అక్షరాలు తింటాం.. పుస్తకాలు కప్పుకుంటాం | Nani Gang Leader Movie Trailer Release | Sakshi
Sakshi News home page

అక్షరాలు తింటాం.. పుస్తకాలు కప్పుకుంటాం

Published Thu, Aug 29 2019 8:41 AM | Last Updated on Thu, Aug 29 2019 8:41 AM

Nani Gang Leader Movie Trailer Release - Sakshi

నాని

మా రైటర్స్‌ ప్రపంచం అంటే ఇంతే.. పుస్తకాలతో నిండిపోయి ఉంటుంది. ఆకలేస్తే అక్షరాలు తింటాం.. చలేస్తే పుస్తకాలు కప్పుకుంటాం’, ‘యుద్ధానికి సిద్ధం కండి... సమరశంఖం నేను ఊదుతా’, ‘రేయ్‌.. నేనింకా థ్రిల్లర్‌ జోనర్‌లోనే ఉన్నాను.. సైకో కిల్లర్‌ జోనర్‌లోకి వెళ్లేలోపు మొదలెట్టేద్దాం’ అంటూ నాని చెప్పే డైలాగ్స్‌ ఆసక్తిగా ఉన్నాయి. నాని, ప్రియాంక జంటగా ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ కార్తికేయ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘నాని’స్‌ గ్యాంగ్‌ లీడర్‌’. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్‌ (సివిఎం) నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 13న విడుదలవుతోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. పైన చెప్పిన డైలాగ్స్‌ అన్నీ ఈ ట్రైలర్‌లోనివే. ‘‘మా సినిమాలో రివెంజ్‌ రైటర్‌ పెన్సిల్‌గా నాని ఓ వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తారు. ఇటీవల విడుదలైన మా చిత్రం టీజర్‌కి, పాటలకు విశేష స్పందన లభిస్తోంది. ఇప్పుడు విడుదల చేసిన ట్రైలర్‌ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: అనిరుథ్, కెమెరా: మిరోస్లా కుబా బ్రోజెక్, సీఈఓ: చిరంజీవి(చెర్రీ).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement