Sai Dharam Tej Mass Warning To Troller Over Negative Comment On Niharika - Sakshi
Sakshi News home page

Niharika: నిహారిక మీద బ్యాడ్‌ కామెంట్‌.. నోరు అదుపులో పెట్టుకో అంటూ మెగా హీరో వార్నింగ్‌

Published Fri, Aug 18 2023 1:20 PM | Last Updated on Fri, Aug 18 2023 1:54 PM

Sai Dharam Tej Mass Warning to Troller Who Satire on Niharika - Sakshi

సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి విమర్శలు గుప్పించడం పరిపాటిగా మారింది. చాలామంది ట్రోలర్లు ఇదే పనిగా పెట్టుకుని ఎప్పుడూ ఎవరో ఒకరిని విమర్శిస్తూనే ఉన్నారు. గత కొంతకాలంగా మెగా డాటర్‌ నిహారిక మీద విపరీతమైన ట్రోలింగ్‌ జరుగుతోంది. విడాకుల వ్యవహారం తర్వాత ఇది పీక్స్‌కు వెళ్లింది. తను వెకేషన్‌కు వెళ్లినా, ఏదైనా పోస్ట్‌ పెట్టినా.. ఏం చేసినా సరే తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. 

ఈ నెగెటివిటినీ నిహారిక లైట్‌ తీసుకుని తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇదిలా ఉంటే ఈ మధ్య సాయిధరమ్‌ తేజ్‌ 'సత్య' అనే షార్ట్‌ ఫిలిం చేసిన సంగతి తెలిసిందే! ఇందులో ఒక పాటను ఆగస్టు 15న విడుదల చేశారు. ఈ పాటకు సంబంధించిన అప్‌డేట్‌లను సాయిధరమ్‌ తేజ్‌ ఎప్పటికప్పుడూ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఓ పోస్ట్‌పై నిహారిక కొణిదెల స్పందిస్తూ.. ఈ పాట కోసం ఎంతో ఎదురుచూస్తున్నాను అని కామెంట్‌ చేసింది.

దీనికి రిప్లైగా ఓ నెటిజన్‌.. వీటి మీద ఉన్న శ్రద్ధాసక్తులు కుటుంబం మీద లేకపాయె అని సెటైర్‌ వేశాడు. దీంతో సాయిధరమ్‌ తేజ్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నోరు అదుపులో పెట్టుకో, వెంటనే ఆ కామెంట్‌ డిలీట్‌ చేయ్‌ అని వార్నింగ్‌ ఇచ్చాడు. నిహారిక కోసం తేజ్‌ అండగా నిలబడడాన్ని అభిమానులు ప్రశంసిస్తున్నారు. అయితే నెటిజన్‌ కామెంట్‌తో పాటు తేజ్‌ తన కామెంట్‌ను సైతం డిలీట్‌ చేశాడు. కానీ అప్పటికే అందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: జైలర్‌లో డ్యాన్స్‌ చేసిన వ్యక్తి ఎవరో తెలుసా? ఫేమస్‌ అవ్వడానికి ముందే గదిలో శవమై..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement