకపోయాను. ఇప్పుడు భోజ్‌పురిలో మహదేవ్ కా గోరఖ్‌పూర్ సినిమా చేస్తున్నాను. ఇది పాన్ ఇండియా చిత్రంగా రానుంది. ఈ సినిమాతో అందరి ఆలోచనలు మారిపోతాయి. నా జూనియర్లు కూడా కొత్త సినిమాలు తీసేందుకు ముందుకు వస్తారు. చీప్ సన్నివేశాలు, అసభ్య డైలాగులు, చెత్త పాటలు లేకుండా మంచి చిత్రాలు చేస్తారు. గత కొన్నేళ్లలో తెలుగు సినిమా ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. రాజమౌళి సలహాలు తీసుకోవాలి రాజమౌళి.. ఆర్ఆర్ఆర్, బాహుబలి 1, 2, అలాగే సుకుమార్ పుష్ప సినిమాలతో టాలీవుడ్ క్రేజ్‌ను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లారు. ఈ విషయంలో భోజ్‌పురి ఇండస్ట్రీ రాజమౌళి నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలి. రాజ్‌కుమార్ బర్జాత్యా, యష్ చోప్రా ఎంతో అందమైన సినిమాలు తీస్తారు. వారి చిత్రాల్లో ఎలాంటి వల్గారిటీ ఉండదు. భోజ్‌పురి సినిమా మొట్టమొదటగా ఆ అసభ్యతను చూపించడం మానేయాలి. రచయితలకు మంచి పారితోషికం ఇవ్వాలి. హీరోలకు ఎక్కువ బడ్జెట్ పెట్టి రచయితలకు, టెక్నీషియన్లకు ఏదో మమ అనిపించకూడదు. నేను సిద్ధం చీప్ సినిమాలు తీస్తున్నారన్న విమర్శలు తెలుగు, మలయాళ ఇండస్ట్రీలో కూడా ఎప్పుడో ఒకసారి వినిపించే ఉంటాయి. కానీ వారు దాన్నుంచి ఎలా బయటపడ్డారు? ఎలా అగ్రగామిగా ఉన్నారనేది మనం నేర్చుకోవాలి. భోజ్‌పురి ఇండస్ట్రీ ముఖకవళికలు మార్చేందుకు ప్రయత్నిస్తున్నాను' అని చెప్పుకొచ్చాడు. రవికిషన్ నటించిన మామ్ల లీగల్ హై వెబ్ సిరీస్ మార్చి 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ఇందులో ఆయన త్యాగి అనే లాయర్‌గా కనిపించనున్నాడు. చదవండి: మనసు మార్చుకున్న బ్యూటీ.. బోల్డ్ సీన్స్‌కు పచ్చజెండా.. ఆ సీన్ అందుకే చేశానంటూ.. -
మద్దాలి శివారెడ్డి గుర్తున్నాడా?.. సరికొత్త వెబ్ సిరీస్‌తో వచ్చేస్తున్నాడు!
రవి కిషన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. అల్లు అర్జున్ రేసుగుర్రం సినిమాలో మద్దాలి శివారెడ్డిగా ప్రేక్షకులను అలరించాడు. తనదైన నటనతో, కామెడీతో టాలీవుడ్ అభిమానులను మెప్పించారు. ఆ తర్వాత కిక్-2, సుప్రీమ్, 90 ఎంఎల్, లై చిత్రాల్లో కనిపించారు. ప్రస్తుతం బాలీవుడ్లో చిత్రాలతో బిజీగా ఉన్న రవికిషన్.. గతేడాది మిషన్ రాణిగంజ్ చిత్రంలో నటించారు. తాజాగా ఆయన ఓటీటీలోనూ ఎంట్రీకి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఆయన సరికొత్త వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. రవి కిషన్, నైలా గ్రేవాల్, అనంత్ విజయ్ జోషి ప్రధాన పాత్రల్లో మామ్లా లీగల్ హై అనే కామెడీ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. కోర్టు రూమ్ నేపథ్యంలో వస్తోన్న ఈ సిరీస్‌ను ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్‌ను రాహుల్ పాండే దర్శకత్వంలో రూపొందించారు. కాగా.. ఈ సిరీస్ మార్చి 1న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. -
ఆర్మీలో చేరిన రేసుగుర్రం విలన్ కూతురు!
భోజ్‌పురి నటుడు రవికిషన్ తెలుగువారికి పరిచయం చేయాల్సిన పనిలేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. రేసుగుర్రం చిత్రంలో మద్దాలి శివారెడ్డిగా ప్రతినాయకుని పాత్రలో మెప్పించాడు. హిందీలో 'ఫిర్ హేరా ఫేరీ', 'వెల్కమ్ టు సజ్జన్‌పూర్', 'ముక్కాబాజ్', 'కిక్ 2' చిత్రాల్లోనూ నటించారు. అయితే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రవికిషన్ గోరఖ్‌పూర్ ఎంపీగా గెలిచారు. అయితే ఆయన కూతురు ఇషితా శుక్లా ఆర్మీలో చేరడం పట్ల పలువురు అభినందనలు తెలుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తండ్రి, కూతురిని అభినందిస్తున్నారు. (ఇది చదవండి: ఆ సూపర్ హిట్ సినిమాకు పార్ట్-2 ఉంది: వెట్రిమారన్) ప్రస్తుతం రవి కిషన్ కూతురు ఇషిత వయసు 21 ఏళ్లు కాగా.. నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మీ ఇద్దరిని చూసి మేము గర్విస్తున్నాము.. ఇతరులకు ఆదర్శంగా నిలిచారు అంటూ పొగుడుతున్నారు. కాగా.. ఈ ఏడాది జనవరి 26న జరిగిన పరేడ్‌లోనూ రవికిషన్ పాల్గొన్నారు. ఈ విషయాన్ని రవికిషన్ ట్వీట్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి పనిచేసిన తన కూతురిని చూసి గర్వపడుతున్నానని ట్వీట్లో పేర్కొన్నారు. ( ఇది చదవండి:ట్రైలర్ బాగుంది కానీ ఆ బూతు డైలాగ్ ఎందుకు పెట్టారో? ) View this post on Instagram A post shared by @varindertchawla 🇮🇳 https://t.co/Bjh3qIjTWg — Ravi Kishan (@ravikishann) June 27, 2023 मेरी बिटिया ईशिता शुक्ला ,आज सुबह बोली पापा I wanna b in #AgnipathRecruitmentScheme I said go ahead beta 🇮🇳 pic.twitter.com/BkxoOB81QQ — Ravi Kishan (@ravikishann) June 15, 2022 Being a father of an extremely diligent daughter Ishita Shukla has broken all records for me to keep head up with pride as she received award of excellence ADG, Delhi DTE out of 1500 cadets. Her training begins to serve our nation Jai Hind!!! @HQ_DG_NCC pic.twitter.com/HzU4XkTBhP — Ravi Kishan (@ravikishann) January 30, 2022 -
పెళ్లి తర్వాత మరో నటితో ఎఫైర్?.. స్పందించిన నటుడు
ప్రముఖ నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ పరిచయం అక్కర్లేని పేరు. రేసు గుర్రం సినిమాతో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నారు. మద్దాలి శివారెడ్డి పాత్రతో తెలుగు వారికి దగ్గరయ్యారు. ప్రస్తుతం ఆయన గోరఖ్‌పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు. అయితే ఇటీవల ఆప్ కీ అదాలత్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతనికి ఓ క్లిష్టమైన ప్రశ్న ఎదురైంది. సీనియర్ నటి నగ్మాతో మీకు ఎఫైర్ ఉండేదా? అని ప్రశ్నించారు. దీంతో ఆయన స్పందించారు. అయితే ఆమెతో ఎక్కువ సినిమాలు చేయడం వల్లే అలా రూమర్స్ సృష్టించారని చెప్పుకొచ్చారు. రవి మాట్లాడుతూ, 'నగ్మాతో చాలా సినిమాలు చేశా. మా సినిమాలు బ్లాక్ బస్టర్లుగా కూడా నిలిచాయి. అయితే మేము మంచి స్నేహితులం కాబట్టి ఎక్కువ సినిమాలు చేసేవాళ్లం. మరీ ముఖ్యంగా నాకు పెళ్లి అయిన విషయం అందరికీ తెలుసు. నేను నా భార్య ప్రీతి శుక్లాను చాలా గౌరవిస్తా. నేను ఆమె పాదాలకు నమస్కరిస్తా. నా భార్య మొదటి నుంచి నాతోనే ఉంది. నా వద్ద డబ్బు లేనప్పుడు కూడా ఆమె నాతో ఉంది' అని అన్నారు. అయితే తాను సూపర్‌స్టార్ అయ్యాక అహంకారం ప్రదర్శించానని.. ఆ తర్వాత తనను బిగ్‌బాస్‌లో పాల్గొనాల్సిందిగా భార్య సూచించిందని రవి తెలిపారు. రవికిషన్ మాట్లాడుతూ.. 'నా సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత నేను కాస్తా గర్వం ప్రదర్శించా. దీంతో వెంటనే నా భార్య బిగ్ బాస్‌కు వెళ్లమని సలహా ఇచ్చింది. మొదట ఇష్టం లేకపోయినా సరే తర్వాత వెళ్లాను. మూడు నెలల పాటు హౌస్‌లో ఉన్నా. బయటకు వచ్చేసరికి నాలో చాలా మార్పు వచ్చింది. నేను పాపులర్ అవ్వడమే కాకుండా సాధారణ వ్యక్తిగా మారిపోయా. ఆ తర్వాత నా కుటుంబాన్ని, నా భార్య, పిల్లలను బాగా చూసుకున్నా.' అని రవికిషన్ వెల్లడించారు. -
పెద్ద స్టార్‌నన్న గర్వంతో కండీషన్స్ పెట్టా.. చివరకు గుణపాఠం చెప్పారు!
ఒక్కసారి స్టార్‌డమ్‌ను తలకెక్కించుకుంటే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఎలాగో స్టార్‌ను అయ్యాను కదా అని గొంతెమ్మ కోర్కెలు కోరితే మొదటికే మోసం వస్తుంది. అందుకు ప్రముఖ నటుడు, ఎంపీ రవి కిషన్ ప్రత్యక్ష ఉదాహరణ. స్టార్డమ్తో గర్వాన్ని తలకెక్కించుకోవద్దని ఓ సంఘటన తనకు గుణపాఠం చెప్పిందంటున్నాడు రవి కిషన్. తాజాగా ఓ షోలో ఆయన మాట్లాడుతూ.. 'గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ సినిమా కోసం నన్ను సంప్రదించారు. నేనేమో పెద్ద స్టార్‌నన్న గర్వంతో.. రోజూ పాలతో స్నానం చేస్తా, గులాబీ పూల రెక్కలపై నిద్రిస్తా.. అవన్నీ మీరే ఏర్పాటు చేయాలని చెప్పాను. ఎందుకంటే నేను స్టార్‌ను, ఇలాంటివి మినిమమ్ ఉండాలి కదా అన్న భ్రమలో ఉన్నాను. అప్పుడు జనాలు నా గురించి మాట్లాడుకుంటారని ఊహించాను. కానీ నేను అనుకుంది ఒకటైతే జరిగింది మరొకటి. నన్ను గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్లో తీసుకోలేదు. నాకోసం రోజూ 25 లీటర్ల పాలు ఏర్పాటు చేయడం అసాధ్యమన్నారు. నా డిమాండ్లు నాకే హాని తలపెట్టాయి. కాబట్టి అప్పటినుంచి అలాంటి డిమాండ్లు చేయడం మానేశాను. ఏమీ లేని స్థాయి నుంచి వచ్చినప్పుడు సడన్‌గా డబ్బు, పేరుప్రతిష్టలు వచ్చినప్పుడు మనసును నియంత్రించడం చాలా కష్టం. ముంబైలాంటి నగరం ఎవరినైనా పిచ్చోళ్లను చేస్తుంది. అందులో నేనూ ఒకడిని. అందుకే నేను నాపై నియంత్రణ కోల్పోయాను' అని చెప్పుకొచ్చాడు. కాగా రవి కిషన్.. భోజ్‌పురి ఇండస్ట్రీలో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లోనూ పలు చిత్రాలు చేశాడు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు రేసుగుర్రం విలన్‌గానే ఎక్కువ గుర్తుండిపోయాడు. -
రాత్రికి రమ్మంది.. నేనూ క్యాస్టింగ్ కౌచ్ బాధితుడినే: నటుడు
సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలో తానూ క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు ప్రముఖ నటుడు, ఎంపీ రవి కిషన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'క్యాస్టింగ్ కౌచ్ అనేది సినిమా ఇండస్ట్రీలో ఉంది. కానీ నేను దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాను. అవకాశాల కోసం అడ్డదారులు తొక్కొద్దని, నీ పనితనాన్ని నిజాయితీగా నిరూపించుకోవాలని మా నాన్న నాకు నేర్పించాడు. నా దగ్గర టాలెంట్ ఉంది, అందుకే షార్ట్‌కర్ట్ నేను ఎంచుకోలేదు. ఇక్కడ ఓ విషయం చెప్పాలి. సినీపరిశ్రమలో ఉన్న ఓ మహిళ కాఫీ తాగడానికి రాత్రి రావాలని పరోక్షంగా తన కోరికను బయటపెట్టింది. ఎవరైనా పొద్దున్నో, సాయంత్రమో కాఫీ తాగుదామంటారు. కానీ తను ప్రత్యేకంగా రాత్రి రావాలని నొక్కి చెప్పడంతో నాకు విషయం అర్థమైంది. వెంటనే నేను నో చెప్పాను. తనిప్పుడు పెద్ద స్థాయిలో ఉంది. ఆమె పేరు వెల్లడించలేను' అని పేర్కొన్నాడు. కాగా రవికిషన్‌కు నటుడు కావాలని చిన్నప్పటినుంచి కోరికగా ఉండేది. తండ్రికి అతడి కోరిక నచ్చలేదు కానీ తల్లి మాత్రం రవికిషన్‌కు మద్దతిచ్చేది. ఓ రోజు ఆమె రవికిషన్‌కు రూ.500 ఇచ్చి ముంబై పంపించేసింది. అలా తల్లి సపోర్ట్‌తో, తన కష్టంతో గొప్ప నటుడిగా ఎదిగాడు. భోజ్‌పురిలో బాగా ఫేమస్ అయిన రవి కిషన్.. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లోనూ పలు చిత్రాలు చేశాడు. రేసుగుర్రం సినిమాలో విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయాడు. గతేడాది రిలీజైన ఖాఖీ: ద బీహార్ చాప్టర్ వెబ్ సిరీస్‌లోనూ నటించాడు. -
'రేసుగుర్రం' విలన్ రవికిషన్ ఇంట విషాదం
ప్రముఖ నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు రామ్ కిషన్ శుక్లా గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని స్వయంగా రవికిషన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ముంబైలోని నానావతి ఆసుపత్రిలో ఆయన కన్నుమూసినట్లు తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. కాగా రామ్ కిషన్ శుక్లా ముంబైలో ఉంటూ ప్రొడక్షన్ పనులు చూసుకుంటేవారు. నిన్న(ఆదివారం)రామ్ కిషన్ శుక్లా తీవ్ర అస్వస్థతకు గురికాగా ఆసుపత్రిలో చేర్చించారు. చికిత్స పొందుతూనే ఆయన కన్నుమూశారు. ఇదిలా ఉంటే రవికిషన్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన రేసుగుర్రం చిత్రంలో ‘మద్దాలి శివారెడ్డి’పాత్రతో తెలుగు వారికి దగ్గరైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన గోరఖ్‌పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు. दुःखद …मेरे बड़े भाई श्री रामकिशन शुक्ला जी का अचानक ह्रदय गति रुकने के कारण मुंबई के नानावटी अस्पताल में दोपहर 12 बजे निधन हो गया है । महादेव से प्रार्थना है की अपने श्री चरणों में स्थान दे ओम् शान्ति शान्ति शान्ति 🙏 pic.twitter.com/TViOuakWcl — Ravi Kishan (@ravikishann) February 5, 2023 -
నటుడు రవికిషన్ ఇంట తీవ్ర విషాదం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ నటుడు (రేస్గుర్రం ఫేమ్ విలన్), బీజేపీ ఎంపీ రవికిషన్ ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు రమేశ్ శుక్లా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే, కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రమేశ్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసినట్టు రవికిషన్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. తన అన్న ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా కృషి చేశారని అయినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి చనిపోయిన కొన్ని రోజులకే సోదురుడు కూడా మరణించడం తమ కుటుంబానికి తీరని లోటని, ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తన అన్న ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయనకు ముగ్గురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. కాగా, రవికిషన్ యూపీలోని గోరఖ్‌పుర్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా గెలుపొందిన విషయం తెలిసిందే. రమేశ్ పట్ల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. दुःखद समाचार..! आज मेरे बड़े भाई श्री रमेश शुक्ला जी का एम्स हॉस्पिटल दिल्ली में दुःखद निधन हो गया है l बहुत कोशिश किया पर बड़े भईया को नहीं बचा सका, पिता जी के बाद बड़े भाई का जाना पीड़ा दायक महादेव आपको अपने श्री चरणों में स्थान प्रदान करें l कोटि कोटि नमन l ओम शांति 🙏 pic.twitter.com/1EZr2vD6Hs — Ravi Kishan (@ravikishann) March 30, 2022 -
మోదీ నినాదంతో ఎంపీ రవికిషన్..
పట్నా: బిహార్ ఓటర్లు కోవిడ్-19 జాగ్రత్తలు తీసుకుంటూ పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని ప్రముఖ నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ నినాదమిచ్చారు. యూపీ ఓటర్లకు కూడా ఇదేవిధంగా సందేశమిచ్చారు. ప్రస్తుతం బిహార్‌లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి కోవిడ్-19 జాగ్రత్తలు తీసుకుంటూ పెద్ద సంఖ్యలో ఓట్లు వేయాలని రవికిషన్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. త్వరలో ఉత్తరప్రదేశ్‌లో కూడా ఉపఎన్నికలు జరగబోతున్నందున రాష్ట్ర ప్రజలకు కూడా ఇదే పిలుపునిచ్చారు. ‘ముందు ఓటు వేయండి ఆ తర్వాత సేద తీరండి’ అనే ప్రధాని నరేంద్ర మోదీ నినాదంతో రవికిషన్ ప్రజలను ఓటు వేయమని కోరుతున్నారు. కోవిడ్-19 జాగ్రత్తలు తీసుకుంటూ అందరూ ఓటు హక్కు వినియోగించుకోని ప్రజాస్వామ్యాన్ని బలపర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చదవండి: నటుడు రవికిషన్‌కు వై-ప్లస్ భద్రత -
నటుడు రవికిషన్‌కు వై-ప్లస్ భద్రత
న్యూఢిల్లీ: బాలీవుడ్ డ్రగ్ వ్యవహారంపై పార్లమెంట్లో ప్రసంగించిన నేపథ్యంలో బీజేపీ ఎంపీ, నటుడు రవి కిషన్‌కు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వై-ప్లస్ కేటగిరి భద్రత కల్పించింది. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీ రవి కిషన్ బాలీవుడ్ డ్రగ్స్ నెక్సస్ లింగ్‌లపై ప్రస్తావించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయనకు బెదిరింపు కాల్స్ రావడం మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఎంపీకి, ఆయన కుటుంబానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వై-ప్లస్ భద్రతను కల్పించారు. దీంతో తనకు తన కుటుంబానికి, నియోజకవర్గ ప్రజలకు భద్రత కల్పించినందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ట్విటర్ వేదికగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. (చదవండి: రవి కిషన్ వ్యాఖ్యలు సిగ్గు చేటు) ‘గౌరవనీయులైన మహారాజ్ జి, నా భద్రతను దృష్టిలో ఉంచుకుని నాకు వై-ప్లస్ కేటగిరి భద్రతను కల్పించినందుకు మీకు కృతజ్ఞతలు. అంతేగాక నా కుటుంబంతో పాటు లోక్‌సభ నియోజకవర్గ ప్రజల క్షేమం గురించి ఆలోచించిన మీకు మేమంతా ఎప్పటికీ రుణపడి ఉంటాం. ప్రజల తరపున సభలో నా గొంతు ఎప్పుడూ ప్రతిధ్వనిస్తూనే ఉంటుందని మీకు మాటఇస్తున్నాను’ అంటూ ఎంపీ ట్వీట్ చేశారు. అయితే బాలీవుడ్లో ప్రస్తుతం కలకలం రేపుతోన్న డ్రగ్ కేసు వ్యవహారంపై ఎంపీ రవి కిషన్ పార్లమెంటులో ఇటివల ప్రసంగించిన విషయం తెలిసిందే. ఆయన ప్రసంగిస్తున్న క్రమంలో ఎంపీ జయబచ్చన్‌తో సహా పలువురు ఎంపీలు ఆయనను వ్యతిరేకించారు. (చదవండి: బంధుప్రీతి.. గ్యాంగ్‌వార్.. డ్రగ్స్...) -
విమర్శలు... వ్యంగ్యాస్త్రాలు
‘బాలీవుడ్ డ్రగ్స్ మత్తులో ఉంది’ అని నటుడు, యంపీ రవికిషన్ చేసిన వ్యాఖ్యలు ఓ కొత్త వివాదానికి దారి తీసిన విషయం, ఆయన మాటల్ని నటి, యంపీ జయా బచ్చన్ ఖండించిన విషయం తెలిసిందే. జయ మాటలకు ఇండస్ట్రీ నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఆమె మాటలు కరెక్ట్ అని చాలామంది అన్నారు. కొందరు కొట్టిపారేశారు. కంగనా రనౌత్ అయితే అస్సలు ఏకీభవించలేదు. జయ కామెంట్స్‌ను తిప్పి కొట్టారు. అయితే కంగనా మాట్లాడిన విషయాన్ని ఊర్మిళ తప్పుబట్టారు. ఇదంతా బుధవారం వరకూ జరిగిన మాటల యుద్ధం. జయా బచ్చన్ వ్యాఖ్యలకు గురువారం వ్యంగ్యంగా బదులిచ్చారు నటుడు రణ్వీర్ షోరే. తన మీద ఊర్మిళ చేసిన కామెంట్స్‌ను తిప్పికొట్టారు కంగనా రనౌత్. ఈ విషయాల గురించి జయప్రద, పూజా భట్ మాట్లాడారు. క్యూట్ గాళ్ నిధీ అగర్వాల్ కూడా ‘నెపోటిజమ్’ గురించి మాట్లాడారు. ఆ విశేషాలు. ఊర్మిళ కేవలం శృంగార తార! – కంగనా ‘డ్రగ్స్ హిమాచల్ ప్రదేశ్‌లోనే మొదలయ్యాయి. ముందు నీ ప్రాంతాన్ని శుభ్రం చేసుకో’ అని కంగనా రనౌత్‌కు కౌంటర్ ఇచ్చారు నటి ఊర్మిళ. ఈ కౌంటర్‌కి ఘాటుగా సమాధానం ఇచ్చారు కంగనా. ‘ఊర్మిళగారి ఇంటర్వ్యూ చూశాను. నా గురించి, నా ప్రయాణం గురించి తక్కువ చేస్తూ మాట్లాడారామె. ఇదంతా నేను రాజకీయాల్లో సీట్ కోసం చేస్తున్నాను అని అంటున్నారామె. ఊర్మిళ సాఫ్ట్ పోర్న్ స్టార్ (శృంగార తార). ఆమె యాక్టింగ్‌కి ఆమె పాపులర్ అవ్వలేదు. మరి దేనికి పాపులరయ్యారు? అంటే... సాఫ్ట్ పోర్న్ చేయడం వల్లే కదా. ఆమెకే టికెట్ వచ్చినప్పుడు నాకెందుకు రాదు?’ అని కౌంటర్ ఇచ్చారు కంగనా. అయితే కంగనా చేసిన ఈ వ్యాఖ్యలకు బాలీవుడ్లో పలువురు ప్రముఖులు ఊర్మిళకు మద్దతుగా ట్వీట్ చేశారు. మా దగ్గర ఉన్న ప్రతిదీ మా కష్టార్జితమే! – రణ్వీర్ షోరే ‘ఇండస్ట్రీలో పని చేస్తూ ఇండస్ట్రీనే తప్పుపట్టడమంటే అన్నం పెట్టిన చేతినే నరకడం వంటిది’ అన్నారు జయా బచ్చన్. ఈ కామెంట్‌ను కంగనా తిప్పి కొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా నటుడు రణ్వీర్ షోరే కూడా స్పందించారు. ‘ఖరీదైన ప్లేట్లలో మీ పిల్లలకు మీరు భోజనం సమకూరుస్తారు. మాకు మాత్రం చివాట్లు. మా భోజనాన్ని మేమే తయారుచేసుకుని బాక్స్ కట్టుకొని పనికి వెళ్తాం. మాకు ఎవ్వరూ ఎప్పుడూ ఏదీ ఇవ్వలేదు. మా దగ్గర ఏముందో అది మాదే. దాన్ని మా నుంచి ఎవ్వరూ లాక్కోలేరు. ఒకవేళ తీసుకునే వీలుంటే దాన్ని కూడా వాళ్ల పిల్లలకే పెడతారు’ అని ఇన్సైడర్స్ వర్సెస్ అవుట్ సైడర్స్ (బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లు/బయటినుంచి వచ్చినవాళ్లు) టాపిక్‌ను చెప్పకనే చెబుతూ ట్వీట్ చేశారు రణ్వీర్ షోరే. వాళ్ల గురించీ ఆలోచించండి – పూజా భట్ ప్రస్తుతం డ్రగ్స్ పై జరుగుతున్న చర్చ గురించి నటి, దర్శక–నిర్మాత పూజా భట్ కూడా మాట్లాడారు. తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారామె. ‘‘ప్రస్తుతం అందరూ బాలీవుడ్లో డ్రగ్స్ ఉన్నాయి. బాలీవుడ్లోనే ఉన్నాయి.. వాటిని తొలగించాలి అని అంటున్నారు. కన్న కలల్ని సాధించలేక, ఆశలన్నీ కూలిపోయి జీవితాన్ని భారంగా గడుపుతూ కలల వెనక పరిగెత్తేవాళ్లు కూడా మత్తు పదార్థాల వెనక పరిగెడుతున్నారు. దారిద్య్రంలో ఉంటూ జీవించడమే భారంగా అనిపించి, మత్తులో తేలుతూ ఈ భారాన్నంతా తేలిక చేసుకుంటున్నవాళ్ల గురించి కూడా ఆలోచించండి. వాళ్లను మామూలు మనుషుల్లా మార్చే ప్రయత్నాలు చేయండి’’ అన్నారు పూజా భట్. నెపోటిజమ్ నా ప్రయాణాన్ని ఆపలేదు – నిధీ అగర్వాల్ ‘అవును.. బాలీవుడ్లో నెపోటిజమ్ (బంధుప్రీతి) ఉంది. ఎప్పటికీ ఉంటుంది. అది ఉన్నంత మాత్రాన అవుట్‌సైడర్‌గా నా ప్రయాణం ఆగిపోదు’ అన్నారు ‘ఇస్మార్ట్ శంకర్’ హీరోయిన్ నిధీ అగర్వాల్. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘మా నాన్నగారు వ్యాపారవేత్త. నేను సినిమాల్లో హీరోయిన్ అవ్వాలని వచ్చాను. ఒకవేళ నేనూ మా నాన్నగారి వ్యాపారంలో ఉంటే ఆయన వారసురాలిగా నన్నే సీఈఓని చేస్తారు. అలానే ఇండస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లకు కొన్ని ప్లస్ పాయింట్లు ఉంటాయి. వాళ్లను గైడ్ చేసేవాళ్లు ఉంటారు. ఎలాంటి నిర్ణయాలు శ్రేయస్కరమో సూచిస్తుంటారు. దీనివల్ల నేను (అవుట్‌సైడర్) స్టార్‌ని అవ్వలేనని కాదు. కొంచెం సమయం పడుతుందేమో కానీ కచ్చితంగా స్టార్‌ని అవుతాను. కష్టపడితే, ప్రేక్షకులు ఆదరిస్తే కచ్చితంగా ఎవ్వరైనా ఇండస్ట్రీలో ఎదగగలరు’’ అన్నారు నిధీ అగర్వాల్. జయా జీ రాజకీయం చేస్తున్నారు – జయప్రద డ్రగ్స్ వివాదం గురించి ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు జయప్రద మాట్లాడుతూ – ‘‘రవికిష¯Œ గారు మాట్లాడిన పాయింట్‌తో నేను ఏకీభవిస్తాను. ఆయన భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. యువతను డ్రగ్స్ బారినపడకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ విషయం మీద మనందరం పోరాటం చేయాలి. జయా బచ్చన్‌గారు మా అందరికంటే పెద్దావిడ.. ఆమె మీద మా అందరికీ గౌరవం ఉంది. కానీ ఆమె ఈ విషయాన్ని (డ్రగ్స్) రాజకీయం చేస్తున్నారనిపించింది’’ అన్నారు. -
‘ఐటెమ్ సాంగ్ ఛాన్స్ రావాలంటే అలా చేయాలసిందే’
ముంబై: ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్లో బాలీవుడ్ ఆత్మహత్యలు, డ్రగ్స్ మాఫియా గురించి ప్రశ్నించగా సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయబచ్చన్ సినీ పరిశ్రమ పరువు తీస్తున్నారంటూ మండిపడ్డ సంగతి తెలిసిందే. అనంతరం కంగనా.. జయాబచ్చన్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మరోసారి ఆమెపై కంగనా ఘాటు వ్యాఖ్యాలు చేశారు. సినిమాలో ఐటెమ్ సాంగ్ చేసే అవకాశం రావాలన్నా, రెండు నిమిషాల సీన్లో నటించచాలన్నా కూడా వారు హీరోతో గడపాల్సి వుంటుందని అలాంటి వాళ్లకే రోల్స్ ఇస్తారని ట్వీట్ చేశారు. తానే పరిశ్రమలో లేడి ఓరియంటెడ్ సినిమాలకు నాందీ వేశానని, దేశభక్తి సినిమాలతో మహిళ ప్రధాన సినిమాలు చేశానని పేర్కొన్నారు. జయాబచ్చన్, సినీ పరిశ్రమ ఆర్టిస్టులకు ఏం ఇచ్చాయి, రెండు నిమిషాల పాత్ర కోసం హీరోతో గడిపితేనే అవకాశాలు ఇవ్వడమా? అని ట్విట్టర్ వేదికగా కంగనా ప్రశ్నలు సంధించారు. कौन सी थाली दी है जया जी और उनकी इंडस्ट्री ने? एक थाली मिली थी जिसमें दो मिनट के रोल आइटम नम्बर्ज़ और एक रोमांटिक सीन मिलता था वो भी हेरो के साथ सोने के बाद,मैंने इस इंडस्ट्री को फ़ेमिनिज़म सीखाया,थाली देश भक्ति नारीप्रधान फ़िल्मों से सजाई,यह मेरी अपनी थाली है जया जी आपकी नहीं। https://t.co/lPo9X4hRZX — Kangana Ranaut (@KanganaTeam) September 16, 2020 సిని పరిశ్రమకు చెందిన ఎంపీ రవి కిషన్ బాలీవుడ్ పరిశ్రమలో ఆత్మహత్యలు జరగకుండా చూడాలని పార్లమెంట్లో కోరిన విషయం విదితమే. అంతేకాకుండా డ్రగ్ మాఫియాకు సంబంధించి పూర్తిగా విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు. చైనా, పాకిస్తాన్ నుంచి భారతదేశానికి డ్రగ్స్ వస్తుందని ఆయన ఆరోపించారు. ఇక దీనిపై స్పందించిన జయాబచ్చన్ రవికిషన్ పేరు ప్రస్తావించకుండానే సినీ పరిశ్రమలో ఉన్న కొంతమంది వ్యక్తులే పరిశ్రమ పరువు తీస్తున్నారంటూ విమర్శించారు. దీంతో కంగనా జయపై విరుచుకుపడుతోన్న సంగతి తెలిసిందే. చదవండి: బంధుప్రీతి.. గ్యాంగ్‌వార్.. డ్రగ్స్... -
బంధుప్రీతి.. గ్యాంగ్‌వార్.. డ్రగ్స్...
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం దగ్గర నుంచి బాలీవుడ్ ప్రశాంతంగా లేదు. ప్రతిభను తొక్కేస్తున్నారు... బాయ్‌కాట్ నెపోటిజమ్ అని మొన్న. బాలీవుడ్ స్టీరింగ్ ఓ గ్యాంగ్ చేతిలో ఉంది.. వాళ్లు ఎటు అంటేæఇండస్ట్రీ అటు తిరుగుతుందని నిన్న. బాలీవుడ్‌ను నడుపుతున్నది డ్రగ్స్ మత్తే అని ఈ మధ్య. ఇలా రకరకాల వివాదాలు. బాలీవుడ్ కాదు... వివాదాలవుడ్ అంటున్నారు చాలామంది. అయితే... ‘ఇండస్ట్రీలో కొందరు చేసిన తప్పుకు అందర్నీ తప్పుపట్టొద్దు’ అంటున్నారు జయాబచ్చన్. ఆమె మాటలతో ఇండస్ట్రీలో పలువురు ఏకీభవించారు. కంగనా రనౌత్ కాదన్నారు. ఆ వివరాలు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య దగ్గర మొదలైన వివాదాలు ఎప్పటికప్పుడు ఏదో ఒక టాపిక్ వైపు మళ్లుతున్నాయి. మిస్టరీ నవలల్లోలా ఏదో ఒక కొత్త టాపిక్‌కి తెరలేస్తోంది. బంధుప్రీతిని ప్రోత్సహించడం వల్లే ప్రతిభకు చోటుండట్లేదు అని కొన్ని రోజులు చర్చ నడిచింది. ఆ తర్వాత డ్రగ్స్ మత్తులో ఇండస్ట్రీ మునిగి తేలుతోందని మరో కొత్త అంశం వెలుగులోకొచ్చింది. రియా చక్రవర్తి డ్రగ్స్ తీసుకున్నట్టు, డ్రగ్స్ తీసుకున్న వాళ్ల పేర్ల జాబితాను పోలీసులకు అందించినట్టు వార్త. ఈ విషయం మీద నటుడు, యంపీ రవికిషన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది ఓ కొత్త వాదనలకు దారి తీసింది. రవికిషన్ వర్సెస్ జయా బచ్చన్ ‘బాలీవుడ్ ఇండస్ట్రీ మత్తు పదార్ధాలకు బానిస అవుతోంది. ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని తన అభిప్రాయాన్ని తెలిపారు రవికిషన్. ఆయన వ్యాఖ్యలను తిప్పికొట్టారు నటి, యంపీ జయా బచ్చన్. ‘‘కొందరు చేసిన తప్పుకి ఓ పరిశ్రమ మొత్తాన్నీ నిందించడం కరెక్ట్ కాదు’’ అని మాట్లాడారామె. ఇదంతా మంగళవారం జరిగింది. జయ మాటలకు బుధవారం స్పందించారు రవికిషన్. జయాజీ నాతో ఏకీభవించండి ‘నా ఉద్దేశం ఇండస్ట్రీలో అందరూ మత్తు పదార్థాలు తీసుకుంటున్నారని కాదు. కానీ తీసుకుంటున్న వాళ్ల ఉద్దేశమైతే పరిశ్రమను నాశనం చేయడమే. ఇండస్ట్రీ మీద ఉన్న బాధ్యతతో ఈ విషయం గురించి మాట్లాడుతున్నాను. జయాజీ కూడా నాతో ఏకీభవించాలి. ప్రస్తుతం డ్రగ్స్ ఓ ఫ్యాషన్ అయిపోయింది. 90వ దశకంలో ఇలాంటివి జరగలేదు. ఇండస్ట్రీలో మురికిని తొలగించాలన్నది మా ముఖ్యోద్దేశం’’ అన్నారు రవి కిషన్. జయా జీ... ఇది నా సొంత భోజనం: కంగనా ‘కొందరు సినీ ఇండస్ట్రీలో పెరిగి దాన్నే మురికి కాలువగా పిలుస్తున్నారని, ఇది భోజనం పెట్టిన చేతిని కరవడమే’ అని జయా బచ్చన్ చేసిన వ్యాఖ్యలకు మంగళవారం స్పందించిన కంగనా బుధవారం కూడా తన విమర్శలను కొనసాగించారు. ‘‘ఏ భోజనం గురించి మీరు మాట్లాడుతున్నారు జయా జీ! రెండు నిమిషాల వేషం, ఐటమ్ నంబర్లు, ఒక రొమాంటిక్ సీన్ ఉండే భోజనమే ఇక్కడ దొరుకుతుంది, అది కూడా హీరోతో గడిపితేనే! నేను వచ్చి ఇండస్ట్రీకి ఫెమినిజమ్ నేర్పాను. మీరనే భోజనాన్ని దేశభక్తి చిత్రాలతో నింపాను. ఇది నా సొంత భోజనం, మీది కాదు’’ అని కంగనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదిలావుంటే జయా బచ్చన్‌కి పలువురు తారలు మద్దతు పలికారు. జయాజీ... యూ ఆర్ రైట్ ‘ఎన్నో సామాజిక విషయాలకు ఇండస్ట్రీకి చెందిన చాలామంది అండగా నిలబడ్డాం. ఇప్పుడు ప్రభుత్వం మాతో నిలబడాల్సిన సమయం ఇది. చెప్పాల్సిన విషయం సూటిగా, స్పష్టంగా చెప్పారు జయాజీ’ అన్నారు తాప్సీ. ‘బహుశా వెన్నెముక ఉండేవాళ్లు ఇలానే మాట్లాడతారేమో’ అని జయ మాటలను ప్రశంసించారు దర్శకుడు అనుభవ్ సిన్హా. ‘జయాజీ మాట్లాడింది అక్షర సత్యం. ఇండస్ట్రీ కోసం ఆమె మాట్లాడటం చాలా సంతోషం’ అన్నారు దియా మిర్జా. ‘పెద్దయ్యాక నేనూ జయాజీలా అవ్వాలనుకుంటున్నాను’ అన్నారు సోనమ్ కపూర్. ‘కంగనా.. పెద్దవాళ్లను గౌరవించాలన్న విషయం కూడా నీకు గుర్తులేదా? నువ్వు తిట్టాలనుకుంటే నన్ను తిట్టు.. వింటాను’ అన్నారు నటి స్వరా భాస్కర్. అలానే జయా బచ్చన్ వ్యాఖ్యలను నటుడు, దర్శకుడు ఫర్హాన్ అక్తర్, దర్శకుడు సుధీర్ మిశ్రా సమర్థించారు. ఈ వివాదం ఇంకెంత దూరమెళ్తుందో? ఎవరెవర్ని వివాదాల్లోకి లాగుతుందో? ఇండస్ట్రీని ఇంకెన్ని ఇబ్బందుల్లో పడేస్తుందో చూడాలి. వివాదాలవుడ్గా మారిన బాలీవుడ్ ఇండస్ట్రీని ఏమైనా అంటే ఊరుకోను – హేమా మాలిని ‘నాకు పేరు, గౌరవం, మర్యాద అన్నీ ఇచ్చింది సినిమా ఇండస్ట్రీయే. అలాంటి ఇండస్ట్రీని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేది లేదు’ అన్నారు సీనియర్ నటి హేమా మాలిని. ప్రస్తుతం జరుగుతున్న చర్చ గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘బాలీవుడ్ ఓ అందమైన ప్రదేశం. సృజనాత్మక ప్రపంచం. ఈ ఇండస్ట్రీ మీద తప్పుడు వ్యాఖ్యలు చేస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. డ్రగ్స్ ఉన్నాయి అంటున్నారు. డ్రగ్స్ లేనిదెక్కడ? ఒకవేళ మురికి ఉంటే కడిగితే పోతుంది. బట్టల మీద అంటుకున్న మురికి ఉతికితే పోతుంది. బాలీవుడ్ మీద పడ్డ మరక కూడా పోతుంది’’ అని అన్నారామె. కంగనాకు సెక్యూరిటీ ఎందుకు – ఊర్మిళ కంగనా చేస్తున్న వ్యాఖ్యలపై (ముంబై పాకిస్తాన్‌ని తలపిస్తోంది. డ్రగ్స్ నిండిన బాలీవుడ్) మండిపడ్డారు నటిæఊర్మిళ. ‘డ్రగ్స్ సమస్య దేశమంతా ఉంది. కంగనాకు తెలుసు.. తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లోనే డ్రగ్స్ మొదలయిందని. తన సొంత ప్రాంతం నుంచే ఆమె డ్రగ్స్ పై యుద్ధం మొదలుపెట్టాలి. అసలు ఈమెకు వై కేటగిరీ సెక్యూరిటీ ఎందుకు ఏర్పాటు చేశారు? ముంబై అందరిదీ. ఆ సిటీ గురించి తప్పుగా మాట్లాడితే ముంబై పుత్రికగా ఊరుకునేది లేదు. ఒక వ్యక్తి అదే పనిగా అరుస్తున్నాడంటే అతను నిజం చెబుతున్నాడని కాదు. కొంతమందికి ఊరికే అరవడం అలవాటు.. అంతే. ఒకవేళ బయటకు వచ్చి మాట్లాడితే తమ కేం అవుతుందో అని చాలా మంది బయటకు రావట్లేదంతే’ అన్నారు ఊర్మిళ. -
బచ్చన్ ఫ్యామిలీకి మరింత భద్రత
ముంబై: బాలీవుడ్లో డ్రగ్స్ వినియోగంపై రవికిషన్ చేసిన వ్యాఖ్యలను జయాబచ్చన్ రాజ్యసభలో ప్రస్తావించిన అనంతరం ముంబై పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా బచ్చన్ల ఇంటికి సెక్యూరిటీ మరింత పెంచారు. జుహూలోని బచ్చన్స్ ఐకానిక్ బంగ్లా అయిన జల్సా వెలుపల అదనపు భద్రత కల్పించారు. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ కేసుకు సంబంధించి బాలీవుడ్‌పై వస్తోన్న ఆరోపణలపై జయాబచ్చన్ మంగళవారం రాజ్యసభలో ప్రసంగించించారు. ఆమె ప్రసంగంపై సోషల్ మీడియాలో భిన్నరకాలుగా ట్రోల్స్ వచ్చిన తర్వాత ముందు జాగ్రత్త చర్యగా భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే బాలీవుడ్లో మాదక ద్రవ్యాల వినియోగంపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ ఎంపీ రవి కిషన్ వ్యాఖ్యానించారు. దీనికి జయా బచ్చన్ స్పందిస్తూ.. కొంతమంది వ్యక్తుల కారణంగా బాలీవుడ్ ప్రతిష్టను కించపర్చడం సరి కాదు. అది కూడా సినీ పరిశ్రమకు చెందిన ఓ వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేయడం సిగ్గుచేటు' అంటూ జయాబచ్చన్ మండిపడిన సంగతి తెలిసిందే. కాగా.. బుధవారం పార్లమెంటులో జయాబచ్చన్ తీసుకున్న వైఖరికి శివసేన మద్దతుగా ముందుకు వచ్చింది. రవికిషన్ ఆరోపణలపై శివసేన అనుబంధ పత్రిక సామ్నా సంపాదకీయంలో 'అలాంటి వాదనలు చేసేవారు కపటవాదులని.. వారి ప్రకటనలు ద్వంద్వ ప్రమాణాలు కలిగి ఉంటాయని పేర్కొంది. (రవి కిషన్ వ్యాఖ్యలు సిగ్గు చేటు) -
రవి కిషన్ వ్యాఖ్యలు సిగ్గు చేటు
న్యూఢిల్లీ: బాలీవుడ్లో డ్రగ్స్ వినియోగం విపరీతంగా ఉందని భోజ్‌పూరి నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్ పార్లమెంట్ సమావేశాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సమాజ్‌వాది పార్టీ ఎంపీ జయాబచ్చన్ తీవ్రంగా మండి పడ్డారు. కొందరి కోసం అందరిని విమర్శించడం తగదన్నారు. ఈ సందర్భంగా జయా బచ్చన్ మంగళవారం రాజ్యసభలో మాట్లాడుతూ.. ‘కొంతమంది వ్యక్తుల కారణంగా మొత్తం పరిశ్రమను కించపర్చడం సరి కాదు. నిన్న లోక్‌సభలో పరిశ్రమకు చెందిన వ్యక్తే ఈ ఆరోపణలు చేయడంతో నేను ఎంతో సిగ్గు పడ్డాను. ఆయన వ్యాఖ్యలు చూస్తే.. అన్నం పెట్టిన చేతినే నరుక్కున్నట్లుగా ఉంది’ అంటూ తీవ్రంగా మండి పడ్డారు జయా బచ్చన్. (చదవండి: డ్రగ్స్ కేసు: నాకేం బాధ లేదు ) బాలీవుడ్లో మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని రవి కిషన్ అన్నారు. దేశ యువతను నాశనం చేయటానికి కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. పొరుగుదేశాలు ఇందుకు సహకారం అందిస్తున్నాయన్నారు. సోమవారం నాటి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్, చైనాలనుంచి ప్రతి ఏటా మత్తు పదార్థాలు దేశంలోకి అక్రమంగా రవాణా అవుతున్నాయని, నేపాల్, పంజాబ్ ద్వారా దేశంలోకి వస్తున్నాయని రవి కిషన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. -
నాకు లక్ష ఇస్తే.. తనకు రూ. 25 వేలే
బాలీవుడ్ టీవీ షో కపిల్ శర్మ కార్యక్రమానికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బడా స్టార్స్ అంతా ఈ షోకు హాజరవుతారు. ఈ నేపథ్యంలో ఈ వారం కపిల్ శర్మ షోకు భోజ్‌పురి సూపర్ స్టార్లు మనోజ్ తివారీ, రవి కిషన్ వచ్చారు. తమ జీవితాలు, కెరీర్‌కు సంబంధించి అనేక విషయాలను వెల్లడించారు. అంతేకాక ఇద్దరి మధ్య వచ్చిన విభేదాల గురించి తెలిపారు. ఈ సందర్భంగా మనోజ్ తివారీ మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో రవి కిషన్ నాకు సీనియర్. నేను పరిశ్రమలోకి వచ్చేనాటికే అతడు సూపర్ స్టార్. అయితే ఒక సినిమాకు రవికిషన్‌కు కేవలం 25 వేల రూపాయలు ఇస్తే.. నాకు లక్ష రూపాయలు ఇచ్చారు. అది కూడా కేవలం ఒక ఐటమ్ సాంగ్ కోసం’ అంటూ రవి కిషన్‌ని ఆట పట్టించాడు. ఈ షోలో క్రికెట్ ఆడారు. ఇలా ఇద్దరు ఒకే షోకు హాజరుకావడం చాలా గొప్ప విషయం అన్నారు. అంతేకాక ఇండస్ట్రీలో వారి ప్రయాణం.. ఎదుర్కొన్న కష్టాలు.. హార్డ్ వర్క్ వంటి విషయాల గురించి వెల్లడించారు. (చదవండి: ‘రూ.500 టికెట్‌తో.. రూ.5 లక్షల వైద్యం’) అభిమానులతో మాటల సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు ఇద్దరు హీరోలు. తాను రాజకీయ నాయకుడిని అయితే.. నదులను శుభ్రం చేస్తానని తెలిపారు మనోజ్ తివారీ. ఇద్దరికి సంబంధించిన ఫోటోలను షోలో ప్రదర్శించారు. వాటిల్లో వారు సమజానికి సేవ చేస్తున్న ఫోటోలు కూడా ఉన్నాయి. లాక్డౌన్ కాలంలో మనోజ్ తివారీ పేదలకు సాయం చేయగా.. రవి కిషన్ తన స్వస్థలం.. గోరఖ్‌పూర్‌లో వరదల సమయంలో, లాక్డౌన్ కాలంలో జనాలకు అవసరమైన వస్తువులను అందించారు. ఈ షోకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. View this post on Instagram कल A post shared by Ravi Kishan (@ravikishann) on Sep 11, 2020 at 11:37pm PDT -
పార్లమెంట్లో గళమెత్తిన ‘రేసుగుర్రం విలన్’
న్యూఢిల్లీ : డ్రగ్స్ కేసుతో బాలీవుడ్‌కు ఉన్న సంబంధాలపై నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ ( రేసుగుర్రం విలన్ మద్దాలి శివారెడ్డి) గళమెత్తారు. బాలీవుడ్లో మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని అన్నారు. దేశ యువతను నాశనం చేయటానికి కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. పొరుగుదేశాలు ఇందుకు సహకారం అందిస్తున్నాయన్నారు. సోమవారం నాటి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్, చైనాలనుంచి ప్రతి ఏటా మత్తు పదార్థాలు దేశంలోకి అక్రమంగా రవాణా అవుతున్నాయని, నేపాల్, పంజాబ్ ద్వారా దేశంలోకి వస్తున్నాయని పేర్కొన్నారు. ( డ్రగ్స్ కేసు: రాగిణి ద్వివేదీ చీటింగ్ ) డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న కొంతమందిని అరెస్ట్ చేసి, ఎన్సీబీ మంచి పనిచేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని, కేసుతో సంబంధం ఉన్న మిగిలిన దోషులను వెంటనే పట్టుకుని శిక్షించాలని కోరారు. పొరుగు దేశాల కుట్రకు శుభం కార్డు వేయాలన్నారు. ( ‘ఏయ్.. నేను నిజంగానే ఎంపీ అయ్యాను’) -
‘రూ.500 టికెట్‌తో.. రూ.5 లక్షల వైద్యం’
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు ఆయనను ఇరకాటంలో పడేశాయి. ఢిల్లీయేతర ప్రజలు కూడా తమ రాష్ట్రానికి వచ్చి ఉచితంగా వైద్యం పొందుతున్నారు.. ఇది ఎక్కడి న్యాయం అంటూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. వివరాలు.. మంగోల్‌పురి ప్రాంతంలోని సంజయ్ గాంధీ మెమోరియల్ ఆస్పత్రిలో ట్రామా సెంటర్ ప్రారంభోత్సవానికి హాజరైన కేజ్రీవాల్.. ‘ప్రస్తుతం ఢిల్లీలో వైద్య సేవలు బాగా మెరుగుపడ్డాయి. దాంతో ఢిల్లీకి వచ్చే రోగుల సంఖ్య కూడా బాగా పెరిగింది. అయితే ఢిల్లీ వాసులకు వైద్యం అందడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే ఢిల్లీలో మెరుగైన వైద్యం లభిస్తుండటంతో ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఇక్కడికే వస్తున్నారు. దాంతో ఢిల్లీవాసులకు వైద్యం ఆలస్యం అవుతోంది’ అన్నారు. ‘ఉదాహరణకు బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి కేవలం రూ.500 పెట్టి టికెట్ కొని ఢిల్లీ వచ్చి.. రూ. 5లక్షల విలువైన వైద్యాన్ని ఉచితంగా పొందుతున్నాడు. అంటే ఢిల్లీ ప్రజలకోసం ఉద్దేశించిన వాటిని ఇతరులు కూడా వినియోగించుకుంటున్నారు. వారు కూడా మన దేశ ప్రజలే కాబట్టి.. మనం అభ్యంతరం తెలపం. కానీ ఢిల్లీ దేశ ప్రజలందరికి సేవ చేయలేదు కదా’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్ మాట్లాడుతూ.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేజ్రీవాల్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన మాటలు మానవత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఓటమి భయంతో ఇలాంటి మాటలు మాట్లాడటం మంచిది కాదని విమర్శించారు. -
మోదీ బయోపిక్‌లో నటిస్తా
‘రేసుగుర్రం’ సినిమాతో సౌత్‌కి పరిచయమయ్యారు భోజ్‌పురి స్టార్ రవికిషన్. తన నటనతో మెల్లిగా దక్షిణాది ప్రేక్షకుల మనసును గెలుచుకున్నారు. ప్రస్తుతం నాలుగు భోజ్‌పురి, ఒక హిందీ చిత్రంతో బిజీగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జీవితంతో సినిమా చేయాలని ఉందని ఇటీవల రవికిషన్ పేర్కొన్నారు. ‘‘మన నాయకుల సత్తాను అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందుకే భోజ్‌పురి భాషలో నరేంద్ర మోది బయోపిక్‌లో నటించాలనుకుంటున్నాను. అంతేకాదు బిహార్, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన స్వాతంత్య్ర సమర యోధుల జీవిత చరిత్రల్లో కూడా నటించాలని ఉంది. స్వామి వివేకానంద బయోపిక్‌పై కూడా ఆసక్తిగా ఉంది’’ అని చెప్పుకొచ్చారు రవికిషన్. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘పీఎమ్ నరేంద్ర మోదీ’ టైటిల్‌తో హిందీలో మోదీ బయోపిక్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటించారు. -
‘ఏయ్.. నేను నిజంగానే ఎంపీ అయ్యాను’
సాక్షి, హైదరాబాద్ : అల్లు అర్జున్ హీరోగా ఐదేళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘రేసుగుర్రం’లో విలన్ మద్దాలి శివారెడ్డి గుర్తున్నాడు కదా. ఎలాగైనా తాను ఎమ్మెల్యేను కావాలని నామినేషన్ వేయడానికి వెళ్తుంటే హీరో అల్లు అర్జున్ అడ్డుపడి చితక్కొట్టేస్తాడు. నామినేషన్ వేయలేకపోయినా ఆ తరవాత ఎలాగోలా మంత్రి అయిపోతాడు. ‘మద్దాలి శివారెడ్డి అనే నేను..’ అంటూ పదవీ ప్రమాణ స్వీకారం చేసి పొలిటికల్ పవర్‌ను ఎంజాయ్ చేయాలనే కోరికను తీర్చుకుంటాడు. అది సినిమా. అయితే, నిజ జీవితంలో అలాగే రాజకీయాల్లో గెలిస్తే ఆ అనందం ఎలా ఉంటుంది? ఉహించుకుంటేనే ఏదో థ్రిల్లింగ్‌గా ఉంది కదా! అలాంటి థ్రిల్లింగ్‌ను పొందాడు రేసుగుర్రం విలన్ మద్దాలి శివారెడ్డి అలియాస్ రవికిషన్. భోజ్‌పురి స్టార్ రవికిషన్ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి 3లక్షల మెజారిటితో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎంపీగా లోక్‌సభలో ప్రమాణ స్వీకారం కూడా చేశాడు. అయితే ఆయన చేసిన ప్రమాణ స్వీకారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. రేసుగుర్రం సినిమాలో మంత్రిగా ప్రమాణం చేసిన మాటలను, లోక్‌సభలో ప్రమాణం చేసిన మాటలను పక్కపక్కన చేర్చిన వీడియో ఒకటి వైరల్ అయింది. ‘లోక్‌సభలో మద్దాలి శివారెడ్డి’ ‘ ఏయ్ నిజంగానే ఎంపీ అయ్యా’ అని రాసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘హేయ్ విలన్.. హీరో అయ్యాడు’, ‘సినిమాలో విలన్ అయినా..నిజజీవితంలో హీరోలా ప్రజలకు సేవ చేయాలి’,‘మద్దాలి శివారెడ్డి.. అనుకున్నది సాధించావ్ పో’ అంటూ రవికిషన్‌పై తెలుగు నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. -
నిజం గెలిచింది : నటుడు రవికిషన్
బహు భాషా నటుడు, భోజ్‌పురి హీరో రవికిషన్ 2019 జనరల్ ఎలక్షన్స్‌లో బీజేపీ బరిలో దిగారు. 2014లో కాంగ్రెస్‌పార్టీ తరుపున జౌన్సూర్ నుంచి బరిలో నిలిచిన రవికిషన్, ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ నియోజక వర్గం నుంచి లోక్‌సభకు పోటి చేశారు. దాదాపు 3 లక్షలకు పైగా మేజార్టీతో ఘన విజయం సాధించారు. 1998 నుంచి 2017 వరకు యోగి ఆదిత్యనాథ్ ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. అంతేకాదు ప్రస్తుత ఎలక్షన్లలోనూ రవికిషన్ తరుపున ప్రచార బాధ్యతను కూడా యోగినే తీసుకున్నారు. దీంతో రవికిషన్ గెలుపు మరింత సులువైంది. అయితే రవికిషన్ గోరఖ్‌పూర్ వాస్తవ్యూడు కాకపోవటంతో కాస్త తొలుత కాస్త ప్రతికూలత వాతావరణం కనిపించిన చిరవకు ఓటర్లు ఆయనకే పట్టం కట్టారు. 2014 ఎన్నికల్లో పోటి చేసిన సమయంలో ఇచ్చిన అఫిడవిట్లో డిగ్రీ పట్టభద్రుడిగా పేర్కొన్న రవికిషన్ ఈ ఎన్నికల్లో మాత్రం తాను ఇంటర్మీడియట్ పాసైనట్టుగా అఫిడవిట్ దాఖలు చేయటంపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. అయితే అన్ని అడ్డంకులను చేధించిన 3,01,664 ఓట్లతో ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రవికిషన్ నిజం గెలిచిందంటూ వ్యాఖ్యానించారు. -
ఆ హీరోకు బిల్డర్ టోకరా..
న్యూఢిల్లీ : పలు బాలీవుడ్ సినిమాలు, టీవీ షోల్లో నటించిన భోజ్‌పురి సినిమా మెగాస్టార్ రవికిషన్ ఓ బిల్డర్ చేతిలో మోసపోయారు. ముంబైలో రూ 1.5 కోట్లు వెచ్చించి ఫ్లాట్‌ను బుక్ చేసిన రవికిషన్‌కు ఇంతవరకూ బిల్డర్ ఫ్లాట్‌ను అప్పగించకపోవడంతో నటుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబైలోని కమలా ల్యాండ్‌మార్క్ గ్రూప్ బిల్డర్స్ వద్ద రూ 1.5 కోట్లు చెల్లించి ఫ్లాట్ బుక్ చేసుకున్న రవికిషన్‌కు ఇప్పటివరకూ బిల్డర్లు ఫ్లాట్‌ను అప్పగించలేదు. కమలా ల్యాండ్‌మార్క్ గ్రూప్ బిల్డర్లు జితేంద్ర జైన్, జినేంద్ర జైన్, కేతన్ షాలపై రవికిషన్ ఫిర్యాదు చేశారు. సునీల్ నాయర్ అనే వ్యక్తిని కూడా బిల్డర్లు రూ 6.5 కోట్ల మేర మోసగించినట్టు ముంబై పోలీసులకు ఫిర్యాదు అందింది. కమలా ల్యాండ్‌మార్క్ గ్రూప్ మరో నిర్మాణ రంగ సంస్థతో కలిసి ఏర్పాటు చేసిన జేవీ గ్రూప్ ఫిర్యాదుదారులు ఇద్దరికీ కలిపి రూ 8 కోట్ల మేర టోకరా ఇచ్చిందని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది. -
నటుడికి రియల్టీ గ్రూప్ కుచ్చుటోపీ!
భోజ్‌పురి హీరో, ‘రేసుగుర్రం’ ఫేం రవికిషన్ ముంబైకి చెందిన రియల్టీ సంస్థ కమలా ల్యాండ్ గ్రూప్ తనను మోసగించిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జుహులో ఫ్లాట్ నిర్మిస్తామని చెప్పడంతో తాను కోటిన్నర రూపాయలు చెల్లించానని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు సదరు రియల్టీ గ్రూపు డైరెక్టర్లు జితేంద్ర జైన్, జినేంద్ర జైన్, కేతన్ షాలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రవి కిషన్ కూడా నాలాగే మోసపోయాడు.. ‘కమలా ల్యాండ్ గ్రూప్‌ను నమ్మి రవికిషన్ కూడా నాలాగే మోసపోయాడు. రెండు ఫ్లాట్ల కోసం వాళ్లు నా దగ్గర నుంచి ఆరున్నర కోట్ల రూపాయలు తీసుకున్నారు. రవి నుంచి కూడా కోటిన్నర రూపాయలు వసూలు చేసి, సిద్ధాంత్ ప్రాజెక్టులో 3165 చదరపు మీటర్ల ఫ్లాట్ ఇస్తామన్నారు. ఇందుకు సంబంధించి అలాట్మెంట్ లెటర్ కూడా ఇచ్చారు. కానీ ఇంతవరకు ఫ్లాట్ ఇవ్వలేదు. అందుకే ఇద్దరం కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాం అని ముంబైకి చెందిన వ్యాపారి సునీల్ నాయర్ వ్యాఖ్యానించారు. కాగా వీరిద్దరి ఫిర్యాదు మేరకు జితేంద్ర, జనేంద్ర, కేతన్‌లపై చీటింగ్, బ్రీచింగ్ కేసు నమోదు చేసినట్లు ఈవోడబ్ల్యూ ఆఫీసర్ ఒకరు తెలిపారు. -
దీనస్థితిలో నటి.. సల్మాన్ ఆపన్నహస్తం!
సాక్షి, న్యూఢిల్లీ: తనతో కలిసి నటించిన హీరోయిన్ అత్యంత దీనమైన స్థితిలో ఉన్నట్లు గుర్తించిన బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఆమెకు సాయం చేశాడు. సల్మాన్ హీరోగా 90ల్లో వచ్చిన 'వీర్‌గాటి' చిత్రంలో నటించిన పూజా దద్వాల్ అనే హీరోయిన్ ప్రస్తుతం టీబీ వ్యాధి భారిన పడి వైద్యం చేయించుకోవడానికి డబ్బుల్లేని స్థితిలో ఉన్న సంగతి తెలిసిందే. సల్మాన్ సాయం కోసం ఆమె గతంలో మీడియా ద్వారా వేడుకోగా.. ఎట్టకేలకు ఆ విషయం సల్మాన్‌కి తెలిసింది. దబాంగ్ టూర్ లో భాగంగా పుణెకి వచ్చిన సల్మాన్ అనారోగ్యంతో బాధపడుతున్న పూజా దద్వాల్ పరిస్థితి విని విచారం వ్యక్తం చేశారు. తక్షణమే ఆమెకు సహాయం చేస్తానన్నారు. సల్మాన్ మాట్లాడుతూ...‘ఆమె అనారోగ్యంతో ఉన్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది. వెంటనే మా టీంని ఆసుపత్రికి పంపిచా. ఆమెకు కావాల్సిన సాయం అందిస్తా. ఆరోగ్యంతో పూజా దద్వాల్ బయటకు వస్తుందనే నమ్మకం ఉందని’ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఇటీవల ఆమెను ఆదుకోవటానికి రేసుగుర్రం మూవీ ప్రతినాయకుడు రవికిషన్ ముందుకొచ్చి... తన స్నేహితుని ద్వారా పూజాకి సాయం చేశారు. చికిత్సకు కావాల్సిన డబ్బుతో పాటు పండ్లు కూడా పంపిణీ చేశారు. పూజా దద్వాల్ కొన్ని రోజుల కిందట ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘6 నెలల కిందట టీబీ ఉందని తెలిసింది. అప్పటి నుంచి సల్మాన్ ను సాయం అడుగుదామని యత్నిస్తున్నాను. కానీ అది సాధ్యం కాలేదు. నా వీడియోను చూస్తే ఎంతో కొంత సాయం చేస్తాడన్న ఆశ ఉంది. కొన్ని రోజులుగా ఇదే హాస్పిటల్లో ఉన్నాను. నా దగ్గర నయా పైసా కూడా లేదు. కనీసం టీ కోసం కూడా ఇతరులపై ఆధారపడాల్సి వస్తున్నదంటూ’ పూజా వాపోయిన విషయం తెలిసిందే. పూజా ఆరోగ్యం బాగా లేదని తెలిసిన తర్వాత భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఆమెను ఇంటి నుంచి పంపించేశారు. సినిమాల్లో అవకాశాలు లేక పోవడంతో ఇండస్ట్రీని వదిలిపెట్టిన పూజా గత కొన్నేళ్లుగా గోవాలో క్యాసినో మేనేజ్మెంట్ చేస్తూ సాధారణ జీవితం గడుపుతున్నారు. ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటూనే జీవనం సాగిస్తున్నారు. -
‘ఎంఎల్ఎ (మంచి లక్షణాలున్న అబ్బాయ్)’ మూవీ రివ్యూ
టైటిల్ : ఎంఎల్ఎ (మంచి లక్షణాలున్న అబ్బాయ్) జానర్ : కమర్షియల్ ఎంటర్టైనర్ తారాగణం : కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్, రవి కిషన్, 30 ఇయర్స్ పృథ్వీ, మనాలీ రాథోడ్ సంగీతం : మణిశర్మ దర్శకత్వం : ఉపేంద్ర మాధవ్ నిర్మాత : కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి, టీజీ విశ్వ ప్రసాద్ నందమూరి యంగ్ హీరో కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఎంఎల్ఎ. పటాస్ సినిమా తరువాత ఆ స్థాయి హిట్ కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తానన్న నమ్మకంతో ఉన్నాడు. రచయిత ఉపేంద్ర మాధవ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమాలో చాలా కాలం తరువాత కాజల్ అగర్వాల్‌తో కలిసి నటించాడు కళ్యాణ్ రామ్. మరి పొలిటికల్ ఎంటర్టైనర్ కళ్యాణ్ రామ్ కెరీర్ లో మరో సక్సెస్ గా నిలిచిందా..? ఉపేంద్ర మాధవ్ దర్శకుడిగా విజయం సాధించాడా..? కథ : గాడప్ప (రవికిషన్) అనంతపురం జిల్లా వీరభద్రపురం ఎంఎల్ఎ. తరతరాలుగా గాడప్ప వంశం వాళ్లే అక్కడ ఎంఎల్ఎగా ఎన్నికవుతూ వస్తుంటారు. గాడప్పపై మీద ఒక్కసారైన విజయం సాధించాలన్న కసితో నాగప్ప(జయ ప్రకాష్ రెడ్డి) గాడప్ప మీద ఎన్నికల్లో తలపడుతూనే ఉంటాడు. ఇక మన హీరో కళ్యాణ్ (కళ్యాణ్ రామ్) మంచి లక్షణాలున్న అబ్బాయ్. చెల్లెలు(లాస్య) ప్రేమించిన అబ్బాయికి వేరే పెళ్లి జరుగుతుంటే పెళ్లి పీటల మీదనుంచి లేపుకొచ్చి మరీ చెల్లెలికిచ్చి పెళ్లి చేస్తాడు. (సాక్షి రివ్యూస్) తమకు కూడా చెప్పకుండా చెల్లి పెళ్లి చేసినందుకు కళ్యాణ్ తండ్రికి కోపం వస్తుంది. కళ్యాణ్‌తో సహా చెల్లిని కూడా ఇంట్లోనుంచి గెంటేస్తాడు. అలా బెంగళూరు చేరిన కళ్యాణ్‌కు అక్కడ ఇందు(కాజల్ అగర్వాల్) పరిచయం అవుతుంది. తొలిచూపులోనే ఇందుతో ప్రేమలో పడిన కళ్యాణ్ ఆమె కంపెనీ సమస్యల్లో ఉంటే బయటపడేసేందుకు సాయం చేస్తాడు. కానీ అదే సమయంలో ఇందు ప్రమాదంలో ఉందని తెలుస్తుంది. ఆమె గతం తెలుసుకున్న కళ్యాణ్ ఏం చేశాడు..? ఇందుకు వీరుభద్రపురం ఎంఎల్ఎ గాడప్పకు సంబంధం ఏంటి? కళ్యాణ్ ఎంఎల్ఎగా పోటి చేయాల్సిన పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి.? అన్నదే మిగతా కథ. నటీనటులు : మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్ తన ఇమేజ్‌కు, బాడీలాంగ్వేజ్‌కు తగ్గ కమర్షియల్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తనదైన నటనతో కళ్యాణ్ పాత్రలో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో కళ్యాణ్ రామ్ నటన కంటతడిపెట్టిస్తుంది. గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ డ్యాన్స్ లు ఆకట్టుకుంటాయి. యాక్షన్ సీన్స్ లోనూ పర్ఫెక్షన్ చూపించాడు. కాజల్ అగర్వాల్‌కు నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దక్కింది. (సాక్షి రివ్యూస్)ఇందుగా అందంతో పాటు అభినయంతోనూ మెప్పించింది. విలన్ గా రవికిషన్ తనకు అలవాటైన పాత్రలో కనిపించాడు. గాడప్ప పాత్రలో రేసుగుర్రం సినిమాలో మద్దాలి శివారెడ్డి పాత్ర ఛాయలు కనిపిస్తాయి. చాలా కాలం తరువాత బ్రహ్మానందం కామెడీ వర్క్ అవుట్ అయ్యింది. లాయర్ పట్టాభిగా బ్రహ్మీ అలరించాడు. ఇతర పాత్రలో వెన్నెల కిశోర్, పోసాని కృష్ణ మురళీ, 30 ఇయర్స్ పృథ్వీ,ప్రభాస్ శ్రీనులు నవ్వించే ప్రయత్నం చేశారు. విశ్లేషణ : దర్శకుడిగా తొలి ప్రయత్నానికి ఉపేంద్ర మాధవ్ పక్కా ఫార్ములా కమర్షియల్ సినిమాను ఎంచుకున్నాడు. ఆరు పాటలు, నాలుగు ఫైట్ల కాన్సెప్ట్ తో రూపొందిన ఎంఎల్ఎతో నందమూరి అభిమానులను ఆకట్టుకున్నాడు. ఫస్ట్ హాఫ్ అంతా అసలు కథతో సంబంధం లేకుండా నడిపించిన దర్శకుడు ఇంటర్వెల్ సమయానికి గాని కథలోకి ఎంటర్ కాలేదు. హీరో ఎంఎల్ఎగా ఎన్నికయ్యేందుకు చేసే ప్రయత్నాలు ఇంకాస్త ఎలివేట్ చేసుంటే బాగుండేదనిపించింది. (సాక్షి రివ్యూస్)మణిశర్మ సంగీతం పరవాలేదు. పాటలు విజువల్ గా బాగున్నాయి. నేపథ్యం సంగీతంలో మణిశర్మ తన మార్క్ చూపించాడు. ముఖ్యంగా హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సీన్స్ తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్‌లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కళ్యాణ్ రామ్, కాజల్ కామెడీ నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : రొటీన్ స్టోరి బోర్ కొట్టించే కొన్ని సీన్స్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
రేసుగుర్రం విలన్‌కు గాయాలు
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా రేసుగుర్రంతో తెలుగు ఆడియన్స్‌కు పరిచయం అయన నటుడు రవికిషన్. భోజ్‌పురిలో స్టార్ హీరోగా ఉన్న రవికిషన్ తెలుగు ప్రేక్షకులకు మాత్రం విలన్‌గా పరిచయం అయ్యాడు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సుప్రీం సినిమాలో నటిస్తున్న రవికిషన్, ఓ ఫైట్ సీన్ షూటింగ్ సమయంలో గాయపడ్డాడు. పటాస్ ఫేం అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ షూటింగ్ ప్రస్తుతం రాజస్థాన్‌లో జరుగుతోంది. సాయిధరమ్ తేజ్, రవికిషన్ల మధ్య ఫైట్ సీన్ షూట్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో రవికిషన్ గాయపడ్డాడు. అక్కడే ప్రాథమిక చికిత్స అందించిన చిత్రయూనిట్, మెరుగైన వైద్యం కోసం ఆయన్ను ముంబై తరలించారు. -
సందీప్ సరసన నిత్యా..?
ఆసక్తికరమైన కథలను ఎంచుకుంటూ యంగ్ జనరేషన్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో సందీప్ కిషన్. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో కూడా నటిస్తున్న ఈ యంగ్ హీరో 'ఒక అమ్మాయి తప్ప' అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలైన ఈ సినిమాకు ఇంత వరకు హీరోయిన్ను మాత్రం ఫైనల్ చేయలేదు. ప్రస్తుతం సందీప్ కిషన్‌తో పాటు విలన్‌గా నటిస్తున్న రవికిషన్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా నటించడానికి స్టార్ హీరోయిన్ నిత్యామీనన్‌ను సంప్రదించారన్న టాక్ వినిపిస్తోంది. బడా బడా స్టార్ హీరోల సరసన వరుస సూపర్ హిట్స్‌లో నటిస్తున్న ఈ భామ, సందీప్ సరసన హీరోయిన్గా నటించడానికి అంగీరిస్తుందా లేదా చూడాలి. అయితే నిత్యామీనన్‌కు ఈ సినిమా కథ చాలా బాగా నచ్చిందని, సినిమాలో నటించటం ఖాయం అంటున్నారు చిత్రయూనిట్. ఇంత వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ మాత్రం చేయలేదు. లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా ప్రముఖ రచయిత రాజసింహా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. అంజి రెడ్డి నిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. -
ప్రముఖ నటుడి కూతురు మిస్సింగ్!
ముంబై: బాలీవుడ్, భోజ్‌పురి నటుడు రవికిషన్ 19 ఏళ్ల కూతురు కనిపించకుండాపోయారు. తన కూతురు కనిపించడం లేదని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి కొన్నిరోజుల కిందటే ఆయన బంగుర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడని, ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారని డీసీపీ (డిటెన్షన్) ధనుంజయ్ కులకర్ణి తెలిపారు. రవికిషన్ కూతురు ఇంటిని వదిలివెళ్లిపోవడం ఇది రెండోసారి. గతంలోనూ ఓసారి ఆమె తల్లిదండ్రులను వదిలేసి బయటకు వెళ్లిందని పోలీసు వర్గాలు తెలిపాయి. భోజ్‌పురి నటుడిగా ఫేమస్ అయిన రవికిషన్ ఇటీవల బిగ్‌బాస్, ఏక్ సే బడ్ఖర్ ఏక్- జల్వా సితారోంకా వంటి టీవీ కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా ఆదరణ పొందారు. అంతేకాకుండా తెలుగులో 'రేసుగుర్రం', 'కిక్-2' సినిమాల్లో విలన్ గా నటించారు. -
సినిమా రివ్యూ: రేసుగుర్రం
ప్లస్ పాయింట్స్: అల్లు అర్జున్, 'కిక్' శ్యామ్, రవి కిషన్, బ్రహ్మానందం యాక్టింగ్ శృతి హాసన్ గ్లామర్ సాంగ్స్, కామెడీ మైనస్ పాయింట్స్: రొటీన్ కథ ఫైట్స్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన క్రేజీ ప్రాజెక్ట్ 'రేసుగుర్రం' ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది. దానికి తోడుగా ఆడియోకు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 11న విడుదలైన రేసుగుర్రం ఎలాంటి అనుభూతిని మిగిల్చిందో తెలుసుకోవాలంటే ముందు కథ గురించి తెలుసుకోవాల్సిందే. లక్ష్మణ్ ఉరప్ లక్కీ, రామ్ ఇద్దరూ అన్నదమ్ములు. నీతి, నిజాయితీ ఉన్న బాధ్యతాయుతమైన పోలీస్ ఆఫీసర్ రామ్, ఎప్పుడూ జల్సాగా తిరిగే లక్కీలకు క్షణం కూడా పడదు. ఎప్పుడూ ఏదో ఒక కారణంతో గొడవ పడుతుంటారు. ఈ క్రమంలో స్పందన (శృతి హాసన్)తో లక్కీ ప్రేమలో పడతాడు. అయితే ఓ కారణంగా లక్కీ, స్పందన ప్రేమ వ్యవహారానికి బ్రేక్ వేసేందుకు రామ్ ప్లాన్ వేస్తాడు. శృతిని తనకు దక్కకుండా చేసిన రామ్‌కు తగిన గుణపాఠం చెప్పాలని అతని పోలీస్ కారును దొంగిలిస్తాడు. లక్కీ దొంగిలించిన కారులో ఉన్నది రామ్ అనుకుని రాజకీయవేత్తగా మారిన రౌడీ మద్దాలి శివారెడ్డి వర్గం ఎటాక్ చేసి చంపాలనుకుంటాడు. ఆ దాడి నుంచి లక్కీ క్షేమంగా బయటపడుతాడు. ఆ దాడి నుంచి బయటపడిన శివారెడ్డి ఏం చేశాడు? శివారెడ్డికి రామ్ మధ్య శతృత్వానికి కారణమేంటి? లక్కీ, స్పందనల ప్రేమ వ్యవహారాన్ని రామ్ ఎందుకు బ్రేక్ చేయాలనుకుంటాడు? రామ్, లక్కీల మధ్య ఉన్న మనస్పర్ధలు ఎలా తొలగిపోయాయి అనే సమస్యలకు ముంగిపే 'రేసుగుర్రం' చిత్ర కథ. పెర్ఫార్మెన్స్: అల్లు అర్జున్‌లో ఎనర్జీ లక్కీ పాత్రకు సూట్ అయింది. యాక్షన్, ఎంటర్టైన్ మెంట్, లవ్ సీన్స్‌లో నటించడం అర్జున్‌కు కొత్తేమీ కాదు. తనదైన శైలిలో లక్కీ పాత్రలో ఉండే వివిధ కోణాలకు అల్లు అర్జున్ న్యాయం చేకూర్చారు. స్పందనగా శృతి హాసన్ గత చిత్రాల్లో ఎన్నడూ లేనంతగా గ్లామర్ పరంగా ఆకట్టుకుంది. స్పందన పాత్రలో ఓ ఢిఫరెంట్ యాంగిల్ ఉంటుంది. దాన్ని శృతి హాసన్ బాగా పండించింది. కిక్ శ్యామ్ ప్రేయసిగా సలోని గెస్ట్ గా కనిపించింది. ఈ చిత్రంలో తనకు లభించిన సీన్లలో తెలంగాణ యాసలో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది కానీ అంతగా గుర్తుండిపోయే పాత్రేమీ కాదు. కిక్ శ్యామ్ పోలీస్ ఆఫీసర్‌గా, అల్లు అర్జున్ అన్నగా పర్వాలేదనిపించాడు. కిక్ తర్వాత అలాంటి తరహా పాత్రనే రిపీట్ చేశాడా అనిపించింది. మెయిన్ విలన్‌గా మద్దెల శివారెడ్డి పాత్రలో భోజ్‌పూరి నటుడు రవికిషన్ నటించాడు. రౌడీగా మారిన రాజకీయవేత్తగా రవికిషన్ వీలైనంత మేరకు మంచి నటనే అందించాడు. మరోసారి బ్రహ్మనందం కామెడీతో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. ఓ ప్రత్యేక పోలీస్ ఆఫీసర్ కిల్ బిల్ పాండే గా క్లైమాక్స్‌లో హంగామా చేశాడు. ప్రీ క్లైమాక్స్ ఎంటరై.. క్లైమాక్స్ వరకు చిత్ర భారాన్ని తన భుజాలపై బ్రహ్మానందం ఎత్తుకున్నాడు. చిత్రమంతా రొటీన్‌గా ఉందే అనుకునే సమయంలో మరోసారి తన ప్రతిభతో ప్రేక్షకులకు కొంత ఊరట కలిగించాడు. శ్రీనివాస్ రెడ్డి, తాగుబోతు రమేశ్ తదితర కమెడియన్లు తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు. స్పందన తండ్రిగా ప్రకాశ్ రాజ్ నటించాడు. కొన్ని సీన్లకు తనదైన స్టైల్లో ప్రకాశ్ రాజ్ న్యాయం చేశాడు. మిగతా పాత్రల్లో తనికెళ్ల భరణి, ముఖేశ్ రుషి నటించారు. టెక్నికల్: తమన్ సంగీతం, ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోరు కీలక సన్నివేశాలకు మంచి సపోర్ట్ ఇచ్చింది. పాటల్లో అర్జున్ పై చిత్రీకరించిన సోలో సాంగ్... బూచోడే, 'సినిమా చూపిస్త మామా' పాటలు ఆడియో పరంగానే కాకుండా తెరపై కూడా ఆకట్టుకున్నాయి. టెక్నికల్ అంశాలు చూస్తే మనోజ్ పరమహంస కెమెరా చాలా రిచ్‌గా ఉంది. శృతి హాసన్, అల్లు అర్జున్ క్యాస్టూమ్ అదిరిపోయేలా ఉన్నాయి. కొత్త లుక్ తో డిజైన్ చేసిన క్యాస్టూమ్ శృతి, అల్లు అర్జున్ కు మరింత గ్లామర్ ను పెంచాయి. డైరెక్షన్: టేకింగ్‌లో దర్శకుడు సురేందర్ రెడ్డి టాలీవుడ్లో విలక్షణమైన శైలి అని గత చిత్రాలతో నిరూపించుకున్నాడు. ఈ చిత్రం విషయానికి వస్తే కథ కన్నా అల్లు అర్జున్‌లోని స్టైలిష్ పెర్ఫార్మెన్స్, బ్రహ్మనందం కామెడీనే ఎక్కువగా నమ్ముకున్నట్టు కనిపిస్తుంది. కిక్ సినిమాలో ఆలీ క్యారెక్టర్‌ను కొనసాగింపుగా ఈ చిత్రంలో ఇంట్రడ్యూస్ చేసినా సరైన స్పేస్ లేని కారణంగానో, ఇతర పరిమితుల కారణంగానో బెడిసి కొట్టింది. ముఖేశ్ రుషి, ప్రకాశ్ రాజ్, తనికెళ్ల భరణి, జయప్రకాశ్ క్యారెక్టర్లను సరైన దృష్టి పెట్టకుండా వదిలేశాడనే ఓ చిన్న ఫీలింగ్ కలుగుతుంది. రొటీన్ కథ, కొత్తదనం లేని విలనిజంతో చేసిన సాహసం అనుకున్నంతగా ఫలితాన్ని ఇవ్వకపోయినా.. క్లైమాక్స్‌లో బ్రహ్మానందాన్ని తీసుకొచ్చి మంచి మార్కులే కొట్టేశారు. బ్రహ్మనందం ఎపిసోడ్ నడిపించిన తీరు గ్రిప్పింగ్ గా ఉంది. ఈ చిత్రంలోని 'రేసుగుర్రం' అర్జున్ ఎనర్జీని బ్రహ్మానందానికి ఇచ్చేసి రొటీన్‌కు భిన్నంగా కొత్త ముగింపు ఇచ్చే ప్రయత్నం చేశారు. సెకంఢాఫ్ లో కథపై కొంత ఎక్సర్ సైజ్ చేసి ఉంటే మంచి ఫలితాలన్ని రాబట్టే అవకాశం ఉండేది. మార్కెట్లో ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ పై దృష్టి సారిస్తున్నారనే ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా మాస్, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ అంశాలను జోడించి రేసుగుర్రాన్ని పరిగెత్తించిన సురేందర్ రెడ్డి... వినోదాన్ని ఆశించిన ప్రేక్షకుల్లో సంతృప్తి నింపి.. కొత్తదనం ఆశించిన వారిని కొంచెం నిరాశకు గురి చేశాడు. ట్యాగ్: బ్రహ్మీ బలంతో పరుగెత్తిన రేసుగుర్రం -
అభిమానులంతా ఓటర్లే!
భోజ్‌పురి, హిందీ సినిమాలతో బిజీబిజీగా ఉండే రవికిషన్ షూటింగులను పక్కనబెట్టి ఎన్నికల బరిలో దిగాడు. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్పూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభకు పోటీ చేస్తున్నాడు. ఇక్కడున్న తన అభిమానులందరినీ ఓట్లుగా మార్చుకుంటానని నమ్మకంగా చెబుతున్నాడు. ‘అభిమానులంతా నాకే ఓటేస్తారన్న నమ్మకం ఉంది. నేను బయటి మనిషినేమీ కాదు. వారిలో ఒకడిని. మా తల్లిదండ్రులు ఇక్కడే ఉంటున్నారు. జౌన్పూర్ సమస్యల గురించి నాకు పూర్తిగా తెలుసు’ అని ఈ 42 ఏళ్ల నటుడు అన్నాడు. రవి రాజకీయాలకు కొత్తే అయినా సినిమాల్లోనూ కొనసాగాలని అనుకుంటున్నాడు. నటించడం ఆపేసిన రోజు మరణించినట్టేనని, హిందీ, భోజ్‌పురితోపాటు మరాఠీ, తెలుగు సినిమాల్లోనూ నటిస్తున్నానని చెప్పాడు. పండిట్ జీ బతాయినా బియా కబ్ హొయి, రావణ్, గంగా, బన్కే బీహారీ ఎమ్మెల్యే వంటి సినిమాలు ఇతడికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. స్థానిక సినిమాలకు అందించిన సహకారమే తనకు మేలు చేస్తుందని ఇప్పటికే 200 భోజ్‌పురి సినిమాల్లో నటించిన రవి అన్నాడు. ‘భోజ్‌పురి సినిమాల అభివృద్ధికి నేను ఎంతో కృషి చేశాను. నా సినిమాలే నా బలం. అయితే ఎన్నికల ప్రచారంలో సినిమా డైలాగులు కొట్టడం నాకు నచ్చదు. స్థానిక సమస్యలపైనే శ్రద్ధ చూపిస్తాను. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ స్ఫూర్తిగా నేను రాజకీయాల్లోకి వచ్చాను. గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నాను కాబట్టి ఇదే పార్టీ టికెట్‌పై పోటీ చేస్తున్నాను. నేను రాజీవ్‌గాంధీకి వీరాభిమానిని. భోజ్‌పురి సినిమా కేంద్రంగా జౌన్పూర్ తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ కనీస సదుపాయాలు కూడా లేవు కాబట్టే షూటింగులు చేయడం సాధ్యపడడం లేదని నా బాలీవుడ్ స్నేహితులు చెబుతుంటారు. వాటి కొరత లేకుండా నేను చేస్తాను’ అని వివరించాడు. పట్టణంలో భారీ స్టేడియంతోపాటు ప్రతి ఇంటికీ టాయిలెట్ ఉండేలా కృషి చేస్తానని రవికిషన్ వాగ్దానం చేశాడు. -
ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతున్న సినీ నటుడు!
మరో సినీ నటుడు రాజకీయ ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. భోజ్ పూరి నటుడు రవి కిషన్ వచ్చే లోకసభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ లోని స్వంత జిల్లా జాన్ పూర్ లో ఎన్నికల్లో పోటి చేసేందుకు సిద్దమవుతున్నారు. కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తన రక్తంలోనే కాంగ్రెస్ ఉంది. టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాను. కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించే విషయంలో సానుకూలంగా స్పందింస్తుంది అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే తనతో ఇతర పార్టీల వారు కూడా తనతో టచ్ లో ఉన్నారని, కాని తాను కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నాను అని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. బాలీవుడ్ చిత్రాలు ఫిర్ హెరా ఫెరీ, ఏజెంట్ వినోద్, బుల్లెట్ రాజాతోపాటు పలు భోజ్ పూరి చిత్రాల్లో రవి కిషన్ నటించారు. -
సంక్రాంతి రేసులో గుర్రం
అల్లు అర్జున్ సంక్రాంతి బరిలో దిగడానికి ‘రేసుగుర్రం’లా సిద్ధమవుతున్నారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఆయన చేస్తున్న ‘రేసుగుర్రం’ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో శ్రుతిహాసన్ కథానాయిక. వీరిద్దరి కలయికలో ఇదే తొలి చిత్రం. బన్నీ చిత్రానికి తమన్ స్వరాలందించడం కూడా ఇదే తొలిసారి. భోజ్‌పురిలో అగ్రకథానాయకుడిగా వెలుగొందుతోన్న రవికిషన్ ఇందులో ప్రతినాయకునిగా నటిస్తుండటం విశేషం. నానక్‌రామ్‌గూడాలోని రామానాయుడు సినీ విలేజ్‌లో వేసిన విలన్ హౌస్ సెట్లో ప్రస్తుతం అల్లు అర్జున్, రవికిషన్, ముఖేష్‌రిషి తదితరులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ నెల 15న మొదలైన ఈ షెడ్యూలు చిత్రం పూర్తయ్యే వరకూ నిర్విరామంగా జరుగుతుంది. ఇప్పటికే మూడు పాటల చిత్రీకరణ పూర్తయింది. మిగిలిన పాటలను కూడా ఈ షెడ్యూల్లోనే చిత్రీకరించనున్నారు. ఇందులో బన్నీ పాత్ర చిత్రణ చాలా విభిన్నంగా ఉంటుందని సమాచారం. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబరులో పాటలను, సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ‘కిక్’ శ్యామ్, సలోని ఇందులో ముఖ్యతారలు.