లోక్ సభ ఎన్నికల సమయంలో నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్‌కు కాస్త ఊరట లభించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికల బరిలో ఉన్నారు. ఇలాంటి సమయంలో రవికిషన్ తన అండ్రి అంటూ జూనియర్ నటి షినోవా సోనీ తెరపైకి వచ్చింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె ముంమై కోర్టును ఆశ్రయించింది.
భోజ్ పురి, హిందీ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న రవికిషన్.. అల్లు అర్జున్ 'రేసుగుర్రం' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2019లో గోరఖ్ పుర్ నుంచి ఎంపీగా గెలిచిన ఆయన మరొసారి ఎన్నికల బరిలో ఉన్నాడు. సరిగ్గా ఇలాంటి సమయంలో రవి కిషన్ తన భర్త అంటూ కొద్ది రోజుల క్రితం షినోవా సోనీ తల్లి అపర్ణా సోనీ విలేకరుల సమావేశంలో ప్రకటించింది.
(రవి కిషన్ సతీమణి ప్రీతి)
రవికిషన్ నుంచి సరైన రెస్పాన్స్ రాకపోవడంతో షినోవా సోనీ తన తల్లితో కోర్టుకు వెళ్లింది. డీఎన్‌ఏ పరీక్ష చేయాలని తన లాయర్ ద్వారా పిటీషన్ దాఖలు చేసింది. రవికిషన్‌ను తాను అంకులు అని పిలుస్తాను. కానీ, ఆయన తనకు తండ్రి అని ఆమె చెప్పింది. ఆమె మాటల్లో నిజం లేదని రవికిషన్ లాయర్ చెప్పారు. అపర్ణతో రవికిషన్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. వారిద్దరి మంచి స్నేహ బంధం మాత్రమే ఉందని పేర్కొన్నారు. ఎలాంటి రిలేషన్ కూడా లేదన్నారు. అపర్ణ, రవికిషన్ రిలేషన్‌లో ఉన్నారని చెప్పేందుకు కనీసం ఒక్క ఆధారం అయినా చూపించకపోవడంతో డీఎన్‌ఏ పరీక్షను కోర్టు తిరస్కరించింది. గతంలో తమకు రూ.20 కోట్లు ఇవ్వాలని బెదిరించినట్లు రవికిషన్ సతీమణి తెలిపారు. ఒకవేళ డబ్బు ఇవ్వకుంటే అత్యాచారం కేసులో రవికిషన్‌ను ఇరికిస్తామంటూ షినోవా సోనీ, అపర్ణ బెదిరించారని ఆమె తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment