mega fans
-
మెగా ఫ్యాన్స్ కి ఇచ్చి పడేస్తోన్న అల్లు ఆర్మీ..
-
రీఎంట్రీలో చిరంజీవి ఆ తప్పులు చేస్తున్నారా?
90ల్లో పుట్టిన ఓ పిల్లాడు. కాస్త ఊహ తెలిసొచ్చాక నాన్న భుజాలపై కూర్చుని తొలిసారి ఓ సినిమా చూశాడు. ఓ వ్యక్తి డ్యాన్సులు చూసి మెస్మరైజ్ అయిపోయాడు. ఆ హీరోకి పెద్ద ఫ్యాన్ అయిపోయాడు. కట్ చేస్తే ఆ పిల్లాడు ఇప్పుడు కుర్రాడు అయ్యాడు. ఆ హీరోకి వయసైపోయింది కానీ యాక్టింగ్, డ్యాన్సుల్లో గ్రేస్ మాత్రం తగ్గలేదు. అవును మీరు గెస్ట్ చేసింది కరెక్ట్. ఆ హీరో మెగాస్టార్ చిరంజీవినే. అప్పట్లో ట్రెండ్ సెట్ చేసిన చిరు.. ఇప్పుడు మాత్రం ఎందుకో తడబడుతున్నారు. ఎందుకిలా జరుగుతోంది? ఆ స్థాయి సినిమాలు ఎక్కడ? నటుడిగా మెగాస్టార్ చిరంజీవిని వంక పెట్టడానికి ఏం లేదు. ఎందుకంటే ఆయన ఇమేజ్ ఆకాశంలో ఉంటుంది. ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ నుంచి అత్యధిక రెమ్యునరేషన్ వరకు ఎన్నో విషయాల్లో రికార్డులు సృష్టించారు. దాదాపు అన్ని రకాల జానర్స్ కథల్ని కవర్ చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఒకప్పుడు చిరంజీవి అంటే మాస్-క్లాస్-ఫ్యామిలీస్ ఇలా అందరినీ ఎంటర్టైన్ చేసేవారు. ఇప్పుడు ఆయన రేంజుకి తగ్గ సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా పడటం లేదనేది సగటు మెగా అభిమాని ఆవేదన. (ఇదీ చదవండి: బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా ‘భోళా శంకర్’.. అప్పుడే ఓటీటీలోకి..!) రీమేక్స్ వల్ల డ్యామేజ్? 'భోళా శంకర్'తో కలిపి చిరంజీవి ఇప్పటివరకు దాదాపు 38 సినిమాలని రీమేక్ చేశారు. ఇదేం అఫీషియల్ నంబర్ కాదు. ఎందుకంటే అప్పట్లో టెక్నాలజీ పెద్దగా లేదు కాబట్టి ఏది ఒరిజినల్ స్టోరీ, ఏది రీమేక్ అనేది ప్రేక్షకులకు పెద్దగా తెలిసేది కాదు. థియేటర్‌కి వెళ్లి మనస్పూర్తిగా చిరుని ఆయా మూవీస్‌లో చూసి ఎంజాయ్ చేసేవాళ్లు. ఇప్పుడు జమానా మారిపోయింది గురూ. రీమేక్స్ అనేవి పెద్దగా వర్కౌట్ కావట్లేదు. ఇంకా చెప్పాలంటే చిరు రీమేక్స్ వల్ల ఆయనకు ప్లస్ కంటే డ్యామేజే ఎక్కువ జరుగుతోందనేది అందరికీ తెలిసిన విషయం. నాడీ పట్టుకోలేకపోతున్నారా? చాలామంది హీరోలు.. అభిమానులకు నచ్చే సినిమాలు చేస్తున్నామని గొప్పగా చెప్పుకొంటూ ఉంటారు. చిరు కూడా ఇదే ఫాలో అవుతుంటారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఫ్యాన్స్‌ని మాత్రమే దృష్టిలో పెట్టుకుంటే దెబ్బ పడటం గ్యారంటీ. ఎందుకంటే ఓ మూవీ బాగుంది-బాగోలేదు అని డిసైడ్ చేసిది ఫ్యాన్స్ కాదు నార్మల్ ఆడియెన్స్. వీళ్లకు నచ్చాలంటే ట్రెండ్‌కి తగ్గట్లు డిఫరెంట్ స్టోరీలు చేయాలి. అప్పుడే కలెక్షన్స్తోపాటు హిట్ అనే మాట వినబడుతుంది. చిరు.. వీళ్ల నాడీ పట్టుకోనేలా సినిమాలు చేస్తే బెటర్. (ఇదీ చదవండి: మితిమీరిన పారితోషికాలు.. లెక్కలు సరిగ్గా చూపుతున్నారా?) ఇంకా అలానే అంటే! చిరంజీవి వయసు ప్రస్తుతం 68 ఏళ్లు. అయితే తనకు వయసు అయిపోయిందని ఒప్పుకోవట్లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే రజనీకాంత్, కమల్‌హాసన్, మమ్ముట్టి, మోహన్‌లాల్ లాంటి స్టార్ హీరోలు వయసు తగ్గ పాత్రలు, డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. చిరంజీవి మాత్రం ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్.. ఇంకా కుర్రాడిలా ఉండేందుకు తెగ తాపత్రయపడుతున్నారు. అభిమానులని ఇది నచ్చేయొచ్చేమే గానీ.. సాధారణ ప్రేక్షకుడికి మాత్రం ఎబ్బెట్టుగా ఉంటుంది. కాకపోతే బయటకు చెప్పుకోరు అంతే! అసలైన ఫ్యాన్స్ వాళ్లు ఇప్పటి జనరేషన్ కుర్రాళ్లకి సూపర్‌స్టార్, రెబల్‌స్టార్, ఐకాన్‌స్టార్ తెలిసినంత.. మెగాస్టార్ గురించి తెలియదు. ఎందుకంటే 2007 తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిపోయిన చిరు.. దాదాపు పదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. మెగాస్టార్ అసలైన ఫ్యాన్స్ అంటే ఇప్పటి జనరేషన్‌కి నాన్నల తరం. వాళ్లలో చాలామందికి ఇప్పుడు థియేటర్స్‌కి వెళ్లి సినిమాలు చూడాలనే ఆసక్తి ఉండట్లేదు. ఇది కూడా రీఎంట్రీలో చిరు సినిమాలపై టాక్ తేడా కొట్టడానికి ఓ కారణం కావొచ్చు. ఇలా పైన చెప్పిన వాటితో పాటే ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి. వీటిని ఓసారి దృష్టిలో పెట్టుకుని చిరు ఇకపై సినిమాలు చేస్తే బెటర్. లేదంటే మాత్రం అంతే! (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 కొత్త సినిమాలు) -
మెగా ఫ్యాన్స్ కు కిక్కిచ్చే అప్డేట్..
-
ఉపాసనపై అనుచిత వ్యాఖ్యలు.. చితకబాదిన మెగా ఫ్యాన్స్
-
బన్నీ అప్డేట్ వాయిదా.. ఎందుకంటే..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు నిరాశ ఎదురైంది. తివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా ‘అల వైకుంఠపురములో’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన మూడు లిరికల్ సాంగ్స్‌కు విశేష స్పందన వచ్చింది. అయితే ఈ మూవీ టీజర్‌కు సంబంధించిన అప్డేట్ను ఆదివారం ప్రకటించనున్నట్టు చిత్రబృందం తెలిపింది. దీంతో బన్నీ అభిమానులు టీజర్ ఎప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే తాజాగా అల వైకుంఠపురములో టీజర్ అప్డేట్ను వాయిదా వేస్తున్నట్టు గీతా ఆర్ట్స్ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ మెగా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ నూర్ భాయ్ మృతిచెందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలను ప్రకటిస్తామని పేర్కొంది. కాగా, మెగా హీరోలందరితో నూర్ భాయ్‌కి మంచి అనుబంధం ఉంది. ‘తమ కుటుంబ సభ్యుల్లో ఒకడైన నూర్ భాయ్ మరణం కలచివేసింది. ఇటువంటి విషాద సమయంలో అల వైకుంఠపురములో టీజర్‌కు సంబంధించిన అప్డేట్ను ప్రకటించడం సరైనది కాదని భావిస్తున్నాం. త్వరలోనే టీజర్‌కు సంబంధించిన వివరాలను ప్రకటిస్తామ’ని గీతా ఆర్ట్స్ పేర్కొంది. కాగా, అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది. -
నానీని.. మెగా అభిమానులు అంగీకరిస్తారా?
నాని.. గ్యాంగ్ లీడర్ సినిమాను మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇబ్బందులు వెంటాడుతున్నాయి. కొద్ది రోజుల షూటింగ్ తరువాత సినిమా ఆగిపోయిందంటూ ప్రచారం జరిగింది. తరువాత గ్యాంగ్‌లీడర్ అనే టైటిల్‌ను ప్రకటించటంతో మెగా అభిమానులు ఫైర్ అయ్యారు. దీనికి తోడు గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ వేరే నిర్మాతలు రిజిస్టర్ చేయించుకోవటంతో తప్పనిసరి పరిస్థితుల్లో సినిమా టైటిల్‌ను ‘నానీస్ గ్యాంగ్ లీడర్’గా మార్చాల్సి వచ్చింది. రిలీజ్ డేట్ విషయంలోనూ గ్యాంగ్ లీడర్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. ముందుగా ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయాలని భావించారు. కానీ అదే రోజు సాహో రిలీజ్ అంటూ ప్రకటన రావటంతో ఆగస్టు 30కి మార్చారు. కానీ సాహో కూడా వాయిదా పడి ఆగస్టు 30కి రావటంతో సినిమాను సెప్టెంబర్ 13కు వాయిదా వేశారు. ఆ రోజు కూడా వరుణ్ తేజ్ వాల్మీకితో పోటి పడాల్సి రావటంతో సినీ పెద్దలు కలగజేసుకొని వాల్మీకిని సెప్టెంబర్ 20కి వాయిదా వేయించారు. తాజాగా ట్రైలర్లో మెగా అభిమానులను కూల్ చేసే ప్రయత్నం చేశాడు నాని. ట్రైలర్లో గ్యాంగ్ లీడర్లో చిరు ఇంట్రడక్షన్ సీన్ తరహాలో వెల్డర్‌గా ఓ షాట్, తరువాత చిరంజీవి ఫేస్ మాస్క్‌తో మరో షాట్లో కనిపించాడు. మరి ఈ రెండు సీన్స్‌తోనే మెగా అభిమానులు శాంతిస్తారా..? గ్యాంగ్ లీడర్‌గా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌ను చూసుకోవాలనుకుంటున్న ఫ్యాన్స్ ఆ స్థానంలో నానిని అంగీకరిస్తారా..? లేదా..? తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేవరకు వెయిట్ చేయాల్సిందే -
నానికి మెగా సెగ..!
నేచురల్ స్టార్ నాని హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అమ్మాయి ఇది మీ కోసమే అంటూ విభిన్న ప్రమోషన్ ప్రారంబించిన నాని ఈ సినిమా టైటిల్ విషయంలో కూడా అదే ఫార్ములా ఫాలో అయ్యాడు. మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సినిమా గ్యాంగ్ లీడర్ టైటిల్‌ను తన సినిమా కోసం తీసుకున్నాడు. అయితే ఇటీవల ఎనౌన్స్ అయిన ఈ సినిమా టైటిల్‌పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అభిమానులు నాని మెగా టైటిల్‌ను తీసుకోవటంపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఏకంగా ‘బాయ్‌కాట్ నానీస్ గ్యాంగ్ లీడర్’(#BoycottNanisGangLeader) అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. గతంలో ఇదే టైటిల్‌ను సాయి ధరమ్ తేజ్ సినిమాకు తీసుకోవాలని భావించినా అభిమానులు వ్యతిరేఖించటంతో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నాడు. మరి ఈ ట్రోలింగ్‌పై నాని ఎలా స్పదింస్తాడో చూడాలి. పులి ని చూసి ... నక్క వాతలు పెట్టుకుంది అంట 😐 .... వాతలు పెట్టుకున్నా ... పులి పూలే .. నక్క నక్కే 😌#BoycottNanisGangLeader pic.twitter.com/DZTUaT1IkG — Megastar Follower (@ChiruFollower) 24 February 2019 #BoycottNanisGangLeader There's only one Gang leader and Indra in TFI. The Mass hysteria he has created wit this movie is never before and never again with due respect towards the legend. The movie team should drop this title. @guptanagu8 @ChiruFollower @vthchiru4ever — Anies.Md (@Mega_Kannadiga) 24 February 2019 #BoycottNanisGangLeader Pls change the title — Suresh kumar (@Sureshk12400884) 25 February 2019 -
అలా చేస్తే ఇంకా ఆనందిస్తాను : మెగాహీరో
హీరోల పుట్టినరోజులు వస్తే అభిమానులకు పండుగే. ఇక వారి ఆనందాలకు హద్దులే ఉండవు. కేక్ కట్టింగ్లు, బ్యానర్లు కట్టడం, పాలాభిషేకాలు, రక్తదానాలు, అన్నదానాలు ఇలా ఒకటేమిటి ఎన్నో రకాలుగా సెలబ్రేట్ చేస్తుంటారు ఫ్యాన్స్. అయితే కొంతమంది హీరోలు మాత్రం ఇలాంటి ఆర్భాటాలు వద్దంటూ తమ అభిమానులకు సూచిస్తుంటారు. వాటికి ఖర్చయ్యే డబ్బులతో ఎవరికైనా ఆర్థిక సహాయాన్ని చేయమని కోరుతుంటారు. తాజాగా మెగాహీరో సాయిధరమ్ తేజ్ తమ అభిమానులను కూడా ఇదే విధంగా కోరారు. అక్టోబర్ 15న పుట్టిన రోజును జరుపుకోబోతున్న సాయిధరమ్ తేజ్ మెగా అభిమానులకు సోషల్ మీడియా ద్వారా ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ‘అత్యంత ప్రియమైన మెగాభిమానులకు అంతులేని ప్రేమతో.. గెలిచినప్పుడు వేలకు పైగా చేతులు చప్పట్లు కొడతాయి. ఓడిపోయినా.. మీ చేతుల చప్పట్లు చప్పుడుకూడా తగ్గకుండా జయాపజయాలకు అతీతంగా నన్ను ప్రోత్సహిస్తూ.. వెన్నంటి ఉన్న అభిమానులందరికి కృతజ్ఞతలు. ఈ మధ్యకాలంలో మీ అంచనాలను అందుకోలేకపోయాన్నన్నది వాస్తవం. దానికి గల కారణాలను విశ్లేషించుకుంటున్నాను. మీ సలహాలు, సూచనలను తీసుకొని చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ.. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నంలో ఉన్నాను. మీరు నాపై చూపించే ఈ అభిమానమే నన్ను మానసికంగా ధృడంగా ఉంచి మంచి సినిమాలు చేయడానికి ఉత్సాహాన్నిస్తుంది. మీకు నా నుంచి చిన్న విన్నపం. నా పుట్టినరోజు సందర్భంగా పలుచోట్ల అభిమానులు కేక్ కట్టింగ్, బ్యానర్స్ కట్టడంలాంటివి..చేస్తున్నారని చెప్పారు. వాటికి ఖర్చు పెట్టే డబ్బుతో ఎవరైనా చిన్నారి చదువులకు ఉపయోగించండి. అలా చేస్తే నేను ఇంకా ఆనందిస్తాను. ఎల్లప్పటికీ మీ అభిమానం కోరుకునే.. మీ సాయిధరమ్ తేజ్’ అంటూ సుధీర్ఘమైన పోస్ట్ చేశారు. ప్రియమైన మెగాభిమానులకు 🙏🏼 pic.twitter.com/p9H6PzQyJs — Sai Dharam Tej (@IamSaiDharamTej) October 13, 2018 -
పట్టించుకోవద్దంటూ మెగా హీరో ట్వీట్
టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై చర్చ తారా స్థాయికి చేరిన వేళ.. అగ్ర హీరోలపై కొందరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇదిలా ఉంటే మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. ‘కపట వేషధారులు, నీపై విమర్శలు చేసి నిన్ను నేలకీడ్చాలని చూసేవాళ్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అవతలి వాళ్లను చెడ్డొళ్లను చేయాలన్న వాళ్ల ప్రయత్నం సులువైందే కావొచ్చు. కానీ, అలా చేసేముందు వాళ్లను వాళ్లు ఓసారి అద్దంలో చూసుకుంటే మంచిది’ అంటూ వరుణ్ తేజ్ ఓ ట్వీట్ చేశాడు. దీనికి క్షణాల్లో మెగా ఫ్యాన్స్ నుంచి మద్ధతుగా రీ-ట్వీట్లు వస్తున్నాయి. pic.twitter.com/15mQM1czib — Varun Tej Konidela (@IAmVarunTej) 17 April 2018 -
బాస్ ఈజ్ బ్యాక్ ..ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
-
రాంగోపాల్ వర్మపై మెగాఫ్యాన్స్ ఫైర్
-
రాంగోపాల్ వర్మపై మెగాఫ్యాన్స్ ఫైర్
'ఖైదీనంబర్ 150' ప్రీ రిలీజ్ వేడుకలో మెగా బ్రదర్ నాగబాబు రచయిత యెండమూరి వీరేంద్రనాథ్, దర్శకుడు రాంగోపాల్ వర్మపై చేసిన విమర్శలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. తనపై విమర్శలు చేసిన నాగబాబుకు అంతే ఘాటుగా వర్మ బదులిచ్చారు. నాగబాబుకు చురకలంటించారు. ఈ ఎపిసోడ్లో వర్మ తీరుపై మెగాఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మెగా కుటుంబంపై, నాగబాబుపై వర్మ శృతిమించి ఆరోపణలు చేస్తున్నారని అభిమానులు అంటున్నారు. 'ఖైదీనంబర్ 150' వేడుకలో నాగాబాబు మాట్లాడుతూ.. 'తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ముంబై వెళ్లిన ఒకడు రకరకాల కూతలు కూస్తున్నాడు. ఈ కూతలు ఆపేసి దర్శ కత్వం సక్రమంగా చేసుకుని, ఆ బాంబ్ ఏదో అక్కడే ముంబై లో పేల్చుకుంటే... వాడికీ మంచిది, మాకూ మంచిది. చిరంజీవి సినిమా ఎలా ఉండాలి? ఆయన ఎలా చేయాలి? అని మాట్లాడడం. ఇలాంటి అక్కుపక్షి, పనికిమాలిన సన్నాసి కూసే కూతలతో మాకేం కాదు. ఇలాంటి పక్షి ఎన్ని కూతలు కూసినా.. సూపర్‌హిట్ సినిమాని ఆపలేవు. ఫెయిల్యూర్ సినిమాని లేపలేవు’’ అంటూ వర్మపై ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. ఈ విమర్శలకు దర్శకుడు వర్మ అంతే ఘాటుగా బదులిచ్చారు. దశాబ్ద కాలం లొ ఒక్క రక్తచరిత్ర తప్ప (తెలుగు లో) హిట్ లెదు. ఆయన జయ అపజయాల గురించి హితబోధలు. #KhaidiNo150 #BossIsBack — Stay Strong !! (@pepparsalt9) 8 January 2017 ‘నాగబాబు సార్.. మీకు ఇంగ్లిష్ అర్థం కాదు ఎవరితోనైనా చదివించుకోండి. నాకు సలహా ఇచ్చేముందు మీ ‘జబర్దస్త్’ కెరీర్ గురించి ప్రశ్నించు కోండి. ‘ప్రజారాజ్యం’ టైమ్‌లో మీ అన్నయ్యకు తప్పుడు సలహాలిచ్చి ఆయన ఓడిపోయేలా చేశారు. ‘అక్కుపక్షి’ అనే కామెంట్స్ చేసి టైమ్ వృథా చేసుకునే బదులు మీ సోదరు లను బతిమాలుకోండి. లేదంటే రోడ్డున పడే అవకాశం ఉంది’’ అని వర్మ ట్వీట్స్ చేశారు. నాగబాబు మాట్లాడిన దానిలో తప్పు ఎంటి ? ఒకరిని విమర్శించేటప్పుడు స్వీకరించే గుణం కూడా ఉండాలి. #KhaidiNo150 #BossIsBack — Stay Strong !! (@pepparsalt9) 8 January 2017 మొత్తానికి ఈ ఎపిసోడ్లో వర్మ తీరును మెగా అభిమానులు తప్పుబడుతున్నారు. 'నాగబాబు మాట్లాడిన దానిలో తప్పు ఎంటి? ఒకరిని విమర్శించేటప్పుడు స్వీకరించే గుణం కూడా ఉండాలి.. ఆయన మాత్రం శివ పేరు చెప్పుకొని ఇంకా సన్మాన సభలు పెట్టుకోవచ్చు. అందరి చేత భజన చెయించుకోవచ్చు.. దశాబ్దకాలంలో తెలుగులోఒక్క రక్తచరిత్ర తప్ప హిట్ లేదు. ఆయన జయాపజయాల గురించి హితబోధలా' అంటూ ఒక నెటిజన్ వర్మను విమర్శించారు. ఇలా వర్మను విమర్శిస్తూ పలు పోస్టులు వెల్లువెత్తుతుండగా.. మరోవైపు వర్మ అభిమానులు కూడా ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. 'మా అన్న మెగాస్టార్ కదా అని వాడు వీడు అని వాగితే అక్కడ సైలెంట్ గా ఉండటానికి వాడు బాలయ్య అభిమానో లేదా చంద్రబాబు ఫ్యాన్ కాదు దటీజ్ రాంగోపాల్ వర్మ' అంటూ ఓ నెటిజన్ ఫేస్బుక్లో కామెంట్ చేశారు. కాగా, మెగాఫ్యాన్స్ తనపై గుర్రుగా ఉండి పెడుతున్న కామెంట్లపై వర్మ కూడా స్పందిస్తున్నట్టు కనిపిస్తోంది. నిన్న వరుసగా నాగబాబుపై విమర్శలు ట్వీట్ చేసిన వర్మ.. ఈ రోజు మెగాస్టార్ ఫ్యాన్స్ మార్ఫింగ్ చేసి పెట్టిన ఓ ఫొటోను ట్వీట్ చేశారు. ఖైదీనంబర్ 150 పోస్టర్‌కు వర్మ ఫేస్ అంటించి.. రౌడీనంబర్ 150 అంటూ మెగాస్టార్ అభిమానులు ఈ ఫొటోను ట్వీట్ చేశారు. ఇది ఆయనకు నచ్చినట్టే ఉంది. -
మెగా ఫ్యాన్స్ మద్దతు హరికి లేదు
హొసూరు : తళి నియోజకవర్గంలో మెగా ఫ్యాన్స్ పేరుతో స్వతంత్ర అభ్యరి హరికి మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొనడాన్ని తళి నియోజక వర్గ మెగా ఫ్యాన్స్ ఖండించారు. ఈ సందర్భంగా భైరమంగలం మెగాఫ్యాన్స్ మాట్లాడుతూ చిరంజీవి అభిమాని అయిన తళి ఎమ్మెల్యే టి.రామచంద్రన్‌కు మెగా ఫ్యాన్స్ మద్దతు తెలిపి (సీపీఐ) ఆయనకు ఓటువేసి గెలిపించాలని మెగా అభిమానులు శేఖర్, రఘు, శ్రీనివాస్, మురళి, వినయ్, ఎస్.హరీష్, హరిబాబు, నవీన్, వెంకటరాజు, రమేష్, సి.ఆశ్వత్, జి.మునిరాజ్, సుబ్బారావు, రవి, ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. -
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొత్త కుంపటి!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కొత్త కుంపటి పెట్టెందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. గత కొంతకాలంగా మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా తిరుపతిలో ఈ నెల 30న జరగబోయే 'మెగా ఫ్యాన్స్ డే' అన్నదమ్ముల అభిమానుల మధ్య దూరాన్ని మరింత పెంచాయి. దాంతో పవన్ అభిమానులు....సొంతంగా అభిమాన సంఘం ఏర్పాటు చేసుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. త్వరలోనే అభిమానుల సమావేశం నిర్వహించి రాష్ట్రస్థాయిలో అభిమాన సంఘం ఏర్పాటు చేయనున్నట్లు చిత్తూరు జిల్లా పవన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిరణ్ తెలిపాడు. 'పవన్ కళ్యాణ్ రాష్ట్ర యువత' పేరుతో అభిమాన సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించాడు. ఇందు కోసం ముందుగా పవన్ కళ్యాణ్ అభిమానుల సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి రాజమండ్రి లేదా విజయవాడ వేదిక కానుంది. ఇక ఈనెల 30 జరిగే మెగా అభిమానుల సమావేశానికి తమకు ఎలాంటి ఆహ్వానం అందలేదని కిరణ్ తెలిపాడు. అలాగే తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న చిరంజీవి అభిమాన సంఘాల సమావేశానికి హాజరు కావద్దని హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చినట్టు అతను పేర్కొన్నాడు. మరోవైపు మెగాస్టార్ అభిమాన సంఘాల అధ్యక్షుడు స్వామినాయుడు మాత్రం చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని తెలిపాడు. రాజకీయంగా పవన్‌ని వ్యతిరేకిస్తాం తప్ప.. చిరంజీవి సోదరుడిగా ఆయన్ని అభిమానిస్తామని చెప్పటం విశేషం. -
'పవనిజం డే' జరుపుకుంటున్న మెగా ఫ్యాన్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు నేడు ప్రపంచవ్యాప్తంగా పవనిజం డే జరుపుకుంటున్నారు. తాజాగా విడుదలయిన అత్తారింటికి దారేది సినిమా విజయవంతం కావడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రెట్టించిన ఉత్సాహంతో పవనిజం రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రేమికుల రోజు, చిల్డ్రన్ డే, మదర్స్ డే తరహాలో మెగా అభిమానులు పవనిజం డే జరుపుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ మొదటి సినిమా విడుదలయిన తేదీ కాబట్టి అక్టోబర్ 11న పవనిజం డే నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మొదటి సినిమా 'అక్కడ అమ్మాయి-ఇక్కడ అబ్బాయి' 1996 అక్టోబర్ 11న విడుదలయింది. చిరంజీవి సోదరుడి టాగ్‌తో తెరంగ్రేటం చేసిన పవన్ కళ్యాణ్ తర్వాత సొంత ఇమేజ్ సృష్టించుకున్నారు. విలక్షణ నటన, ఆహార్యంతో యువతతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. తనదైన వ్యక్తిత్వంతో యూత్ ని ఆకట్టుకున్నారు.