
ఓ కొత్త ప్లాన్‌తో నాని అండ్ గ్యాంగ్ రంగంలోకి దిగారు. ఆ ప్లాన్ డిౖటైల్స్ ‘గ్యాంగ్‌లీడర్’ సినిమాలో వెండితెరపై లీక్ అవుతాయి. మనం, 24 వంటి డిఫరెంట్ చిత్రాలతో ప్రేక్షకుల మెప్పు పొందిన విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందుతున్న సినిమా ‘గ్యాంగ్‌లీడర్’. కథానాయిక ప్రియాంకా మోహన్ నటిస్తున్న ఈ సినిమాలో ‘ఆర్‌ఎక్స్ 100’ హీరో కార్తికేయ విలన్ పాత్రలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తయింది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ఈ నెల 8న హైదరాబాద్‌లో స్టార్ట్ కానుంది. ఆ రోజు నుంచి సినిమా పూర్తయ్యేవరకూ నాన్‌స్టాప్‌గా షూటింగ్ జరపడానికి ప్లాన్ చేశారు. జూలై 5కల్లా గుమ్మడికాయ కొట్టాలని టీమ్ ప్లాన్ వేసింది. ఈ చిత్రాన్ని ఆగస్టు 30న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా కాకుండా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘వి’ అనే సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు నాని. ఇందులో సుధీర్‌బాబు హీరో.
Comments
Please login to add a commentAdd a comment