Actor Tarun Gives Clarity On Marriage Rumours From Mega Family - Sakshi
Sakshi News home page

Tarun Marriage: మెగా అల‍్లుడిగా తరుణ్? నిజం చెప్పేశాడు

Published Wed, Aug 2 2023 1:06 PM | Last Updated on Wed, Aug 2 2023 1:44 PM

Actor Tarun Clarify Marriage Rumours Mega Family - Sakshi

కొన్నిరోజుల ముందు ఓ విషయం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఒకప్పటి లవర్ బాయ్, హీరో తరుణ్ మెగా అల్లుడు కాబోతున్నాడంటూ తెగ రూమర్స్ వచ్చాయి. చాలామంది ఇది నిజమే అనుకున్నారు కూడా. ఆ నోట ఈ నోట పడిన ఈ వదంతులు ఇ‍ప్పుడు అతడి వరకు చేరుకున్నాయి. దీంతో ఈ పుకార్లకు చెక్ పెట్టాడు. అసలు నిజాన్ని తరుణ్ బయటపెట్టాడు. 

పెళ్లి రూమర్
బాలనటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన తరుణ్.. లవర్ బాయ్ ఇమేజ్‌తో తెలుగులో చాలా సినిమాలు చేశాడు. కారణం ఏంటనేది పక్కనబెడితే కొన్నాళ్లుగా నటనకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. అయితే ఇప్పటికీ సింగిల్‌గానే ఉంటున్నారు. దీంతో ఎప్పటికప్పుడు ఆయన వివాహం త్వరలో జరగబోతుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్య కూడా అలానే తరుణ్ మ్యారేజ్ ఫిక్సయింది అని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

(ఇదీ చదవండి: సమంత ట్రీట్‌మెంట్ కోసం అన్ని కోట్ల ఖర్చు?)

నిజం కాదు
దాదాపు మీడియా చాలావరకు ఈ విషయాన్ని రాసింది. దీంతో ఈ విషయమై స్వయంగా తరుణ్ క్లారిటీ ఇచ్చాడు. 'ఈ ప్రచారం నిజం కాదు. నిజంగా నేను ఏదైనా శుభవార్త చెప్పాలనుకుంటే నిరభ్యంతరంగా సోషల్ మీడియా వేదికగా లేదా మీడియా ముఖంగా ఆ విషయం చెబుతాను. నా పెళ్లి విషయంలో ఈ పుకార్లు ఎందుకు వస్తున్నాయో అస్సలు తెలియడం లేదు' అని తరుణ్ చెప్పుకొచ్చాడు.

పుకారు ఎలా?
తరుణ్‌ పెళ్లి గురించి ఇటీవల అతని తల్లి, నటి రోజా రమణి మాట్లాడుతూ... త్వరలోనే కొడుక్కి పెళ్లి చేస్తామని అన్నారు. అమ్మాయిది ఇండస్ట్రీకి చెందిన ఓ బడా ఫ్యామిలీ అని చెప్పారు. దీంతో పలు పేర్లు వినిపించి, చివరకు మెగాఫ్యామిలీ దగ్గర వచ్చి ఆగాయి. అయితే ఇప్పుడు స్వయంగా తరుణ్ దీనిని ఖండించడంతో ఇవి కేవలం వదంతులు మాత‍్రమే అని తేలిపోయాయి. 

(ఇదీ చదవండి: స్టార్ సింగర్ సర్‌ప్రైజ్.. ఒక్కో డ్రైవర్‌కు రూ.82 లక్షలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement