
'గ్యాంగ్ లీడర్'గా సాయి
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో బిగెస్ట్ హిట్స్లో గ్యాంగ్ లీడర్ సినిమా ఒకటి. ఈ సినిమాతో మాస్ ప్రేక్షకుల ఆరాధ్య దైవంగా మారిపోయాడు మెగాస్టార్. యాక్షన్, రొమాన్స్, సెంటిమెంట్ ఇలా అన్ని ఎమోషన్స్ సమపాళ్లలో ఉన్న ఈ సినిమా అప్పట్లో ఘనవిజయం సాధించింది. అయితే ఇంతటి ఘనవిజయం సాధించిన ఈ సినిమా టైటిల్ను ఇప్పుడు ఓ మెగా వారసుడు వాడేస్తున్నాడు.
చాలా కాలంగా గ్యాంగ్ లీడర్ సినిమాను చరణ్ హీరోగా రీమేక్ చేస్తారన్న టాక్ వినిపించింది. అయితే ఈ విషయం పై ఎలాంటి క్లారిటీ రాకముందే గ్యాంగ్ లీడర్ టైటిల్ను మరో మెగా వారసుడు సాయిధరమ్ తేజ్ వాడేస్తున్నాడు. ఇప్పటికే చిరు సినిమా టైటిల్ సుప్రీంను తీసుకున్న సాయి తన నెక్ట్స్ సినిమాకు గ్యాంగ్ లీడర్ టైటిల్ను ఫైనల్ చేశాడట.
గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న మాస్ మసాలా ఎంటర్టైనర్కు ఈ టైటిల్ను ఫిక్స్ చేశాడన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను నల్లమలపు శ్రీను భారీగా నిర్మించడానికి రెడీ అవుతున్నాడు. గతంలో గోపిచంద్ దర్శతక్వంలో వరుణ్ హీరోగా ఓ సినిమా ఉంటుందన్న టాక్ వినిపించింది. మరి అదే సినిమాను సాయితో తెరకెక్కిస్తున్నారా లేక ఇది వేరే కథా..? అన్న విషయం పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.