ఆగస్టు 30న ‘నాని గ్యాంగ్ లీడర్’ | Nani Gangleader Worldwide Grand Release On 30th August | Sakshi
Sakshi News home page

ఆగస్టు 30న ‘నాని గ్యాంగ్ లీడర్’

Published Fri, May 17 2019 2:15 PM | Last Updated on Fri, May 17 2019 2:15 PM

Nani Gangleader Worldwide Grand Release On 30th August - Sakshi

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘నాని గ్యాంగ్‌ లీడర్‌’. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం)లు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణం‍లో ఉన్న ఈ సినిమా ఆగస్టు 30 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధమవుతోంది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

ఈ సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మాతలు మాట్లాడుతూ ‘మా బేనర్‌లో చేస్తున్న మరో విభిన్న చిత్రం ‘నాని గ్యాంగ్ లీడర్’. 14 నుండి శంషాబాద్ లో మూడో షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ అయింది. జూన్ 30కి టోటల్ షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. ఆగష్టు 30న వరల్డ్ వైడ్ గా  గ్రాండ్ రిలీజ్ కి ప్లాన్ చేశాం’ అన్నారు.

చిత్ర దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ మాట్లాడుతూ ‘ఈ సినిమా ఇంతకముందెన్నడూ రాని ఒక డిఫరెంట్ లుక్ తో ఉండే ఫామిలీ ఎంటర్టైనర్. సినిమాలో ఓ ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌ కూడా ఉంటుంది. అది ఏమిటనేది స్క్రీన్‌ పైన చూస్తేనే బాగుంటుంది. టెక్నికల్‌గా చాలా హై స్టాండర్డ్స్‌లో ఉండే సినిమా ఇది’ అన్నారు. 

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో  ఒక ప్రధాన పాత్ర ఆర్ఎక్స్ 100 ఫేమ్  కార్తికేయ పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement