Gang Leader Review, in Telugu | Nani's గ్యాంగ్‌ లీడర్‌’ మూవీ రివ్యూ | Rating: 2.5/5 | 2019 | Vikram K Kumar - Sakshi
Sakshi News home page

‘నాని గ్యాంగ్‌ లీడర్‌’ మూవీ రివ్యూ

Published Fri, Sep 13 2019 12:51 PM | Last Updated on Tue, Jul 27 2021 3:26 PM

Nani's Gang Leader Telugu Movie Review - Sakshi

టైటిల్‌ : ‘నాని గ్యాంగ్‌ లీడర్‌’
జానర్‌ : కామెడీ రివేంజ్‌ డ్రామా
నటీనటులు : నాని, కార్తికేయ, ప్రియాంక అరుల్‌ మోహన్‌, లక్ష్మి, శరణ్య, ప్రియదర్శి, వెన్నెల కిశోర్‌
సంగీతం : అనిరుధ్‌ రవిచందర్‌
నిర్మాత : మోహన్ చెరుకూరి, రవిశంకర్‌ యలమంచిలి, నవీన్‌ ఎర్నేని
దర్శకత్వం : విక్రమ్‌ కె కుమార్‌

విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న విక్రమ్‌ కె కుమార్‌ తెలుగులో ఇష్క్‌, మనం లాంటి సూపర్‌ హిట్ చిత్రాలను రూపొందించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ దర్శకుడు నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడన్న వార్తలు రావడంతో సినిమా మీద మంచి హైప్‌ క్రియేట్‌ అయ్యింది. ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో హీరోగా సూపర్‌ హిట్ అందుకున్న కార్తికేయ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తుండటంతో ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. మరి ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ను గ్యాంగ్‌ లీడర్‌ అందుకున్నాడా.? ఇటీవల కమర్షియల్ సక్సెస్‌లు సాధించటంలో ఫెయిల్ అవుతున్న నాని తిరిగి ఫాంలోకి వచ్చాడా..? హీరోగా సూపర్‌ హిట్ అందుకున్న కార్తికేయ విలన్‌గా మెప్పించాడా..?

కథ :
ఓ బ్యాంక్‌లో 300 కోట్ల చోరి జరుగుతుంది. ఆరుగురు వ్యక్తులు కేవలం 18 నిమిషాల సమయంలో బ్యాంక్‌లోని సొమ్మంతా దోచేస్తారు. కానీ వారిలో ఒకడు మిగతా ఐదుగురిని చంపి డబ్బంతా ఎత్తుకెళ్లిపోతాడు. ఆ ఐదుగురికి సంబంధించిన ఆడవాళ్లు ఎలాగైన తమ వాళ్లను చంపిన వాడి మీద పగ తీర్చుకోవాలనుకుంటారు.

అందుకోసం పెన్సిల్ పార్థసారథి(నాని) అనే రివేంజ్‌ కథల రచయిత సాయం తీసుకోవాలనుకుంటారు. హాలీవుడ్ సినిమాలు చూసి నవలలుగా కాపీ చేసే పెన్సిల్‌, ఈ రియల్‌ రివేంజ్‌ స్టోరిని కథగా రాసి భారీగా డబ్బు సంపాదించొచ్చన్న ఆశతో వారికి సాయం చేసేందుకు అంగీకరిస్తాడు. ఆ ఐదుగురు ఆడవాళ్లతో కలిసి పెన్సిల్ హంతకుడిని ఎలా పట్టుకున్నాడు? ఈ కథకు ఇండియాస్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ దేవ్‌ (కార్తికేయ)కు సంబంధం ఏంటి..? అన్నదే మిగతా కథ.



నటీనటులు:
నాని నటనకు వంక పెట్టడానికి లేదు. పెన్సిల్ పాత్రలో ఒదిగిపోయిన నాని.. కామెడీ, సెంటిమెంట్‌, రొమాన్స్‌ ఇలా అన్ని ఎమోషన్స్‌ను చాలా బాగా పండించాడు. విలన్‌గా కార్తికేయ మెప్పించాడు. సినిమా అంతా సీరియస్‌ ఎక్స్‌ప్రెషన్‌కే పరిమితం కావటంతో నటనకు పెద్దగా అవకాశం లేదు. అయితే లుక్స్‌, యాటిట్యూడ్‌తో మంచి విలనిజం చూపించాడు. హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ప్రియాంక అరుల్‌మోహన్‌ ఆకట్టుకోలేకపోయింది. కథలో పెద్దగా స్కోప్‌ లేకపోవటంతో ఆమె పాత్ర సపోర్టింగ్‌ రోల్‌గానే మిగిలిపోయింది. లక్ష్మీ, శరణ్య, వెన్నెల కిశోర్‌, ప్రియదర్శి, అనీష్‌ కురివిల్లా తదితరులు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.


విశ్లేషణ :

నాని లాంటి నటుడు విక్రమ్‌ లాంటి దర్శకుడి సినిమాలో నటిస్తుండటంతో గ్యాంగ్‌ లీడర్‌పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలను అందుకోవటంతో విక్రమ్‌ ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. విక్రమ్‌ సినిమా నుంచి ఆశించిన స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌ సినిమాలో లేకపోవటం నిరాశకలిగించే అంశమే. సినిమాను ఇంట్రస్టింగ్‌ సీన్‌తో ప్రాంభించిన దర్శకుడు ప్రతీ సన్నివేశాన్ని సుదీర్ఘంగా చెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో రాను రాను సినిమా బోరింగ్‌గా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. దీనికి తోడు ప్రేక్షకుడి అంచనాలకు తగ్గట్టుగా సాగే కథనం కూడా సినిమాకు మైనస్‌ అయ్యింది. దర్శకుడిగా తడబడినా రైటర్‌గా మాత్రం విక్రమ్‌ కె కుమార్‌ మెప్పించాడు. కామెడీ, డైలాగ్స్‌ బాగున్నాయి. అనిరుధ్ సంగీతం ఆకట్టుకుంటుంది. పాటలతో పాటు నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచే ప్రయత్నం చేశాడు అనిరుధ్‌. మిరోస్లా బ్రోజెక్ సినిమాటోగ్రఫి సూపర్బ్. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్‌ :
నాని నటన
కామెడీ
నేపథ్య సంగీతం

మైనస్‌ పాయింట్స్‌ :
ప్రేక్షకుడి అంచనాలకు తగ్గట్టు సాగే కథనం
విక్రమ్‌ కె కుమార్‌ మార్క్‌ లేకపోవటం

సతీష్‌ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్‌ డెస్క్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement