‘గ్యాంగ్ లీడర్’ ఫస్ట్‌లుక్
బామ్మ, వరలక్ష్మి, ప్రియ, స్వాతి, చిన్ను... అందరూ బైనాక్యులర్స్‌తో ఎవర్నో వెతుకుతున్నారు. ఇంతమంది పనికట్టుకుని వెతికేది ఎవర్నబ్బా? అసలు వీళ్ల స్టోరీ ఏంటి? తెలియాలంటే ఆగస్ట్ 30వరకూ వేచి చూడాల్సిందే. నాని హీరోగా విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘గ్యాంగ్‌లీడర్’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్నారు. పోస్టర్‌లో కనిపిస్తున్న లేడీ గ్యాంగ్‌కు నాని గ్యాంగ్ లీడర్. ఈ సినిమా ఫస్ట్ లుక్ సోమవారం రిలీజ్ చేశారు. అనిరుథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 30 విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment