
'రేసుగుర్రం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు రవికిషన్. స్వతహాగా ఇతడికి బిహార్. భోజ్‌పురి భాషలో బోలెడన్ని సినిమాలు చేశాడు. ప్రస్తుతం రాజకీయాల్లో ఉండటం వల్ల నటన తగ్గించేశాడు. రీసెంట్‌గా ఢిల్లీలోని సాహిత్య ఆజ్‌తక్ కార్యక్రమంలో పాల్గొన్న ఇతడు.. తన జూనియర్లు భోజ్‌పురి ఇండస్ట్రీ పరువు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
(ఇదీ చదవండి: 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న నటుడు సుబ్బరాజ్)
'ఇప్పుడొస్తున్న చాలామంది నటీనటులు భోజ్‌పురి చిత్రపరిశ్రమ ఖ్యాతి నాశనం చేస్తున్నారు. నేను భోజ్‌పురి ఇండస్ట్రీలో మూడో జనరేషన్‌లో వచ్చాను. నా తర్వాత వచ్చేవాళ్ల కోసం అన్ని ఏర్పాటు చేశాం. కానీ వాళ్లీ దీన్ని సరిగా ఉపయోగించుకోలేకపోతున్నారు. చెప్పాలంటే ఇండస్ట్రీ పరువు తీస్తున్నారు. భోజ్‌పురి 25 కోట్లమంది మాట్లాడే భాష. ఇందుకు నేను చాలా గర్వపడుతున్నాను'
'భోజ్‌పురి ఇండస్ట్రీ.. చాలామందికి జాబ్స్ కల్పిస్తోంది. అయినాసరే చిన్నచూపు చూస్తున్నారు. ఈ రోజు ఇండస్ట్రీలో లక్ష మందికి పైగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు' అని రవికిషన్ తన ఆవేదన వ్యక్తం చేశారు. 2002లో భోజ్‍పురి నటుడిగా ఈయన కెరీర్ ప్రారంభించాడు. తెలుగులోనూ రేసుగుర్రం, సుప్రీం, సైరా తదితర సినిమాలలో నటించారు.
(ఇదీ చదవండి: 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)
Comments
Please login to add a commentAdd a comment