
రేసుగుర్రం విలన్‌కు గాయాలు
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా రేసుగుర్రంతో తెలుగు ఆడియన్స్కు పరిచయం అయన నటుడు రవికిషన్. భోజ్పురిలో స్టార్ హీరోగా ఉన్న రవికిషన్ తెలుగు ప్రేక్షకులకు మాత్రం విలన్గా పరిచయం అయ్యాడు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సుప్రీం సినిమాలో నటిస్తున్న రవికిషన్, ఓ ఫైట్ సీన్ షూటింగ్ సమయంలో గాయపడ్డాడు.
పటాస్ ఫేం అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ షూటింగ్ ప్రస్తుతం రాజస్థాన్లో జరుగుతోంది. సాయిధరమ్ తేజ్, రవికిషన్ల మధ్య ఫైట్ సీన్ షూట్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో రవికిషన్ గాయపడ్డాడు. అక్కడే ప్రాథమిక చికిత్స అందించిన చిత్రయూనిట్, మెరుగైన వైద్యం కోసం ఆయన్ను ముంబై తరలించారు.