
నాని
‘జెర్సీ’ వంటి హిట్ సినిమా తర్వాత నాని గ్యాంగ్‌లీడర్‌గా మారిన సంగతి తెలిసిందే. తన గ్యాంగ్‌ను వెంటబెట్టుకుని హైదరాబాద్‌లో 45 రోజులు మకాం వేయడానికి సిద్ధమయ్యారని తెలిసింది. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘గ్యాంగ్‌లీడర్’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి, రవిశంకర్ నిర్మిస్తున్నారు. విభిన్న వయసుల్లో ఉన్న ఐదుగురు మహిళలు ఉండే గ్యాంగ్‌కు నాని లీడర్‌గా కనిపిస్తారన్నది చిత్ర కథ.
ఈ సినిమా కొత్త షెడ్యూల్ మరో రెండు రోజుల్లో హైదరాబాద్‌లో స్టార్ట్ కానుందని తెలిసింది. 45 రోజులు ఏకధాటిగా ఈ షెడ్యూల్ జరగనుంది. శంషాబాద్‌లో వేసిన ప్రత్యేక ఇంటి సెట్‌లో కొన్ని రోజులు షూటింగ్ జరుపుతారట. ఆగస్ట్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి అనిరు«థ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా కాకుండా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వి’ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నాని కనిపించనున్నారు. ఇందులో సుధీర్‌బాబు హీరో. నివేదా థామస్, అదితీరావ్ హీరోయిన్లు.
Comments
Please login to add a commentAdd a comment