![Sai Dharam Tej Comments On Marriage Goes Viral - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/7/WhatsApp%20Image%202023-02-07%20at%2021.02.01.jpeg.webp?itok=9H861j3G)
కిరణ్ అబ్బవరం, కశ్మీర పరదేశి జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'వినరో భాగ్యము విష్ణు కథ'. ఈ చిత్రానికి మురళి కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో మురళీ శర్మ కీలక పాత్రలో నటిస్తున్నారు. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ చేతుల మీదుగా విడుదల చేశారు.
అయితే ఈవెంట్‌లో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్ అభిమానులపై సీరియస్ అయ్యారు. ఈవెంట్‌లో సాయి ధరమ్‌ను పెళ్లి ఎప్పుడని ఫ్యాన్స్ ఆసక్తిగా అడిగారు. దీనికి కాస్తా గట్టిగానే కౌంటరిచ్చారు. సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ..' మీరెప్పుడైతే అమ్మాయిలను గౌరవించడం నేర్చుకుంటారో అప్పుడవుద్ది. ఇది మీవల్ల అవుతుందా. నా పెళ్లి ఎప్పుడో అయిపోయింది. ఇప్పటికే నాలుగుసార్లు పెళ్లి అయింది అంటూ నవ్వుతూనే' ఫ్యాన్స్‌కు కౌంటరిచ్చారు. దీంతో ఈవెంట్‌లో వేదికపై ఉన్న సినీతారలు, అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment