
బహు భాషా నటుడు, భోజ్‌పురి హీరో రవికిషన్ 2019 జనరల్ ఎలక్షన్స్‌లో బీజేపీ బరిలో దిగారు. 2014లో కాంగ్రెస్‌పార్టీ తరుపున జౌన్సూర్ నుంచి బరిలో నిలిచిన రవికిషన్, ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ నియోజక వర్గం నుంచి లోక్‌సభకు పోటి చేశారు. దాదాపు 3 లక్షలకు పైగా మేజార్టీతో ఘన విజయం సాధించారు.
1998 నుంచి 2017 వరకు యోగి ఆదిత్యనాథ్ ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. అంతేకాదు ప్రస్తుత ఎలక్షన్లలోనూ రవికిషన్ తరుపున ప్రచార బాధ్యతను కూడా యోగినే తీసుకున్నారు. దీంతో రవికిషన్ గెలుపు మరింత సులువైంది. అయితే రవికిషన్ గోరఖ్‌పూర్ వాస్తవ్యూడు కాకపోవటంతో కాస్త తొలుత కాస్త ప్రతికూలత వాతావరణం కనిపించిన చిరవకు ఓటర్లు ఆయనకే పట్టం కట్టారు.
2014 ఎన్నికల్లో పోటి చేసిన సమయంలో ఇచ్చిన అఫిడవిట్‌లో డిగ్రీ పట్టభద్రుడిగా పేర్కొన్న రవికిషన్ ఈ ఎన్నికల్లో మాత్రం తాను ఇంటర్‌మీడియట్ పాసైనట్టుగా అఫిడవిట్ దాఖలు చేయటంపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. అయితే అన్ని అడ్డంకులను చేధించిన 3,01,664 ఓట్లతో ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రవికిషన్ నిజం గెలిచిందంటూ వ్యాఖ్యానించారు.