
రాంగోపాల్ వర్మపై మెగాఫ్యాన్స్ ఫైర్
'ఖైదీనంబర్ 150' ప్రీ రిలీజ్ వేడుకలో మెగా బ్రదర్ నాగబాబు రచయిత యెండమూరి వీరేంద్రనాథ్, దర్శకుడు రాంగోపాల్ వర్మపై చేసిన విమర్శలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. తనపై విమర్శలు చేసిన నాగబాబుకు అంతే ఘాటుగా వర్మ బదులిచ్చారు. నాగబాబుకు చురకలంటించారు. ఈ ఎపిసోడ్లో వర్మ తీరుపై మెగాఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మెగా కుటుంబంపై, నాగబాబుపై వర్మ శృతిమించి ఆరోపణలు చేస్తున్నారని అభిమానులు అంటున్నారు.
'ఖైదీనంబర్ 150' వేడుకలో నాగాబాబు మాట్లాడుతూ.. 'తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ముంబై వెళ్లిన ఒకడు రకరకాల కూతలు కూస్తున్నాడు. ఈ కూతలు ఆపేసి దర్శ కత్వం సక్రమంగా చేసుకుని, ఆ బాంబ్ ఏదో అక్కడే ముంబై లో పేల్చుకుంటే... వాడికీ మంచిది, మాకూ మంచిది. చిరంజీవి సినిమా ఎలా ఉండాలి? ఆయన ఎలా చేయాలి? అని మాట్లాడడం. ఇలాంటి అక్కుపక్షి, పనికిమాలిన సన్నాసి కూసే కూతలతో మాకేం కాదు. ఇలాంటి పక్షి ఎన్ని కూతలు కూసినా.. సూపర్‌హిట్ సినిమాని ఆపలేవు. ఫెయిల్యూర్ సినిమాని లేపలేవు’’ అంటూ వర్మపై ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. ఈ విమర్శలకు దర్శకుడు వర్మ అంతే ఘాటుగా బదులిచ్చారు.
దశాబ్ద కాలం లొ ఒక్క రక్తచరిత్ర తప్ప (తెలుగు లో) హిట్ లెదు. ఆయన జయ అపజయాల గురించి హితబోధలు. #KhaidiNo150 #BossIsBack
— Stay Strong !! (@pepparsalt9) 8 January 2017
‘నాగబాబు సార్.. మీకు ఇంగ్లిష్ అర్థం కాదు ఎవరితోనైనా చదివించుకోండి. నాకు సలహా ఇచ్చేముందు మీ ‘జబర్దస్త్’ కెరీర్ గురించి ప్రశ్నించు కోండి. ‘ప్రజారాజ్యం’ టైమ్‌లో మీ అన్నయ్యకు తప్పుడు సలహాలిచ్చి ఆయన ఓడిపోయేలా చేశారు. ‘అక్కుపక్షి’ అనే కామెంట్స్ చేసి టైమ్ వృథా చేసుకునే బదులు మీ సోదరు లను బతిమాలుకోండి. లేదంటే రోడ్డున పడే అవకాశం ఉంది’’ అని వర్మ ట్వీట్స్ చేశారు.
నాగబాబు మాట్లాడిన దానిలో తప్పు ఎంటి ? ఒకరిని విమర్శించేటప్పుడు స్వీకరించే గుణం కూడా ఉండాలి. #KhaidiNo150 #BossIsBack
— Stay Strong !! (@pepparsalt9) 8 January 2017
మొత్తానికి ఈ ఎపిసోడ్లో వర్మ తీరును మెగా అభిమానులు తప్పుబడుతున్నారు. 'నాగబాబు మాట్లాడిన దానిలో తప్పు ఎంటి? ఒకరిని విమర్శించేటప్పుడు స్వీకరించే గుణం కూడా ఉండాలి.. ఆయన మాత్రం శివ పేరు చెప్పుకొని ఇంకా సన్మాన సభలు పెట్టుకోవచ్చు. అందరి చేత భజన చెయించుకోవచ్చు.. దశాబ్దకాలంలో తెలుగులోఒక్క రక్తచరిత్ర తప్ప హిట్ లేదు. ఆయన జయాపజయాల గురించి హితబోధలా' అంటూ ఒక నెటిజన్ వర్మను విమర్శించారు. ఇలా వర్మను విమర్శిస్తూ పలు పోస్టులు వెల్లువెత్తుతుండగా.. మరోవైపు వర్మ అభిమానులు కూడా ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. 'మా అన్న మెగాస్టార్ కదా అని వాడు వీడు అని వాగితే అక్కడ సైలెంట్ గా ఉండటానికి వాడు బాలయ్య అభిమానో లేదా చంద్రబాబు ఫ్యాన్ కాదు దటీజ్ రాంగోపాల్ వర్మ' అంటూ ఓ నెటిజన్ ఫేస్బుక్లో కామెంట్ చేశారు.
కాగా, మెగాఫ్యాన్స్ తనపై గుర్రుగా ఉండి పెడుతున్న కామెంట్లపై వర్మ కూడా స్పందిస్తున్నట్టు కనిపిస్తోంది. నిన్న వరుసగా నాగబాబుపై విమర్శలు ట్వీట్ చేసిన వర్మ.. ఈ రోజు మెగాస్టార్ ఫ్యాన్స్ మార్ఫింగ్ చేసి పెట్టిన ఓ ఫొటోను ట్వీట్ చేశారు. ఖైదీనంబర్ 150 పోస్టర్‌కు వర్మ ఫేస్ అంటించి.. రౌడీనంబర్ 150 అంటూ మెగాస్టార్ అభిమానులు ఈ ఫొటోను ట్వీట్ చేశారు. ఇది ఆయనకు నచ్చినట్టే ఉంది.