తెలుగులో సూపర్‌ హిట్‌ మూవీ.. ఆ భాషలోనూ గ్రాండ్ రిలీజ్! | Kiran Abbavaram Ka Movie Release In Malayalam from This date | Sakshi
Sakshi News home page

Ka Movie: ఆ భాషలోనూ గ్రాండ్‌గా రిలీజవుతోన్న 'క' మూవీ!

Published Wed, Nov 13 2024 3:00 PM | Last Updated on Wed, Nov 13 2024 3:36 PM

Kiran Abbavaram Ka Movie Release In Malayalam from This date

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం 'క' మూవీతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. సుజిత్- సందీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా థియేటర్లలో సందడి చేసింది. లక్కీ భాస్కర్‌, అమరన్‌ చిత్రాలతో పోటీపడి బాక్సాఫీస్ వద్ద హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో క టీమ్ సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది.

తెలుగులో సూపర్‌హిట్‌గా నిలిచిన క మూవీని తాజాగా మలయాళంలోనూ విడుదల చేయనున్నారు.  ఈ మేరకు హీరో కిరణ్ అబ్బవరం పోస్టర్‌ను షేర్ చేశారు. మాలీవుడ్‌లో హీరో దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్‌ హౌస్ ద్వారా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. దుల్కర్‌కు చెందిన వేఫేరర్‌ ఫిల్మ్స్‌ క మూవీ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ నెల 22న మలయాళంలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. కాగా.. దుల్కర్ సల్మాన్ తెలుగులో లక్కీ భాస్కర్‌తో సూపర్ హిట్‌ కొట్టిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement