చిరు 150..అక్కడ అట్టర్ ఫ్లాప్..! | Khaidi Number 150 gets low ratings on TV | Sakshi
Sakshi News home page

చిరు 150..అక్కడ అట్టర్ ఫ్లాప్..!

Published Thu, Jun 8 2017 4:25 PM | Last Updated on Tue, Sep 5 2017 1:07 PM

చిరు 150..అక్కడ అట్టర్ ఫ్లాప్..!

చిరు 150..అక్కడ అట్టర్ ఫ్లాప్..!

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమాగా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఖైదీ నంబర్ 150. ఆ అంచనాలను నిజం చేస్తూ ఈ సినిమా వెండితెర మీద సరికొత్త సంచలనాలను నమోదు చేసింది. కుర్ర హీరోలకు కూడా షాక్ ఇస్తూ మెగాస్టార్ 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి మరోసారి సత్తా చాటాడు. నాన్ బాహుబలి రికార్డు లన్నింటినీ బద్ధలు కొట్టిన ఖైదీ నంబర్ 150, బుల్లి తెర మీద మాత్రం నిరాశపరిచింది.

చిరు రీ ఎంట్రీ టెలివిజన్ ప్రీమియర్కు కూడా భారీ ప్రచారమే చేశారు. ముఖ్యంగా బుల్లితెరపై చిరు చేస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు షో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవటంతో చిరు సినిమాకు బుల్లితెరపై ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే మరోసారి బుల్లితెరపై మెగాస్టార్ నిరాశపరిచాడు. వెండితెరపై కనక వర్షం కురిపించిన ఖైదీ నంబర్ 150 బుల్లి తెర మీద మాత్రం ఆకట్టుకోలేదు.

ఈ సినిమాను కనీసం రెండకెల టీఆర్పీ కూడా దక్కకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది. బ్రహ్మోత్సవం లాంటి డిజాస్టర్ సినిమాకు కూడా 7.52 టీఆర్పీ రాగా.. మెగా 150కి అంతకన్నా తక్కువగా 6.9 రేటింగ్ మాత్రమే వచ్చింది. గతంలో ఏ సినిమా ప్రీమియర్ విషయంలో లేని విధంగా హిట్ సాంగ్స్ను రెండు సార్లు ప్లే చేసినా కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ముఖ్యంగా అదే సమయంలో మరో ఛానల్లో సినీ వేడుక ప్రసారం కావటమే చిరు సినిమాకు టీఆర్పీ రేటింగ్ రాకపోవటానికి కారణం అన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement