Gang Leader
-
ఇంటర్వ్యూ కోసం వెళ్తే.. కిడ్నాప్ చేశారు
ఈరోజుల్లో యూట్యూబర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. కొందరు జెన్యూన్‌గా సబ్ స్క్రైబర్లను పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. మరికొందరు మాత్రం రకరకాల ఫీట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో.. కాస్త ఫేమ్ సంపాదించుకున్న ఓ యూట్యూబర్ సాహసం ప్రదర్శించబోయి చిక్కుల్లో పడ్డాడు. జార్జియాకు చెందిన యూట్యూబర్ అడిసన్ పీయెర్రె మాలౌఫ్(యూట్యూబ్‌లో YourFellowArab/Arab). ప్రపంచంలో ప్రమాదకరమైన ప్రాంతాలుగా పేరున్న చోట్లకు వెళ్తూ.. అత్యంత ప్రమాదకరమైన వ్యక్తుల్ని ఇంటర్వ్యూలు చేస్తూ ఆ వీడియోలతో 1.4 మిలియన్ సబ్స్కయిబర్లను సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో.. కరేబియన్ దేశం హైతీలో ఓ ముఠా నాయకుడ్ని ఇంటర్వ్యూ చేయాలని డిసైడ్ అయ్యాడు. మావోజో అనే ముఠా నాయకుడు జిమ్మీ ‘బార్బీక్యూ’ చెరిజైర్కు హైతీలోనే కరడుగట్టిన గ్యాంగ్ లీడర్‌గా పేరుంది. అలాంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడానికి అడిసన్ వెళ్లాడు. ఇందుకోసం హైతీలో ఓ స్థానిక టూరిస్ట్ సాయం తీసుకున్నాడు. అయితే.. ఆ గ్యాంగ్ ఉండే ప్రాంతానికి వెళ్లగానే వాళ్లిద్దరినీ తుపాకులతో 400 మంది చుట్టుముట్టారు. వదిలిపెట్టాలంటే 6 లక్షల డాలర్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. this is the last footage arab uploaded for me before he got kidnapped pic.twitter.com/vRbYdarPn1 — masih (@VFXmasih) March 29, 2024 తన దగ్గరున్న 40 వేల డాలర్లను వాళ్లకు ఇచ్చేసి విడిచిపెట్టమని అడిసన్ బతిమాలాడట. అయితే ఆ ముఠా అవి లాగసుకుని.. మిగతాది ఇస్తేనే రిలీజ్ చేస్తామని షాకిచ్చింది ఆ గ్యాంగ్. దీంతో తన స్నేహితుల కాంటాక్ట్ కోసం అడిసన్ ప్రయత్నిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో.. మార్చి 14వ తేదీన అడిసన్ను మావోజో ముఠా కిడ్నాప్ చేయగా, రెండు వారాలు ఆలస్యంగా ఆ విషయం బయటి ప్రపంచానికి తెలిసిందే. తోటి యూట్యూబర్ ఒకరు ఈ సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అతన్ని విడిపించేందుకు అవసరమైన డబ్బును సమీకరించేందుకు కొందరు యూట్యూబర్లు ముందుకు వచ్చారు. -
నాని 'గ్యాంగ్ లీడర్' హీరోయిన్ అలాంటి సినిమా చేసిందా..?
కథానాయికలు ఒక స్థాయికి చేరే వరకు పీత కష్టాలు పీతవి అన్నట్లు వారి కష్టాలు వారికి ఉంటాయి. ఆ తర్వాత వారేంటో చూపిస్తారు. నటి ప్రియాంకా అరుళ్ మోహనన్ కూడా ఇందుకు అతీతం కాదన్నది ఇటీవలే తెలిసింది. ఈ కన్నడ బ్యూటీ చదివింది ఇంజినీరింగ్. అయితే ఎంచుకున్న వృత్తి మాత్రం నటన. మొదట్లో మోడలింగ్ చేసిన ఆ తర్వాత మాతృభాషలో కథానాయకిగా సినీ రంగప్రవేశం చేశారు. కన్నడ చిత్రంలో నటించిన వెంటనే తెలుగు చిత్రంలో లభించే అవకాశం వరించింది అలా విక్రమ్‌కుమార్ నానీకి జంటగా గ్యాంగ్ లీడర్ చిత్రంలో నటించారు. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా ప్రియాంక తన నటనతో అందరి దృష్టిలో పడ్డారు. అలాంటి సమయంలో డాక్టర్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. శివకార్తికేయన్ కథానాయకుడిగా నెల్సన్ దర్శకత్వం వహించిన ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత అదే హీరోతో జతకట్టి డాన్ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. దీంతో ప్రియాంకమోహన్‌కు స్టార్ ఇమేజ్ వచ్చిందనే చెప్పాలి. వరుసగా సూర్య సరసన ఎదర్కుమ్ తుణిందవన్ (ET), ధనుష్‌తో కెప్టెన్ మిల్లర్ నటించి పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో శృంగారభరితంగా నటించారా..? ఈ బ్యూటీకి అందాలారబోతలకే దూరం అనే పేరు ఉంది. తాజాగా తెలుగులోనూ నానితో సరిపోదా శనివారం చిత్రం చేస్తుంది. ప్రియాంక తమిళంలో నటించిన తొలి చిత్రం డాక్టర్ అనేది ప్రచారంలో ఉంది. అయితే అంతకుముందే ఆమె 'టిక్ టాక్' అనే చిత్రంలో నటించారు. కానీ ఈ చిత్ర ట్రైలర్ ఇటీవల విడుదలైంది. అందులో ప్రియాంకమోహన్ బెడ్ రూమ్ సన్నివేశాలు చూసి అభిమానులు షాక్ అయ్యారు. కారణం అందులో ఈ అమ్మడు శృంగారభరితంగా నటించడమే. దీంతో కెరీర్ ఆరంభంలో ఇదంతా సహజమే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె నటనకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో కనిపిస్తున్నారు. సీన్స్ కట్.. పోలీసులకు నిర్మాత ఫిర్యాదు 'టిక్ టాక్' సినిమా నుంచి ప్రియాంక మోహన్ సీన్స్ తొలగించడంతో నిర్మాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రియాంక మోహన్ 2017లో 'టిక్ టాక్' అనే తమిళ సినిమాకు సంతకం చేసినట్లు చెబుతున్నారు. నటి ప్రియాంక మోహన్‌తో మూడున్నర కోట్ల రూపాయలతో ‘టిక్‌టాక్’ సినిమా తీశానని, ఆ తర్వాతే ఆమె ఇతర సినిమాల్లో నటించి ఫేమస్ అయ్యిందని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. అయితే డిసెంబర్ 2023లో డిఎస్ఆర్ ఫిల్మ్స్ ద్వారా విడుదలైన ఈ చిత్రాన్ని చూసి నిర్మాత షాక్ అయ్యాడు. సినిమాలోని ప్రియాంక మోహన్‌కి సంబంధించిన ముఖ్యమైన 20 నిమిషాల సన్నివేశాలను నిర్మాతకు తెలియకుండా ఉద్దేశపూర్వకంగా తొలగించారు, దీంతో సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. దాంతో నిర్మాతకు మూడున్నర కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, సినిమా పరాజయానికి DSR ఫిలింస్ కారణమని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో నిర్మాతకు నష్టం కలిగించిన డీఎస్ఆర్ ఫిల్మ్, మాస్టరింగ్ ఇంజనీర్ దినేష్‌పై చర్యలు తీసుకోవాలని గతంలో పోలీసులను నిర్మాత కోరారు. ఇదంతా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. -
నాని ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో పాప ఇప్పుడు ఎలా ఉందో చూశారా? (ఫొటోలు)
-
'నాని' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీని గుర్తుపట్టగలరా..?
మెగాస్టార్ చిరంజీవి హిట్ సినిమా అయిన ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్‌తో హీరో నాని ఒక సినిమా చేశారు. 2019లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసింది. విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ఐదుగురు మహిళలు ఒక గ్రూప్‌గా ఉంటారు. కానీ వారందరూ కూడా సేమ్ గ్రూప్ ఏజ్ కాకుండా ఒక్కొక్కరిది ఒక్కో వయసు చిన్న పాప దగ్గర నుంచి బామ్మ వరకు ఉంటారు. వారిలో 'శ్రియ రెడ్డి కొంతం' అనే అమ్మాయి అందరినీ ఆకట్టుకుంది. అప్పట్లోనే ఆ అమ్మాయి ఎవరా అని చాలా మంది ఆరా తీశారు. సినిమా విడుదల సమయంలో ఆమె ఎక్కడా కూడ ఆప్రమోషన్లో పాల్గొనలేదు. సినిమా షూటింగ్ పూర్తి కాగానే ఆమెరికా వెళ్లిపోయింది. తాజాగా ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గ్యాంగ్ లీడర్ సినిమాలో కళ్ళజోడు పెట్టుకొని సాధరణంగా కనిపించిన అమ్మాయి.. ఇప్పుడు ఇలా హాట్ ఫోటోలతో మళ్లీ వైరల్ అవుతుంది.,హైదరాబాద్‌లోని తార్నాకకు చెందిన శ్రియ కొంతం ఇంటర్మిడియట్ తర్వాత పై చదువుల కోసం విదేశాలకు వెళ్లిపోయింది. ఆమెకు సినిమాలపై మక్కువ ఉండటంతో అప్పుడప్పుడు కొన్ని ఆడిషన్స్లలో పాల్గొనేది. తనకు 12 ఏళ్ల వయసులోనే విజయదేవర కొండతో థియేటర్ ఆర్టిస్ట్‌గా నటించానని చెప్పింది. తాను ఇంటర్ చదవుతున్నప్పుడు శేఖర్ కమ్ముల సినిమా కోసం ఆడిషన్ చేస్తుండగా.. అక్కడ ఒక కోఆర్డినేటర్ తనను చూసి దర్శకుడు విక్రమ్ కుమార్‌కు రిఫర్ చేస్తే అలా నాని ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంలో ఛాన్స్ దక్కినట్లు చెప్పింది. ప్రస్తుతం అమెరికాలోని బోస్టన్‌లో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన శ్రియ కొంతం ఫోటోలు తాజాగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Shriya Kontham (@shriya.kontham) -
మాట నిలబెట్టుకున్న నాని.. కొత్త సినిమా ప్రకటన.. వారిద్దరికీ ఛాన్స్
దసరా సందర్భంగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే కానుకను ఇచ్చాడు హీరో నాని. తన కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది. అందుకు సంబంధించిన ఒక టైటిల్ వీడియోను ఆయన విడుదల చేశాడు. ఈ ఏడాదిలో 'దసరా' సినిమా తర్వాత 'హాయ్ నాన్న' అనే సినిమాను డిసెంబర్ 7న విడుదల చేస్తున్నారు. ఈలోపే నాని మరో సినిమాను లైన్లో పెట్టాడు. 'సరిపోదా శనివారం' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. (ఇదీ చదవండి: బూతులను సమర్థించిన శివాజీని ఢీ కొట్టిన శోభ) ‘అంటే సుందరానికీ’ సినిమా దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తాజాగా నాని మరో సినిమాను ప్రకటించాడు. ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తుంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి ఈ సినిమాను నిర్మించనున్నారు. మాట నిలబెట్టుకున్న నాని నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది హీరోయిన్ ప్రియాంక మోహన్. కానీ ఆ సినిమా తర్వాత ఆమెకు పెద్దగా ఆఫర్స్ రాలేదు. ఆ సినిమా ప్రమోషన్స్‌లో మాట్లాడుతూ.. ప్రియాంక యాక్టింగ్ తనకు బాగా నచ్చిందని కచ్చితంగా ఆమెతో మరో సినిమా చేస్తానని నాని అప్పట్లో మాటిచ్చాడు. చెప్పినట్లుగానే ఇప్పుడు ఆమెకు మరో ఛాన్స్‌తో తన మాట నిలబెట్టుకున్నాడు నాని. 'అంటే సుందరానికీ' సినిమా దర్శకుడు వివేక్ ఆత్రేయ టాలెంట్‌కు ఫిదా అయిన నాని అతడితో కూడా కచ్చితంగా మరో సినిమా చేస్తానని ప్రకటించాడు. 'సరిపోదా శనివారం' అనే సినిమాలో వారిద్దరికి ఛాన్స్ ఇచ్చి.. తన మాటను నిలబెట్టుకున్నాడు నాని. -
క్రిమినల్ కథా చిత్రమ్.. అత్యంత కరడుగట్టిన నేరగాడు అతీక్ అహ్మద్
మాఫియా డాన్, గ్యాంగ్ లీడర్, హిస్టరీ షీటర్, రౌడీ షీటర్, మాఫియా–బాహుబలి, దబాంగ్, పొలిటి కల్ లీడర్.. ఇవన్నీ ఒకే వ్యక్తికి పర్యాయపదాలు. ఆ ఒక్కడే అతీక్ అహ్మద్. ఉత్తరప్రదేశ్‌లో అసద్ అహ్మద్ ఎన్కౌంటర్ నేపథ్యంలో అతడి తండ్రి అతీక్ అహ్మద్ పేరు మళ్లీ ప్రముఖంగా చర్చల్లోకి వచ్చింది. నిరుపేద టాంగావాలా కుమారుడైన అతీక్ అహ్మద్ రౌడీయిజంలో, రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగాడు. రూ.వందల కోట్ల విలువైన ఆర్థిక సామ్రాజ్యం నిర్మించుకున్నాడు. దివంగత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జన్మించిన అలహాబాద్(ప్రయాగ్‌రాజ్)ను అతీక్ అహ్మద్ సొంత జాగీరుగా మార్చేసుకొని, సమాంతర పాలన సాగించాడంటే అతడి హవా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. వందకుపైగా కేసులు నమోదైనప్పటికీ.. ఉమేశ్‌పాల్ కిడ్నాప్ కేసు మినహా ఏ కేసులోనూ అతీక్‌కు శిక్ష పడలేదు. వ్యవస్థ మొత్తం అతడికి దాసోహమైందని, నిస్సిగ్గుగా ఊడిగం చేసిందని ప్రత్యర్థులు విమర్శిస్తూ ఉంటారు. నేరాల నుంచి వ్యాపారాలు, వ్యాపారాల నుంచి రాజకీయాలు.. ఇలా సాగింది అతీక్ ప్రస్థానం. నేరాలను, అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి, శిక్షల నుంచి తప్పించుకోవడానికి రాజకీయాలను రక్షణ కవచంగా వాడుకున్నాడు. 18 ఏళ్ల వయసులో తొలి ఎఫ్ఐఆర్ ► అతీక్ అహ్మద్ ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జన్మించాడు. టాంగా నడిపే అతడి తండ్రి హజీ ఫిరోజ్ నేరస్వభావం ఉన్నవాడే. అతీక్ బాల్యంలో కటిక పేదరికం అనుభవించాడు. ఎలాగైనా డబ్బు సంపాదించాలన్న కసితో నేరమార్గం ఎంచుకున్నాడు. స్నేహితులతో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. కిడ్నాప్‌లు, బెదిరింపులు, బలవంతపు వసూళ్లతో చెలరేగిపోయాడు. 1983లో 18 ఏళ్ల వయసున్నప్పుడు అతీక్‌పై మొదటి ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. అతడిని అదుపులోకి తీసుకొనేందుకు పోలీసులు విసిరిన వల నుంచి చాలాసార్లు తప్పించుకున్నాడు. అతీక్‌పై నమోదైన కేసులను విచారించాలంటే న్యాయమూర్తులు వెనుకంజ వేసేవారు. అలహాబాద్ హైకోర్టుకు చెందిన 10 మంది జడ్జీ్జలు తమంతట తామే ఈ కేసుల విచారణ నుంచి తప్పుకున్నారు. అతీక్ చంపేస్తాడన్న భయమే ఇందుకు కారణం. యూపీలో యోగి ఆదిత్యనాథ్ పాలన మొదలయ్యాక కూడా ప్రత్యర్థులను కిడ్నాప్ చేసి, తానున్న జైలుకు రప్పించి, తీవ్రంగా హింసించాడు. అతడిని ఉత్తరప్రదేశ్ జైళ్లలో కాకుండా ఇతర రాష్ట్రాల్లోని జైళ్లలో ఉంచాలని నాలుగేళ్ల క్రితం సుప్రీంకోర్టు ఆదేశించింది. కుటుంబం.. నేరమయం ► ఉమేశ్ పాల్ హత్య కేసులో నిందితుడైన అతీక్ కుమారుడు అసద్ అహ్మద్ ఎన్కౌంటర్లో హతం కావడం దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారింది. కరడుగట్టిన నేరగాడైన అతీక్ అహ్మద్ కుటుంబ సభ్యులు సైతం నేరాలబాట పట్టినవారే కావడం గమనార్హం. కొందరు ఇప్పటికే వేర్వేరు కేసుల్లో జైలుపాలయ్యారు. అతడి భార్య మాత్రం పరారీలో ఉన్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా.. ► నేర సామ్రాజ్యాధినేతగా ఎదిగిన అతీక్ అహ్మద్ కన్ను 1980వ దశకంలో రాజకీయాలపై పడింది. 1989లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అలహాబాద్ వెస్ట్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు. మతం కార్డు వాడుకున్నాడు. తన ప్రత్యర్థి చాంద్బాబాను హత్య చేశాడు. సులువుగా విజయం సాధించాడు. తొలిసారి ఎమ్మెల్యే హోదా సంపాదించాడు. ఆ తర్వాత అదే స్థానం నుంచి 1991, 1993లోనూ స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందాడు. 1996లో సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌తో, 2002 ఆప్నా దళ్ టికెట్‌తో గెలిచాడు. 2002లో ఆప్నా దళ్ ఉత్తరప్రదేశ్ అధ్యక్షుడయ్యాడు. హెలికాప్టర్లలో తిరుగుతూ రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలు చేశాడు. 2004లో మళ్లీ సమాజ్‌వాదీ పార్టీలో చేరాడు. ఆ పార్టీ తరపున ఫూల్పూర్ ఎంపీగా ఘన విజయం సాధించాడు. పార్లమెంట్లో అడుగుపెట్టాడు. మొత్తం ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొందాడు. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత కూడా నేరాలు ఆపలేదు. మరింత రాటుదేలాడు. బినామీల పేరిట కాంట్రాక్టులు దక్కించుకున్నాడు. ఇతర కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు వసూలు చేసేవాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగాడు. అడ్డొచ్చిన వారిని అంతం చేశాడు. భారీగా ఆస్తులు కూడబెట్టాడు. దేశవ్యాప్తంగా పదికిపైగా రాష్ట్రాలకు అతీక్ నేరసామ్రాజ్యం విస్తరించింది. అచ్ఛంగా సినిమాల్లో చూపించే డాన్ల తరహాలోనే అతడి వ్యవహార శైలి, ప్రవర్తన ఉండేవి. తరచుగా గుర్రంపై వీధుల్లో తిరిగేవాడు. కొన్నిసార్లు ఖరీదైన కార్ల కాన్వాయ్ వెంటరాగా పాదయాత్ర చేస్తుండేవాడు. రాజుపాల్ హత్య కేసు ► 2005 జనవరి 25న ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ఎమ్మెల్యే రాజుపాల్ హత్యతో అతీక్ పతనం ప్రారంభమైంది. ఈ తర్వాత జరిగిన పలు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేశాడు. కానీ, ఓటమే ఎదురయ్యింది. 2004లో ఎంపీగా గెలిచాక తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. ఉప ఎన్నికల్లో తన సోదరుడు అజీమ్‌కు సమాజ్‌వాదీ పార్టీ టికెట్ ఇప్పించుకున్నాడు. ఈ స్థానంలో నేరచరిత్ర ఉన్న రాజుపాల్కు బీఎస్పీ టికెట్ ఇచ్చింది. ఎన్నికల్లో అజీమ్ ఓడిపోయాడు. రాజుపాల్ ఎమ్మెల్యే అయ్యాడు. తర్వాత రాజుపాల్ హత్య జరిగింది. ఈ కేసులో అతీక్, అజీమ్ నిందితులు. రాజుపాల్ హత్యతో మళ్లీ ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై అజీమ్ గెలిచాడు. అతీక్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, ఓడిపోయాడు. అసద్ అహ్మద్ ► ఉమేశ్‌పాల్ మర్డర్ కేసులో అసద్ అహ్మద్ నిందితుడు. చాలా రోజులు పోలీసుల కళ్లుగప్పి తిరిగాడు. ► అతడిపై రూ.5 లక్షల రివార్డు ఉంది. ► గురువారం ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు జరిపిన కాల్పుల్లో మరో నిందితుడు గులామ్తోపాటు మరణించాడు. ► అతీక్ అహ్మద్ మరో ఇద్దరు కుమారులైన అజాన్, అబాన్ మైనర్లు. వారు ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలోని చైల్డ్ ప్రొటెక్షన్ హోంలో ఉన్నారు. అతీక్ అహ్మద్ ► గత 43 ఏళ్లుగా పోలీసు రికార్డుల్లో కొనసాగుతున్నాడు. ఇప్పటికే 100కుపైగా కేసులు నమోదయ్యాయి. ► ఉమేశ్‌పాల్ అపహరణ కేసులో అతీక్ అహ్మద్‌కు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ► ప్రస్తుతం గుజరాత్‌లోని సబర్మతీ జైలులో ఉన్నాడు. ► అతీక్ అహ్మద్ 1996లో షాయిస్తా పర్వీన్‌ను వివాహం చేసుకున్నాడు. ► వారికి ఐదుగురు కుమారులు.. అలీ అహ్మద్, ఉమర్ అహ్మద్, అసద్ అహ్మద్, అజాన్ అహ్మద్, అబాన్ అహ్మద్ ఉన్నారు. ► పాకిస్తాన్ ఉగ్రవాదులతో, అక్కడి నిఘా సంస్థ ఐఎస్ఐతో అతీక్ అహ్మద్‌కు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు గతంలో వెల్లువెత్తాయి. అష్రాఫ్ అలియాస్ అజీమ్ అహ్మద్ ► అతీక్ అహ్మద్ సోదరుడే అష్రాఫ్/అజీమ్ అహ్మద్. ► ఇతడిపై మొత్తం 52 కేసులు ఉన్నాయి. ఒకసారి సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ► 2006 నాటి ఉమేశ్‌పాల్ కిడ్నాప్ కేసులో ఇతడిని ప్రయాగ్‌రాజ్ కోర్టు దోషిగా తేల్చింది. ► యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. షాయిస్తా పర్వీన్ ► ఉమేశ్ పాల్ హత్య వ్యవహారంలో అతీక్ అహ్మద్, ఆష్రాఫ్ అహ్మద్‌తోపాటు షాయిస్తా పర్వీన్‌పై కేసు నమోదయ్యింది. ► పరారీలో ఉన్న పర్వీన్‌పై ఉత్తరప్రదేశ్ పోలీసులు రివార్డు ప్రకటించారు. ► ఆమె ఆచూకీ ఇంకా దొరక్కపోవడంతో రివార్డు మొత్తాన్ని రూ.25,000 నుంచి రూ.50,000కు పెంచారు. అలీ అహ్మద్ ► బలవంతంగా డబ్బు వసూళ్లకు పాల్పడిన కేసులో 2021లో అలీ అహ్మద్‌ను పోలీసులు అరెస్టు చేసి, జైలుకు పంపించారు. ► ఉమేశ్‌పాల్ హత్య కేసులోనూ అతడి పేరు తెరపైకి వచ్చింది. ► అలీ అహ్మద్ బెయిల్ పిటిషన్‌ను ఈ ఏడాది మార్చి 3న అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. ఇప్పుడు లక్నో జైలులో ఉన్నాడు. ► అలీ అహ్మద్ లాంటి నేరగాళ్లు బయట ఉంటే కేవలం సాక్షులకే కాదు, సమాజానికి సైతం ముప్పేనని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఉమర్ అహ్మద్ ► లక్నోకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మోహిత్ జైస్వాల్ కిడ్నాప్, దాడి కేసులో అతీక్ అహ్మద్‌తోపాటు ఉమర్ అహ్మద్‌పై 2018 ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. ► అదే కేసులో ఉమర్ అహ్మద్ ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లోని నైనీ సెంట్రల్ జైలులో ఉన్నాడు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
దిక్కుతోచని స్థితిలో ‘గ్యాంగ్ లీడర్’ బ్యూటీ..!
తమిళంలో రెండు హిట్ చిత్రాల్లో నటించినా ప్రియాంక మోహన్‌కు అవకాశాలు రావట్లేదట. 2019లో కన్నడ చిత్రం ద్వారా నటిగా పరిచయమైన బ్యూటీ ఆ తర్వాత టాలీవుడ్లో అడుగు పెట్టింది. తెలుగులో ఆమె ‘గ్యాంగ్ లీడర్’, ‘శ్రీకారం’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆ తర్వాత ఆమెను తెలుగులో ఎవరూ పట్టించుకోలేదు. అయితే కోలీవుడ్‌లో మాత్రం అవకాశాలు దక్కాయి. తమిళంలో డాక్టర్ చిత్రంతో ఎంట్రీ వచ్చింది. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతో శివ కార్తికేయన్ డాన్ చిత్రంతో మరో అవకాశం ఇచ్చారు. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. మధ్యలో సూర్యతో ఎదుర్కుమ్ తుణిందవన్ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. చదవండి: సెట్లో ఓవరాక్షన్ చేసి తన్నులు తిన్న హీరో.. వీడియో వైరల్ ఇక్కడ వరకు కథ బాగానే నడిచింది. ఇప్పుడే అమ్మడు అయోమయంలో పడింది. కొత్త చిత్రాలు అవకాశాలు కనుచూపు మేర కనిపించడం లేదట. ఇలాంటప్పుడు ఏ హీరోయిన్ అయినా అవకాశాల వేట పట్టక తప్పదు. అయితే కన్నడం, తెలుగు, తమిళం మూడు భాషల్లో నటించిన ప్రియాంక మోహన్ ఇప్పుడు ఏ భాషలో అవకాశాల కోసం ప్రయత్నించాలో తెలియక సతమతపడుతుందట. దీంతో ఆమె ప్రస్తుతం ఇన్‌స్ట్రాగామ్‌ను మార్గంగా ఎంచుకుంది. ఇటీవల వివిధ భంగిమల్లో రకరకాల గ్లామర్ దుస్తుల్లో ఫొటోషూట్ చేయించుకుని ఆ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేస్తూ ముందుగా ఏ భాషలో అవకాశం వస్తుందా? అని ఎదురు చూస్తోంది. View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) -
మే9 : తెలుగు ఇండస్ట్రీకి చాలా సెంటిమెంట్..ఎందుకంటే..
మే9..టాలీవుడ్లో ఈరోజుకు చాలా ప్రత్యేకత ఉంది. ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టిన రోజు ఇది. హీరో, హీరోయిన్లకు స్టార్ స్టేటస్‌తో పాటు దర్శక, నిర్మాతలక కాసుల వర్షం కురిపించిన రోజు. అందుకే క్యాలెండర్లో సంవత్సరాలు మారినా తెలుగు చిత్ర పరిశ్రమకు మాత్రం ఎప్పటికీ లక్కీ డేనే. ఎందుకంటే మే9న రిలీజైన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాశాయి. నాటి జగదేకవీరుడు అతిలోకసుందరి నుంచి నిన్నటి మహర్షి వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఈరోఉ (మే9)న విడుదలయినవే. మరి ఆ హిట్ చిత్రాలేంటో చూసేద్దామా? జగదేకవీరుడు అతిలోకసుందరి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రూపొందించిన ఈ సినిమా 1990 మే9న రిలీజైంది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించిన చిరంజీవి, శ్రేదేవిలకు ఎంతటి పేరు ప్రఖ్యాతలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇప్పటికీ ఈ సినిమా ఎవర్‌గ్రీన్‌గా నిలిచిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ మూవీ రిలీజ్‌కు కొన్ని వారాల ముందే రాష్ట్రంలో వర్షాలు అతలాకుతలం చేశాయట. అయినా వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మించిన ఈ మూవీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇళయరాజా సంగీతం సంగీత ప్రియులను ఆకర్షించి సినిమా విజయంలో భాగమైంది. గ్యాంగ్ లీడర్ విజయ బాపినీడు దర్శకత్వంలో చిరంజీవి, విజయశాంతి హీరోహీరోయిన్లుగా వచ్చిన చిత్రం గ్యాంగ్ లీడర్. 1991లో విడుదలైన ఈ చిత్రం ముప్పైకి పైగా కేంద్రాలలో శతదినోత్సవం చేసుకుంది. చిరంజీవికి మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది కూడా ఈ సినిమానే. ఈ చిత్రంలోని మెగాస్టార్ నటన, స్టైల్, డ్యాన్స్ యూత్‌ను కట్టిపడేశాయి. ఈ చిత్రం విడుదలై నేటికి 30 ఏళ్లవుతుంది. అయిన ఇందులో చేయి చూడు ఎంత రఫ్ ఉందో.. రఫాడిస్తా అనే పవర్ ఫల్ డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. ప్రేమించుకుందాం రా వెంకటేష్, అంజలా జవేరి జంటగా నటించిన ఈ చిత్రం 1997లో రిలీజైంది. ఈ సినిమాలో మొదట హీరోయిన్గా ఐశ్వర్యరాయ్‌ని అనుకున్నారట. అయితే అప్పటికే ఆమె నటించిన రెండు చిత్రాలు పరాజయం పాలవడంతో సెంటిమెంట్‌గా ఆమెను వద్దనుకున్నారట. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ డూపర్ అయిన సంగతి తెలిసిందే లవ్ స్టోరీస్‌లో సరికొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేసింది ఈ చిత్రం. సంతోషం నాగార్జున, శ్రియ, గ్రేసీసింగ్, ప్రభుదేవా నటించిన ఈ చిత్రం 2002లో విడుదలైంది. ఈ సినిమా మ్యూజిక్ పరంగానూ సూపర్ హిట్ అయ్యింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి కొన్ని పాటలు రాయగా ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు. నాగార్జున కెరియర్లోనే బెస్ట్ క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచిందీ ఈ చిత్రం. మహానటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘మహానటి’. కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో ఒదిగిపోయింది. ఆమె నటనకు గాను నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2018లో విడుదలై క్లాసిక్ హిట్‌గా నిలిచింది. కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్రప్రసాద్, షాలినీ పాండేలు ఈ మూవీలో ముఖ్యపాత్రలు పోషించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై ప్రియా దత్, స్వప్న దత్‌లు ఈ మూవీని నిర్మించారు. మహర్షి మహేష్‌బాబు హీరోగా మహర్షి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 2019లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పివిపి సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మూడు నేషనల్ అవార్డులు వచ్చాయి. -
గ్యాంగ్ లీడర్ @ 30
-
నంబర్ వన్‌గా నిలబెట్టిన...గ్యాంగ్ లీడర్
ఒక్కో హీరో కెరీర్లో ఒక్కో సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. చరిత్ర ఉంటుంది. నటుడిగా మొదలై స్టార్‌గా ఎదిగి, మెగాస్టార్‌గా, ఆపై నంబర్ వన్‌గా మారే క్రమంలో హీరో చిరంజీవి చూసిన అలాంటి ఓ బాక్సాఫీస్ శిఖరం – ‘గ్యాంగ్ లీడర్’. విజయ బాపినీడు దర్శకత్వంలో చిరంజీవి, విజయశాంతి నటించగా బాక్సాఫీస్‌ను రప్ఫాడించి, చిరు మెగా ఇమేజ్ను సుస్థిరం చేసిన ‘గ్యాంగ్ లీడర్’ (1991 మే 9)కు నేటితో 30 వసంతాలు. అచంచల అగ్రపీఠికపై... తెలుగు సినీసీమలో తన తరంలో నంబర్ వన్ హీరోగా చిరంజీవిని ఆ స్థానంలో స్థిరంగా నిలబెట్టిన సినిమా అంటే ‘గ్యాంగ్ లీడర్’. ఫ్లాష్ బ్యాక్‌కి వెళితే.. ‘ప్రాణం ఖరీదు’(1978)తో తెర మీదకొచ్చిన చిరు ‘ఖైదీ’ (1983 అక్టోబర్ 28)తో స్టార్ హీరో అయ్యారు. తర్వాత అనేక సక్సెస్‌లు! తోటి హీరోలతో పోటీలు!! బిగ్ హిట్ ‘పసివాడి ప్రాణం’ (1987)తో పరిశ్రమ రేసులో చిరంజీవి ముందంజలోకి వచ్చారు. అయితే, నాగార్జున ‘శివ’ (1989 అక్టోబర్ 5) లాంటి హిట్లు ఆయనకు మళ్ళీ సవాలు విసిరాయి. దాన్ని విజయవంతంగా ఎదుర్కొని, ‘జగదేక వీరుడు – అతిలోక సుందరి’ (1990 మే 9)తో తన లీడ్‌ను నిలబెట్టుకున్నారు చిరు. కానీ, ‘రాజా విక్రమార్క’(1990), ‘స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్’ (1991 జనవరి 9) – వరుసగా రెండు చిత్రాలు నిరాశపరిచాయి. ‘గ్యాంగ్ లీడర్’ అప్పుడొచ్చింది. ‘జగదేక...’ రిలీజైన ఏడాదికి సరిగ్గా అదే తేదీన వచ్చింది. బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టింది. చిరంజీవి తిరుగులేని నంబర్ వన్ అని సుస్థిరపరిచింది. దటీజ్ ది హిస్టారికల్ ప్లేస్ ఆఫ్ ‘గ్యాంగ్ లీడర్’! టైటిల్ ఎలా వచ్చిందంటే.. నిజానికి, ముందు విజయ బాపినీడు తీయాలనుకున్న సినిమా ఇది కాదు. ఒకప్పుడు తాను తీసిన, మనసుకు బాగా నచ్చిన బ్లాక్ అండ్ వైట్ ఫ్యామిలీ డ్రామా ‘బొమ్మరిల్లు’ (’78) ప్రేరణతో, నాగబాబుతో ఓ సినిమా తీయాలనుకున్నారు. ‘షోలే’లోని గబ్బర్ సింగ్ పాత్రధారి అమ్జాద్ ఖాన్ డైలాగ్ ప్రేరణతో ‘అరె ఓ సాంబా’ అని టైటిల్ పెట్టాలనుకున్నారు. తీరా చిరంజీవి ఓ సినిమా చేద్దామని పిలిచేసరికి, అది పక్కనపెట్టి ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. ఆ ఫ్యామిలీ డ్రామాకే యాక్షన్ జోడించి ఈ కొత్త సినిమా తీశారు. అప్పటికే హీరో చిరంజీవికీ, ఫ్యా¯Œ ్సకూ వారధిగా నిలిచేలా ‘మెగాస్టార్ చిరంజీవి’ అనే ఓ మాసపత్రికను బాపినీడు నడుపుతున్నారు. సినీ రచయిత సత్యమూర్తి (సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తండ్రి) అందులో ‘గ్యాంగ్ లీడర్’ అనే ఓ సీరియల్ రాస్తున్నారు. ఆ పేరు మీద మోజుపడ్డ బాపినీడు, చిరంజీవిని ఒప్పించి మరీ దాన్నే టైటిల్‌గా పెట్టారు. ప్రజాభిప్రాయం తీసుకొని, వారు ఎంపిక చేసిన లోగో డిజైనే వాడారు. మధ్యతరగతి కుటుంబ కథ... పేరు యాక్షన్ సినిమాలా అనిపించినా, ఇది రఘుపతి (మురళీమోహన్), రాఘవ (శరత్ కుమార్), రాజారామ్ (చిరంజీవి) – అనే ముగ్గురు అన్నదమ్ముల సెంటిమెంట్ కథ. స్నేహితులతో కలసి అల్లరిచిల్లరగా తిరిగే నిరుద్యోగ యువకుడైన హీరో విచ్ఛిన్నం కాబోతున్న తన కుటుంబాన్ని కాపాడుకోవడమే కాక, సొంత అన్నయ్యను అన్యాయంగా చంపిన విలన్లను తుదముట్టించడం కథాంశం. మధ్యతరగతి యువకుడికి తగ్గట్టు రంగురంగుల కాటన్ షర్ట్స్, ఫేడెడ్ జీ¯Œ ్సతో చిరంజీవి వెరైటీ కాస్ట్యూమ్స్ అప్పట్లో ఓ క్రేజ్. సినిమా అంతా పూర్తయ్యాక ఫైనల్ వెర్షన్ ప్రివ్యూ చూసినప్పుడు, లె¯Œ ్త ఎక్కువైందని అరవింద్ బృందం భావించింది. అప్పటికప్పుడు నిడివి తగ్గించారు బాపినీడు. దానికి తగ్గట్టు చిరంజీవి మళ్ళీ డబ్బింగ్ చెప్పారు. ఇలా సమష్టి కృషి ‘గ్యాంగ్ లీడర్’. వాళ్ళందరికీ... కెరీర్ బ్రేక్ ఫిల్మ్! తెలుగులో బప్పీలహరి హవా ఓ ప్రభంజనమైంది ‘గ్యాంగ్ లీడర్’తోనే! దీంతోనే భువనచంద్ర క్రేజీ రచయిత య్యారు. అంతకు ముందు ‘జగదేక..’కి తండ్రి సుందరంకి సహాయకుడిగా ఉంటూ, సర్వం తానే అయి స్టెప్పులు సమకూర్చిన యువ ప్రభుదేవా ఈ చిత్రానికి అధికారిక డ్యా¯Œ ్స మాస్టర్ హోదాలో వాన పాట లాంటివాటితో కనువిందు చేశారు. సీనియర్ డ్యా¯Œ ్స మాస్టర్ తార అయితే సరేసరి... విశ్వరూపం చూపారు. బాపినీడుకు అల్లుడైన వల్లభనేని జనార్దన్‌కు నటుడిగా వరుస పాత్రలు అందించిందీ ‘గ్యాంగ్ లీడ’రే! ఒకే రోజు 4చోట్ల శతదినోత్సవం! అప్పట్లో స్పెషల్ ఫ్లైట్ ఆసరాగా ఒకే రోజున (చిరంజీవి బర్త్‌డే 1991 ఆగస్ట్ 22న) నాలుగు కేంద్రాల్లో (తిరుపతి, హైదరాబాద్, ఏలూరు, విజయ వాడ) ‘గ్యాంగ్ లీడర్’ శతదినోత్సవం ఓ అరుదైన విన్యాసం. అతిరథ మహారథులు రాగా, బాపినీడు ఏకంగా చిరంజీవికి స్వర్ణకిరీట ధారణ చేసి, చేతికి రాజదండమిచ్చి ఘనంగా సత్కరించడం మరో విశేషం. అప్పట్లో ‘అప్పుల అప్పారావు’ చిత్రకథలో నటి అన్నపూర్ణది చిరంజీవి ఫ్యా¯Œ ్స అసోసియేషన్ ప్రెసిడెంట్ పాత్ర. ఏలూరు శతదినోత్సవ బహిరంగ సభ దృశ్యాలను, వేదికపై చిరంజీవిని అన్నపూర్ణ స్వాగతించే దృశ్యాలను కథానుగుణంగా ఆ చిత్రంలో వాడారు. హ్యాట్రిక్ హిట్ల చిరంజీవితం! ‘గ్యాంగ్ లీడర్’ తరువాత ‘రౌడీ అల్లుడు’, ఆ వెంటనే ‘ఘరానా మొగుడు’ – ఇలా హ్యాట్రిక్ హిట్లు చిరంజీవి సాధించారు. వాటిలో ‘ఘరానా మొగుడు’ బాక్సాఫీస్ వద్ద çసృష్టించిన ప్రభంజనం మరో పెద్ద కథ. హీరోగా నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టినఫిల్మ్గా గ్యాంగ్ లీడర్ మెగాస్టార్‌కు సదా ఓ ఆకుపచ్చ జ్ఞాపకం. సూపర్ హిట్ సాంగ్స్ అప్పట్లో కొన్నేళ్ళ పాటు ‘గ్యాంగ్ లీడర్’ పాటలు వినపడని ఊరు, ఊగిపోని కుర్రకారు లేదు. తెలుగులో ‘సింహాసనం’ (1986) లాంటి చిత్రాలతో పాపులరైన బప్పీలహరి కూర్చిన బాణీలవి. ‘స్టేట్ రౌడీ’ (1989) తర్వాత చిరంజీవితో ఆయన పనిచేసిన రెండో సినిమా ఇది. వేటూరి, భువనచంద్ర సాహిత్యం సమకూర్చారు. విజయ బాపినీడు ‘నాకూ పెళ్ళాం కావాలి’ (’87) ద్వారా పరిచయమైన రచయిత భువనచంద్ర. ‘గ్యాంగ్ లీడర్’లో రెండు పాటలు (‘పాలబుగ్గ..’, ‘వయసు వరసగున్నది వాటం..’) వేటూరి రాస్తే, మిగతావన్నీ భువనచంద్ర రచనలు. టైటిల్ సాంగ్ మొదలు ‘వానా వానా వెల్లువాయె..’, ‘భద్రాచలం కొండ..’, ‘సండే అననురా...’ – ఇలా అరుదైన రీతిలో... ఆల్బమ్‌లోని ఆరు పాటలూ హిట్టే. బప్పీలహరి సంగీతం, చిరంజీవి స్టెప్పులు, విజయశాంతి గ్లామర్, ఎస్పీబీ – చిత్ర గాత్రంలోని భావవ్యక్తీకరణ అన్నీ ఈ పాటల్లో హైలైటే! ఈ తరం మోస్ట్ పాపులర్ వానపాటల్లో మొదటి వరుసలో నిలబడ్డ ‘వాన వాన వెల్లువాయె..’ భువనచంద్రకు తొలి సినీ వాన పాట. హైదరాబాద్ నుంచి మద్రాసుకు రైలులో బయలుదేరిన భువనచంద్ర పొద్దున్న రైలు దిగే లోగా... ఈ పాటతో సహా నాలుగు పాటలూ రాసేశారు. ఆడియో రిలీజయ్యాక ఆ పాటలన్నీ ఛార్ట్ బస్టర్ గా నిలిచిపోవడం ఓ చరిత్ర. ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సాలూరి వాసూరావు సమకూర్చారు. సరిగ్గా 21 ఏళ్ళకు ‘గ్యాంగ్ లీడర్’లోని అదే ‘వాన వాన వెల్లువాయె...’ పాటను మళ్ళీ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌తో ‘రచ్చ’ (2012)లో మణిశర్మ రీమిక్స్ చేశారు. ‘వాన..’ పాటలో సెట్స్‌పై మెగా జోడీ, యువ ప్రభుదేవా హిందీలోనూ..! ఆకాశానికెత్తిన మీడియా!! ‘గ్యాంగ్‌లీడర్’ అదే పేరుతో తమిళంలోకి అనువాదమై, 1991 లోనే నవంబర్ 30న తమిళనాట రిలీజై, సక్సెస్ సాధించింది. తమిళంలో చిరంజీవికి సాయికుమార్ డబ్బింగ్ చెప్పడం విశేషం. కేరళలో తమిళ వెర్షన్‌ను రిలీజ్ చేస్తే, అక్కడా మంచి వసూళ్ళు సాధించింది. తరువాత హిందీ నిర్మాత ఎన్.ఎన్. సిప్పీ ఇదే కథను చిరంజీవితోనే హిందీలో రీమేక్ చేశారు. చిరంజీవికి ఇది రెండో హిందీ సినిమా. తొలి హిందీ సినిమా ‘ప్రతిబంధ్’ (తెలుగు ‘అంకుశం’కి రీమేక్ – 1990 సెప్టెంబర్ 28) లానే ఈ రీమేక్‌కీ రవిరాజా పినిసెట్టి దర్శకులు. చిరంజీవి సరసన మీనాక్షీ శేషాద్రి నటించగా, ఆనంద్ – మిళింద్ సంగీతంలో ఈ రీమేక్ ‘ఆజ్కా గూండా రాజ్’ (1992 జూలై 10) పేరుతో విడుదలైంది. తెలుగులో చిరంజీవి పిన్ని కొడుకు దుర్గబాబు నటించిన ఫ్రెండ్ పాత్రను ఆ హిందీ వెర్షన్లో నేటి తరం హీరో రవితేజ పోషించడం విశేషం. గమ్మత్తేమిటంటే, తెలుగునాట చిరుకు ఉన్న క్రేజ్ దష్ట్యా ఆ కొత్త హిందీ బాణీలకు తెలుగులో పాటలు రాయించి, ఆ డబ్బింగ్ సాంగ్స్‌ను ఇక్కడ రిలీజ్ చేయడం. అప్పట్లో ‘గూండా రాజ్’ పేరిట లియో సంస్థ ద్వారా ఆ డబ్బింగ్ పాటల క్యాసెట్లు మార్కెట్లోకి వచ్చాయి. ఒక హీరో తెలుగు సినిమా హిందీలో రీమేకై, మళ్ళీ ఆ హిందీ రీమేక్ పాటలు తెలుగులోకి డబ్బింగ్ అవడం అరుదైన ఘటన. డ్యాన్స్, ఫైట్లలో ఉత్తరాదినీ సమ్మోహనపరచిన చిరంజీవి గురించి ఇంగ్లీష్ మేగజైన్లు ముఖచిత్ర కథనాలు రాసి, ఆకాశానికెత్తాయి. ‘ఆజ్ కా గూండారాజ్’లో మీనాక్షీ శేషాద్రితో... 50 కేంద్రాలు... 100 రోజులు... ‘గ్యాంగ్ లీడర్’ పెద్ద హిట్. దాని రిలీజ్‌కు 5 వారాల ముందు తెలుగునాట టికెట్ రేట్లు పెరిగాయి. అదే సమయంలో తెలుగుగడ్డపై తీసిన చిత్రాలకు వినోదపన్నులో భారీ రాయితీ కల్పించింది ప్రభుత్వం. అప్పటికి ఉన్న ట్యాక్స్‌లో ఏకంగా పెద్ద సినిమాలకు దాదాపు 40 శాతం, చిన్న సినిమాలకు 70 శాతం మేర రాయితీ ఇచ్చారు. అలా టికెట్లు రేట్లు పెరిగాక, రాయితీలిచ్చాక వచ్చిన తొలి పెద్ద హిట్ ఇదే! నిజానికి, పెరిగిన టికెట్ రేట్ల ప్రభావం తెలియక ముందే, ఈ సినిమా ప్రదర్శన హక్కులను మామూలు వ్యాపార లెక్కల చొప్పున అమ్మేశారు. తీరా రిలీజయ్యాక పెరిగిన టికెట్ రేట్లలోనూ జనాదరణ బ్రహ్మాండంగా ఉండడంతో, ‘గ్యాంగ్ లీడర్’ వసూళ్ళ వర్షం కురిపించింది. బయ్యర్లందరికీ లాభాల పంట చేతికి అందింది. 75కి పైగా ప్రింట్లతో రిలీజై, ఏకంగా 30 కేంద్రాలలో నేరుగా, మరో 15 – 20 కేంద్రాలలో నూన్‌షోలతో... అన్నీ కలిపి 50 సెంటర్లలో ‘గ్యాంగ్ లీడర్’ వంద రోజులు పూర్తి చేసుకుంది. హైదరాబాద్ సుదర్శన్ 70 ఎం.ఎంలో ఏకంగా 162 రోజులు ఆడింది. చిరంజీవి ‘రౌడీ అల్లుడు’ వచ్చి, సిల్వర్ జూబ్లీ మిస్సయింది. తెలుగు సినీ రాజధాని విజయవాడలో శాంతి థియేటర్‌ను శాంతి, ప్రశాంతి అంటూ రెండుగా చేశాక, వాటిలో వచ్చిన తొలి సినిమా ‘గ్యాంగ్ లీడ’రే! ఏకకాలంలో ఆ రెండిట్లోనూ 6 వారాలాడింది. అంతకు ముందు శారద– శోభన్‌బాబుల ‘మనుషులు మారాలి’(’69) ఇలాగే విజయవాడలో ఒకేసారి రెండు (లీలామహల్, శేష్ మహల్) హాళ్ళలో 6 వారాలాడిన ఘనత దక్కించుకుంది. తర్వాత మళ్ళీ 22ఏళ్ళకు గ్యాంగ్‌లీడర్ సినీలవర్ల బెజవాడలో ఆ అరుదైన విన్యాసం చేసింది. ఇటు మెగాస్టార్... అటు లేడీ అమితాబ్... ‘గ్యాంగ్‌లీడర్’కు చిరంజీవితో పాటు విజయశాంతి పెద్ద ప్లస్. ‘కర్తవ్యం’ (1990 జూన్ 29) హిట్టయ్యాక, యాక్షన్ హీరోలకు దీటుగా విజయశాంతికి ‘లేడీ అమితాబ్’ అనే ఇమేజ్ ఉన్న రోజులవి. ‘కర్తవ్యం’ నుంచి ప్రేక్షక, ట్రేడ్ వర్గాలు రెండూ ఆమెను ఒక హీరోలా చూడడం మొదలెట్టాయి. అలా ఆ కాలంలోనే ‘ఆశయం’, ‘పోలీస్ లాకప్’ లాంటివి ఆమెతో వచ్చాయి. అందుకే, ట్రేడ్ వర్గాల దృష్టిలో ‘గ్యాంగ్ లీడర్’ ఏకంగా ‘డబుల్ స్టారర్’గా నిలిచింది. ఊటీలో ‘గ్యాంగ్ లీడర్’లోని ‘భద్రాచలం కొండ...’ పాట షూటింగ్ జరుగుతున్నప్పుడే, ‘కర్తవ్యం’లో ఉత్తమ నటిగా విజయశాంతికి నేషనల్ అవార్డ్ వరించింది. వార్త తెలిసిన వెంటనే చిరంజీవి ఆమెను అభినందించి, అందరికీ పార్టీ ఇచ్చారు. ‘గ్యాంగ్ లీడర్’లో చిరు, విజయశాంతి పోటీ పడి నటించారు. ఆ ముందు ‘యముడికి మొగుడు’ (’88), ‘స్టేట్‌రౌడీ’(’89)లాంటి వాటితో చిరంజీవి పక్కన డ్యా¯Œ ్స అంటే హీరోయిన్ రాధ తప్ప మరొకరు లేరనే భావన ఉండేది. కానీ ‘గ్యాంగ్ లీడర్’తో డ్యాన్సులో చిరంజీవితో ఢీ అంటే ఢీ అన్నారు విజయశాంతి. టైటిల్ సాంగ్ మినహా, 5 పాటలూ హీరో, హీరోయిన్ మధ్యే ఉండడం, అన్నీ మ్యూజిక్ – డ్యాన్సుల్లో హిట్టవడం మరో అరుదైన ఘటన. అది ఈ జంటకే సాధ్యమైంది. అయితే, ‘గ్యాంగ్ లీడర్’ ఘనత తమదంటే తమదని వారిద్దరూ అనుకున్నట్టు గుసగుసలొచ్చాయి. ∙చిరంజీవి, విజయశాంతి పరుచూరి బ్రదర్స్ శకంలో... ‘గ్యాంగ్ లీడర్’ సూపర్ హిట్‌కు డైలాగ్స్ కూడా కారణం. బాపినీడు తొలిసారిగా పరుచూరి బ్రదర్స్‌ను డైలాగ్ రైటర్స్‌గా పెట్టుకున్నారు. బాపినీడు తన మనసుకు దగ్గరైన పాత ‘బొమ్మరిల్లు’ కథకు, సెకండాఫ్‌లో హిందీ ‘ఘాయల్’ను అనుసరిస్తూ ఈ కథ సిద్ధం చేసుకున్నారు. కథ సిద్ధం కావడంలో ఎం.వి.వి.ఎస్. బాబూరావు సహకరించారు. కథలో, స్క్రీన్‌ప్లేలో పరుచూరి సోదరుల సలహాలూ ఉపకరించాయి. అప్పట్లో ఆ అన్నదమ్ములు రాసిందల్లా బాక్సాఫీస్ బంగారమైంది. ముఖ్యంగా, 1990 – 91 కాలంలో ఇండస్ట్రీలో సంచలనమైన – విజయశాంతి ‘కర్తవ్యం’, వెంకటేశ్ ‘బొబ్బిలిరాజా’, బాలకృష్ణ ‘లారీ డ్రైవర్’, శోభన్‌బాబు – సుమన్‌ల ‘దోషి – నిర్దోషి’, హరీశ్ – మాలాశ్రీల ‘ప్రేమఖైదీ’, మోహన్‌బాబు ‘అసెంబ్లీ రౌడీ’, చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్’– ఈ ఏడు సినిమాలూ రచయితలుగా పరుచూరి బ్రదర్స్ కలం చేసుకున్నవే. వేర్వేరు ఇమేజ్లున్న ఆ ఏడు చిత్రాల హీరోలనూ ఆ సినిమాలు కొత్త ఎత్తులకు తీసుకువెళ్ళడం మరో చరిత్ర. ‘గ్యాంగ్ లీడర్’లో రావు గోపాలరావుతో ‘‘కన్నాంబకు ఎక్కువ – కాంచనమాలకు తక్కువ’’అంటూ చిత్రమైన మేనరిజమ్ డైలాగ్స్ పెట్టారు. జనజీవితంలో ఈ ఫక్కీలో డైలాగ్స్ చెప్పుకోవడం అప్పట్లో ఓ క్రేజ్. అసలీ తరహా డైలాగ్ మూలసృష్టికర్త– సినీ రచయిత ఎం.వి.ఎస్. హరనాథరావు. ‘నవయుగం’(’90) చిత్రంలో ‘‘వీడు కత్తికి ఎక్కువ, బాంబుకు తక్కువ’’ అని ఒకే ఒక్క డైలాగ్ రాశారాయన. అదిచూసి ముచ్చట పడ్డ పరుచూరి గోపాలకృష్ణ, ‘గ్యాంగ్ లీడర్’లో పాత్రకు సినిమా అంతటా ఈ తరహా డైలాగ్స్ పెట్టడం హిట్ పాయింటైంది. అలాగే, చిరంజీవి సొంత ఐడియా ‘రప్ఫాడిస్తా’ అనే ఊతపదం మోస్ట్ పాపులరైంది. బామ్మ నిర్మలమ్మతో ఫోటోలో నుంచి వచ్చినట్టు తాత గెటప్‌లో చిరంజీవి మాట్లాడే సీన్లు, ‘శబరీ’ డైలాగ్ ట్రాక్ చిరంజీవి చేసిన ఇంప్రొవైజేషన్లే! అవీ హిట్! సెట్స్‌పై బాపినీడు, పరుచూరి గ్యాంగ్‌తో... – రెంటాల జయదేవ -
ఇక మా సినిమా మాట్లాడుతుంది
‘‘నాని’స్ గ్యాంగ్‌లీడర్’ విడుదల రోజు రకరకాల విషయాలు మమ్మల్ని భయపెట్టాయి. ఎన్ని అడ్డంకులు ఉన్నా ప్రతి షోకి గ్రాఫ్ అలా పైకి వెళ్లింది. శనివారం షోకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటిదాకా మేం మాట్లాడాం. ఇక నుంచి మా సినిమా మాట్లాడుతుంది’’ అన్నారు నాని. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మించిన ‘నాని’స్ గ్యాంగ్‌లీడర్’ ఈ నెల 13న విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాని మాట్లాడుతూ– ‘‘సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రతి ఒక్కరి పెర్ఫార్మెన్స్ బాగుందని నెటిజన్లు అభినందిస్తున్నారు. ఈ సినిమాతో మైత్రీ మూవీమేకర్స్ బ్యానర్లో మరో హిట్ పడిందనే మెసేజ్ చూసి హ్యాపీ ఫీలయ్యాను’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో నేను చేసిన దేవ్ పాత్రకు ఇంతటి స్పందన రావడం నాకు ఒక కలలా ఉంది. ఈ సినిమాతో నాని నాకు ఒక మెంటర్‌లా, ఫ్యామిలీ మెంబర్లా మారిపోయారు’’ అన్నారు కార్తికేయ. ‘‘ప్రేక్షకుల అభిమానానికి థ్యాంక్స్’’ అన్నారు విక్రమ్. ‘‘మా బ్యానర్లో వచ్చిన మరో క్వాలిటీ ఫిల్మ్ ఇది. హ్యూజ్ బ్లాక్ బ్లస్టర్. మౌత్ పబ్లిసిటీ బాగుండడంతో థియేటర్స్ పెంచాం. నానీగారి కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ వస్తాయని అంచనా వేస్తున్నాం’’ అన్నారు నవీన్. -
మంచి రెస్పాన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ : నాని
నేచురల్ స్టార్ నాని, వెర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ల కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్(సివిఎం) నిర్మించిన ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నాని'స్ గ్యాంగ్ లీడర్’. అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్. ‘ఆర్ఎక్స్100’ ఫేమ్ కార్తికేయ ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర పోషించారు. సెప్టెంబర్ 13న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్‌తో మంచి కలెక్షన్లు సాధిస్తుంది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ‘నేను లోకల్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది. ‘ఫీల్డర్స్‌లేని గ్రౌండ్లో ఫోర్ కొడితే కిక్కే ఉండదు’ అని ఆ డైలాగ్ ఎడిటింగ్‌లో తీసేశాం కానీ ఇప్పుడు వాడాలనిపిస్తుంది. ఎందుకంటే రిలీజ్ రోజు రకరకాల విషయాలు మమ్మల్ని భయపెట్టాయి. ఎన్ని అడ్డంకులు ఉన్నా ప్రతి షోకి గ్రాఫ్ అలా పైకి వెళ్ళింది. ఈరోజు మార్నింగ్ షోస్ ఇంకా స్ట్రాంగ్‌గా స్టార్ట్ అయ్యాయి. ఇప్పటిదాకా మేము మాట్లాడాము ఇకనుండి సినిమా మాట్లాడుతుంది. గ్యాంగ్‌లీడర్ సినిమాను ఇంతలా ఓన్ చేసుకొని ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. సినిమా రిలీజైనప్పటి నుంచి సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రతి ఒక్కరి పెర్ఫామెన్స్కి ఒక ఎమొర్టికన్ వాడుతున్నారు. ఇది ఒక నిజమైన గెలుపుగా భావిస్తున్నాం. ప్రతి రివ్యూలోను కార్తికేయ పెర్ఫామెన్స్‌ని, వెన్నెల కిషోర్ కామెడీని అంతగా మెచ్చుకుంటున్నారు. సినిమా రిలీజ్ అవ్వగానే ఒకటి నోటీస్ చేశాను ప్రియాంక అరుళ్ మోహన్ ఫ్యాన్ క్లబ్‌ను క్రియేట్ చేశారు. ఫస్ట్ డేనే ఫ్యాన్ క్లబ్ ఏర్పాటు చేయడం మంచి విషయం. అలాగే మైత్రి మూవీ మేకర్స్‌కి మరో హిట్ పడింది అనే మెస్సేజ్ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాను. మల్లికార్జున థియేటర్లో ఫ్యామిలీస్ సినిమాను ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారు అనేది నా కజిన్ ఒక వీడియో క్లిప్ తీసి పంపింది. రిలీజ్ టెన్షన్ లేకుండా మాకు ఇంతటి పాజిటివిటీని ఇచ్చిన ప్రతి ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు. -
‘నాని గ్యాంగ్ లీడర్’ మూవీ రివ్యూ
-
‘నాని గ్యాంగ్ లీడర్’ మూవీ రివ్యూ
టైటిల్ : ‘నాని గ్యాంగ్ లీడర్’ జానర్ : కామెడీ రివేంజ్ డ్రామా నటీనటులు : నాని, కార్తికేయ, ప్రియాంక అరుల్ మోహన్, లక్ష్మి, శరణ్య, ప్రియదర్శి, వెన్నెల కిశోర్ సంగీతం : అనిరుధ్ రవిచందర్ నిర్మాత : మోహన్ చెరుకూరి, రవిశంకర్ యలమంచిలి, నవీన్ ఎర్నేని దర్శకత్వం : విక్రమ్ కె కుమార్ విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న విక్రమ్ కె కుమార్ తెలుగులో ఇష్క్, మనం లాంటి సూపర్ హిట్ చిత్రాలను రూపొందించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ దర్శకుడు నేచురల్ స్టార్ నాని హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడన్న వార్తలు రావడంతో సినిమా మీద మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోగా సూపర్ హిట్ అందుకున్న కార్తికేయ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తుండటంతో ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. మరి ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ను గ్యాంగ్ లీడర్ అందుకున్నాడా.? ఇటీవల కమర్షియల్ సక్సెస్‌లు సాధించటంలో ఫెయిల్ అవుతున్న నాని తిరిగి ఫాంలోకి వచ్చాడా..? హీరోగా సూపర్ హిట్ అందుకున్న కార్తికేయ విలన్‌గా మెప్పించాడా..? కథ : ఓ బ్యాంక్‌లో 300 కోట్ల చోరి జరుగుతుంది. ఆరుగురు వ్యక్తులు కేవలం 18 నిమిషాల సమయంలో బ్యాంక్‌లోని సొమ్మంతా దోచేస్తారు. కానీ వారిలో ఒకడు మిగతా ఐదుగురిని చంపి డబ్బంతా ఎత్తుకెళ్లిపోతాడు. ఆ ఐదుగురికి సంబంధించిన ఆడవాళ్లు ఎలాగైన తమ వాళ్లను చంపిన వాడి మీద పగ తీర్చుకోవాలనుకుంటారు. అందుకోసం పెన్సిల్ పార్థసారథి(నాని) అనే రివేంజ్ కథల రచయిత సాయం తీసుకోవాలనుకుంటారు. హాలీవుడ్ సినిమాలు చూసి నవలలుగా కాపీ చేసే పెన్సిల్, ఈ రియల్ రివేంజ్ స్టోరిని కథగా రాసి భారీగా డబ్బు సంపాదించొచ్చన్న ఆశతో వారికి సాయం చేసేందుకు అంగీకరిస్తాడు. ఆ ఐదుగురు ఆడవాళ్లతో కలిసి పెన్సిల్ హంతకుడిని ఎలా పట్టుకున్నాడు? ఈ కథకు ఇండియాస్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ దేవ్ (కార్తికేయ)కు సంబంధం ఏంటి..? అన్నదే మిగతా కథ. నటీనటులు: నాని నటనకు వంక పెట్టడానికి లేదు. పెన్సిల్ పాత్రలో ఒదిగిపోయిన నాని.. కామెడీ, సెంటిమెంట్, రొమాన్స్ ఇలా అన్ని ఎమోషన్స్‌ను చాలా బాగా పండించాడు. విలన్‌గా కార్తికేయ మెప్పించాడు. సినిమా అంతా సీరియస్ ఎక్స్‌ప్రెషన్‌కే పరిమితం కావటంతో నటనకు పెద్దగా అవకాశం లేదు. అయితే లుక్స్, యాటిట్యూడ్‌తో మంచి విలనిజం చూపించాడు. హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ప్రియాంక అరుల్మోహన్ ఆకట్టుకోలేకపోయింది. కథలో పెద్దగా స్కోప్ లేకపోవటంతో ఆమె పాత్ర సపోర్టింగ్ రోల్‌గానే మిగిలిపోయింది. లక్ష్మీ, శరణ్య, వెన్నెల కిశోర్, ప్రియదర్శి, అనీష్ కురివిల్లా తదితరులు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : నాని లాంటి నటుడు విక్రమ్ లాంటి దర్శకుడి సినిమాలో నటిస్తుండటంతో గ్యాంగ్ లీడర్‌పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలను అందుకోవటంతో విక్రమ్ ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. విక్రమ్ సినిమా నుంచి ఆశించిన స్క్రీన్‌ప్లే మ్యాజిక్ సినిమాలో లేకపోవటం నిరాశకలిగించే అంశమే. సినిమాను ఇంట్రస్టింగ్ సీన్‌తో ప్రాంభించిన దర్శకుడు ప్రతీ సన్నివేశాన్ని సుదీర్ఘంగా చెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో రాను రాను సినిమా బోరింగ్‌గా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. దీనికి తోడు ప్రేక్షకుడి అంచనాలకు తగ్గట్టుగా సాగే కథనం కూడా సినిమాకు మైనస్ అయ్యింది. దర్శకుడిగా తడబడినా రైటర్‌గా మాత్రం విక్రమ్ కె కుమార్ మెప్పించాడు. కామెడీ, డైలాగ్స్ బాగున్నాయి. అనిరుధ్ సంగీతం ఆకట్టుకుంటుంది. పాటలతో పాటు నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచే ప్రయత్నం చేశాడు అనిరుధ్. మిరోస్లా బ్రోజెక్ సినిమాటోగ్రఫి సూపర్బ్. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్ : నాని నటన కామెడీ నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : ప్రేక్షకుడి అంచనాలకు తగ్గట్టు సాగే కథనం విక్రమ్ కె కుమార్ మార్క్ లేకపోవటం సతీష్ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్ డెస్క్. -
ఆ టెన్షన్లో కిక్ ఉంటుంది
‘‘సాధారణంగా పరీక్షలప్పుడు ఉండే టెన్షన్ సినిమా విడుదలప్పుడు ఉంటుంది. రిలీజ్‌కు ముందు ఉండే ఈ రెండు రోజులంటే నాకు చాలా ఇష్టం. ఈ రెండు రోజుల్లో ఉండే టెన్షన్లో మంచి కిక్ ఉంటుంది’’ అని నాని అన్నారు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందిన చిత్రం ‘నానీస్ గ్యాంగ్‌లీడర్’. మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో నాని మాట్లాడుతూ– ‘‘సినిమాలో నవ్వులే కాదు.. మనసుని హత్తుకునే ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి. సినిమాని చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. అస్సలు ఒత్తిడికి గురి కాలేదు. ఏదో పెయిడ్ హాలిడేలా గడిచింది. ఈ సినిమాలో కొత్త కార్తికేయ (‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్)ను చూస్తారు. ఈ సినిమా తర్వాత ప్రియాంకకు చాలా అవకాశాలు వస్తాయి. విక్రమ్ బాగా డైరెక్ట్ చేశారు. పోలాండ్ కెమెరామన్ మిరోస్లా కుబా మా సినిమాను కొత్త కోణంలో చూపించారు. అనిరుద్ మంచి సంగీతం అందించారు. విడుదల చేసిన ప్రతి పాటకు మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు. ‘‘కథ, నా పాత్ర నచ్చి ఈ సినిమా చేయడానికి అంగీకరించాను. ఒకవేళ ఈ సినిమా చేయకపోతే ఏదో కోల్పోయేవాడినని నాకు ఇప్పుడు అర్థం అవుతోంది. విక్రమ్, నానీగార్ల నుంచి చాలా నేర్చుకున్నాను. బ్లాక్‌బ్లస్టర్ సినిమాలు ఎన్ని వచ్చినా రిఫరెన్స్ సినిమాలు కొన్నే ఉంటాయి. ఆ జాబితాలో ఈ చిత్రం ఉంటుంది. ఆల్రెడీ నాని ఖాతాలో ‘జెర్సీ’ ఉంది. నాని ఇలాంటి విభిన్నమైన కథలు ఎంచుకుంటారు. అందుకే ఆయన నేచురల్‌స్టార్’’ అన్నారు కార్తికేయ. ‘‘ఎడిటర్ నవీన్, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడ్డారు. సహకరించిన టీమ్ అందరికీ థ్యాంక్స్’’ అన్నారు దర్శకుడు విక్రమ్. ‘‘నానీగారితో మా బ్యానర్లో సినిమా చేయడానికి మూడేళ్లు పట్టింది. మరో సినిమా చేయడానికి ఇంత సమయం పట్టదనుకుంటున్నాను. సినిమా బ్లాక్‌బ్లస్టర్ అవుతుంది’’ అన్నారు నిర్మాత నవీన్. ‘‘ఈ సినిమాను ఆరు నెలల్లో పూర్తి చేశాం. విక్రమ్‌గారి ప్రణాళిక వల్లే సాధ్యమైంది’’ అన్నారు మైత్రీ మూవీ మేకర్స్ సీఈఓ చెర్రీ. ‘‘మా గ్యాంగ్లీడర్ని చూసేందుకు మీ గ్యాంగ్స్‌తో థియేటర్స్‌కు రండి’’ అన్నారు కథానాయిక ప్రియాంక. -
పదేళ్లుగా వైజాగ్‌ను ప్రేమిస్తున్నా!
సాక్షి, బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ‘పదేళ్ల కిందట వైజాగ్ అమ్మాయితో ప్రేమలో పడ్డా. అప్పటి నుంచి విశాఖ ప్రేక్షకులతో ప్రేమలోనే ఉన్నా’ అని హీరో నాని చెప్పారు. పాటల చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్తున్నారు గాని ఇక్కడ ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయని అన్నారు. ‘నానీస్ గ్యాంగ్‌లీడర్’ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకల ను గురజాడ కళాక్షేత్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. పదకొండేళ్ల క్రితం అష్టాచెమ్మా సినిమా విడుదల ముందు విశాఖలో కార్యక్రమంలో పాల్గొని సినీరంగంలో స్థిరపడ్డానని, ఇప్పుడు మరో 11 ఏళ్లపాటు ఈ రంగంలో తనకు ఢోకా ఉండదని చమత్కరించారు. సినిమా విడుదలయ్యే సెప్టెంబర్ 13న టికెట్ ముక్క కూడా దొరకకుండా చేయాలని ప్రేక్షకులను కోరారు. ‘మనం’ సినిమా నుంచి తాను విక్రమ్ సినిమా చేయాలని అనుకున్నామని, ఇప్పటికి గ్యాంగ్‌లీడర్ లాంటి అద్భుతమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని చెప్పారు. సంగీత దర్శకుడు అనిరుధ్‌తో తర్వాత చిత్రం చేయాలని అనుకున్నా కానీ రెండో సినిమా కూడా అతడితో చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు. హీరోయిన్స్‌ను పరిచయం చేయడం నా పనిగా మారిందనుకుంటున్నా.. ప్రియాంక కుడా నా చిత్రంతో పరిచయం కావడం సంతోషంగా ఉంది.’ అని చెప్పారు. కార్తికేయను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా చెప్తున్నానని.. టాలీవుడ్లో ఇంకో మంచి నటుడు వచ్చినట్టేనని తెలిపారు. తర్వాత చేయబోయే సినిమాలో కార్తికేయ హీరోగా, తాను విలన్‌గా చేస్తామని చెప్పారు. సినిమాలోని డైలాగులు చెప్పి ప్రేక్షకులను అలరించారు. నిన్న చిరు.. నేడు నాని కార్తికేయ మాట్లాడుతూ ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా నటులుగా స్థిరపడాలనుకున్న వారికి నిన్నటి తరంలో చిరంజీవి, ఇప్పటి తరంలో నాని గుర్తొస్తారని ప్రశంసించారు. నానితో నటించడం తన జీవితంలో మరువలేని జ్ఞాపకమన్నారు. అందరు డైరెక్టర్లను భిన్నంగా పని చేసి హిట్ కొడుతున్న డైరెక్టర్ విక్రమ్ అని ప్రశంసించారు. ఈ సందర్భంగా సినిమాలోని డైలాగ్‌లు చెప్పి శభాష్ అనిపించారు. డైరెక్టర్ విక్రమ్ మాట్లాడుతూ నాని అద్భుతమైన నటుడని, మంచి మిత్రుడని చెప్పారు. ప్రియాంక చాలా బాగా నటించిందన్నారు. ఈ సినిమాలోని కార్తికేయ నటన కారణంగా భవిష్యత్తులో మరిన్ని విభిన్న చిత్రాల్లో అవకాశాలు వస్తాయని చెప్పారు. హీరోయిన్ ప్రియాంక మాట్లాడుతూ డైరెక్టర్ విక్రమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. నానితో నటించడం ఆనందంగా ఉందన్నారు. ఇతర సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. అనిరుధ్ పాట.. నాని ఆట మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ స్టేజి మీదకు వచ్చి తన పాటలతో ప్రేక్షకుల్లో ఆనందాన్ని నింపారు. నాని గ్యాంగ్‌లీడర్ వచ్చాడో లెగండో.. పాటతో అందరిలో ఊపు తెచ్చారు. పాటలు హోరెత్తుతూ ఉండగా, నాని, కార్తికేయ, ప్రియాంకల చేత స్టెప్పులేయించారు. ఈ సందర్భంగా డ్యాన్సర్లు రసవత్తరమైన నాట్యాలతో అందరినీ ఉరకలెత్తించారు. -
‘గ్యాంగ్ లీడర్ అందరినీ మెప్పిస్తాడు’
ఈ శుక్రవారం గ్యాంగ్ లీడర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న యంగ్ హీరో నాని, ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నాని సినిమా సక్సెస్‌పై ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ సినిమా అందరినీ మెప్పిస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు నాని. కామెడీ రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు విక్రమ్ కె కుమార్ దర్శకుడు. గ్యాంగ్ లీడర్ తరువాత ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘వి’ సినిమాలో నటిస్తున్నాడు నాని. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. సుధీర్ బాబు మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్, అదితిరావ్ హైదరిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. -
నేను మా గల్లీ గ్యాంగ్లీడర్ని
‘‘సాధారణంగా రివెంజ్ డ్రామా సినిమాలు సీరియస్ మోడ్‌లో నడుస్తుంటాయి. ‘గ్యాంగ్‌లీడర్’ మాత్రం సరదా యాంగిల్లో సాగుతుంది. విక్రమ్ నాకు కథ చెప్పినప్పుడు నేను ఎంత నవ్వానో థియేటర్లో ప్రేక్షకులు కూడా అలానే నవ్వితే సినిమా కచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుంది’’ అన్నారు నాని. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన చిత్రం ‘నానీస్ గ్యాంగ్‌లీడర్’. నవీన్ యర్నేని, వై. రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మించారు. ‘ఆర్ఎక్స్100’ ఫేమ్ కార్తికేయ విలన్‌గా నటించారు. ఈ శుక్రవారం (సెప్టెంబర్ 13) ‘నానీస్ గ్యాంగ్‌లీడర్’ రిలీజ్ కానున్న సందర్భంగా నాని చెప్పిన విశేషాలు. ► విక్రమ్, నేను ఎప్పటినుంచో సినిమా చేయాలనుకుంటూ ఉన్నాం. ఒకరోజు ‘గ్యాంగ్‌లీడర్’ సినిమా ఐడియా చెప్పాడు. విన్న వెంటనే ఓకే అన్నాను. అప్పటికి ‘జెర్సీ’ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. ‘జెర్సీ’ పూర్తయ్యేసరికి ‘గ్యాంగ్‌లీడర్’ ప్రీ–పొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయి. వెంటనే షూట్ స్టార్ చేశాం. విక్రమ్ గత సినిమాలు ‘మనం, 24’లాగా ఈ సినిమా క్లిష్టంగా ఉండదు. చాలా సింపుల్‌గా ఉంటుంది. ‘జెర్సీ’ చాలా ఎమోషనల్ సినిమా. మానసికంగా ఎక్కువ శ్రమతో కూడుకున్నది. గ్యాంగ్‌లీడర్ చాలా సరదా సినిమా. నవ్వించడం, ఏడిపించడం, దేని కష్టం దానిదే. ఎంత నిజాయితీగా చేస్తాం అన్నదాని మీద ఉంటుంది. ► ఇందులో నేను ‘పెన్సిల్ పార్థసారథి’ అనే ప్రతీకార కథలు రాసే రచయితగా నటించాను. వాడో పెద్ద పాపులర్ రచయిత అని పార్థసారథిగాడి ఫీలింగ్. వాడు రాసిన పుస్తకాలని ఎవడూ కొనడని ఆ పుస్తకాల పబ్లిషర్‌కి కూడా తెలుసు. విలన్ మీద పగ తీర్చుకోవడానికి ఓ ఐదుగురు స్త్రీలు వీడి దగ్గరకు వస్తారు. వాళ్లతో కలసి పగ తీర్చుకుంటూ తన 29వ నవల రాస్తాడు పార్థసారథి. అదే వాడు రాసిన తొలి ఒరిజినల్ కథ. ► ఇందులో విలన్ పాత్రకు నలుగురైదుగురు హీరోల పేర్లు అనుకున్నాం. మొదట అడిగింది కార్తికేయానే. కథ వినగానే ఎగ్జయిట్ అయ్యాడు. దాంతో రెండో వాళ్లను అడగాల్సిన పని లేకుండా పోయింది. ► కృష్ణవంశీగారి సినిమాల్లో లక్ష్మీగారు భలే ఉంటారనుకున్నాను. ఆయన ఆవిడను భలే చూపించారనిపించేది. ఆవిడతో పని చేశాకే తెలిసింది.. ఆవిడ అలానే ఉంటారని. కృష్ణవంశీగారి క్రెడిట్ కాస్త తగ్గింది. (నవ్వుతూ). ► విక్రమ్ సినిమాల్లో త్వరగా షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా ఇదే. తొందర గా పూర్తి చేస్తే ఇంత కిక్ వస్తుందా? నా కళ్లు తెరిపించావు అన్నాడు విక్రమ్ (నవ్వుతూ). ‘జెర్సీ’ కోసం క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు విక్రమ్ ఈ టైటిల్ చెప్పడానికి వచ్చాడు. ‘గ్యాంగ్‌లీడర్’ అని చెప్ప గానే ఎగ్జయిట్ అయ్యాను. ఆ తర్వాత ‘గ్యాం గ్లీడర్’ టైటిల్‌తో ఏర్పడ్డ చిన్న కన్ఫ్యూజన్ వల్ల ‘నానీస్ గ్యాంగ్‌లీడర్’ గా మార్చాం. ఒకవేళ మాస్ సినిమా చేస్తే భయపడుతూ, వణికిపోతూ ఉండాలి. కానీ ఈ ‘గ్యాంగ్‌లీడర్’ జానర్ వేరే. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి పేరుని మా అబ్బాయికి పెట్టాను అనుకుందాం. అప్పుడు కాంట్రవర్సీ అవుతుందేమో అని ఆలోచిస్తానా? లేదు కదా. ఇష్టంతో, ప్రేమతో పెట్టుకున్న టైటిల్ ఇది. టైటిల్ పెట్టాం కదా అని ఆ సినిమా గుర్తుగా ఓ షాట్ పెట్టాం. సినిమా ఫుల్ ఎనర్జీతో నడుస్తుంది. ఇది ఏ సినిమాకు రీమేక్, కాపీ కూడా కాదు. ► స్కూల్ రోజుల్లో రిజర్వ్›్డగా ఉండేవాణ్ణి. మార్కులు వస్తే ధైర్యంగా ఉంటుంది. అందుకే సైలెంట్‌గా ఉండేవాణ్ణేమో (నవ్వుతూ). అయితే మా గల్లీలో నేనే గ్యాంగ్‌లీడర్. అందరూ నాకంటే చిన్నోళ్లు ఉండేవారు. అక్కడ రెచ్చిపోయేవాణ్ణి. ► నేను కేవలం యాక్టర్‌ని. కమర్షియల్ సినిమాలో చూస్తే కమర్షియల్ యాక్టర్లా, ‘జెర్సీ’లాంటి సినిమాలో చూస్తే జస్ట్ యాక్టర్‌గానే కనిపిస్తాను. మీరు ఎలా చూస్తారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది.. అంతే. ‘సక్సెస్ రేట్’ అనే విషయాన్ని నేను నమ్మడం మానేశాను. పది హిట్లు ఇచ్చి ఒక్క ఫ్లాప్ ఇచ్చినా ‘నానీ కష్టాల్లో’ ఉన్నాడు అంటున్నారు. అలాంటప్పుడు ప్రతి సినిమా ముఖ్యమే. సక్సెస్ గురించి ఆలోచిస్తూ ఈ సినిమా ఆడుతుందా? ఆడదా అని లెక్కలు వేసుకోవడం మానేశా. నచ్చింది చేస్తున్నాను. ► కథ కచ్చితంగా చెప్పాల్సింది అయితేనే ద్విభాషా చిత్రం చేస్తాను. గతంలో అలా చేసే చాలా సమయం వృ«థా అయింది. బాలీవుడ్‌కు వెళ్లే ఆలోచనలు లేవు. వెళ్లినా నన్ను తరిమేస్తారు. అది నాకు తెలుసు (నవ్వుతూ). ► మా నిర్మాణంలో చేసిన ‘అ!’ సినిమాకు రెండు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. త్వరలోనే కొత్త సినిమా ప్రకటిస్తాం. ప్రస్తుతం మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ‘వి’ సినిమా చేస్తున్నాను. ► ‘జెర్సీ’ సక్సెస్ నాకు సంతోషాన్ని ఇచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో అమ్ముడుపోతున్న అంశాలేవీ లేకుండా ఈ సినిమా చేశాం. అది 30 కోట్ల షేర్ వసూళ్లు చేసింది. ఇతర భాషల్లోనూ రీమేక్ అవుతోంది. దాన్ని ‘సరిగ్గా ఆడలేదు’ అని ఎలా అంటాం? ‘ఎంసీఏ’ అప్పుడు కలెక్షన్లు బాగా వస్తున్నాయి. ‘డబ్బులు సరేగానీ మంచి సినిమాలు చేయడా?’ అన్నారు. ‘జెర్సీ’ అప్పుడు ‘మంచి సినిమాలు సరే, కలెక్షన్లలో ‘ఎంసీఏ’ని కొడుతుందా లేదా?’ అంటారు. ‘జెర్సీ’కి 400 శాతం డబ్బులు వచ్చినట్టు. ► నాకు సినిమా చూడటం బాగా ఇష్టం. కేవలం ప్రేక్షకుడిలానే చూస్తాను. నేను యాక్టర్ కానప్పుడు నాలో ఉన్న ప్రేక్షకుడికి ఆ కాలం సినిమాలు నచ్చాయి. యాక్టర్‌గా మారిన తర్వాత నాలో ఉన్న ప్రేక్షకుడికి ఇప్పటి సినిమాలు నచ్చుతున్నాయి. ప్రేక్షక్షకుడు మారితే నేను మారినట్టే. నా సినిమాలు తప్పితే అన్ని సినిమాలను ప్రేక్షకుడిలానే చూస్తాను. ► నటుడిగా 11 ఏళ్లు అంటే చాలా ఎక్కువ ప్రయణమే అనిపిస్తోంది. నాకు మాత్రం ఎలా గడిచిపోయిందో అర్థం కావడం లేదు. నాకు పని చేయడమే హాలిడే అన్నట్టు. బ్రేక్ తీసుకుంటే టార్చర్‌గా, ఏదో కష్టపడుతున్న ఫీలింగ్ వస్తుంది. షూటింగ్ చేస్తున్నప్పుడు రోజులు ఎలా గడుస్తుంటాయో తెలియదు. పూర్తయ్యాక ప్రమోషన్స్ అప్పుడు కొంచెం ఇబ్బందే (నవ్వుతూ). -
గ్యాంగ్‌లీడర్ ప్రమోషనల్ సాంగ్
-
దూసుకెళ్తోన్న గ్యాంగ్‌లీడర్ సాంగ్
జెర్సీతో మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చిన నాని.. కథా ప్రాధాన్యం ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ ఉన్నాడు. ప్రస్తుతం నాని మరో విభిన్న కథతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యాడు. గ్యాంగ్ లీడర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటికే మంచి హైప్‌ను క్రియేట్ చేసింది. నాని.. రచయితగా నటిస్తోన్న ఈ మూవీలో హీరో కార్తికేయ నెగెటివ్ రోల్ పోషించడం విశేషం. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్‌తో మంచి టాక్‌ను సొంతం చేసుకున్న ఈ మూవీ నుంచి ఓ ప్రమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. నానితో కలిసి సంగీత దర్శకుడు అనిరుధ్ వేసిన స్టెప్పులు హైలెట్‌గా నిలిచాయి. ఐదుగురి పాత్రలను వివరిస్తూ సాగిన ఈ పాట.. మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. మైత్రీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 13న విడుదల కానుంది. -
నా నుండి మీ అయ్యి పదకొండేళ్లు : నాని
యంగ్ హీరో నాని హీరోగా వెండితెరకు పరిచయం అయి పదకొండేళ్లు అవుతుంది. నాని హీరోగా తెరకెక్కిన తొలి సినిమా అష్టా చమ్మా రిలీజ్ అయి నేటికి పదకొండేళ్లు. ఈ సందర్భంగా నాని తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘అష్టా - చమ్మా రిలీజ్ అయ్యి పదకొండేళ్ళు.... నా నుండి మీ అయ్యి పదకొండేళ్ళు. ఇంత పెద్ద కుటుంబానికి థ్యాంక్యూ అనేది చాలా చిన్న పదం. ఇంకా మరిన్ని సంవత్సరాల పాటు ఈ అనుబంధం కొనసాగాలని ఆశిస్తున్నా’ అంటూ ట్వీట్ చేశారు. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ప్రస్తుతం నేచురల్ స్టార్‌గా తనకంటూ స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు నాని. ప్రస్తుతం నాని, విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో గ్యాంగ్ లీడర్ సినిమాలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. అష్టా - చమ్మా రిలీజ్ అయ్యి పదకొండేళ్ళు.... నా నుండి మీ అయ్యి పదకొండేళ్ళు. Thank you is a small word for such a big family To many more years of this magical bond. Cheers Mee Nani — Nani (@NameisNani) September 5, 2019 -
నానీని.. మెగా అభిమానులు అంగీకరిస్తారా?
నాని.. గ్యాంగ్ లీడర్ సినిమాను మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇబ్బందులు వెంటాడుతున్నాయి. కొద్ది రోజుల షూటింగ్ తరువాత సినిమా ఆగిపోయిందంటూ ప్రచారం జరిగింది. తరువాత గ్యాంగ్‌లీడర్ అనే టైటిల్‌ను ప్రకటించటంతో మెగా అభిమానులు ఫైర్ అయ్యారు. దీనికి తోడు గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ వేరే నిర్మాతలు రిజిస్టర్ చేయించుకోవటంతో తప్పనిసరి పరిస్థితుల్లో సినిమా టైటిల్‌ను ‘నానీస్ గ్యాంగ్ లీడర్’గా మార్చాల్సి వచ్చింది. రిలీజ్ డేట్ విషయంలోనూ గ్యాంగ్ లీడర్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. ముందుగా ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయాలని భావించారు. కానీ అదే రోజు సాహో రిలీజ్ అంటూ ప్రకటన రావటంతో ఆగస్టు 30కి మార్చారు. కానీ సాహో కూడా వాయిదా పడి ఆగస్టు 30కి రావటంతో సినిమాను సెప్టెంబర్ 13కు వాయిదా వేశారు. ఆ రోజు కూడా వరుణ్ తేజ్ వాల్మీకితో పోటి పడాల్సి రావటంతో సినీ పెద్దలు కలగజేసుకొని వాల్మీకిని సెప్టెంబర్ 20కి వాయిదా వేయించారు. తాజాగా ట్రైలర్లో మెగా అభిమానులను కూల్ చేసే ప్రయత్నం చేశాడు నాని. ట్రైలర్లో గ్యాంగ్ లీడర్లో చిరు ఇంట్రడక్షన్ సీన్ తరహాలో వెల్డర్‌గా ఓ షాట్, తరువాత చిరంజీవి ఫేస్ మాస్క్‌తో మరో షాట్లో కనిపించాడు. మరి ఈ రెండు సీన్స్‌తోనే మెగా అభిమానులు శాంతిస్తారా..? గ్యాంగ్ లీడర్‌గా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌ను చూసుకోవాలనుకుంటున్న ఫ్యాన్స్ ఆ స్థానంలో నానిని అంగీకరిస్తారా..? లేదా..? తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేవరకు వెయిట్ చేయాల్సిందే -
అక్షరాలు తింటాం.. పుస్తకాలు కప్పుకుంటాం
మా రైటర్స్ ప్రపంచం అంటే ఇంతే.. పుస్తకాలతో నిండిపోయి ఉంటుంది. ఆకలేస్తే అక్షరాలు తింటాం.. చలేస్తే పుస్తకాలు కప్పుకుంటాం’, ‘యుద్ధానికి సిద్ధం కండి... సమరశంఖం నేను ఊదుతా’, ‘రేయ్.. నేనింకా థ్రిల్లర్ జోనర్‌లోనే ఉన్నాను.. సైకో కిల్లర్ జోనర్లోకి వెళ్లేలోపు మొదలెట్టేద్దాం’ అంటూ నాని చెప్పే డైలాగ్స్ ఆసక్తిగా ఉన్నాయి. నాని, ప్రియాంక జంటగా ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘నాని’స్ గ్యాంగ్ లీడర్’. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ (సివిఎం) నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 13న విడుదలవుతోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. పైన చెప్పిన డైలాగ్స్ అన్నీ ఈ ట్రైలర్‌లోనివే. ‘‘మా సినిమాలో రివెంజ్ రైటర్ పెన్సిల్‌గా నాని ఓ వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తారు. ఇటీవల విడుదలైన మా చిత్రం టీజర్‌కి, పాటలకు విశేష స్పందన లభిస్తోంది. ఇప్పుడు విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: అనిరుథ్, కెమెరా: మిరోస్లా కుబా బ్రోజెక్, సీఈఓ: చిరంజీవి(చెర్రీ). -
‘మా రైటర్స్ ప్రపంచం అంటే ఇంతే’
నేచురల్ స్టార్ నాని హీరోగా, విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గ్యాంగ్ లీడర్. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా వరుస వాయిదాల తరువాత సెప్టెంబర్ 13న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని రివేంజ్ కథల రచయిత పెన్సిల్‌గా కనిపించనున్నాడు. రివేంజ్ రచయిత అయినా పెన్సిల్ ఐదుగురు ఆడవాళ్లు పగ తీర్చుకునేందుకు ఎలా సాయం చేశాడు అన్నదే గ్యాంగ్ లీడర్ కథ. నానికి జోడిగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుండగా యువ సంగీత దర్శకుడు అనిరుధ్ స్వరాలందిస్తున్నాడు. సీనియర్ నటి లక్ష్మీ, శరణ్య, అనీష్ కురివిల్లా, ప్రియదర్శి, వెన్నెల కిశోర్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
క్లాష్ వస్తే నిర్మాతలే నష్టపోతున్నారు
‘‘పండగరోజుల్లో తమ సినిమాలను విడుదల చేయాలని అందరూ అనుకోవడంలో తప్పు లేదు. సెలవులు లేని రోజుల్లో వారానికి ఒకరు ప్రేక్షకుల ముందుకు రావాలని నిర్ణయించుకోవడం మంచిదే. ప్యాన్ ఇండియా సినిమాలు ‘సాహో, సైరా నరసింహారెడ్డి’ విడుదలవుతున్నప్పుడు ఇలాగే ఆలోచించి విడుదల ప్లాన్ చేసుకోవాలి.. అలాగే నిర్ణయం తీసుకున్నాం. రెండు సినిమాలు ఒకేసారి క్లాష్ వస్తే నిర్మాతలే నష్టపోతున్నారు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. నాని హీరోగా నటించిన ‘నానిస్ గ్యాంగ్ లీడర్’, వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘వాల్మీకి’ చిత్రాలు సెప్టెంబర్ 13న విడుదలకు సిద్ధమయ్యాయి. ఒకేరోజు రెండు చిత్రాలు విడుదలైతే నిర్మాతలకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నందున ‘ప్రొడ్యూసర్స్ గిల్డ్’ రెండు చిత్రాల నిర్మాతలను పిలిచి మాట్లాడారు. చర్చల అనంతరం సెప్టెంబర్ 13న ‘నానిస్ గ్యాంగ్‌లీడర్’, సెప్టెంబర్ 20న ‘వాల్మీకి’ సినిమా విడుదల చేయడానికి ఆయా నిర్మాతలు నిర్ణయించుకున్నారు. ‘‘రెండు సినిమాల రిలీజ్ డేట్స్ ఒకేరోజున కుదిరాయి. ఆ సినిమాల నిర్మాతలిద్దరూ మా గిల్డ్ గ్రూపులో సభ్యులే కాబట్టి ఓ సినిమాను వెనక్కి వెళ్లమని వారిని ఒప్పించాం’’ అన్నారు నిర్మాత కె.ఎల్.దామోదర ప్రసాద్. ‘‘వాల్మీకి’ ని సెప్టెంబర్ 20న విడుదల చేసేందుకు ఒప్పుకున్న నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంటలకు, గిల్డ్‌కు థ్యాంక్స్’’ అన్నారు నిర్మాత నవీన్ ఎర్నేని. ‘‘ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు సామరస్యంగానే ముందుకు వెళ్లాలి. వరుణ్ తేజ్, హరీశ్ శంకర్ సహకారానికి, గిల్డ్‌కి థ్యాంక్స్’’ అన్నారు నిర్మాత రామ్ ఆచంట. -
వెనక్కి తగ్గిన ‘వాల్మీకి’!
మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వాల్మీకి. తమిళ సూపర్ హిట్ జిగర్తాండకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాను సెప్టెంబర్ 13న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే అదే రోజు నాని, విక్రమ్ కె కుమార్ల గ్యాంగ్ లీడర్ కూడా రిలీజ్ అవుతుండటంతో రెండు చిత్రాల నిర్మాతలు కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరున రిలీజ్ అవుతున్న సాహో మేనియా సెప్టెంబర్ 13 వరకు కొనసాగే అవకాశం ఉండటంతో ఆ రోజు రెండు సినిమాలు రిలీజ్ చేస్తే థియేటర్ల సమస్య కూడా వస్తుందని భావిస్తున్నారు. అందుకే గ్యాంగ్‌లీడర్‌ను ముందుగా ప్రకటించినట్టుగా సెప్టెంబర్ 13న రిలీజ్ చేసి వాల్మీకిని 20న రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు చిత్ర నిర్మాతలు ఈ రోజు అధికారిక ప్రకటన చేయనున్నారు. -
‘నానీస్ గ్యాంగ్‌లీడర్’ విలేకరుల సమావేశం
-
మాది రివెంజ్ ఎంటర్టైనర్
‘‘రెండు ఐకానిక్ సినిమాల (సాహో, సైరా: నరసింహారెడ్డి చిత్రాలను ఉద్దేశించి) మధ్య వస్తున్నాం. ఆ రెండు సినిమాలకు మా చిత్రానికి రిలీజ్‌ల విషయంలో గ్యాప్ ఉంది కాబట్టి పెద్దగా టెన్షన్ లేదు. నేను కూడా ఆ సినిమాలను చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని నాని అన్నారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన చిత్రం ‘నానీస్ గ్యాంగ్‌లీడర్’. ౖమైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేనీ, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెల 13న విడుదల కానుంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఈ నెల 28న విడుదల చేయనున్నట్లు నాని వెల్లడించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో నాని మాట్లాడుతూ– ‘‘మంచి పాజిటివ్ ఎనర్జీతో ఈ సినిమా స్టార్ట్ చేశాం. చాలా ఎంజాయ్ చేస్తూ షూటింగ్‌ను కంప్లీట్ చేశాం. టీమ్ మెంబర్స్ నా బరువునంత పంచుకున్నారు. లక్ష్మి, శరణ్యగార్లతో నటించడం అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఇది మాకు ఒక హ్యాపీ ప్రాజెక్ట్. వచ్చే బుధవారం ట్రైలర్‌ను విడుదల చేస్తున్నాం. సినిమాలో సర్ప్రైజ్లు, నవ్వులు ఉంటాయి. వచ్చే నెల మొదటి వారంలో నేను–అనిరు«ద్ చేసిన ఓ ప్రమోషనల్ సాంగ్ వీడియో రిలీజ్ ప్లాన్ ఉంది. ఈ సినిమాతో తెలుగు పరిశ్రమకు హీరోయిన్గా పరిచయం అవుతున్నారు ప్రియాంక. చిరంజీవిగారి ‘గ్యాంగ్‌లీడర్’ మంచి ఐకానిక్ మూవీ. ఆ సినిమా జానర్ వేరు. మా సినిమా రివెంజ్ ఎంటర్టైనర్. ఇందులో దేవ్ అనే విలన్ పాత్రలో కార్తికేయ చాలా బాగా చేశాడు. మైత్రీ నిర్మాతలు సినిమాలను చాలా క్వాలిటీగా తీస్తారు’’ అన్నారు. ‘‘యాక్టర్‌గా నాకు తక్కువ అనుభవం ఉన్నప్పటికీ ఈ సినిమాలోని దేవ్ పాత్ర నాకు ఇచ్చిన నాని, విక్రమ్గార్లకు థ్యాంక్స్. హీరో అవ్వాలనుకునే మాలాంటి వారికి నానిగారు ఒక ప్రేరణ. నా రోల్ భయపెట్టేలా ఉంటుంది’’ అన్నారు కార్తికేయ. ‘‘ఈ చిత్రం నాకు తెలుగులో తొలి సినిమా. నాకు కొంచెం కొంచెం తెలుగు వచ్చు. మంచి డెబ్యూ మూవీ దొరికింది’’ అన్నారు ప్రియాంక. -
‘గ్యాంగ్ లీడర్’ మరోసారి వాయిదా?
నేచురల్ స్టార్ నాని హీరోగా విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ‘నానీస్ గ్యాంగ్ లీడర్’. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబర్ 13న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. రిలీజ్‌కు ఇంకా 20 రోజులు మాత్రమే సమయం ఉన్నా చిత్రయూనిట్ ప్రమోషన్ విషయంలో ఇంకా స్పీడు పెంచలేదు. దీంతో సినిమా మరోసారి వాయిదా పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ముందుగా ఈ సినిమాను ఆగస్టు 30న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. కానీ అదే రోజు సాహో రిలీజ్ అనే ప్రకటన రావటంతో తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాను సెప్టెంబర్ 13కు వాయిదా వేశారు. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల సందడి కనిపించకపొవటంతో సినిమా మరోసారి వాయిదా పడనుందన్న ప్రచారం జరుగుతోంది. నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తరువాత ఈ బ్యానర్లో ఒక్క హిట్ కూడా రాలేదు. ప్రస్తుతం నాని కూడా ఓ బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో రిలీజ్ అవుతున్న గ్యాంగ్ లీడర్ సినిమాకు కావాల్సిన బజ్ మాత్రం కనిపించటం లేదు. -
రచ్చ మళ్లీ మొదలవుతుంది
‘బావమరదలు’ చిత్రం ఫేమ్ మోహన్ కృష్ణ హీరోగా కిషోర్ బాబు దర్శకత్వంలో సింగులూరి మోహన్ రావు నిర్మించిన చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ‘మళ్ళీ మొదలవుతుంది రచ్చ’ అనేది ఉపశీర్షిక. హరిణి రెyì ్డ కథానాయిక. కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. గురువారం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామి నాయుడు, మెగా అభిమాని మోహన్ కృష్ణ ఈ సినిమా టీజర్‌ను విడుదలచేశారు. సీహెచ్ రవికిషోర్ బాబు మాట్లాడుతూ– ‘‘సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. చిరంజీవిగారి సూపర్ హిట్ సినిమా టైటిల్ కావడం వల్ల రాజీ పడకుండా తెరకెక్కిస్తున్నాం. త్వరలోనే సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘స్వతహాగా చిరంజీవిగారి అభిమానినైన నేను ఆయన సూపర్ హిట్ సినిమా ‘గ్యాంగ్‌లీడర్’ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నా. మెగా అభిమానులను అలరించేలా టీజర్, సినిమా ఉంటుంది’’ అన్నారు. -
‘గ్యాంగ్ లీడర్’ నుంచి సెకండ్ సింగిల్
నటనకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలను చేస్తూ.. తనకంటూ ఓ అభిమాన గణాన్ని ఏర్పరుచుకున్న నాని.. రీసెంట్గా జెర్సీ చిత్రంలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మళ్లీ తాజాగా మరో విభిన్న చిత్రం చేస్తూ.. తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దం అవుతున్నాడు. విక్రమ్ కె కుమార్ డైరెక్షన్లో రాబోతోన్న గ్యాంగ్ లీడర్ చిత్రం టీజర్, పోస్టర్స్,పాటలతో మంచి అంచనాలను పెంచగా.. తాజాగా రెండో పాటను విడుదల చేసింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అందర్నీ అలరించడానికి రెడీ అవుతున్న ‘గ్యాంగ్‌లీడర్' చిత్రంలోని 'వేరే కొత్త భూమిపై ఉన్నానా.. ఏదో వింత రాగమే విన్నానా.. హోయ్‌నా.. హోయ్‌నా..హోయ్‌నా..' అంటూ సాగే రెండో పాటను స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్ట్ 15న విడుదల చేశారు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్, జైజా, సత్య నటిస్తున్నారు. ఈ ప్రముఖ పాత్రను ఆర్ఎక్స్ 100 హీరో కార్తీకేయ పోషిస్తున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 13న థియేటర్లలో సందడి చేయనుంది. -
రివెంజ్ లీడర్
తన ప్లాన్‌ను మార్చుకుని ఆడియన్స్ కోసం కొత్త స్కెచ్ వేశాడు పార్థసారధి. గ్యాంగ్ సాహసాలను వచ్చే నెల చూపిస్తానంటున్నాడు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన చిత్రం ‘‘నాని’స్ గ్యాంగ్‌లీడర్’’. ఈ చిత్రంలో రివెంజ్ రైటర్ పార్థసారధి పాత్రలో నటించారు నాని. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మించారు. ఈ సినిమా విడుదల తేదీని సెప్టెంబరు 13న నిర్ణయించినట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది. ‘‘ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్, టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఓ ఆసక్తికరమైన పాయింట్‌తో విక్రమ్‌కుమార్ బాగా తెరకెక్కించారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు అనిరు«ద్ రవిచందర్ సంగీతం అందించారు. -
‘సాహో’ మన సినిమా : నాని
బాహుబలి తరువాత టాలీవుడ్ నుంచి వస్తున్న మరో భారీ చిత్రం సాహో. బాహుబలి తరహాలోనే సాహోపై కూడా జాతీయ స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా 300 కోట్లకు పైగా బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించారు. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. అయితే సాహో రిలీజ్ డేట్ వాయిదా పడటం కారణంగా తెలుగు, తమిళ భాషల్లో కొన్ని సినిమాల రిలీజ్లు డైలామాలో పడ్డాయి. వాటిలో నాని హీరోగా తెరకెక్కుతున్న గ్యాంగ్ లీడర్ ఒకటి. తాజాగా తన సినిమా రిలీజ్ డేట్‌పై నాని స్పందించాడు. ‘దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన సాహో మన సినిమా. ఆ సినిమా విజయాన్ని కూడా మనందరం సెలబ్రేట్ చేసుకోవాలి. ప్రభాస్ అన్న, సాహో టీంకు నా శుభాకాంక్షలు. గ్యాంగ్ లీడర్ రిలీజ్ డేట్‌ను రేపు ప్రకటిస్తా’ అంటూ ట్వీట్ చేశాడు. #Saaho is our film which is making noise nation wide and when it succeeds its our celebration. wishing Prabhas Anna and team nothing less than a huge blockbuster on August 30th 🤗#GANGLEADER release date will be announced tomorrow 🔥 pic.twitter.com/D6oJXOmFDA — Nani (@NameisNani) August 8, 2019 -
కష్టాల్లో ‘గ్యాంగ్ లీడర్’!
నేచురల్ స్టార్ నాని ఏ ముహూర్తాన గ్యాంగ్ లీడర్ సినిమాను ప్రారంభించాడోగాని.. మొదలు పెట్టిన దగ్గర నుంచి ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూనే ఉంది. విలక్షణ దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగిపోయిందన్న ప్రచారం జరిగింది. తరువాత టైటిల్ విషయంలోనూ ఇబ్బందులు తలెత్తాయి. గ్యాంగ్ లీడర్ టైటిల్ ఇతర నిర్మాతలు రిజిస్టర్ చేయించుకోవటంతో టైటిల్‌ను ‘నానీస్ గ్యాంగ్ లీడర్’గా మార్చారు. రిలీజ్ డేట్ విషయంలోనూ గ్యాంగ్ లీడర్‌కి ఇబ్బందులు తప్పటంలేదు. ముందుగా ఈ సినిమాను ఆగస్టు 30న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ అదే రోజు ‘సాహో’ రిలీజ్ అవుతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో సెప్టెంబర్ 13కు వాయిదా వేశారు. కానీ ఆ రోజున కూడా గ్యాంగ్ లీడర్‌కు కష్టాలు తప్పేలా లేవు. భారీ చిత్రం కావటంతో సాహో హవా రెండు మూడు వారాల పాటు కొనసాగే అవకాశం ఉంది. దీనికి తోడు సెప్టెంబర్ 13న వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘వాల్మీకి’ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీంతో గ్యాంగ్ లీడర్‌కు థియేటర్ల సమస్యతో పాటు కలెక్షన్ల మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. మరి ఇన్ని సమస్యల మధ్య గ్యాంగ్ లీడర్ థియేటర్లలోకి వస్తాడా..? లేక మరోసారి వాయిదా వేస్తారా చూడాలి. -
స్కెచ్ కంప్లీట్
తన గ్యాంగ్‌తో కలిసి పగ తీర్చుకున్నాడు పార్ధసారథి. ఇందుకోసం ఎలాంటి స్కెచ్‌లు వేశాడు? ప్రత్యర్థుల నుంచి ఎటువంటి సమస్యలను ఎదుర్కొన్నాడు అనే దృశ్యాలను మాత్రం వెండితెరపై చూడాల్సిందే. నాని హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘గ్యాంగ్‌లీడర్’. ఇందులో రివెంజ్ రైటర్ పార్థసారథి పాత్రలో నటించారు నాని. ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిల్లాలు నాని గ్యాంగ్ సభ్యులుగా నటించారు. ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆగస్టు 30న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. -
పెన్సిల్, ప్రియ గుడ్‌బై చెప్పేశారు
మన న్యాచురల్ స్టార్ నాని రచయితగా మారారు. అదీ గ్యాంగ్ లీడర్ చిత్రం కోసమనే సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు భిన్న పాత్రలను చేస్తూ వచ్చిన నాని.. ఈ మూవీలో రచయితగా మారిపోయాడు. అలాంటప్పుడు తన కలానికి ఓ పేరు ఉండాలి కదా అని.. కలానికి పెన్సిల్ అని పేరు పెట్టుకున్నారు. అయితే పెన్సిల్, ప్రియ ఇప్పుడు షూటింగ్‌కు గుడ్‌బై చెప్పారట. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీ టీజర్ రీసెంట్గా విడుదలైంది. ఈ టీజర్లో నానితో పాటు ఐదు పాత్రలు చేసిన అల్లరిని చూశాం. నాని, ప్రియాంక అరుల్ మోహన్‌లు షూటింగ్‌కు వీడ్కోలు చెప్పినట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ మేరకు హీరోయిన్ ప్రియా ట్వీట్ చేశారు. ఇక ఈ మూవీలో ఆ ఐదుగురి పాత్రలతో మన రైటర్ ఎలా నెగ్గుకొచ్చాడు? దీంట్లో ప్రియ పాత్ర ఏంటో చూడాలంటే ఆగస్టు 30 వరకు ఆగాల్సిందే. Pencil and Priya signing off from the sets of Gang Leader & we're on our way to meet you at the nearest theatre, soon.@NameisNani 😋#Gangleader #pencil#priya pic.twitter.com/NEgokZPXzY — Priyanka Mohan (@priyankaamohan) July 29, 2019 -
‘పెన్సిల్.. ఫేమస్ రివేంజ్ రైటర్’
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం గ్యాంగ్ లీడర్. విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తికాగా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు చిత్రయూనిట్. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు ఓ లిరికల్ వీడియోను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ తాజాగా సినిమాలో హీరో పాత్రకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు. నానిని పెన్సిల్ పేరుతో పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన ఈ టీజర్‌ను ఆసక్తికరంగా రూపొందించారు. నాని ఈ సినిమాలో రివేంజ్ స్టోరిల రచయితగా కనిపించాడు. మరో కీలక పాత్రలో నటిస్తున్న కార్తికేయను రేసర్‌గా పరిచయం చేశారు. నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. ఇతర పాత్రల్లో లక్ష్మీ, శరణ్య, అనీష్ కురివిల్లా, ప్రియదర్శి, వెన్నెల కిశోర్‌లు అలరించనున్నారు. -
నాని ‘గ్యాంగ్ లీడర్’ వాయిదా?
నేచురల్ స్టార్ నాని, విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గ్యాంగ్ లీడర్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆగస్టు 30న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే సాహో సినిమాను అదే రోజు రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించటంతో గ్యాంగ్ లీడర్ టీం ఆలోచనలో పడ్డారు. సాహో లాంటి భారీ చిత్రంలో పోటి పడే కన్నా రిలీజ్ వాయిదా వేయటం బెటర్ అన్న ఆలోచనలో ఉన్నారట. అందుకే ముందుగా అనుకున్నట్టుగా ఆగస్టు 30న కాకుండా సినిమాను సెప్టెంబర్ 13న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. నాని సరసన ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుథ్ సంగీతమందిస్తున్నాడు. -
పెన్ పెన్సిల్
కవికి కలం ముఖ్యం. అందుకే దానికి కూడా ఓ పేరు పెట్టుకుంటాడు. ఆ పేరుతో రచనలు చేస్తుంటాడు. నాని కూడా రచయితగా మారారా. ఆయన కూడా తన పెన్నుకో పేరు పెట్టుకోవాలనుకున్నారు. ఆలోచించి చించీ పెన్నుకి తమ్ముడైన పెన్సిల్ పేరుని తన పెన్నుకి పెట్టుకున్నారు. పెన్ఫ్యూషన్గా ఉందా? అయితే అసలు విషయానికి వచ్చేస్తాం. నాని నటిస్తున్న కొత్త చిత్రం ‘గ్యాంగ్‌లీడర్’. విక్రమ్ కె. కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో నాని పెన్ నేమ్ పెన్సిల్ అట. ఇందులో నాని రచయితగా నటిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను ఇవాళ రిలీజ్ చేస్తున్నారు. సినిమా ఆగస్ట్ 30న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు అనిరుథ్ సంగీత దర్శకుడు. -
‘రారా.. జగతిని జయించుదాం..’
నేచురల్ స్టార్ నాని వెర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్(సివిఎం) నిర్మిస్తున్న విభిన్న చిత్రం 'నాని'స్ గ్యాంగ్ లీడర్'. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. విభిన్న కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాపై ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల తర్వాత భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సాంగ్‌ను విడుదల చేశారు. అనంత శ్రీరామ్ రచించిన 'రారా.. జగతిని జయించుదాం.. రారా చరితని లిఖించుదాం..' అంటూ సాగే పాటను అనిరుధ్ రవిచందర్ సంగీత నేతృత్వంలో పృథ్వీచంద్ర, బాషెర్‌మాక్స్ ఆలపించారు. ఈ పాటలోని ర్యాప్‌ను కూడా బాషెర్‌మాక్స్ క్రియేట్ చేశారు. చక్కని పదాలతో అనంతశ్రీరామ్ రాసిన ఈ పాట అందర్నీ ఇన్స్పైర్ చేసేలా ఉంది. అనిరుధ్ మ్యూజిక్ మెస్మరైజ్ చేసేలా ఉంది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ కార్తికేయ పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. -
ఇప్పుడు ‘గ్యాంగ్ లీడర్’ పరిస్థితేంటి?
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం గ్యాంగ్ లీడర్. విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవల ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ సినిమాను ఆగస్టు 30 రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే అనూహ్యంగా గ్యాంగ్ లీడర్‌కు పెద్ద కష్టం వచ్చి పడింది. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సాహో సినిమా వాయిదా పడనుందన్న టాక్ వినిపిస్తోంది. ముందుగా అనుకున్నట్టుగా ఆగస్టు 15న కాకుండా ఆగస్టు 30కి రిలీజ్ కానుందన్న ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే నిజమైతే గ్యాంగ్ లీడర్ రిలీజ్ కు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. దీంతో గ్యాంగ్ లీడర్ కూడా వాయిదా పడే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. -
ఏం వెతుకుతున్నారు?
బామ్మ, వరలక్ష్మి, ప్రియ, స్వాతి, చిన్ను... అందరూ బైనాక్యులర్స్‌తో ఎవర్నో వెతుకుతున్నారు. ఇంతమంది పనికట్టుకుని వెతికేది ఎవర్నబ్బా? అసలు వీళ్ల స్టోరీ ఏంటి? తెలియాలంటే ఆగస్ట్ 30వరకూ వేచి చూడాల్సిందే. నాని హీరోగా విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘గ్యాంగ్‌లీడర్’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్నారు. పోస్టర్లో కనిపిస్తున్న లేడీ గ్యాంగ్‌కు నాని గ్యాంగ్ లీడర్. ఈ సినిమా ఫస్ట్ లుక్ సోమవారం రిలీజ్ చేశారు. అనిరుథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 30 విడుదల కానుంది. -
‘గ్యాంగ్ లీడర్’ సందడి మొదలవుతోంది!
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం గ్యాంగ్ లీడర్. విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తికాగా త్వరలో ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. ఈ నెల 15 ఫస్ట్ లుక్, 18న ఫస్ట్ సాంగ్, 24న టీజర్‌ను రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ మేరకు ఓ ప్రీ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ కీలక పాత్రలో నటిస్తున్నాడు. We MET We are READY We are the GANG & I AM#GANGLEADER 🖐🏼👊🏼 @Vikram_K_Kumar @MythriOfficial @anirudhofficial @priyankaamohan pic.twitter.com/l7ZO7C2Le7 — Nani (@NameisNani) 13 July 2019 -
గ్యాంగ్ లీడర్‌పై ఏజెంట్ ఎఫెక్ట్!
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం గ్యాంగ్ లీడర్. విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రిలీజ్ డేట్ కూడా ప్రకటించేసిన చిత్రయూనిట్ అనుకున్న సమయానికి సినిమాను రెడీ చేసేందుకు కష్టపడుతున్నారు. అయితే ఈ సినిమాలో గ్యాంగ్ లీడర్‌కు విచిత్రమైన సమస్య ఎదురైంది. గ్యాంగ్ లీడర్ లైన్ ఇటీవల విడుదలైన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా లైన్‌ను పోలి ఉంటుందట. ముఖ్యంగా కొన్ని ట్విస్ట్‌లు ఒకేలా ఉండటంతో ఇప్పుడు కథలో మార్పులు చేసుందుకు రెడీ అవుతున్నారట. అయితే ఈ సమయంలో మార్పులు చేర్పులు చేస్తే అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ అవుతుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఈ వార్తలపై చిత్రయూనిట్ ఇంతవరకు స్పందించలేదు. -
నానీని టెన్షన్ పెడుతున్న అనిరుధ్!
తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ టాలీవుడ్లో సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ‘అ ఆ’ సినిమాతోనే అనిరుధ్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని భావించినా వర్క్ అవుట్ కాకపోవటంతో అజ్ఞాతవాసితో అడుగుపెట్టాడు. అయితే తొలి సినిమా నుంచే టైంకు ట్యూన్ ఇవ్వడన్న అపవాదు అనిరుధ్ మీద ఉంది. దీనికి తోడు అజ్ఞాతవాసి డిజాస్టర్ కావటంతో టాలీవుడ్లో అనిరుధ్ ఆశలు గల్లంతయ్యాయి. తరువాత చేసిన జెర్సీ హిట్ అయినా అనిరుధ్ కు ప్రత్యేకంగా గుర్తింపేమీ రాలేదు. అయితే ప్రస్తుతం నాని హీరోగా తెరకెక్కుతున్న గ్యాంగ్ లీడర్ సినిమాకు సంగీతమందిస్తున్నాడు అనిరుధ్. ఈ సినిమా విషయంలోనూ చెప్పిన టైంకు ట్యూన్స్ ఇవ్వకుండా చిత్రయూనిట్‌ను ఇబ్బంది పెడుతున్నాడట. ఇప్పటికే రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించేసిన టీం, నిర్మాణానంతర కార్యక్రమాలు ఎప్పుడు పూర్తవుతాయో అన్న టెన్షన్లో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. -
చిరు బర్త్‌డేకి గ్యాంగ్‌లీడర్
మోహన్ కృష్ణ, హరిణి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘గ్యాంగ్‌లీడర్’. సిహెచ్ కిషోర్‌బాబు దర్శకత్వంలో సింగులూరి మోహన్‌రావు నిర్మిస్తున్నారు. కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ సమర్పకులు. చిత్ర హీరో మోహన్‌కృష్ణ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ లను రిలీజ్ చేస్తున్నారు.‘‘నా అభిమాన హీరో చిరంజీవిగారి పుట్టిన రోజు ఆగస్టు 22న మా సినిమా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అని మోహన్‌కృష్ణ అన్నారు. ‘‘చిరంజీవిగారి సినిమా టైటిల్ పెట్టడం వల్ల ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాని తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు సిహెచ్ కిషోర్ బాబు. ‘‘సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. టీమ్ చాలా కష్టపడుతున్నారు’’ అన్నారు సింగులూరి మోహన్‌రావు. -
నాన్‌స్టాప్ గ్యాంగ్
ఓ కొత్త ప్లాన్‌తో నాని అండ్ గ్యాంగ్ రంగంలోకి దిగారు. ఆ ప్లాన్ డిౖటైల్స్ ‘గ్యాంగ్‌లీడర్’ సినిమాలో వెండితెరపై లీక్ అవుతాయి. మనం, 24 వంటి డిఫరెంట్ చిత్రాలతో ప్రేక్షకుల మెప్పు పొందిన విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందుతున్న సినిమా ‘గ్యాంగ్‌లీడర్’. కథానాయిక ప్రియాంకా మోహన్ నటిస్తున్న ఈ సినిమాలో ‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ విలన్ పాత్రలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తయింది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ఈ నెల 8న హైదరాబాద్‌లో స్టార్ట్ కానుంది. ఆ రోజు నుంచి సినిమా పూర్తయ్యేవరకూ నాన్‌స్టాప్‌గా షూటింగ్ జరపడానికి ప్లాన్ చేశారు. జూలై 5కల్లా గుమ్మడికాయ కొట్టాలని టీమ్ ప్లాన్ వేసింది. ఈ చిత్రాన్ని ఆగస్టు 30న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా కాకుండా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘వి’ అనే సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు నాని. ఇందులో సుధీర్‌బాబు హీరో. -
ఆగస్టు 30న ‘నాని గ్యాంగ్ లీడర్’
నేచురల్ స్టార్ నాని హీరోగా వెర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘నాని గ్యాంగ్ లీడర్’. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్(సివిఎం)లు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ సినిమా ఆగస్టు 30 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధమవుతోంది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు మాట్లాడుతూ ‘మా బేనర్లో చేస్తున్న మరో విభిన్న చిత్రం ‘నాని గ్యాంగ్ లీడర్’. 14 నుండి శంషాబాద్ లో మూడో షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ అయింది. జూన్ 30కి టోటల్ షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. ఆగష్టు 30న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కి ప్లాన్ చేశాం’ అన్నారు. చిత్ర దర్శకుడు విక్రమ్ కె.కుమార్ మాట్లాడుతూ ‘ఈ సినిమా ఇంతకముందెన్నడూ రాని ఒక డిఫరెంట్ లుక్ తో ఉండే ఫామిలీ ఎంటర్టైనర్. సినిమాలో ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంటుంది. అది ఏమిటనేది స్క్రీన్ పైన చూస్తేనే బాగుంటుంది. టెక్నికల్‌గా చాలా హై స్టాండర్డ్స్‌లో ఉండే సినిమా ఇది’ అన్నారు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. -
నాన్‌స్టాప్‌గా 45 రోజులు
‘జెర్సీ’ వంటి హిట్ సినిమా తర్వాత నాని గ్యాంగ్‌లీడర్‌గా మారిన సంగతి తెలిసిందే. తన గ్యాంగ్‌ను వెంటబెట్టుకుని హైదరాబాద్‌లో 45 రోజులు మకాం వేయడానికి సిద్ధమయ్యారని తెలిసింది. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘గ్యాంగ్‌లీడర్’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి, రవిశంకర్ నిర్మిస్తున్నారు. విభిన్న వయసుల్లో ఉన్న ఐదుగురు మహిళలు ఉండే గ్యాంగ్‌కు నాని లీడర్‌గా కనిపిస్తారన్నది చిత్ర కథ. ఈ సినిమా కొత్త షెడ్యూల్ మరో రెండు రోజుల్లో హైదరాబాద్‌లో స్టార్ట్ కానుందని తెలిసింది. 45 రోజులు ఏకధాటిగా ఈ షెడ్యూల్ జరగనుంది. శంషాబాద్‌లో వేసిన ప్రత్యేక ఇంటి సెట్లో కొన్ని రోజులు షూటింగ్ జరుపుతారట. ఆగస్ట్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి అనిరు«థ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా కాకుండా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వి’ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నాని కనిపించనున్నారు. ఇందులో సుధీర్‌బాబు హీరో. నివేదా థామస్, అదితీరావ్ హీరోయిన్లు. -
‘గ్యాంగ్ లీడర్’ మహేష్ చేయాల్సింది!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమా తరువాత సుకుమార్ దర్శకత్వంలో చేయాల్సిన సినిమాను మహేష్ క్యాన్సిల్ చేసుకున్న సంగతి తెలిసిందే. గతంలోనూ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉండగా ఆ సినిమాను కూడా మహేష్ పక్కన పెట్టేశాడు. ఇప్పటికే అదే కథను విక్రమ్.. నాని హీరోగా తెరకెక్కిస్తున్నాడట. సినిమాలో విలన్ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉండటంతో తన ఇమేజ్‌కు ఆ కథ సూటవ్వదన్న ఉద్దేశం మహేష్ నో చెప్పాడట. అదే కథను నాని ఓకె చేయటంతో గ్యాంగ్ లీడర్ పేరుతో తెరకెక్కిస్తున్నారు. విలన్ పాత్రకు సెన్సేషనల్ హీరోగా ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయను తీసుకున్నారు. మరి మహేష్ కోసం తరువాత చేసిన కథకు నాని ఎంత వరకు సూట్ అవుతాడో చూడాలి. -
గ్యాంగ్ రెడీ అవుతోంది
ఒక చిన్నపాప, టీనేజ్ అమ్మాయి, ఇరవై రెండేళ్ల అమ్మాయి, అమ్మ.. బామ్మ. వీళ్లందరి వెనక ఒక్కడున్నాడు. ఐదు వేళ్లకు సపోర్ట్ ఇచ్చే అరచేతిలా, పాండవులను రక్షించిన శ్రీకృష్ణుడిలా. ఆ గ్యాంగ్‌కి లీడర్ నాని. మరి ఈ గ్యాంగ్ ఏం చేసింది? ఈ గ్యాంగ్‌ను ఆ గ్యాంగ్‌లీడర్ ఎలా రక్షించాడు? అనే కాన్సెప్ట్‌తో నాని లేటెస్ట్ చిత్రం ‘గ్యాంగ్ లీడర్’ తెరకెక్కుతోంది. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఫుల్ స్పీడ్‌లో జరుగుతోంది. ఇటీవలే హైదరాబాద్‌లో ఓ స్టూడియోలో వేసిన సెట్లో ఓ కీలక షెడ్యూల్‌ను కంప్లీట్ చేసింది చిత్రబృందం. నెక్ట్స్ షెడ్యూల్ ఈ వారంలో స్టార్ట్ కానుంది. ‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ ఈ సినిమాలో విలన్‌గా కనిపిస్తారు. అరుళ్ మోహనన్ కథానాయికగా పరిచయం అవుతున్నారు. అనిరు«ద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ నెలలో రిలీజ్ కానుంది. -
గ్యాంగ్ లీడర్ మాదే
‘‘నేను చిరంజీవిగారికి వీరాభిమానిని. అందుకే ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్‌తో ఏ మెగా హీరో సినిమా చేసినా ఇచ్చేస్తాను. వేరే వాళ్లకు ఇచ్చే ప్రసక్తి లేదు. ఈ టైటిల్ తమకు కావాలని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు అడిగారు. ఇవ్వనన్నాను. అమ్మనన్ని కూడా చెప్పాను’’ అన్నారు మోహన్‌కృష్ణ. ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్‌తో తాను హీరోగా నటిస్తూ ఓ నిర్మించాలనుకున్నారు మోహన్‌కృష్ణ. అయితే నాని హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రానికి ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్‌తో మైత్రి మూవీ మేకర్స్ టీజర్ రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో శనివారం మోహన్‌కృష్ణ మాట్లాడుతూ – ‘‘తెలంగాణ, ఏపి ఫిలిం చాంబర్లో ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ రిజిస్టర్ చేశాం. త్వరలో షూటింగ్ ఆరంభించి, చిరంజీవిగారి బర్త్‌డే సందర్భంగా ఆగస్ట్ 22న విడుదల చేయాలనుకున్నాం. చిరంజీవి గారి టైటిల్ పెట్టడం వల్ల చాలా ఫండింగ్ వచ్చింది. 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ కూడా వచ్చింది. ఈలోపు నాని బర్త్‌డేకి మా టైటిల్‌తో టీజర్ రిలీజ్ చేశారు. మా పర్మిషన్ తీసుకోకుండా ఎలా టైటిల్‌ను ఎనౌన్స్ చేస్తారు. నేను చాంబర్లో ఫిర్యాదు చేశాను. ఏపి, తెలంగాణ చాంబర్స్ మాకే అనుకూలంగా ఉన్నాయి’’ అన్నారు. -
ముదురుతున్న ‘గ్యాంగ్ లీడర్’ వివాదం
నాని, విక్రమ్ కె కుమార్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో ఇటీవలే ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి గ్యాంగ్ లీడర్ అనే టైటిల్‌తో టీజర్ కూడా రిలీజ్ చేశారు. అయితే గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ తమ బ్యానర్లో రిజిస్టర్ చేసుకున్నామని, గ్యాంగ్ లీడర్ పేరుతో తాము సినిమా కూడా ప్రారంభించామని చిత్ర నిర్మాత, హీరో మోహన కృష్ణ ఫిలిం చాంబర్లో జరిగిన ప్రెస్ మీట్లో తెలియజేశారు. మాణిక్యం మూవీస్ బ్యానర్ మీద తెలంగాణ, ఏపి ఫిలిం చాంబర్లో టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మోహన కృష్ణ మాట్లాడుతూ.. ‘మా మాణిక్యం మూవీస్ బ్యానర్లో బావా మరదలు అనే సినిమా నిర్మించాం. ఇప్పుడు నాయుడు గారి అబ్బాయి నిర్మిస్తున్నాం. త్వరలోనే గ్యాంగ్ లీడర్ అనే సినిమా చేయబోతున్నాం. ఇందులో నేనే హీరోగా, నిర్మాతగా సెట్స్ మీదకు వెళ్ల బోతున్నాం. అక్టోబర్‌లో గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ రిజిస్ట్రేషన్ చేశాం. ఉగాది రోజున ఈస్ట్ గోదావరిలో దాదాపు 40 రోజుల పాటు షూటింగ్‌కు ప్లాన్ చేశాం. చిరంజీవి గారి బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 22న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. నేను చిరంజీవి గారికి వీరాభిమానిని. గ్యాంగ్ లీడర్ టైటిల్ తో ఏ మెగా హీరో సినిమా చేసినా ఇచ్చేస్తాను. వేరే వాళ్లకు ఇచ్చే ప్రసక్తి లేదు. టైటిల్ కావాలని మైత్రీ మూవీ మేకర్స్ నుంచి కాల్ చేశారు. కానీ నేను టైటిల్ ఇవ్వను, అమ్మను అని చెప్పాను. వాళ్లు చాలా రకాలుగా ట్రై చేశారు. కానీ టైటిల్ మాకే దక్కింది. అయినప్పటికీ నాని బర్త్ డే రోజు మా టైటిల్ తో పబ్లిసిటీ చేసుకున్నారు. నా పర్మీషన్ తీసుకోకుండా ఎలా టైటిల్ ను ఎనౌన్స్ చేస్తారు. ఇటువంటి నిర్ణయం ఎలా తీసుకున్నారో తెలియదు. చాంబర్ రూల్స్ కు విరుద్దంగా టైటిల్‌ను ఎలా ఎనౌన్స్ చేస్తారు. నేను చాంబర్ లో కంప్లైంట్ ఇచ్చాను. ఈ టైటిల్ మాకే వచ్చింది. ఏపి, తెలంగాణ చాంబర్స్ మాకే అనుకూలంగా ఉన్నాయి. నేను రిజిస్ట్రేషన్ చేసి మూడు నెలలు అవుతుంది. ఉగాది నుంచి షూటింగ్ కు వెళ్తున్నాం. 3 కోట్ల బడ్జెట్ తో సినిమా చేస్తున్నాం. చిరంజీవి గారి టైటిల్ పెట్టడం వల్ల చాలా ఫండింగ్ వచ్చింది. 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ కూడా వచ్చింది. పక్కోడి టైటిల్ తీసుకోవడం కరెక్ట్ కాదు. పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలని వచ్చాను. చిరంజీవి గారి టైటిల్ కు ఎటువంటి ఆటంకం లేకుండా మంచి పేరు తీసుకోవాలని కథ రెడీ చేశాం. టైటిల్ విషయంలో లీగల్ గా మేం కరెక్ట్ గా ఉన్నాం. తుమ్మల పల్లి రామసత్యనారాయణ, సముద్ర, నట్టి కుమార్, ముత్యాల రాందాసు లాంటి పెద్దలు కూడా మాకు సపోర్టివ్ గా ఉన్నారు. ఏపీ ఎలక్షన్స్ అయ్యాక... 16 సినిమాలు తీసిన పెద్ద బ్యానర్ తో కలిసి మా బ్యానర్లో సినిమాలు తీసి యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయబోతున్నాం. అని అన్నారు. -
నానికి మెగా సెగ..!
నేచురల్ స్టార్ నాని హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అమ్మాయి ఇది మీ కోసమే అంటూ విభిన్న ప్రమోషన్ ప్రారంబించిన నాని ఈ సినిమా టైటిల్ విషయంలో కూడా అదే ఫార్ములా ఫాలో అయ్యాడు. మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సినిమా గ్యాంగ్ లీడర్ టైటిల్‌ను తన సినిమా కోసం తీసుకున్నాడు. అయితే ఇటీవల ఎనౌన్స్ అయిన ఈ సినిమా టైటిల్‌పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అభిమానులు నాని మెగా టైటిల్‌ను తీసుకోవటంపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఏకంగా ‘బాయ్‌కాట్ నానీస్ గ్యాంగ్ లీడర్’(#BoycottNanisGangLeader) అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. గతంలో ఇదే టైటిల్‌ను సాయి ధరమ్ తేజ్ సినిమాకు తీసుకోవాలని భావించినా అభిమానులు వ్యతిరేఖించటంతో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నాడు. మరి ఈ ట్రోలింగ్‌పై నాని ఎలా స్పదింస్తాడో చూడాలి. పులి ని చూసి ... నక్క వాతలు పెట్టుకుంది అంట 😐 .... వాతలు పెట్టుకున్నా ... పులి పూలే .. నక్క నక్కే 😌#BoycottNanisGangLeader pic.twitter.com/DZTUaT1IkG — Megastar Follower (@ChiruFollower) 24 February 2019 #BoycottNanisGangLeader There's only one Gang leader and Indra in TFI. The Mass hysteria he has created wit this movie is never before and never again with due respect towards the legend. The movie team should drop this title. @guptanagu8 @ChiruFollower @vthchiru4ever — Anies.Md (@Mega_Kannadiga) 24 February 2019 #BoycottNanisGangLeader Pls change the title — Suresh kumar (@Sureshk12400884) 25 February 2019 -
గ్యాంగ్‌లీడర్
‘‘ఐదుగురు అమ్మాయిలు. వాళ్ల గ్యాంగ్‌కి ఓ లీడర్. ఐదు వేళ్లను మోసే అరచేతిలాగా, పాండవుల వెనకుండే కృష్ణుడిలా ఆ గ్యాంగ్‌ని చూసుకుంటుంటాడు’ అంటూ సాగే వీడియోతో నాని–విక్రమ్ కె.కుమార్ చిత్ర టైటిల్‌ను నాని బర్త్‌డే సందర్భంగా ‘గ్యాంగ్‌లీడర్’ అని ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇది నాని 24వ చిత్రం. ఈ సినిమాలో ‘ఆర్ఎక్స్ 100’ కార్తికేయ విలన్‌గా నటించనున్నారు. ‘‘చిరంజీవిగారి సినిమాలకు ఫస్ట్ డే ఫస్ట్ షోకు వెళ్లిన జ్ఞాపకాలు ఇంకా గుర్తున్నాయి. ఆయన అభిమాని అయిన నేను.. ఆయన సినిమా టైటిల్‌ను నా సినిమాకి పెట్టడం సంతోషంగా ఉంది’’ అని నాని ట్వీటర్లో పేర్కొన్నారు. ఈ సినిమాలో ప్రియాంక, శరణ్య, ప్రియదర్శి కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఆగస్ట్‌లో రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరు«ద్. -
నాని గ్యాంగ్ లీడరా..?
ఇటీవల కాలంలో పాత సినిమాల టైటిల్స్‌ను ఈ జనరేషన్ హీరోల సినిమాలకు వాడటం కామనైపోయింది. ఇప్పటికే చాలా టైటిల్స్ అలా రిపీట్ అయ్యాయి. తాజాగా ఈ లిస్ట్‌లో మరో బ్లాక్ బస్టర్ టైటిల్ వచ్చి చేరనుందట. నేచురల్ స్టార్ నాని, విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ రోజు (ఆదివారం) నాని పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్డేట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. ఈ రోజు నాని, విక్రమ్‌ల కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా టైటిల్‌ను రివీల్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఈ సినిమా టైటిల్ సంబంధించిన పోస్టింగ్‌లు పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్యాంగ్ లీడర్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సూపర్‌హిట్ సినిమా టైటిల్ గ్యాంగ్ లీడర్‌ను నాని సినిమా కోసం తీసుకున్నారట. గతంలో ఈ టైటిల్‌తో సాయి ధరమ్ తేజ్ హీరోగా సినిమా రూపొందనుందన్న ప్రచారం జరిగింది. అదే సమయంలో గ్యాంగ్ లీడర్ సినిమాను అదే పేరుతో రీమేక్ చేయాలని కూడా అభిమానులు కోరుతున్నారు. మరి ఈ సమయంలో నాని అదే టైటిల్‌ను తన సినిమాకు ఫిక్స్ చేయటంపై అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. -
మెగా న్యూస్ : గ్యాంగ్‌లీడర్ రీమేక్
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో బిగెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచిన సినిమా గ్యాంగ్ లీడర్. మాంగటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మాణంలో విజయబాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఘనవిజయం సాధించి ఎన్నో రికార్డ్లను సొంతం చేసుకుంది. అయితే మెగా వారసుడిగా రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి గ్యాంగ్ లీడర్ రీమేక్‌కు సంబంధించిన చర్చ జరుగుతూనే ఉంది. మెగాస్టార్ అద్భుతమైన టైమింగ్‌తో అలరించిన రాజారామ్ పాత్రలో రామ్ చరణ్‌ను చూసేందుకు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. త్వరలోనే అభిమానుల కల నేరవేరబోతోందన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల జరిగిన తేజ్ ఐ లవ్ యు ఆడియో రిలీజ్ వేడుకలో మాట్లాడిన చిరు, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లో రామ్ చరణ్ హీరోగా సినిమా ఉంటుందన్న హింట్ ఇచ్చారు. అయితే అది గ్యాంగ్ లీడర్ రీమేకే అన్న ప్రచారం జరుగుతోంది. ఒరిజినల్ కథను ఈ జనరేషన్‌కు తగ్గట్టుగా మార్పులు చేసిన తెరకెక్కించేందుకు కేయస్ రామారావు ప్రయత్నిస్తున్నారట. రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీ స్టారర్ తరువాత చరణ్ చేయబోయే సినిమా ఇదే అన్న టాక్ కూడా వినిపిస్తోంది. మరి ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతున్న ఈ వార్తలపై మెగా టీం ఎలా స్పందిస్తుందో చూడాలి. -
రాజంపేటలో గ్యాంగ్ వార్ !
ఒకప్పుడు శివ సినిమాలో హీరో నాగార్జున తన ప్రత్యర్థులను సైకిల్‌కు ఉండే చైన్ లాగి కొట్టడం అప్పల్లో ఒక క్రేజ్.. ఇప్పుడు యువత విద్యార్థి దశలో డస్టర్గాడ్ ,«ఆధునికమైన కత్తులు లాంటి పరికరాలను ఆన్లైన్లో బుక్‌చేసుకొని తమ బ్యాగు, జేబులో పెట్టుకొని తిరగడం ఒక ఫ్యాషన్‌గా మారింది. విద్యార్థులు గ్యాంగ్లీడర్లను ఆశ్రయిస్తూ గ్రూపు తగాదాలతో తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. రాజంపేట : పార్లమెంటు నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట పట్టణంలో మూడు నుంచి నాలుగు గ్యాంగ్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ గ్యాంగ్‌లో ఖాళీగా ఉన్న యువత, మరికొంతమంది ఎన్ఆర్ఐ కుటుంబాలకు చెందిన వారు, ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులు ఉన్నారు. ఖరీదైన బైకుల్లో తిరుగుతూ ప్రేమవ్యవహారాలు, వివాహేతర సంబం«ధాలు, అసాంఘిక కార్యకలాపాలు, మద్యం, హెరాయిన్ ముఠాలతో సంబంధాలు కలిగి ఉంటున్నారు. గ్యాంగుల్లో ఉన్న విద్యార్థులు, యువకులు ఆన్లైన్లో డస్టర్గాడ్తో నూతనంగా వచ్చిన పరికరాలను అందుబాటులోకి తెచ్చుకుంటున్నారు. ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేయాల్సిన ఆవశ్యకత పోలీసులపై ఉందని పలువురు పేర్గొంటున్నారు. ఈ నేపథ్యంలో రాజంపేట పట్టణంలో సంచలనం కలిగించిన ఇంజినీరింగ్ విద్యార్థి సోముసాయి హత్యకు సూత్రధారులెవరనే అంశంపై ఇప్పుడు భిన్నకథనాలు ప్రచారంలో ఉన్నాయి. హత్య ఒకరి వల్ల కాదని కనీసం ఐదుమందిపైకి పైగా ఇందులో పాల్గొని ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ హత్య గ్యాంగ్‌వార్ పనేనా?.అమ్మాయితో సంబంధాల వ్యవహారమా ? బ్యాచ్‌ల మధ్య తగదాలా అనేది పోలీసుల విచారణలో వెల్లడి కావాల్సి ఉంది. కాగా ఈ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న ఒకరిని తప్పించేందుకు అధికారపార్టీ ఎన్ఆర్ఐ నేత ఒకరు ఉన్నతాధికారి నుంచి పోలీసులపై వత్తిడి తీసుకువస్తున్నట్లు తెలిసింది. పట్టణ సీఐ ఏమంటున్నారంటే... సోముసాయి హత్యకేసులో ఇప్పటి వరకు ప్రాథమికంగా ఇద్దరు ఉన్నట్లు పట్టణ సీఐ యుగంధర్ ‘సాక్షి’కి తెలిపారు. నిందితునిగా ఉన్న వంశీ పట్టుబడితే హత్యకు దారితీసిన పూర్తి కారణాలు తెలుస్తాయన్నారు. హత్య కేసులో ఎవరున్నా వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. -
మోదీ హత్యకు టీసీఎస్ ఉద్యోగి కుట్ర?
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు రాజకీయ నాయకులను హతమార్చేందుకు కుట్రపన్నిన అల్ కాయిదా ఉగ్రవాదులను ఎన్ఐఏ వర్గాలు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే.. అరెస్టయిన వాళ్లలో గ్యాంగ్‌లీడర్ దావూద్ సులేమాన్ (23) టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అతడు మదురైలోని కరిమ్సా పల్లివాసల్ ప్రాంతానికి చెందినవాడు. ప్రస్తుతం చెన్నైలోని తిరువన్మియూర్ ప్రాంతంలో ఉంటున్నాడు. అతడితో పాటు పెయింటర్ అబ్బాస్ అలీ, చికెన్ షాపుపలో పనిచేసే శామ్‌సమ్ కరీమ్ రజా కూడా అరెస్టయ్యారు. వీళ్లంతా అల్‌కాయిదా స్ఫూర్తితో మొత్తం 22 మంది వీవీఐపీలను టార్గెట్ చేసినట్లు ఎన్ఐఏ వర్గాలు గుర్తించాయి. వాళ్లు దాగున్న చోటు నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురినీ మదురై, చెన్నై ప్రాంతాల్లో అరెస్టు చేశారు. 'ద బేస్ మూమెంట్ ఆఫ్ అల్ కాయిదా' అనే గ్రూపుగా వీళ్లంతా ఒక్కటయ్యారు. వీళ్లలో కొంతమంది 1998లో తమిళనాడులో నిషేధానికి గురైన అల్ ఉమా ఉగ్రవాద సంస్థ సభ్యులు కూడా. -
'గ్యాంగ్ లీడర్'గా సాయి
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో బిగెస్ట్ హిట్స్‌లో గ్యాంగ్ లీడర్ సినిమా ఒకటి. ఈ సినిమాతో మాస్ ప్రేక్షకుల ఆరాధ్య దైవంగా మారిపోయాడు మెగాస్టార్. యాక్షన్, రొమాన్స్, సెంటిమెంట్ ఇలా అన్ని ఎమోషన్స్ సమపాళ్లలో ఉన్న ఈ సినిమా అప్పట్లో ఘనవిజయం సాధించింది. అయితే ఇంతటి ఘనవిజయం సాధించిన ఈ సినిమా టైటిల్‌ను ఇప్పుడు ఓ మెగా వారసుడు వాడేస్తున్నాడు. చాలా కాలంగా గ్యాంగ్ లీడర్ సినిమాను చరణ్ హీరోగా రీమేక్ చేస్తారన్న టాక్ వినిపించింది. అయితే ఈ విషయం పై ఎలాంటి క్లారిటీ రాకముందే గ్యాంగ్ లీడర్ టైటిల్‌ను మరో మెగా వారసుడు సాయిధరమ్ తేజ్ వాడేస్తున్నాడు. ఇప్పటికే చిరు సినిమా టైటిల్ సుప్రీంను తీసుకున్న సాయి తన నెక్ట్స్ సినిమాకు గ్యాంగ్ లీడర్ టైటిల్‌ను ఫైనల్ చేశాడట. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న మాస్ మసాలా ఎంటర్టైనర్కు ఈ టైటిల్‌ను ఫిక్స్ చేశాడన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను నల్లమలపు శ్రీను భారీగా నిర్మించడానికి రెడీ అవుతున్నాడు. గతంలో గోపిచంద్ దర్శతక్వంలో వరుణ్ హీరోగా ఓ సినిమా ఉంటుందన్న టాక్ వినిపించింది. మరి అదే సినిమాను సాయితో తెరకెక్కిస్తున్నారా లేక ఇది వేరే కథా..? అన్న విషయం పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. -
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సునీల్ ఎస్కేప్..
అనంతపురం క్రైం : కడప, అనంతపురం జిల్లాల్లో పలు కిడ్నాప్ కేసుల్లో ప్రధాన నిందితుడు, గ్యాంగ్ లీడర్, బలవంతపు వసూళ్లకు పాల్పడే వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సునీల్ తప్పించుకోవడం సంచలనం కల్గిస్తోంది. సెక్యూరిటీగా ఉండే ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్ల కళ్లుగప్పి పరారీ కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. కేసు విషయమై కడప సబ్‌జైలులో ఉన్న సునీల్‌ను గురువారం ఉదయం అనంతపురం ఏఆర్ హెడ్‌కానిస్టేబుళ్లు ఇంతియాజ్ అహమ్మద్ (1977), వెంకటరమణారెడ్డి (2177) అనంతపురం కోర్టుకు తీసుకొచ్చారు. అనంతరం కడపకు తీసుకెళ్లారు. అయితే సబ్‌జైలు సమీపంలో సునీల్ పరారయ్యాడు. ఇంతటి కీలకమైన నిందితుడి విషయంలో సెక్యూరిటీ సిబ్బంది అజాగ్రత్తగా ఎలా వ్యవహరించారనేది అర్థం కాని విషయం. వీరిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సునీల్ సెక్యూరిటీ పోలీసుల కళ్లగప్పి పారిపోవడాన్ని అనంతపురం ఎస్పీ ఎస్వీ రాజశేఖర్‌బాబు తీవ్రంగా పరిగణించారు. ఏఆర్ హెడ్‌కానిస్టేబుళ్లు ఇంతియాజ్ అహమ్మద్, వెంకట రమణారెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సునీల్ పోలీసుల చెర నుంచి తప్పించుకోవడం అటు పోలీసులు, ఇటు ప్రజలను కలవరపెడుతోంది. బలవంతంగా డబ్బులు డిమాండ్ చేయడం, కిడ్నాప్ చేయడం, చివరకు హత్యలు చేసేందుకు కూడా వెనుకాడని సునీల్ తప్పించుకోవడం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది. సునీల్‌ను పట్టుకోవడానికి పోలీసు బృందాలు వేట ప్రారంభిం చాయి. కాగా, సునీల్ నేర చరిత్ర తెలిసీ అతడి చేతులకు బేడీలు వేయకుండా కోర్టుకు తీసుకురావడం చర్చనీ యాంశమైంది. -
మీడియా ముందుకు ఎల్లంగౌడ్
-
జిల్లాలో దొంగలముఠా!
విజయనగరం క్రైం, న్యూస్‌లైన్ :జిల్లాలో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. రోజూ ఏదో ఒక ప్రదేశంలో దొంగలు దోపిడీకి పాల్పడుతున్నారు. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. సుమారు రెండు నెలలపాటు దొంగతనాలు జరగకుండా పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండగ నేపథ్యంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతాయని భావించారు. సంక్రాంతి పండగలో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేయడంతో దొంగల ఆటలు సాగలేదు. అయితే, ఊహించని విధంగా ఈ నెల 22 నుంచి దొంగలు వరుసగా చోరీలకు పాల్పడుతున్నారు. జిల్లాలో ముఠా దిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 24న రాత్రి చీపురుపల్లి, కొమరాడ, బలిజిపేట, పార్వతీపురం మండలం కొత్తవలస తదితర ప్రాంతాల్లో దొంగలు చోరీలకు పాల్పడ్డారు. బంగారం, వెండి వస్తువులతోపాటు, నగదును అపహరించారు. వాహనదారులూ.. బహుపరాక్ పట్టణంలోని ఇందిరానగర్‌లో ఈ నెల 20 నుంచి వరుసగా మూడు రోజులపాటు మూడు బైకులు చోరీకి గురయ్యాయి. బయటన పార్కింగ్ చేసిన వాహనాలను మారుతాళాలతో తీసి అపహరిస్తున్నారు. 23న సాయంత్రం మున్సిపల్ కార్యాలయంలో సీసీగా పనిచేస్తున్న ఎన్.వెంకటరావు తన ద్విచక్రవాహనాన్ని కార్యాలయంలో పార్కింగ్ చేయగా.. దొంగలు పట్టపగలే తస్కరించారు. వీరే బైకులపై బృందాలుగా విడిపోయి చీపురుపల్లి, బలిజిపేట, కొమరాడ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 25న రాత్రి ఇందిరానగర్‌లో ఒక బైకు మాయమైనట్లు స్థానికులు చెబుతున్నారు. దొంగలు దేవాలయాలను కూడా వదలడం లేదు. ఇది కూడా ఒక ప్రత్యేక ముఠా పనేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బలిజిపేట ప్రాంతంలో ఈ నెల 24న రాత్రి మూడు దేవాలయాల్లో దొంగతనం జరిగిన తీరు దీనికి నిదర్శనం. గతంలో జమ్ము, నారాయణపురం, పట్టణంలోని హకుంపేట తదితర ప్రాంతాల్లోని దేవాలయాల్లో జరిగే దొంగతనాలు కూడా దీనికి ఊతమిస్తున్నాయి. జిల్లాలో తిరుగుతున్న దొంగల ముఠా..? జిల్లాలో చోరీలకు పాల్పడే ప్రత్యేక ముఠాలు తిరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల వరుసగా బైకులు మాయమవ్వడంతో ప్రత్యేక ముఠాలు తిరుగుతున్నట్లుగా తెలుస్తోంది. వాహనదారులు తమ వాహనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. -
గోవిందా..గోవిందా !
సాక్షి, గుంటూరు: దేవుడిని నమ్ముకొంటే కోరికలు నెరవేరతాయి. అదే దేవుడిని అమ్ముకొంటే లాభ పడవచ్చనే దురాలోచనతో జిల్లాలో విగ్రహాల దొంగల ముఠా సంచరిస్తుంది. పురాతన ఆలయాల్లోని పంచలోహ విగ్రహాలే లక్ష్యంగా ఈ ముఠా పనిచేస్తున్నట్టు సమాచారం. గతంలో అనేక ప్రాంతాల్లో దేవుడి విగ్రహాలు మాయం కావడంపై ఫిర్యాదులు వున్నప్పటికీ, అసలు దొంగలెవరనేది పోలీసులు తేల్చలేక పోయారు. తాజాగా ఫిరంగిపురంలో ఒక ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మూడు రోజుల కిందట ఫిరంగిపురంలో తెల్లవారుజామున అలజడి రేగింది. గ్రామంలో పోలేరమ్మ దేవాలయంలో ఉన్న భద్రకాళీ అమ్మవారి విగ్రహాన్ని ఎత్తుకెళ్తున్న ఇద్దర్ని స్థానికులు పట్టుకున్నారు. భారీ బరువు ఉన్న రాతి విగ్రహాన్ని బైక్‌పై తీసుకు వెళ్లే ప్రయత్నంలో దొరికిపోయారు. వీరిలో సత్తెనపల్లి మండలం కంటెపూడి గ్రామానికి చెందిన వ్యక్తి ఒకరు, మరొకరు ఫిరంగిపురం మండలం బేతపూడికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఆ ఇద్దరు ఇచ్చిన సమాచారం మేరకు మరో నలుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరంతా ఉదయం పోలేరమ్మ దేవాలయాన్ని సందర్శించి రాత్రికి విగ్రహాన్ని పలుగు,పారలతో పెకిలించినట్లు తెలిసింది. రెడ్డిరాజుల కాలంనాటి ఈ రాతి విగ్ర హంలో బంగారం, విలువైన వజ్రాలు (రాతి మధ్యన రంధ్రం చేసి ఉంచుతారని) ఉంటాయని ఇలాంటి విగ్రహాలను పగులకొట్టి వజ్రాలు, బంగారాన్ని కాజేయాలని ముఠా పన్నాగంగా తెలుస్తోంది. పల్నాడులో విగ్రహాలు మాయం.. మూడేళ్ల కిందట నరసరావుపేటలో బేల్దారి సామగ్రి అద్దెకిచ్చే వ్యక్తి అందించిన సమాచారంతో విలువైన పంచలోహ విగ్రహాన్ని పోలీసులు పట్టుకున్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లా సరిహద్దులో వున్న ఓ పురాతన ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని తవ్వేందుకు బేల్దారి సామగ్రి దుకాణం నుంచి పలుగులు, పారలు తీసుకెళ్లారు. చాలారోజుల వరకు వాటిని తిరిగి అప్పగించకుండా, అద్దె చెల్లించ కుండా ఆలస్యం చేయడంతో ముఠా గుట్టు పోలీసులకు తెలిసింది. అప్పట్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు ఆ ముఠా సభ్యులను పోలీసులు వదిలేసినట్లు దుమారం రేగింది. అదేవిధంగా ఏడాది కిందట బొల్లాపల్లి మండలం చక్రాయపాలెం సుగాలితండాలో ఒక అరుదైన పంచలోహ విగ్రహాన్ని అమ్ముకోవాలనే ప్రయత్నంలో స్థానికుల ఘర్షణ పోలీసుల దృష్టికెళ్లింది. విగ్రహాన్ని స్వాధీనం చేసుకుని ఆరాతీయగా, ఆ ఇద్దరు సత్తెనపల్లిలో మట్టిపని కెళితే పంచలోహ విగ్రహం దొరికిందని చెప్పారు. విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నపోలీసులు కేసు నమోదు చేసి వినుకొండ కోర్టుకు సమర్పించారు. మాచర్ల, దాచేపల్లితో పాటు కోటప్పకొండ ప్రాంతంలో గతంలో రాతి విగ్రహాలు మాయమైనట్టు ఫిర్యాదులున్నాయి. ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన వ్యక్తులు ముఠాగా ఏర్పడి పంచలోహ విగ్రహాలే లక్ష్యంగా సంచరిస్తున్నట్టు సమాచారం. 25న కాంట్రాక్ట్ అధ్యాపకుల చలో హైదరాబాద్ గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల ఉద్యోగ భద్రత డిమాండ్ చేస్తూ రాష్ట్ర కాంట్రాక్ట్ అధ్యాపక సంఘ కార్యదర్శి కె.సురేష్ పిలుపు మేరకు ఈనెల 25న చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నట్లు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.రమేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ధ జరిగే సంకల్ప దీక్షకు జిల్లాలోని 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు తరలిరావాలని కోరారు.