పిల్లలు బాగా చదువుకుని గొప్ప ఉద్యోగం చేయాలని పేరెంట్స్ కలలు కంటుంటారు. తాము పడ్డ కష్టాలు వారు పడకూడదని ఆలోచిస్తారు. అయితే ఉద్యోగం చేయడం అందరికీ ఇష్టం ఉండదు. కొందరికి తెలియకుండానే నటనవైపు మనసు మళ్లుతుంది. అలా నటుడు, రాజకీయ నాయకుడు రవి కిషన్ కూడా చిన్నతనంలోనే యాక్టింగ్‌పై మనసు పారేసుకున్నాడు. కానీ ఇది అతడి తండ్రికి ఏమాత్రం ఇష్టం లేదు. ఒకసారైతే అతడిని విపరీతంగా కొట్టి చర్మం ఒలిచేశాడు.
చర్మం ఊడిపోయేలా కొట్టాడు
ఈ సంఘటన గురించి రవి కిషన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మా ఊరిలో రామ్‌లీలా అనే నాటకం వేసేవారు. నేను అందులో సీతలా నటించేవాడిని. ఒకరోజు మా నాన్నకు ఆ విషయం తెలిసింది. అప్పుడు నేను మా అమ్మ చీర తీసుకెళ్లి దానితో రోజంతా రిహార్సల్ చేశాను. ఇంటికి వెళ్లగానే మా నాన్న బెల్ట్ అందుకుని వాయించాడు. నా చర్మం ఊడిపోయేలా కొట్టాడు. మా ఊరిలో నాన్నకు మంచి పేరుంది. తనకు అందరూ ఎంతో గౌరవించేవారు. బహుశా అందుకునేమో నేనిలా అమ్మాయిలా వేషం కట్టి యాక్ట్ చేస్తుంటే భరించలేకపోయారు.
ఆ రోజే ఇంటి నుంచి పారిపోయా
అయితే ఆ కోపంతో నాన్న నన్నెక్కడ చంపేస్తాడోనని అమ్మ భయపడింది. అదే రోజు రాత్రి నా చేతిలో రూ.500 పెట్టి పారిపోమని చెప్పింది. అలా 15 ఏళ్ల వయసులో నేను ఇంటి నుంచి పారిపోయి ముంబైకు వచ్చాను అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే రవికిషన్ హిందీ, భోజ్‌పురి, తెలుగు భాషల్లో అనేక చిత్రాల్లో నటించాడు. రేసుగుర్రం మూవీతో తెలుగువారికి ఎంతగానో దగ్గరైన ఈయన ప్రస్తుతం డాకు మహారాజ్ మూవీ చేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment