Sai Dharam Tej Released Vinaro Bhagyamu Vishnu Katha Trailer - Sakshi
Sakshi News home page

Vinaro Bhagyamu Vishnu Katha: 'మంచి కన్నా చెడు త్వరగా..' వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్ అవుట్

Published Tue, Feb 7 2023 7:58 PM | Last Updated on Tue, Feb 7 2023 9:02 PM

Sai Dharam Tej Released Vinaro Bhagyamu Vishnu Katha trailer - Sakshi

కిరణ్ అబ్బవరం, కశ్మీర పరదేశి జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'వినరో భాగ్యము విష్ణు కథ'. ఈ చిత్రానికి మురళి కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో మురళీ శర్మ కీలక పాత్రలో నటిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ చేతులమీదుగా విడుదల చేశారు. ఈ సినిమా ఫిబ్రవరి 17న శివరాత్రి కానుకగా విడుదల కానుంది. 

ట్రైలర్ చూస్తే లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఖాయంగా కనిపిస్తోంది. కిరణ్ అబ్బవరం యాక్షన్, రొమాన్స్, కామెడీ సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. 'ఎస్ఆర్‌ కల్యాణ మండపం' సినిమాతో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్‌ అబ్బవరం. ఆ తర్వాత సమ్మతమే చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్స్  ప్రారంభించారు. ఈ యాక్షన్ డ్రామాకి మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. త్వరలోనే ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు కిరణ్.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement