‘పెన్సిల్.. ఫేమస్‌ రివేంజ్‌ రైటర్‌’ | Nani's Gang Leader Teaser | Sakshi
Sakshi News home page

‘పెన్సిల్.. ఫేమస్‌ రివేంజ్‌ రైటర్‌’

Published Wed, Jul 24 2019 11:08 AM | Last Updated on Wed, Jul 24 2019 11:08 AM

Nani's Gang Leader Teaser - Sakshi

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం గ్యాంగ్ లీడర్‌. విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే మేజర్‌ పార్ట్ షూటింగ్ పూర్తికాగా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు చిత్రయూనిట్‌.

ఇప్పటికే ఫస్ట్ లుక్‌ పోస్టర్‌తో పాటు ఓ లిరికల్‌ వీడియోను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ తాజాగా సినిమాలో హీరో పాత్రకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు. నానిని పెన్సిల్ పేరుతో పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన ఈ టీజర్‌ను ఆసక్తికరంగా రూపొందించారు.

నాని ఈ సినిమాలో రివేంజ్‌ స్టోరిల రచయితగా కనిపించాడు. మరో కీలక పాత్రలో నటిస్తున్న కార్తికేయను రేసర్‌గా పరిచయం చేశారు. నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. ఇతర పాత్రల్లో లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురివిల్లా, ప్రియదర్శి, వెన్నెల కిశోర్‌లు అలరించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement