
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ అబ్బవరం పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈనెల 22న హీరోయిన్ రహస్య గోరఖ్‌ను ఆయన పెళ్లాడనున్నారు. వీరిద్దరు కలిసి 'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోహీరోయిన్లుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తొలి చిత్రంతో మొదలైన స్నేహం కాస్తా ప్రేమగా మారింది.
టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో కిరణ్ అబ్బవరం.. ప్రస్తుతం క చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ అనే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మంచి పాటను అందించిన చిత్రబృందానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. నా పాటలకు ఎప్పుడూ మంచి రెస్పాన్స్ వస్తుందని అన్నారు. అలాగే ఈ సాంగ్‌కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ పాటకు సంగీతం, లిరిక్స్ అందించిన టీమ్‌కు ప్రత్యేక అభినందనలు అంటూ వీడియోను పోస్ట్ చేశారు.
Thank you all ☺️🙏#WorldofVasudev #KA pic.twitter.com/RDQauPl5PN
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) August 20, 2024
Comments
Please login to add a commentAdd a comment