నానికి మెగా సెగ..! | Mega Heros Fans Unhappy With Nanis Gang Leader | Sakshi
Sakshi News home page

నానికి మెగా సెగ..!

Published Tue, Feb 26 2019 10:38 AM | Last Updated on Tue, Feb 26 2019 12:47 PM

Mega Heros Fans Unhappy With Nanis Gang Leader - Sakshi

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా క్రియేటివ్‌ డైరెక్టర్ విక్రమ్‌ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అమ్మాయి ఇది మీ కోసమే అంటూ విభిన్న ప్రమోషన్‌ ప్రారంబించిన నాని ఈ సినిమా టైటిల్‌ విషయంలో కూడా అదే ఫార్ములా ఫాలో అయ్యాడు. మెగాస్టార్‌ చిరంజీవి సూపర్‌ హిట్ సినిమా గ్యాంగ్‌ లీడర్‌ టైటిల్‌ను తన సినిమా కోసం తీసుకున్నాడు.

అయితే ఇటీవల ఎనౌన్స్‌ అయిన ఈ సినిమా టైటిల్‌పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అభిమానులు నాని మెగా టైటిల్‌ను తీసుకోవటంపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఏకంగా ‘బాయ్‌కాట్‌ నానీస్‌ గ్యాంగ్‌ లీడర్‌’(#BoycottNanisGangLeader) అనే హ్యాష్‌ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. గతంలో ఇదే టైటిల్‌ను సాయి ధరమ్‌ తేజ్‌ సినిమాకు తీసుకోవాలని భావించినా అభిమానులు వ్యతిరేఖించటంతో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నాడు. మరి ఈ ట్రోలింగ్‌పై నాని ఎలా స్పదింస్తాడో చూడాలి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement