నా తండ్రే నన్ను మట్టుబెట్టాలని చూశాడు: రేసుగుర్రం విలన్‌ | Ravi Kishan Reveals About His Troubled Relationship with Father, Deets Inside - Sakshi
Sakshi News home page

Ravi Kishan: నాన్న చావబాదేవాడు.. తను ఊపిరి వదిలేముందు..

Published Sat, Mar 16 2024 12:22 PM | Last Updated on Sat, Mar 16 2024 2:03 PM

Ravi Kishan About His Troubled Relationship with Father - Sakshi

ప్రముఖ నటుడు రవికిషన్‌ తెలుగు, భోజ్‌పురి, హిందీ భాషల్లో అనేక సినిమాలు చేశాడు. కానీ తెలుగువారికి మాత్రం ఇతడు రేసుగుర్రం విలన్‌ మద్దాలి శివారెడ్డిగానే గుర్తుండిపోయాడు. సినిమాలతో కావాల్సినంత గుర్తింపు తెచ్చుకున్న ఇతడు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ ఎంపీగా సేవలందిస్తున్నాడు. రాజకీయాల్లో ఉన్నప్పటికీ సినిమాలకు దూరం కాలేదు. ఇటీవలే లాపట్ట లేడీస్‌ అనే సినిమాలో కనిపించాడు. 

నాన్నకు కోపం ఎక్కువ
తాజాగా అతడు తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. 'మా నాన్నకు కోపం చాలా ఎక్కువ. నన్ను చితక్కొట్టేవాడు.. సింపుల్‌గా చెప్పాలంటే చంపేందుకు కూడా వెనుకాడలేదు. అలా ఓ రోజు నన్ను చంపాలన్న కోపంతో కనిపించాడు. అది గమనించిన అమ్మ నన్ను పారిపోమని చెప్పింది. వెంటనే ఆలస్యం చేయకుండా రూ.500 జేబులో పెట్టుకుని ఇంట్లో నుంచి పారిపోయి ముంబై ట్రైన్‌ ఎక్కాను.

నటుడినవుతానంటే..
నాన్న కోపం వెనక అర్థం ఉంది. ఆయనొక పూజారి. ఒక బ్రాహ్మణుడిగా తన కొడుకు కూడా పూజారే కావాలని ఆశపడ్డాడు. లేదంటే వ్యవసాయం చేయాలి, అదీ లేదంటే ప్రభుత్వ ఉద్యోగిగానైనా స్థిరపడాలని ఆశించాడు. తన కుటుంబంలో ఒక ఆర్టిస్టు పుడతాడని అస్సలు ఊహించలేదు. ఒకసారి నేను సీతలా వేషం వేసుకుని నటిస్తూ, డ్యాన్స్‌ చేస్తూ ఉంటే షాకైపోయాడు. అయితే అతడి దెబ్బల వల్లే నాకు జీవితమంటే ఏంటో తెలుసొచ్చింది. ప్రతి దండన ఒక పాఠమే అనుకున్నాను. తన వల్లే ఈ రోజు రవికిషన్‌గా మీ ముందు నిలబడ్డాను.

చివరి క్షణాల్లో..
నేను నటుడిగా స్థిరపడ్డాక నా ఎదుగుదల చూసి ఆయన ఎంతో సంతోషించాడు. ఆయన చావుకు దగ్గరైనప్పుడు కూడా నన్ను చూసి గర్వంగా ఉందని చెప్పి కన్నుమూశాడు' అని ఎమోషనలయ్యాడు. కాగా రవికిషన్‌ ప్రస్తుతం 'మామ్లా లీగల్‌ హై' అనే వెబ్‌ సిరీస్‌లో నటించాడు. ఈ సిరీస్‌ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండ్‌ అవుతోంది.

చదవండి: ఆమెతో కితకితలకు ప్రయత్నించా..వర్కౌట్‌ కాలేదు: హీరో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement