పెళ్లి తర్వాత కిరణ్ అబ్బవరం తొలి పోస్ట్.. అదేంటంటే! | Kiran Abbavaram Shares First Post After His Wedding With Rahasya Gorak, Marriage Pics Goes Viral | Sakshi
Sakshi News home page

Kiran Abbavaram Marriage Photos: 'మీ ఆశీర్వావాదాలు కావాలి'.. కిరణ్ అబ్బవరం పోస్ట్ వైరల్!

Published Fri, Aug 23 2024 6:49 PM | Last Updated on Fri, Aug 23 2024 7:51 PM

Kiran Abbavaram Shares Marriage Pics After His Wedding Ceremony

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్‌ను ఆయన పెళ్లాడారు. కర్ణాటకలోని కూర్గ్‌లో ఓ రిసార్ట్‌లో వీరి పెళ్లి వేడుక జరిగింది. ఈ గ్రాండ్‌ వెడ్డింగ్ వేడుకల్లో బంధుమిత్రులు, ‍అత్యంత సన్నిహితులు పాల్గొన్నారు.

రహస్య గోరఖ్‌తో పెళ్లి తర్వాత కిరణ్ అబ్బవరం తొలి పోస్ట్ చేశారు. మా జంటకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలంటూ పెళ్లి ఫోటోలను పంచుకున్నారు. ఇవీ చూసిన అభిమానులు తమ హీరోకు కంగ్రాట్స్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. సినీ ప్రియులు, చిత్ర పరిశ్రమకు చెందిన మిత్రులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

కాగా.. రాజావారు రాణిగారు సినిమాతో  కలిసి నటించిన కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్.. ఆ సినిమా షూటింగ్‌ సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఇప్పుడు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం భారీ పీరియాడిక్ థ్రిల్లర్ మూవీ "క" లో నటిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియావ్యాప్తంగా రిలీజ్ కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement