లాక్‌డౌన్ నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకొని బ్యాచిలర్ జీవితానికి స్వస్తి పలికిన విషయం తెలిసిందే. నితిన్ రానా, నిఖిల్, నిహారిక, కాజల్.. ఇలా అందరూ వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. ఇక నిహారిక పెళ్లి అనంతరం అందరి చూపు మెగా కుటుంబంలోని బ్యాచిలర్స్‌పై పడింది. పెళ్లి కావాల్సిన ప్రసాద్‌ల లిస్ట్‌లో మెగా ఫ్యామిలీ నుంచి ముగ్గురు(వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్) ముందు వరుసలో ఉన్నారు. దీంతో ఈ ఇంటి నుంచి మరో పెళ్లి కబురు ఎప్పుడస్తుందానని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇటీవల సాయి ధరమ్ తేజ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని వార్తలు వినిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ధరమ్ తేజ్ తను సింగిల్ అన్న విషయాన్ని వెల్లడించాడు. ‘నేను సింగిల్. కానీ నా కుటుంబం నా పెళ్లి కోసం ప్లాన్ చేస్తోంది. నిహారిక వివాహం తరువాత ఇప్పుడు పెళ్లిపై కుటుంబం ఒత్తిడి చేస్తోంది’ అని పేర్కొన్నాడు. ఇప్పుడు ఇదే వార్త నిజం కాబోతుందని మళ్లీ టాక్ వస్తోంది. సాయి ధరమ్ తేజ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడనేది ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోన్న రూమర్.
చదవండి: హీరో రిపబ్లిక్‌కి ముహూర్తం
పెళ్లిరోజు: భార్యకు మహేష్ రొమాంటిక్ విష్
ఈ ఏడాది మే నెలలో ధరమ్ తేజ్ పెళ్లి జరగబోతుందని, తేజ్ తల్లి, చిరంజీవి చెల్లెలు ఇప్పటికే అమ్మాయిని కూడా సెలెక్ట్ చేసినట్లు సమాచారం. ఇది పెద్దలు కుదిర్చిన వివాహమేనని, ఆమెకు సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేదని వినికిడి. అంతేగాక మెగా ఫ్యామిలీకి తెలిసిన అమ్మాయేనట. మరి ఇవన్నీ నిజమా కాదా తెలియాలంటే మెగా ఫ్యామిలీ అధికారికంగా ప్రకటించే వరకు ఆగాల్సిందే. ఇక మెగా కుటుంబం నుంచి వచ్చిన సాయి ధరమ్ తేజ్ విభిన్న చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తన కెరీర్‌పైన దృష్టి పెట్టిన తేజ్ ఆ ప్రయత్నంలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment