పార్లమెంట్‌లో గళమెత్తిన ‘రేసుగుర్రం విలన్‌’ | MP Ravi Kishan Comments Over Bollywood Drug Connection In Parliamentary Sessions | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ కేసు: పార్లమెంట్‌లో గళమెత్తిన ఎంపీ రవికిషన్‌

Published Mon, Sep 14 2020 12:58 PM | Last Updated on Mon, Sep 14 2020 2:58 PM

MP Ravi Kishan Comments Over Bollywood Drug Connection In Parliamentary Sessions - Sakshi

రవి కిషన్‌

న్యూఢిల్లీ : డ్రగ్స్‌ కేసుతో బాలీవుడ్‌కు ఉన్న సంబంధాలపై నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ ‌( రేసుగుర్రం విలన్‌ మద్దాలి శివారెడ్డి) గళమెత్తారు. బాలీవుడ్‌లో మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని అన్నారు. దేశ యువతను నాశనం చేయటానికి కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. పొరుగుదేశాలు ఇందుకు సహకారం అందిస్తున్నాయన్నారు. సోమవారం నాటి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్‌, చైనాలనుంచి ప్రతి ఏటా మత్తు పదార్థాలు దేశంలోకి అక్రమంగా రవాణా అవుతున్నాయని, నేపాల్‌, పంజాబ్‌ ద్వారా దేశంలోకి వస్తున్నాయని పేర్కొన్నారు. ( డ్రగ్స్‌‌ కేసు: రాగిణి ద్వివేదీ చీటింగ్‌ )

డ్రగ్స్‌ కేసుతో సంబంధం ఉన్న కొంతమందిని అరెస్ట్‌ చేసి, ఎన్‌సీబీ మంచి పనిచేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని, కేసుతో సంబంధం ఉన్న మిగిలిన దోషులను వెంటనే పట్టుకుని శిక్షించాలని కోరారు. పొరుగు దేశాల కుట్రకు శుభం కార్డు వేయాలన్నారు. ( ‘ఏయ్‌.. నేను నిజంగానే ఎంపీ అయ్యాను’)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement