ఒక్కసారి స్టార్‌డమ్‌ను తలకెక్కించుకుంటే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఎలాగో స్టార్‌ను అయ్యాను కదా అని గొంతెమ్మ కోర్కెలు కోరితే మొదటికే మోసం వస్తుంది. అందుకు ప్రముఖ నటుడు, ఎంపీ రవి కిషన్ ప్రత్యక్ష ఉదాహరణ. స్టార్‌డమ్‌తో గర్వాన్ని తలకెక్కించుకోవద్దని ఓ సంఘటన తనకు గుణపాఠం చెప్పిందంటున్నాడు రవి కిషన్.
తాజాగా ఓ షోలో ఆయన మాట్లాడుతూ.. 'గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ సినిమా కోసం నన్ను సంప్రదించారు. నేనేమో పెద్ద స్టార్‌నన్న గర్వంతో.. రోజూ పాలతో స్నానం చేస్తా, గులాబీ పూల రెక్కలపై నిద్రిస్తా.. అవన్నీ మీరే ఏర్పాటు చేయాలని చెప్పాను. ఎందుకంటే నేను స్టార్‌ను, ఇలాంటివి మినిమమ్ ఉండాలి కదా అన్న భ్రమలో ఉన్నాను. అప్పుడు జనాలు నా గురించి మాట్లాడుకుంటారని ఊహించాను. కానీ నేను అనుకుంది ఒకటైతే జరిగింది మరొకటి. నన్ను గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్‌లో తీసుకోలేదు. నాకోసం రోజూ 25 లీటర్ల పాలు ఏర్పాటు చేయడం అసాధ్యమన్నారు.
నా డిమాండ్లు నాకే హాని తలపెట్టాయి. కాబట్టి అప్పటినుంచి అలాంటి డిమాండ్లు చేయడం మానేశాను. ఏమీ లేని స్థాయి నుంచి వచ్చినప్పుడు సడన్‌గా డబ్బు, పేరుప్రతిష్టలు వచ్చినప్పుడు మనసును నియంత్రించడం చాలా కష్టం. ముంబైలాంటి నగరం ఎవరినైనా పిచ్చోళ్లను చేస్తుంది. అందులో నేనూ ఒకడిని. అందుకే నేను నాపై నియంత్రణ కోల్పోయాను' అని చెప్పుకొచ్చాడు. కాగా రవి కిషన్.. భోజ్‌పురి ఇండస్ట్రీలో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లోనూ పలు చిత్రాలు చేశాడు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు రేసుగుర్రం విలన్‌గానే ఎక్కువ గుర్తుండిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment