'ఆ కష్టమేంటో నాకు జీవితంలో తెలియదు.. ఎందుకంటే?'.. నాగచైతన్య కామెంట్స్! | Akkineni Naga Chaitanya Comments About Hero Kiran abbavaram Journey | Sakshi
Sakshi News home page

Naga Chaitanya: అలాంటి వారికి భయపడాల్సిన పనే లేదు: నాగచైతన్య

Published Wed, Oct 30 2024 3:59 PM | Last Updated on Wed, Oct 30 2024 4:28 PM

Akkineni Naga Chaitanya Comments About Hero Kiran abbavaram Journey

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఈ దీపావళికి రెడీ అయిపోయాడు. ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సుజీత్, సందీప్ డైరెక్షన్‌లో వస్తోన్న క మూవీ రిలీజ్‌కు అంతా సిద్ధమైపోయింది. ఈ నెల 31న థియేటర్లలో ఈ సినిమా సందడి చేయనుంది. దీంతో విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు మేకర్స్. హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌కు అక్కినేని హీరో నాగచైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిరణ్‌ అబ్బవరం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

నేనే మొదటి అభిమానిని..

నాగ చైతన్య మాట్లాడుతూ..'కిరణ్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. నేను ఇండస్ట్రీలోకి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చాను. కానీ కిరణ్ లాంటి వాళ్ల స్టోరీస్ వినగలుతాను. కానీ ఆ కష్టం ఏంటో నాకు తెలియదు. నేను చెప్పేది ఒక్కటే కిరణ్ జర్నీకి నేను అభిమానిని. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా రావాలంటే నీలాంటి స్టోరీస్ ఆదర్శం. నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. నీలో చాలా సత్తా ఉంది. ట్రోల్ చేసేవాళ్లు చేస్తారు. వాళ్ల చేతుల్లో కేవలం ఫోన్‌ మాత్రమే ఉంది. ‍అలాంటి వారి గురించి భయపడాల్సిన పనే లేదు. నీ టాలెంట్‌ ఏంటో చూస్తూనే ఉన్నాం. అమ్మ గురించి చెప్పినప్పుడు నాకు కన్నీళ్లు వచ్చాయి. ప్రతి సక్సెస్‌ వెనకాల ఓ మహిళ ఉంటుంది. నీకు రహస్య సపోర్ట్‌ ఫుల్‌గా ఉంది. క టీమ్ బృందం పడిన కష్టం నా కళ్లముందే కనిపిస్తోంది. కిరణ్‌కు నేనే మొదటి అభిమానిని. ఆల్‌ ది బెస్ట్‌' అంటూ మాట్లాడారు.

ట్రోల్స్‌పై కిరణ్ కౌంటర్..

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఓ సినిమాలో తనని ట్రోల్ చేయడంపై ఫైర్ అయ్యాడు. అలానే తనపై వస్తున్న ఫేక్ ఆర్టికల్స్ గురించి కూడా ఇచ్చిపడేశాడు. నాతో మీకేంటి సమస్య? నా గురించి ఏది పడితే అది ఎందుకు రాస్తున్నారని ప్రశ్నించాడు. ఒకడేమో నేను బాగా డబ్బున్న వాడిని.. మరొకడేమో రాజకీయ నాయకుడి కొడుకుని అని రాస్తాడని అన్నారు. అసలు నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారనేది అర్థం కావట్లేదని కిరణ్ మాట్లాడారు. దీంతో కిరణ్ స్పీచ్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement