
ప్రతీకాత్మక చిత్రం
ఒకప్పుడు శివ సినిమాలో హీరో నాగార్జున తన ప్రత్యర్థులను సైకిల్‌కు ఉండే చైన్ లాగి కొట్టడం అప్పల్లో ఒక క్రేజ్.. ఇప్పుడు యువత విద్యార్థి దశలో డస్టర్‌గాడ్ ,«ఆధునికమైన కత్తులు లాంటి పరికరాలను ఆన్‌లైన్‌లో బుక్‌చేసుకొని తమ బ్యాగు, జేబులో పెట్టుకొని తిరగడం ఒక ఫ్యాషన్‌గా మారింది. విద్యార్థులు గ్యాంగ్‌లీడర్లను ఆశ్రయిస్తూ గ్రూపు తగాదాలతో తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు.
రాజంపేట : పార్లమెంటు నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట పట్టణంలో మూడు నుంచి నాలుగు గ్యాంగ్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ గ్యాంగ్‌లో ఖాళీగా ఉన్న యువత, మరికొంతమంది ఎన్‌ఆర్‌ఐ కుటుంబాలకు చెందిన వారు, ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులు ఉన్నారు. ఖరీదైన బైకుల్లో తిరుగుతూ ప్రేమవ్యవహారాలు, వివాహేతర సంబం«ధాలు, అసాంఘిక కార్యకలాపాలు, మద్యం, హెరాయిన్ ముఠాలతో సంబంధాలు కలిగి ఉంటున్నారు. గ్యాంగుల్లో ఉన్న విద్యార్థులు, యువకులు ఆన్‌లైన్‌లో డస్టర్‌గాడ్‌తో నూతనంగా వచ్చిన పరికరాలను అందుబాటులోకి తెచ్చుకుంటున్నారు. ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేయాల్సిన ఆవశ్యకత పోలీసులపై ఉందని పలువురు పేర్గొంటున్నారు.
ఈ నేపథ్యంలో రాజంపేట పట్టణంలో సంచలనం కలిగించిన ఇంజినీరింగ్ విద్యార్థి సోముసాయి హత్యకు సూత్రధారులెవరనే అంశంపై ఇప్పుడు భిన్నకథనాలు ప్రచారంలో ఉన్నాయి. హత్య ఒకరి వల్ల కాదని కనీసం ఐదుమందిపైకి పైగా ఇందులో పాల్గొని ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ హత్య గ్యాంగ్‌వార్ పనేనా?.అమ్మాయితో సంబంధాల వ్యవహారమా ? బ్యాచ్‌ల మధ్య తగదాలా అనేది పోలీసుల విచారణలో వెల్లడి కావాల్సి ఉంది. కాగా ఈ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న ఒకరిని తప్పించేందుకు అధికారపార్టీ ఎన్‌ఆర్‌ఐ నేత ఒకరు ఉన్నతాధికారి నుంచి పోలీసులపై వత్తిడి తీసుకువస్తున్నట్లు తెలిసింది.
పట్టణ సీఐ ఏమంటున్నారంటే...
సోముసాయి హత్యకేసులో ఇప్పటి వరకు ప్రాథమికంగా ఇద్దరు ఉన్నట్లు పట్టణ సీఐ యుగంధర్ ‘సాక్షి’కి తెలిపారు. నిందితునిగా ఉన్న వంశీ పట్టుబడితే హత్యకు దారితీసిన పూర్తి కారణాలు తెలుస్తాయన్నారు. హత్య కేసులో ఎవరున్నా వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment