సోషల్‌ మీడియాలో ‘మెగా’ పెళ్లి వార్త వైరల్‌ | sai dharam tej and niharika getting married? | Sakshi
Sakshi News home page

నిహారికతో సాయి ధరమ్‌ తేజ్‌ పెళ్లి!

Published Mon, May 8 2017 2:00 PM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

sai dharam tej and niharika getting married?

మెగాస్టార్‌ ఫ్యామిలీకి చెందిన ఓ వార్త ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. నాగబాబు కుమార్తె నిహారిక, హీరో సాయి ధరమ్‌ తేజ్‌లకు త్వరలో వివాహం జరగనున్నట్లు వార్తలు వైరల్‌ అవుతున్నాయి.  ఈ పెళ్లి వార్తపై ఇప్పుడు యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్లో జోరుగా చర్చ జరుగుతోంది. కాగా చిరంజీవి సోదరి విజయదుర్గ కుమారుడే ధరమ్‌ తేజ్‌. బావా మరదళ్లు అయిన సాయి ధరమ్‌ తేజ్‌, నిహారిక పరస్పరం ఇష్టపడుతున్నారని, దాంతో ఈ పెళ్లికి కుటుంబసభ్యులు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం.

అంతేకాకుండా నిహారిక హీరోయిన్‌గా ధరమ్‌ తేజ్‌ నిర్మాణ సారధ్యంలో ఓ చిత్రాన్ని కూడా నిర్మించబోతున్నాడట. కాగా నిహారిక, సాయి ధరమ్‌ తేజ్‌ చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి పెరిగారని, అంతేతప్ప, వారిద్దరి మధ్య సహజంగానే ఇంటిమసీ అనేది ఉంటుందని, పెళ్లివార్త ఊకార్లే అని కొందరు వాదిస్తుండగా, మరోవైపు ’మెగా’  ఫ్యాన్స్‌ మాత్రం కన్‌ఫ్యూజింగ్‌లో ఉన్నారు. అయితే దీనిపై మెగాస్టార్‌ ఫ్యామిలీ క్లారిటీ ఇస్తే తప్ప, అసలు విషయం ఏంటనేది తెలుస్తుంది.

కాగా బుల్లితెర యాంకర్‌గా కెరీర్‌ ప్రారంభించిన నిహారిక.. రామరాజు దర్శకత్వంలో 'ఒక మనసు' అనే చిత్రం ద్వారా హీరోయిన్‌గా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. కొంత గ్యాప్‌ ఇచ్చిన ఆమె .. మరాఠిలో విజయం సాధించిన హ్యాపీజర్నీ అనే సినిమాను తెలుగు రీమేక్ చేయడానికి రెడీ అవుతోంది. అన్న చెల్లెల్ల మధ్య జరిగే కథగా తెరకెకెక్కనున్న ఈ సినిమాలో.. నిహారిక దెయ్యంగా నటించనుంది. అలాగే ఓ తమిళ చిత్రంలో నిహారిక నటించనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement