
హీరోల పుట్టినరోజులు వస్తే అభిమానులకు పండుగే. ఇక వారి ఆనందాలకు హద్దులే ఉండవు. కేక్ కట్టింగ్‌లు, బ్యానర్లు కట్టడం, పాలాభిషేకాలు, రక్తదానాలు, అన్నదానాలు ఇలా ఒకటేమిటి ఎన్నో రకాలుగా సెలబ్రేట్ చేస్తుంటారు ఫ్యాన్స్. అయితే కొంతమంది హీరోలు మాత్రం ఇలాంటి ఆర్భాటాలు వద్దంటూ తమ అభిమానులకు సూచిస్తుంటారు. వాటికి ఖర్చయ్యే డబ్బులతో ఎవరికైనా ఆర్థిక సహాయాన్ని చేయమని కోరుతుంటారు. తాజాగా మెగాహీరో సాయిధరమ్ తేజ్ తమ అభిమానులను కూడా ఇదే విధంగా కోరారు.
అక్టోబర్ 15న పుట్టిన రోజును జరుపుకోబోతున్న సాయిధరమ్ తేజ్ మెగా అభిమానులకు సోషల్ మీడియా ద్వారా ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ‘అత్యంత ప్రియమైన మెగాభిమానులకు అంతులేని ప్రేమతో.. గెలిచినప్పుడు వేలకు పైగా చేతులు చప్పట్లు కొడతాయి. ఓడిపోయినా.. మీ చేతుల చప్పట్లు చప్పుడుకూడా తగ్గకుండా జయాపజయాలకు అతీతంగా నన్ను ప్రోత్సహిస్తూ.. వెన్నంటి ఉన్న అభిమానులందరికి కృతజ్ఞతలు. ఈ మధ్యకాలంలో మీ అంచనాలను అందుకోలేకపోయాన్నన్నది వాస్తవం. దానికి గల కారణాలను విశ్లేషించుకుంటున్నాను. మీ సలహాలు, సూచనలను తీసుకొని చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ.. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నంలో ఉన్నాను. మీరు నాపై చూపించే ఈ అభిమానమే నన్ను మానసికంగా ధృడంగా ఉంచి మంచి సినిమాలు చేయడానికి ఉత్సాహాన్నిస్తుంది. మీకు నా నుంచి చిన్న విన్నపం. నా పుట్టినరోజు సందర్భంగా పలుచోట్ల అభిమానులు కేక్ కట్టింగ్, బ్యానర్స్ కట్టడంలాంటివి..చేస్తున్నారని చెప్పారు. వాటికి ఖర్చు పెట్టే డబ్బుతో ఎవరైనా చిన్నారి చదువులకు ఉపయోగించండి. అలా చేస్తే నేను ఇంకా ఆనందిస్తాను. ఎల్లప్పటికీ మీ అభిమానం కోరుకునే.. మీ సాయిధరమ్ తేజ్’ అంటూ సుధీర్ఘమైన పోస్ట్ చేశారు.
ప్రియమైన మెగాభిమానులకు 🙏🏼 pic.twitter.com/p9H6PzQyJs
— Sai Dharam Tej (@IamSaiDharamTej) October 13, 2018
Comments
Please login to add a commentAdd a comment