మోదీ హత్యకు టీసీఎస్ ఉద్యోగి కుట్ర? | TCS software engineer, the gang leader behind | Sakshi
Sakshi News home page

మోదీ హత్యకు టీసీఎస్ ఉద్యోగి కుట్ర?

Published Tue, Nov 29 2016 1:31 PM | Last Updated on Mon, Sep 4 2017 9:27 PM

మోదీ హత్యకు టీసీఎస్ ఉద్యోగి కుట్ర?

మోదీ హత్యకు టీసీఎస్ ఉద్యోగి కుట్ర?

ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు రాజకీయ నాయకులను హతమార్చేందుకు కుట్రపన్నిన అల్ కాయిదా ఉగ్రవాదుల గ్యాంగ్‌లీడర్ దావూద్ సులేమాన్ (23) టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు రాజకీయ నాయకులను హతమార్చేందుకు కుట్రపన్నిన అల్ కాయిదా ఉగ్రవాదులను ఎన్ఐఏ వర్గాలు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే.. అరెస్టయిన వాళ్లలో గ్యాంగ్‌లీడర్ దావూద్ సులేమాన్ (23) టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అతడు మదురైలోని కరిమ్సా పల్లివాసల్ ప్రాంతానికి చెందినవాడు. ప్రస్తుతం చెన్నైలోని తిరువన్మియూర్ ప్రాంతంలో ఉంటున్నాడు. అతడితో పాటు పెయింటర్ అబ్బాస్ అలీ, చికెన్ షాపుపలో పనిచేసే శామ్‌సమ్ కరీమ్ రజా కూడా అరెస్టయ్యారు. 
 
వీళ్లంతా అల్‌కాయిదా స్ఫూర్తితో మొత్తం 22 మంది వీవీఐపీలను టార్గెట్ చేసినట్లు ఎన్ఐఏ వర్గాలు గుర్తించాయి. వాళ్లు దాగున్న చోటు నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురినీ మదురై, చెన్నై ప్రాంతాల్లో అరెస్టు చేశారు. 'ద బేస్ మూమెంట్ ఆఫ్ అల్ కాయిదా' అనే గ్రూపుగా వీళ్లంతా ఒక్కటయ్యారు. వీళ్లలో కొంతమంది 1998లో తమిళనాడులో నిషేధానికి గురైన అల్ ఉమా ఉగ్రవాద సంస్థ సభ్యులు కూడా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement